All content free · updated every 5 minutes

ఒక ప్రేమ కథ – 11

Story Telugu 4 pages 4 years ago

ఒక ప్రేమ కథ – 11
ఇద్దరం మేడం దగ్గరికి వెళ్ళాం.. ఆవిడ మాకు సర్టిఫికేట్స్ ఇచ్చారు.. “Good work both of you,” అని మెచ్చుకున్నారు కూడా… మేము కొన్న గిఫ్ట్ ‘n’ కార్డ్ ఆవిడకి ఇచ్చాము… “Thank you for mentoring us, madam… knowingly or unknowingly… మిమ్మల్ని ఎప్పుడైనా హర్ట్ చేసుంటే, kindly forgive us,” అని చెప్పాం. ఆవిడ నవ్వుతూ, “Forgive me if I hurted you…” అన్నారు. “No, madam, not at all… this is a wonderful experience to work with you… you helped us alot with your suggestions, ma’am..” అన్నాను. తను మమ్మల్ని వాళ్ళ ఇంటికి డిన్నర్ కి invite చేసారు… మేము ఈవెనింగ్ వెళ్ళిపోతున్నామని చెప్పాం… సో, లంచ్ కి రమ్మన్నారు. మేము ‘సరే’ అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాం… మా labలో and మేము రోజూ లంచ్ చేసే Cafetariaలో అన్ని ప్లేసెస్ లో ఫొటోస్ తీసుకున్నాం… లంచ్ టైం అయ్యింది కాబట్టీ మేడం వాళ్ళ స్టాఫ్ రెసిడెన్స్ కి వెళ్ళాం… మేడం నవ్వుతూ మమ్మల్ని లోపలికి invite చేసారు… మాకు వాటర్ తేవడానికి లోపలికి వెళ్ళారు. మేము లివింగ్ రూంలో కూర్చున్నాం… అక్కడ షెల్ఫ్ లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి… నేను వాటి దగ్గరికి వెళ్ళి నించుని చూస్తున్నాను… ఇంతలో ఆవిడ వచ్చారు, వాటర్ తీసుకుని… “Thanks.. madam,” అని గ్లాస్ తీసుకున్నాను నేను… “పిక్స్ చాల బాగున్నాయి మేడం.. ఈ అబ్బాయి చాల అందంగా మీలానే ఉన్నాడు,” అన్నాను ఒక పిక్ చూపించి… “తను మా అబ్బాయి శిశిరా… మీ ఏజ్ నే తను కూడా… ఇప్పుడు మీలానే B. Tech చదువుతుండేవాడు,” అన్నారు ఆవిడ. “చదువుతూ ఉండేవాడు ఏంటి మేడం?” అన్నాడు ఆర్యన్, సోఫాలోంచి లేచి మా దగ్గరికు వస్తూ… “He is no more, Aaryan… 2 years back బైక్ ఏక్సిడెంట్లో చనిపోయాడు,” అన్నారు ఆవిడ. “Sorry madam,” అన్నాం ఇద్దరం. “That’s alright,” అన్నారు, చిన్నగా కన్నీళ్ళు పెడుతూ… మేము ఆవిడ దగ్గరకి వెళ్ళాం… తను మా ఇద్దరి తలపై ఆశీర్వదిస్తున్నట్టుగా చెయ్యివేసి, “అయినా… నాకు మీరంతా పిల్లలే కదా….” అన్నారు, కన్నీళ్ళు తుడుచుకుని నవ్వుతూ. మేము కూడా నవ్వాం… “పదండి, లంచ్ చేద్దాం,” అన్నారావిడ. అలా లంచ్ కోసం డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాం. తర్వాత చాల కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసాం అందరం కలిసి… ఎప్పుడూ సీరియస్*గా, ప్రొఫెషనల్ గా ఉండే మేడం మొహంలో ఆరోజు నవ్వుని చూసాను. ఇంకా మాకు dishes వడ్డిస్తున్నప్పుడు చాల కేరింగ్ గా… ప్రేమతో వడ్డించారు. ఎంతైనా హోమ్ ఫుడ్ టేస్ట్ వేరు కదా… అన్నీ ఆవిడ మాకోసం స్వయంగా చేసారు, half-day లీవ్ తీసుకుని మరీ…! ఆవిడ మామీద చూపించిన అభిమానానికి చాల ఆనందం కలిగింది నాకు… లంచ్ తర్వాత కొంచెంసేపు కూర్చుని మాట్లాడుకున్నాం… మేడంకి తెలుగు కూడా వచ్చు కాబట్టీ ఆర్యన్ చెప్పిన కొన్ని కవితలు విని ఆవిడ ఎంజాయ్* చేసారు. “నీకు చాలా మంచి టాలెంట్ ఉంది, ఆర్యన్… నువ్వు మంచి రైటర్ వి అవుతావ్, ట్రై చేస్తే…” అన్నారావిడ. “Thank you, madam. కానీ, నా లైఫ్ లో వేరే goals ఉన్నాయి… రైటింగ్ నాకొక రిలీఫ్ అంతే, అదే passion కాదు,” అన్నాడు తను.

