అసలు కథ – Part 30
అహన ఇంటికొస్తూ క్లబ్ దగ్గర్ తనతో జోస్న మాట్లాడిన మాటలను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకొంటూ ఉద్వేగపడుతోంది. మోహన విశయం పూర్తిగా విన్నాక జోస్న చాలా తేలిగ్గా కొట్టిపారేస్తూ దీనికంత హైరానా పడాల్సిన అవసరం ఏముంది అహనా .. .. నీకు గల ఇబ్బందులను డైరెక్ట్ గా మోహనతో మాట్లాడి వాళ్ళిద్దరినీ వేరుగా ఉంచి కాపురం చేసుకోమనడం ఒకటి. . . మీకు ఒక్కడే కొడుకు కాబట్టి అలా మీ భర్యాభర్తలకు అంగీకారం కాని పక్షంలో నీకొడుకుని ఏదోవిధంగా నీ దారిలోనికి తెచ్చుకొని నీమాట వినేట్లు చేసుకొని ఆరకంగా మోహనను వాడి ద్వారానే వదిలించుకోవడం రెండవది. ఇందులో నీకు ఏది సూటవుతుందో నీవే ఆలోచించుకో. . .లేదంటే మోహన మీదున్న వ్యతిరేకత నిన్ను పూర్తిగా నాశనం చేసేస్తుంది. మీ చక్కటి కాపురాన్ని నీ చేజేతులా నాశనం చేసుకొంటావు. జోస్న చెప్పింది అక్షరాలా నిజమనిపించి సరేలేవే . . . . చారితో ఓ సారి మాట్లాడి నా తిప్పలేవోపడతాను అంటూ అక్కడినుండి వచ్చేస్తూ. . . జోస్న చెప్పిన దాంట్లో తనకు రెండోదే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మోహనను వదలి గగన్ ఉండలేడు. వాడినొదలి తల్లిదండ్రులుగా తాముండలేరు. కాబట్టి గగన్ ను తన దారిలోనికి తెచ్చుకోవడమే కరెక్ట్ . . .ఎటూ సావంత్ వల్ల తాను సగం చెడింది. ఆ విశయం గగన్ కు కూడా తెలుసు కాబట్టి ఏదొ రకంగా వీడిని తాను దారిలోనికి తెచ్చుకోవాలి. . .ఎలా. . . ఎలా . . . .అనుకొంటూ ఇంటికి బయలు దేరింది. అఫీసులో కెళ్ళిన చారి చాలా సేపటి వరకూ మౌనంగా ఉండిపోయాడు. అతడి మౌనం చూసి మోహన కూడా మౌనంగానే ఉండిపోయింది. ఆ మౌన నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మోహనకు ఇష్టమైన పంప్కిన్ పేఠా పాకెట్ ఒకటి తెప్పించి ఇచ్చాడు. ఈ పేఠా అంటే తనకు చిన్ననాటి నుండీ పరమ ప్రీతి. అమ్మ కోసం వచ్చే విటులలో కొంత మంది ప్రత్యేకంగా తెచ్చేవారు. తనకోసం దాచి ఉంచేది అమ్మ. ఇవంటే తనకిష్టమని ఈయనకెలా తెలుసో అనుకొంటూ చిన్నపిల్లలా వాటిని కొరుక్కు తిన సాగింది. ఆమెనే తదేకంగా చూస్తున్న చారి ఉన్నట్టుండి గుండూ . . .అన్నాడు. అది తన చిన్నప్పుడు అమ్మ తనని పిలిచే పేరు. ఇప్పుడు చారి అలా పిలవంగానే చటుక్కున తలెత్తి చూసింది. చారి మళ్ళీ గుండూ అనిపిలవంగానే నాన్నా అంటూ పరుగెత్తుకెళ్ళి చుట్టుకొనేసింది. ఆయన వడిలో ఏం మాట్లాడాలో తెలీక బోరుమని గట్టిగా ఏడ్చేసింది. చారి ఆమె తలను నిమురుతూ గుండూ ఈ పేరు నీకు గుర్తు ఉందా అమ్మా అన్నాడు ఆయన కూడా కరిగిపోతూ. . . ఊ అంది వెక్కిళ్ళు పడుతూ చారి :- ఇంకేం గుర్తుకున్నాయో మా గుండూకి అన్నాడు ఆమెను ఓదార్చడానికన్నట్టు. వెక్కిళ్ళుపడుతూనే నన్ను మల్లీ కొత్తావంతే నీ ముక్కుకోత్తా అంది చారి నిండుగా నవ్వేస్తూ మోహనను గుండెల్లో పెట్టుకొంటూ . . .మీ అమ్మ నాతోగొడవ పడి వెళ్ళిపోయేముందు నువ్వు మాట్లాడిన చివరి మాటలివి. . .