అమ్మ ఒడికి దారేది?
దేవా ది బిలినియర్…వేలకోట్ల ఆస్తి ఉన్నా వెలితి , అమ్మలేని వెలితి.పద పదహారు సంవత్సరాలుగా అమ్మ ఎక్కడుందో ఎలా ఉందో తెలియక అల్లాడిపోతున్నాడు దేవా. నాన్నకు జబ్బుచేసి మంచానపడ్డాడు.ఈ వయసులో బార్య కావాలనిపించి కొడుకు దేవాను పిలిచి …మీ అమ్మకు ఏవోవో ఆలోచనలు అవన్నీ తీర్చాలంటే నావల్ల కాదు అందుకే దూరంగా వుంటున్నాం’ ఇంతకీ ఇప్పుడు అమ్మ ఎక్కడుంది నాన్నా? హైదరాబాద్లో వుందని విన్నా అంతకు మించి నాకేం తెలియదురా… నాన్నా నేను అమ్మను ఎలాగైనా ఇంటికి తీసుకువస్తా నన్ను నమ్మండి. ఆ ఆశతోనే బతుకుతానురా… అమ్మకోసం హైదరాబాద్ బయలుదేరాడు దేవా. అమ్మకు సేవా దృక్పదం ఎక్కువని తెలిసిన దేవా ఆ వైపుగా తను అమ్మకోసం వెతకటం ప్రారంబించాడు. ఒకరోజు దేవా రోడ్డుపై వుండగా ఒక అంధ బృందం రోడ్ దాటుతుండగా వారికి హెల్ప్ చేశాడు. అది గమనించిన శారద అతనికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. దేవా ఎక్కడెక్కడో తిరిగినా అమ్మ ఆచూకీ తెలియలేదు. చివరకు శారదా అనాధశరణాలయం చేరి తన తల్లిగురించి అడిగాడు. అక్కడున్నవారు చెప్పినట్టు ఆ ఆశ్రమం హెడ్ శారదగారిని కలిసి;;; నమస్తే మేడం …. నమస్తే కూర్చొండి ఏం కావాలి? మా అమ్మగారిని వెతుక్కుంటూ వచ్చాను మేడం మా అమ్మ పేరు శారదాదేవి సేవాభావంతో సర్వస్వం వదిలేసింది. ఇప్పుడు మా నాన్న చివరిరోజుల్లో వున్నారు.మీ కేమైనా తెలిస్తే కాస్త నాకు చెప్పండి మేడం. అలాగా నాకు తెలిస్తే తప్పకుండా మీ నాన్నగారి పేరేంటి బాబూ? జగపతి మేడం. అలాగా ? అంటే నువు నా కొడుకువన్నమాట అనుకుంది మనసులో శారద. ఏం ఆయన మీకు తెలుసా మేడం? తెలియకేం బాబూ వేలకోట్ల ఆస్తులున్నా అన్నార్తులకు పైసా విదిలించని వాడు. ప్రేమ జాలి దయ లేని ఒక పాషాణం.ఆవేశంగా చెబుతోంది శారద. మేడం అన్న దేవా పిలుపుకు తేరుకొని శారద సారీ బాబూ….ఏదేదో మాట్లాడాను. పరవాలేదాంటి మీరు నిజమే చెప్పారు.కాని ఆయన మారిపోయారు నిజంగా మారిపోయారరు ఎంతలా అంటే తన బార్య కోరిక ప్రకారం తన ఆస్తిలో సగబాగం అనాధలకు రాసిచ్చేటంత. నేను ఆయన్నంత తొందరగా నమ్మను బాబూ … నిజమే ఆంటి కాని తన జీవిత చివరి దశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో తీసుకున్న నిర్నయం తప్పని నేననుకోను. ఆయన గురించి వదిలెయ్యండి.. మీ గురించి చెప్పు బాబూ…… నా గురించి చెప్పటానికే ముంటుంది ఆంటీ…. ఎందుకులేదు ఉదయం మిమ్మల్ని చూశాను రోడ్ దాటించటం అదీ చూస్తే మీరు మీ నాన్నలా కాదనిపిస్తుంది.మీకంతా మీ అమ్మ పోలిక అనిపిస్తుంది. నిజమే ఆంటీ మా నాన్నకూడ ఎప్పుడూ అంటుంటారు. ఇంతలో ఒక లేడీ తలుపు తెరిచి మేడం ఈ మద్యాహ్నం వరకు సరుకులు సరిపోతాయి సాయంత్రానికి ఏమీ లేవు. అలాగా నువు వెళ్లు నేను వస్తా.