“నీ goals అన్నీ నువ్వు definiteగా achieve చెయ్యాలి,” అని bless చేసారు ఆవిడ. “ఇంకా మీ పెళ్ళికి నన్ను పిలుస్తారా..?” అన్నారు మేడం. నేను ఆశ్చర్యంగా ఆవిడవైపు చూసాను… ఆవిడ నవ్వుతూ మా వైపు చూసి, “నాకు అంతా తెలుసు… Nice couple మీరిద్దరూ…” అన్నారు. నేను కొంచెం సిగ్గు పడుతూ ఉన్నా… ఆవిడ నా దగ్గరికి వచ్చి, “పిలుస్తారుగా…!” అన్నారు. “హ్మ్… తప్పకుండా… మేడం,” అన్నాను. “ఇంక మేం వెళ్తాం మేడం,” అన్నాం. “సరే… మ్…ఆగండి ఒక్క నిముషం,” అని లోపలికి వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత 2 packets తీసుకుని బయటకి వచ్చారు. “ఇదిగో… ఇవి తీస్కోండీ,” అన్నారు. మేము ఆ కవర్స్ ఓపెన్ చేసి చూసాం… ఆర్యన్ కి ఒక డ్రెస్ ఇంకా నాకు శారీ ఉన్నాయి అందులో… కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి నాకు… “మేడం..” అని తన కాళ్ళపై పడబోయాం ఇద్దరం… ఆవిడ మమ్మల్ని ఆపి తనకు దగ్గరగా తీసుకొని, “All the best… and… I wish you all the success in your future…” అని మమ్మల్ని ఆశీర్వదించారు. అక్కడి నుంచి ఇంక బయల్దేరుతున్నాం… తను నన్ను దగ్గరకు తీసుకుని నుదుటిమీద ముద్దుపెడుతూ, “అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి…” అని మా ఫోన్ నంబర్స్ తీసుకున్నారు. “తప్పకుండా మేడం…” అని, ‘Bye’ చెప్పేసి ఆవిడ blessings ని మరోసారి తీసుకుని హాస్టల్స్ కి బయల్దేరాం… ముందురోజు night నే మా టీం మేట్స్ తో డిన్నర్ ఎంజాయ్* చేసాం కాబట్టీ, మళ్ళీ వాళ్ళతో టైం స్పెండ్ చెయ్యడానికి అవ్వకపోయినా పెద్దగా బాధ అనిపించలేదు మాకు. మా హాస్టల్స్ నుంచి లగేజ్ అంతా తీసుకుని అక్షయ కేంటీన్ దగ్గరకి వచ్చేసరికి అజయ్ తన కార్ తో పాటు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. “నేను డ్రాప్ చేస్తా మిమ్మల్ని…” అన్నాడు తను. “Send-off ఇవ్వడానికి వచ్చావా..?” అని అడిగాను నేను. “హా..” అన్నాడు తను. వన్ లాస్ట్ టైం ఇక్కడి ఫిల్టర్ కాఫీ తాగాలని అనిపించింది… కానీ, ఆల్రెడీ అజయ్ వెయిట్ చేస్తున్నాడు కాబట్టీ ఏం మాట్లాడలేదింక. లగేజ్ అంతా కార్ లో పెట్టేసి స్టార్ట్ అవ్వబోయాం… ఇంతలో, “ఆర్యన్…” అన్న పిలుపు వినబడింది. చూస్తే మా ఇద్దరు తమిళ్ టీం మెంబర్స్ వస్తున్నారు. “ఆర్యన్… నువ్వు చెప్పినట్టే ఫిల్టర్ కాఫీ ‘n’ సైకిల్ రెడీ,” అని ఒకరు సైకిల్ కీస్ and ఇంకొకరు ఫిల్టర్ కాఫీ ఆర్యన్ చేతిలో పెట్టారు. “ఏం జరుగుతోంది?” అని confused గా మొహంపెట్టి అడిగాను నేను. వాళ్ళు స్మైల్ ఇచ్చి, “ఆర్యన్ చెప్తాడులే…” అనేసి అజయ్ తో పాటు కార్ ఎక్కి మా లగేజ్ తీస్కొని వెళ్ళిపోయారు. “Come soon… we will be waiting at the main gate,” అని అజయ్ కార్ లో నుంచి అరుస్తూ వెళ్ళిపోయాడు. ఆర్యన్… మన లగేజ్? అసలేం జరుగుతోంది?” అని అడిగాను నేను. “ఇదిగో నీ ఫిల్టర్ కాఫీ, వన్ లాస్ట్ టైం ఎంజాయ్* చెయ్. మళ్ళీ ఇక్కడికి రాగలమో లేదో..!” అన్నాడు తను. “ఒహ్హో… ఇది మనం రైల్వే స్టేషనులో కూడ కొనుక్కునేవాళ్ళం కదా..!” అంటూ తీసుకున్నాను నేను.

