ఒక ప్రేమ కథ – 9
నేను వెళ్లేసరికి తను వాళ్ళ హాస్టల్ దగ్గరున్న లాన్ లో కుర్చుని బొమ్మ గీస్తున్నాడు,నేను వెళ్లి తన పక్కన కూర్చున్నాను….తను నన్ను చూసి నవ్వాడు….. “Good morning “అని విష్ చేసాడు ….. “Good morning Aaryan “అన్నాను నేను.ఎలా మాట్లాడాలో అర్ధం కాలేదు నాకు… సైలెంట్ గా తను వేసే బొమ్మ నీ చూస్తున్నాను. “ఏంటి,ఇవాళ సైలెంట్ గా ఉంది శిశిర? “అన్నాడు తను నా వైపు చూస్తూ . “ఆర్యన్ నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు “అన్నాను నేను తల దించుకుంటు….. “శిశిర,నిన్న జరిగినదాని గురించా ? నువ్వు నా మీద జాలి పడుతున్నావ్ శిశిర,అది ప్రేమ కాదు “అన్నాడు తను. తను అలా అనేసరికి నాకు కోపం వచ్చింది తనని నా వైపుకి కోపం గా లాగి వాడి collar పట్టుకుని ” “నీకు అలా ఎందుకు అనిపించింది రా అసలు,ప్రేమకి,జాలికి తేడా తెలీదా రా నాకు…నాకు నిన్న పాప మాటాడలేదు అని తెలిసినప్పుడు తన పయ్ నాకు కలిగింది జాలి……తను నాకు ముద్దు పెట్టినప్పుడు వచ్చింది ప్రేమ…నేను తనని ముద్దు పెటింది ప్రేమతో…… నీతో ఉన్నప్డు నన్ను నేను మర్చిపోయేలా చేస్తావు రా నన్ను….. మా అప్పా తో ఉన్నప్డు ఎంత secure గా ఉంటానో..ఎంత ఆనందం గా ఉంటానో మల్ల నీతోనే అంతా ఆనందం గా ఉంటార్ర…. ఏరా.. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావ్ రా నా మనసులోని ఆ ఫీలింగ్ ను.. నా మది మాటున దాగున్న ప్రేమను చెప్పాగా ముందు నువ్వంటే నాకు కోపం…నువ్వు కన్పిస్తే చిరాకు పడేదాన్ని… కాని నీతో గడిపాక,నువ్వంటే ఏంటో తెలిసాక…ఒక్క క్షణం నువ్వు కనబడకపోతే నీ జాడ కోసమే వెతుకుతాయి తెలుసా నా కళ్లు….నిన్ని నా నుంచి దూరం చేసే రాత్రి అంతే కోపం నాకు…… రోజు పడుకునే అప్పుడు నీతో గడిపిన క్షణాలే గుర్తొస్తాయి రా…. మార్నింగ్ నీతో గడిపే క్షణాల కోసమే ఎదురు చూస్తుంటా రా…… కొద్దిసేపు నువు మాట్లాడకపోతే ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని నీ పిలుపు కోసమే ఎదురుచూస్తుంది తెలుసా నా మనసు.. ఆ సమయాల్లో నా కంట కన్నీరుని నువ్వు ఎప్పుడన్నా గమనించావా.. లేదు కదా. నీ కోసం నేను పడే ఆరాటం, తపన నీకెప్పుడు అర్థమౌతాయిరా…నీకు తెలుసో లేదో ఒక్కోసారి నువ్వు ఎదురు పడినప్పుడు ఎప్పడు గల గల మాటాడే నేను నీ పక్క నుండే మౌనంగా తలదించుకుని ఎందుకు మౌనం గా ఉంటానో తెలుసా ?.ఆ క్షణాన నాకు ఊపిరి ఆడదురా.. నీ నీడలా నిరంతరం నీ వెంటే తిరుగుతున్నా.. నీ తలపులతోనే పొద్దు గడుపుతున్నా.. నువ్వే శ్వాసగా నీ కోసం నిరీక్షిస్తూ బతుకుతున్నా…ఒరేయ్.. నేన్నిన్ను బాగానే అర్థం చేసుకుంటున్నా .. కానీ నువ్వే నాలో నీ మీద ఉన్న ప్రేమను కాస్తైనా గుర్తించావా?.లేదు…ఇంకెప్పుడు గుర్తిస్తావో నాకు తెలీట్లేదు..అసలు ఈ జన్మకు గుర్తిస్తావా?ఏమో… నా ప్రేమ నీకు అర్థమవ్వాలంటే నా జీవితకాలం సరిపోతుందో లేదో.. నా ఈ ఫీలింగ్స్ అన్నీ నీకింకెప్పుడు అర్థమౌతాయో ఏంటో?.
