కీలు గుర్రం నాలుగవ భాగం
ఈ కధ ఒక పాత మేగజైన్ లోనిది. రవి స్కేన్ చేసి పంపేరు. ఆ కధను తెలుగు లిపి లో పి డి ఫ్ గా మీకు అందిస్తున్నాము. ** భానూ అని పిలిచాడు సుందరం. భానుమతి పలకలేదు. మళ్ళీ ఆమెను పిలిచి నిద్రాభంగం కలిగించటం ఇష్టం లేక కిటికీ పక్కగా ఉన్న మంచం మీద దుప్పటీ తీసి విదిల్చి తిరిగి వేసుకుని మేను వాల్చాడు. గదిలో గాలి చల్లగా ఉంది. పదినిముషాలు తిరగకుండా సుందరం నిద్రాదేవి ఒడిలో ఒరిగి పోయాడు. బడలిక స మయంలో మీద ఆ పిలిచినట్లయింది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న తర్వాత ఎప్పుడో భాను మతి పలుకుదా మనుకున్నాడు. తనని పెది మలు కదిపాడు కాని లేవలేక పోయాడు. గోడవైపు ఉన్నవాడు ఇటువైపు తిరిగి గురక కంటిన్యూ చేయసాగాడు. గురుడు నిద్రపోతున్నాడు అన్నాడు గోపి. కుంభకర్ణుని తమ్ముడు అని నవ్వి భానుమతి మంచం మీద లేచి కూర్చుని లైటార్పేయ్, లేకుంటే సిస్టర్ వచ్చి గొడవ పెడుతుంది అంది. గోపీ తలుపు వేసి వచ్చి మంచం మీద కూర్చుని భాను మతి మీద కి వంగి స్విచ్ నొక్కేడు. లైటారి పోయింది. ఎట్లా ఉంది అన్నాడు గోపి. మెల్లిగా మాట్లాడు, ఆయన లేచారంటే బాగుండదు అంది భాను మతి. ఎట్లా ఉంది అన్నాడు మళ్ళీ గోపి. నాకేం నిక్షేపంగా ఉంటేను, రేపో ఎల్లుండో డిస్చార్జ్ చేస్తారట అంది భాను మతి . వెరీ గుడ్ ఈ రోజు నాకు చాలా సంతోషం గా ఉంది అన్నాడు గోపి. ఏం పార్వత మ్మ కొత్త పిట్టను తెచ్చిందా అంది భాను మతి. ఛా అది రాస్కేల్, ఇహ ఆవిడ మాటలు విని నేను మోసపోయి నిన్ను కొట్టదలచుకోలేదు. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నీ గురించే ఆలోచిస్తూ ఉండి పోయాను. ఈ వేళ నేను షాపుకు కూడా వెళ్ళలేదు అన్నాడు గోపి. అది సరే సంతోషం ఎందుకని అని అడిగింది భాను మతి . నువ్వింత సంతోషంగా మాటాడుతున్నందుకు. నువ్వు నిన్న నా మీద అలా విరుచుకు పడేసరికి నాకు భయం వేసింది అన్నాడు గోపి. కాకా పట్టకు ఇహ ముందు నీతో సంబంధం పెట్టుకోనని బుద్ధి వచ్చిందనీ ఆయనకు చెప్పేసాను అంది భాను మతి. నిజంగా అన్నాడు గోపి. ఈ విషయంలో నేనెప్పుడయినా అబద్ధం చెప్పేనా అంది భాను మతి . గోపి రెండు క్షణాలు మౌనంగా ఉండి ఆమె రెండు చేతులూ పట్టుకుని నిన్ను వదిలి నేను ఉండలేను భానూ అన్నాడు. భానుమతి వెంటనే ఏమీ మాటాడలేదు. అతని చేతులు వణుకుతున్నాయి. అతని వేడి వేళ్ళద్వారా భాను మతిలోకి ప్రవహిస్తోంది. తను మాట్లాడబోయేంతలో…. ఇంకొకసారి చూడు. నేను ఎప్పుడయినా నీ ఎడల మూర్ఖం గా ప్రవర్తించి చేయి చేసుకుంటే నన్ను దగ్గిరకు రానీయకు అన్నాడు గోపి. ఇలా చాలా సార్లు అయింది అంది కినుకగా భాను మతి. ఇది చివరి చాన్స్ అన్నాడు గోపి. మాట తప్పవు కదా అంది భాను మతి . నెవ్వర్ అని ముద్దు పెట్టుకున్నాడు ఆమెను గోపి. భానుమతి అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుని పెదిమలు అందించింది.