“రైల్వే స్టేషన్ మైలాపూర్ లో లేదు కదా మరి,” అన్నాడు తను చిన్నగా నవ్వుతూ… “ఇది మైలాపూర్ ఫిల్టర్ కాఫీనా…?” అని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగాను నేను. “హా… నీకోసమే మైలాపూర్ నుంచి తెప్పించాను. పాపం సెల్వమణి! నేనడిగానని అంత దూరం వెళ్ళి మరీ తెచ్చాడు,” అన్నాడు. నేను చాల హ్యాపీగా ఫీలయ్యా… తనకి నేను మైలాపూర్ వెళ్ళి కాఫీ తాగాలి అని ఒకసారి చెప్పింది ఇంత బాగా గుర్తుపెట్టుకున్నాడని… కాఫీ తాగేసి… “హ్మ్… ఇంక వెళ్దాం,” అన్నాను. “పద,” అంటూ సైకిల్ ఎక్కాడు తను. “సైకిల్ మీదా..?” అడిగాను నేను. “IIT – Chennai, pollution free campus… ఇక్కడ సైకిల్స్ రెంట్ కి ఇస్తారు. నాకు నీతోపాటు సైకిల్ మీద వెళ్ళాలని ఉంది, రావా ప్లీజ్…” అన్నాడు బతిమాలుతున్నట్టు ఫేస్ పెట్టి. “ఇది కూడ సెల్వమణే తెచ్చాడా పాపం..!” అని అడుగుతూ సైకిల్ ముందర రాడ్ మీద కూర్చున్నాను నేను. “ఊహు.. అన్నీ తనకే చెప్తే బాగోదు కదా… అందుకే కృష్ణన్ కి చెప్పాను,” అన్నాడు తను నవ్వుతూ. నేను కూడా నవ్వేసా… “ప్రతి ఫ్రెండూ అవసరమేరా…!” అని హమ్ చేసాను…. తను కూడా నాతో హమ్మింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇద్దరం కొంతసేపయ్యాక మెయిన్ గేట్ రీచ్ అయ్యాం. తమిళ్ తంబీలకి థాంక్స్ చెప్పాను… అక్కడ్నుంచి మమ్మల్ని రైల్వే స్టేషన్ కి అజయ్ డ్రాప్ చేసాడు. ఫైనల్లీ, మా వూరు వెళ్ళే ట్రెయిన్ కోసం వెయిట్ చేస్తున్నాం… announcement విన్నాం… మరికొద్దిసేపట్లో మేమున్న ప్లాట్ఫారంకి వస్తుంది అని… ఇది నిజంగా చాల sweetest experience నా లైఫ్ లో…’ఒక్క నిముషం కూడా ఉండలేను వీడితో’ అనుకున్న వ్యక్తితో జీవితాంతం కలిసుండాలి అనేంతగా నా ఆలోచనల్ని మార్చేసిన ఈ రెండునెలలు చాల హాయిగా గడిచిపోయాయి… మా ట్రెయిన్ వచ్చింది, మేం వెళ్ళి సెటిలయ్యాం… అజయ్ మా ట్రెయిన్ కదిలే వరకు ఉన్నాడు… మేం తనకి బాయ్ చెప్పాము… వచ్చేటప్పటి జర్నీలా కాదు, ఈసారి మేము క్లోజ్ అయ్యాం కాబట్టి బోల్డన్ని మాటలు మాట్లాడుకున్నాం… క్యాంపస్ లో తీసుకున్న ఫొటోస్ అన్నీ చూస్కుని అక్కడి మెమొరీస్ అన్నిటిని తల్చుకుంటున్నామ్మేము… “రెండు నెలల తర్వాత ఇంటికి వెళ్తున్నాను, అప్పా నాకోసం రైల్వే స్టేషన్ కి వస్తారు, త్వరగా వెళ్ళిపోతే బాగుండును..!!!” అని అన్నాను నేను. “మనం ఊరు వెళ్ళాక, నిన్ను మా ఇంటికి తీసుకెళ్తా… అమ్మకి పరిచయం చేయడనికి,” అన్నాడు తను. “నువ్వు కూడ మా ఇంటికి రావాలి… అమ్మా, అప్పా, నా కిట్టు ఇంకా నా రూం అన్నీ చూద్దువుగానీ..” అన్నాను నేను. “కిట్టు అంటే?” అన్నాడు తను. “కిట్టు, మా కుక్క… చాల క్యూట్ గా ఉంటుంది. ఉండు చూపిస్తా…” అని ఫోన్ లో ఉన్న కిట్టూ ఫొటోని చూపించాను. “చాలా చిన్నది… నిజంగానే క్యూట్ గా ఉంది..” అన్నాడు తను.