నా ప్రేమను ఇంకెలా నీకు తెలిజెప్పేది…ఇంతకన్నా చెప్పటం రాదు రా…నీల కవితలు రాయటం నాకు రాదు…నా మనుసులో ఉన్నది చెప్పటం ఒక్కటే తెలుసు ర . నాకు తెలీట్లేదురా.. ఆడపిల్లను రా పెదవి విప్పి నీకు ఈ విషయం చెప్పటానికి చాల మదన పడ్డాను రా . ఇంకేం చేయలేనురా నువు నా ప్రేమను అర్థం చేసుకునే ఆ సమయం కోసం వేయి కళ్లతో వేచి చూడటం తప్ప!!” అని ఏడుస్తూ చెప్పాను,,,తర్వాత అర్ధం అయింది..కోపం లో నేను ఏం చేస్తున్నానో…వాడి collar వదిలి ….. “నిన్న అప్పా తో మాట్లాడి అంతా చెప్పాను,ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను చాల లక్కీ అనిపించింది,నీకు నీ లైఫ్ గోల్ achieve చేయిడం ఎంత important ఓ నాకు అర్ధం అయింది,నేను నీకు సపోర్ట్ అవ్వాలి అనుకుంటున్నాను ఆర్యన్ అంతే.నాకు నీ కమిట్మెంట్ కానీ attention కానీ అవసరం లేదు “అన్నాను నేను అలా నేల పయ్ మోకాళ్ళ మీద కుర్చుని కంటి నిండా నీళ్ళ తో. “నాకు తెలుసు శిశిర, అందుకే చెప్తున్నాను.నువ్వు చాల మంచి అమ్మాయివి,you are like a flawless pearl, నాకన్నా బెటర్ పర్సన్ నీకు దొరుకుతాడు “అన్నాడు తను. “నేను కోరుకునేది నిన్ను ఆర్యన్.”అన్నాను నేను.తను గీసిన బొమ్మని నా చేతి లో పెట్టి హాస్టల్ లోపలి వెళ్ళిపోయాడు..ఆ బొమ్మని చూస్తున్నాను.. ఆ కాగితం నా కన్నీటి బొట్లతో తడుస్తోంది .. అలా అక్కడే కూర్చున్నాను అలా ఏడుస్తూ కూచున్న……తర్వాత నా భుజం మీద ఎవరో చేయి వేసారు……నేను వెనక్కి తిరిగి చూసాను,ఆర్యన్ నించున్నాడు…….. “Thank you so much for coming into my life Shishira .. “అంటూ చేతులు చాపి నించున్నాడు …..నా ఆనందానికి అవధులు లేవు వెంటనే తనని గట్టిగా పట్టేస్కున్నాను,నా కన్నీళ్ళు తన భుజాన్ని తడుపుతున్నాయి.. “నిన్ను ఏడిపించాను కదా.. I am sorry,నీ లెటర్ చదివిన వెంటనే ఎస్ అనాలి అనుకున్నాను కానీ, నేను ఉన్న situation లో ఆ మూడు అక్షరాలూ చాల expensive అనిపించాయి నాకు”అని నా తల నిమురుతూ అన్నాడు తను. “నాకు నీలా పెద్ద పెద్ద మాటల్లో చెప్పడం రాదనీ చెప్పను గా “అన్నాను నేను కళ్ళు తుడుచుకుంటూ. “నువ్వు ఇలా చిన్న పిల్లలా ఉంటేనే నాకు ఇష్టం”అన్నాడు తను నా నుదుటి మెడ ముద్దు పెట్టుకుంటూ…. “కాని ఇంతలా ఏడిపించాలా నన్ను…ఇది ఇందాకే చెప్పొచు కదా” అన్నాను నేను…. “నేను నీకు చెప్పాను…నువ్వే చూడలేదు” అన్నాడు “చెప్పావ….ఎప్పుడు బాబు” అన్నాను నా చేతిలో ఉన్న తను వేసిన బొమ్మ పేపర్ తెస్కుని విడదీసి చూపించాడు…..అందులో ఒక అమ్మాయి అబ్బాయి కలసి ఉన్న బొమ్మ ఉన్నది….అందులో ఇలా రాసి ఉంది…….. “చెలియా నా సఖియా….!! ప్రేమను ఎలా చూపించాలో తెలిసిన నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు….. కాలంతో పరిగెత్తాలనుకునే నా పాదం ఈ క్షణం నీతో నడవాలని చెబుతోంది….. ఎన్నడూ లేని విధంగా 72 లో కొట్టుకోవాల్సిన నా గుండె నిన్ను చూడగానే 143 లోకి వెల్తోంది…..
నీ మాట వినగానే నాలో ఏదో తెలియని సంతోషం… నీ పేరు వినబడినా నాలో అలజడి మొదలవుతుంది. నా కళ్ళెపుడూ నిన్నే చూడాలని,నా మాటలన్నీ నీతోనే చెప్పాలని అనిపిస్తోంది. నిన్నెంత ప్రేమిస్తున్నా అంటే చెప్పడానికి నా దగ్గర మాటల్లేవు,గుండెలో దాచేంత తక్కువ కూడా కాదు.కాలాన్ని కొలవడానికి సెకండ్లు ఉన్నాయి…నీపై నా ప్రేమను నా గుండె చప్పుడుతో కొలుస్తాను…..నువు గుర్తొచ్చినపుడే స్పందించమని నా మనసుకి చెప్పా…అమ్మలా ప్రేమిస్తాను నాన్నలా చూసుకుంటాను అని అందరిలా డైలాగులు చెప్పను కానీ నేను చూపించు ప్రేమలో మీ అమ్మా నాన్నల ప్రేమ కనబడుతుంది..నేను అందరి లాంటి అబ్బాయే అయినా అందరిలా కాకుండా నిన్ను నీలా ప్రేమించి నాలా చూసుకుంటా….నా ప్రేమను నీకు ఇవ్వాలని నీతో నా జీవితాన్ని పంచుకోవాలని నా మనసు పదే పదే ప్రతి స్పందనలో నాకు చెబుతోంది….నా ఈ జన్మ నీతోనే ప్రియతమా…..!!” అది చదివాక వాడిని గట్టిగా పట్టేస్కున్న…. “ఏరా ఇలానే చెప్పాలా…నువ్వు ఎస్ అన్న ఒక్క ముక్క చెప్తే చాలు కదా రా…..జీవితాంతం నా గుండెల్లో పెట్టుకుని చూస్కుంటా ర నిన్ను అన్నా” “నీకు నేను చెప్పేది నీ లైఫ్ లాంగ్ గుర్తుండాలి అందుకే ఇలా ” అన్నాడు…. “సరే పద ఆకలి వేస్తుంది ఇప్పుడు” అన్నా సరే పద అని ఇద్దరం నవ్వుతు చేతులు పట్టుకుని అక్షయ కాంటీన్ వైపు నడుస్తున్నాం. “ఈ రోజు నీ ఫిల్టర్ కాఫీ తో సెలెబ్రేట్ చేస్కుందాం “అన్నాడు తను. “నువ్వు తాగవ్ గా ..”అన్నాను నేను. “నువ్వు తాగుతావ్ గా “అన్నాడు తను. ఇద్దరం నవ్వుకుంటూ నడుస్తున్నాం. “అవను,నువ్వు బొమ్మలు కూడా వేస్తావా?”అడిగాను నేను.. “హా.. వేస్తాను,ఎప్పుడైనా నేను చెప్పాలి అనుకున్నప్పుడు మాటలు కరువైతే….నేను చెప్పలేని భావాలను ఇలా గీస్తుంటాను,ఏదో పిచ్చి రాతలు రాస్తుంటాను… “అన్నాడు తను. “నువ్వు మాట్లాడటం అలవాటు చేస్కో,నీ కవితల్లోనూ,బొమ్మల్లోను అర్ధాలు వెతుక్కోడం నాకు కొంచెం కష్టంఅవుతోంది కదా.”అన్నాను నేను నవ్వుతూ. “ఇప్పుడిప్పుడే మాటలు ఆడడం నేర్చుకుంటున్నాను నీ దగ్గర్నుంచి,ఇంకా బాగా నేర్చుకుంటాను లే “అన్నాడు తను కూడా నవ్వుతూ. కాంటీన్ దగ్గిరకి వచ్చేసాం……. “నేను,అప్పా కి కాల్ చేసి వస్తాను,నువ్వెళ్ళి ఆర్డర్ చెప్పు”అన్నాను నేను. తను లోపలి వెళ్ళాడు,నేను మా నాన్న కి కాల్ చేసి నా ఆనందాన్ని ఆయన తో పంచుకున్నాను.