“హా… దానికి 4 months అంతే… నేను గొడవచేసి మరీ కొనిపించుకున్నాను… అసలు ముందు అయితే అమ్మ ఒప్పుకోలేదు… కానీ, అప్పా నా మాట కాదనరు కదా… సో, తీసుకున్నాం. ఇప్పుడైతే మా ఇద్దరికన్నా అమ్మనే దాన్ని ఎక్కువ ముద్దుచేస్తోంది..” అన్నాను నేను. నేను చెప్పిందంతా విని తను నవ్వాడు. ఇంకొన్ని కబుర్లు, పాటలు, కవితలతో రాత్రయిపోయింది. ఇద్దరం ఎవరి బెర్తుల మీద వాళ్ళం నిద్రపోయాం… తెల్లవారేసరికి, ఆర్యన్ ఫిల్టర్ కాఫీతో నాకు good morning చెప్తూ నిద్రలేపాడు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగాను; తనకి share ఇద్దామని అనుకున్నాను గానీ, తను ‘నో’ అంటాడని తెల్సు కాబట్టి ఇంక ఆఫర్ చెయ్యలేదు. జస్ట్ Thanks చెప్పాను, అంతే… కొంచెంసేపయ్యాక మా destination వచ్చింది.. ఇద్దరం దిగాం. అప్పా already వచ్చి నాకోసం ప్లాట్*ఫాంమీద వెయిట్ చేస్తున్నారు. ఆర్యన్ చెయ్యి పట్టుకుని ట్రెయిన్ దిగాను నేను. అప్పాని చూడగానే, తనని, లగేజ్ ని వదిలేసి అప్పా దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాను… “అప్పా… I am back!” అంటూ వెళ్ళి గట్టిగా పట్టేస్కున్నాను… వెళ్ళేప్పుడు ఎన్ని కన్నీళ్ళు వచ్చాయో గుర్తులేదుగానీ, అప్పా దగ్గరికి తిరిగొచ్చేసాను అనే ఆనందంతో చాలనే కన్నీళ్ళు వచ్చాయి. ఆనందభాష్పాలు అంటారే, అవన్నమాట… అప్పాని చూసి ఆయనతో మాట్లాడుతూ ఆర్యన్ కూడ నాతో వచ్చాడనే విషయమే మర్చిపోయాను. “ఆర్యన్ ఏడి?” అని అప్పా అడిగేదాకా గుర్తురాలేదు నాకు. “వచ్చాడు… నా లగేజ్ తో సహా తనని వదిలేసి మిమ్మల్ని చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చేశాను,” అని జవాబిచ్చాను నేను. “పిచ్చి పిల్లా… పద,” అని నా తల నిమురుతూ అన్నారు ఆయన. ఇద్దరం వెనక్కి వెళ్ళాం. ఆర్యన్, పాపం…ఇద్దరి లగేజ్ మోసుకుంటూ నడిచి వస్తున్నాడు. “సారీ బాబు… నేను తీసుకుంటాను, ఇలా యివ్వు,” అని అప్పా నా trolly హాండిల్ తీసుకున్నారు. “పర్లేదు అంకుల్… శిశిరకి మీరుంటే ఇంకెవరూ గుర్తురారు,” అని నవ్వుతూ అన్నాడు. మాటైతే నవ్వుతూ అన్నాడు కానీ, నాకు మాత్రం తను నన్ను దెప్పినట్టు అనిపించింది… నేను నవ్వాను అంతే.. “పద తల్లీ.. అమ్మ నీకోసం ఎదురుచూస్తుంది ఇంటి దగ్గర,” అన్నారు అప్పా… “హ్మ్…” అన్నాను నేను. “నువ్వు రేపు మాయింటికి లంచ్ కి రా బాబు,” అని ఆర్యన్ని invite చేసారు ఆయన. ‘వస్తాను’ అన్నట్టుగా ఆర్యన్ నవ్వుతూ తల ఊపాడు… తర్వాత నేను అప్పా మా ఇంటికి, తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ______________________________ Sindhu Like 224 Dislike 28 49055 24 5 cookie-check ఒక ప్రేమ కథ – 11 no

Categories Telugu
More stories See all