తను చాల హ్యాపీ గా ఉన్నారు…..ఇలానే ఎప్పుడు నవ్వుతూ ఉండమన్నారు…… ఫోన్ అయ్యాక లోపలికి వెళ్ళాను..ఆర్యన్ ఆర్డర్ చెప్పుంచాడు…..సో,వెళ్ళిన వెంటనే వేడి వేడి ఫిల్టర్ కాఫీ వచ్చింది. “నువ్వు తాగవ?”బుంగమూతి పెట్టి అడిగాను నేను. “ఊహూ.. ” అన్నాడు తను . “నేను నిన్ను ఇబ్బంది పెట్టానులే ” అంటూ నేనే తాగాను. ఆ తర్వాత ఇద్దరం మా డిపార్టుమెంటుకి వెళ్ళాం..వర్క్ చేస్కున్నం..
ఈవెనింగ్ వరకు చాల వర్క్ లోడ్ ఉంది. నేను మాత్రం మధ్యలో కొంత సేపు మిగతా 3 టీంమెంబెర్స్ తో కల్సి బ్రేక్ తీస్కున్నాను కాని ఆర్యన్ కి వర్క్ ముందు ఇంకేమి కనిపించవు కాబట్టి తను అసలు deviate అవ్వలేదు…..నేను కాఫ్తెరియా నుంచి ఒక కోక్ ఇంకా సమోసా తెచ్చి ఆర్యన్ ముందు పెట్టాను.తను తిరిగి నా వైపు చూసాడు.. “కొంచెం బ్రేక్ నీక్కూడా అవసరం,సమోసా బాగుంది ఇవాళ అందుకే తెచ్చాను…హ్మ్మ్ తిను “అంటూ తన చేతిలోనుంచి మౌస్ పక్కకి పెడ్తూ అన్నాను. “హ్మ్మ్..థాంక్యు ” అని నవ్వుతూ సమోసా తింటున్నాడు తను. “బాగుందా?”అడిగాను నేను. “ఆకలేస్తున్నప్పుడు ఏదైనా tasty గానే ఉంటుంది”అన్నాడు తను. “మరింత ఆకలేస్తున్నపుడు 2min బ్రేక్ తీస్కోవచ్చుగా “అన్నాను నేను. “వర్క్ కూడా ఉందిగా”అన్నాడు తను. “హెల్త్ ఉంటె నే చెయ్యగలవ్ ఏమైనా.. ముందు నీ గురించి నువ్వు కేర్ తీస్కోవాలి”అన్నాను నేను. “మా అమ్మ తర్వాత నా హెల్త్ జాగ్రత్త అని చెప్పిన మొదటి వ్యక్తివి నువ్వే శిశిర..థాంక్యు “అన్నాడు తను. “మరి నీలా వరల్డ్ తో సంబంధంలేకుండా వర్క్ కి అంకితం అయిపోయేవాళ్ళుంటే మేము అయినా ఎవరకి చెప్తాము,బాబు ఇలా చేస్తే కష్టం సుమ .. హెల్త్ కూడా ఇంపార్టెంట్….ఇంతవరకు ఆంటీ నిన్ను జాగ్రత్త గా చుస్కున్నారు….ఇకపయ్ నిన్ను జాగ్రత్త గా చుస్కోవలసిన భాద్యత నాదే కదా … అని తన తల పయ్ నా తల పెడ్తూ” అన్నాను నేను… |తెలుగుసెక్స్కథలు డాట్ కం ఉత్తమ కథలను చదవండి ! “హ హ హ.. అవను చెప్తావ్ చెప్తావ్ ..” అన్నాడు తను నా కళ్ళలోకి చూస్తూ…… “ఏంటి శిశిరా కళ్ళకి కాటుక పెట్టావా”అన్నాడు “హ్మ్మ్మ్….నువ్వే గా బాగుంటా అన్నావు…..అందుకే “…. తను నా చేతిని తన చేతిలోకి తీస్కుని ముద్దు పెట్టాడు…… “ఎందుకు శిశిర…నా లిఫ్ లోకి ఇంత లేట్ గా వచ్చావు”……..అన్నాడు “నువ్వే మాటాడకుండా దూరం గా ఉన్నావు …అయిన ఈ ఇంటర్న్షిప్ ౧స్త్ ఇయర్ లోనే వస్తే బాగుణ్ణు “అన్నాను “హ్మ్మ్ …పోన్లే ఇప్పటికన్నా దొరికావు నాకు ఇకపయ్ జాగ్రతగా చూస్కుంటా ” అన్నాడు … తర్వాత మిగిలిన టీం మెంబెర్స్ రావటం తో మల్ల మా వర్క్ లోకి వేల్లిపోయం ……. ఇలా కొంచెం కేరింగ్ గా.. స్వీట్ గా..డే అంతా workload తో ఈవెనింగ్ pleasant గా ఆర్యన్ చెప్పే కవితలతో,నేను చెప్పే బోల్డన్ని కబుర్ల తో మా రెండు నెలల ఇంటర్న్షిప్ ఆల్మోస్ట్ అయిపొయింది. రేపే ఆఖరి రోజు అక్కడ…..నా డైరీ లో ఈ రెండునెలలు నా జీవితాన్ని ఎంతలా మార్చేసాయో రాస్కుంటున్నాను నేను,ఈవెనింగ్ లాన్ లో కుర్చుని.. ఇంతలో ఆర్యన్ వచ్చాడు……. “ఏంటి రాస్తున్నావ్ ?”అడిగాడు తను నా పక్కన కూర్చుంటూ..” హ్మ్మ్….. వచ్చావ.. ఏంలేదు ఈ 2 మంత్స్ ఇంటర్న్షిప్ డేస్ ఎలా గడిచాయో రాస్కుంటున్నాను.”అంటూ పెన్ డైరీలో పెట్టి ముసాను.. “ఓహో..నీ పర్సనల్ డైరీ నా.. సరే “అంటూ తీసిన వాడే మల్లి డైరీ కింద పెట్టేసాడు. “అరేయ్….
అలా ఏంలేదు.. చూడవచ్చు నువ్వు”అన్నాను నేను. “వద్దు శిశిర…..ఎవరికీ వాళ్ళకి కొంత ప్రైవసీ ఉండాలి అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ “అన్నాడు తను. తన మాటలకి నా ప్రైవసీ అండ్ స్పేస్ నాకు ఇస్తున్నాడని నేను హ్యాపీ గా ఫీల్ అవ్వాలో…. లేదంటే నన్ను పరయిదాన్ని అనుకుంటున్నాడు అని బాధ పడాలో నాకు అర్ధం కాలేదు.. చిన్న చిరునవ్వు ఇచ్చాను…. అంతే…… “రేపు లాస్ట్ డే కదా..మేడం కి ఏదైనా memorable గా ఇద్దామ ?” అడిగాడు తను. మా initial డేస్ లో ఆవిడ తో ఉన్న ఎక్స్పీరియన్స్ తర్వాత మేము మల్లి ఎటువంటి ఆడ్ sequences కి తావివ్వలేదు.ఆవిడ వచ్చి వర్క్ ఎలా నడుస్తోందో చూసి వేల్పోయేవారు అంతే……. “హా.. మన టీం అందరం నైట్ డిన్నర్ కి వెళ్తున్నాం కదా.. ఆవిడ ని డిన్నర్ కి పిలిస్తే బాగుండదు కదా సో, ఇవాళ వెళ్లి ఆవిడకి గిఫ్ట్ కొందాము.”అన్నాను నేను. ______________________________ Sindhu Like 224 Dislike 28 49051 19 7 cookie-check ఒక ప్రేమ కథ – 9 no