ఖర్కోటఖుడు – Part 10
“వెల్ మిస్టర్ జెంటిల్మెన్. ఆ హార్ధిక్ ఏం చేస్తున్నాడో తెలిసిందా?” అన్నాడు రిచర్డ్స్ మౌనాన్ని చేదిస్తూ. ” మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను ఇక్కడ లోకల్ కిల్లర్స్ ని హైర్ చేసుకున్నాడు. నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. మనకి ఇక్కడ సాయం చేస్తున్న ఛటర్జీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు.” అన్నాడు రిచర్డ్స్ సెక్యూరిటీ ఆఫీసర్ జాన్. “ఏంటి? ఛటర్జీ కనిపించడం లేదా? అతను లేకపోతే మనకి ఇక్కడ ఎవరు సాయం చేస్తారు? ఎక్కడున్నాడో కనుక్కోండి క్విక్” ఉరుముతూ అన్నాడు రిచర్డ్స్. “యెస్ సర్” అంటూ జాన్ అక్కడ్నుంచి వెళ్తుంటే “హా జాన్.. ఛటర్జీ ఇక్కడ లోకల్ ఎంపీ ఎవరో తనకి బాగా తెలుసని చెప్పాడు కదా? అతని డీటెయిల్స్ ఎంక్వైరీ చెయ్. అలాగే మన నావల్ కమాండ్ ఆఫీసర్ టిమ్ ని కూడా ఒకసారి కాల్ చెయ్యమని చెప్పు.” అంటూ అక్కడినుంచి లేచి వెళ్ళిపోయాడు. )))))******◆ 【√/@®€$# ♂♀】 ◆******((((( హార్ధిక్ కోసం తన అనుచరులతో, వాహనాలతో ఎదురుచూస్తున్న హాథీకి హార్ధిక్ తో పాటుగా మరొక 40 మంది రావడం వాళ్ళ వెనక మోసుకువస్తున్న పెద్ద లగేజ్ చూస్తుంటే భయమేసింది. హార్ధిక్ చెప్పినట్టు తాను తీసుకువచ్చిన 100 మంది కూలీలు హాథీ సైగ చెయ్యగానే పరుగుపరుగున వెళ్ళి అక్కడ నుంచి కూడా తీసుకొచ్చిన రెండు పెద్ద కంటైనర్ లారీలలోకి లోడ్ చేశారు. అక్కడి నుంచి వాహనాలు హైవే దాటుకుంటూ హార్ధిక్ ప్యాలస్ ముందు ఆగాయి. అందులోంచి ఒక్కొక్క వెపన్ తీసి సర్దుతుంటే హాథీ గుండెలు లబలబా కొట్టుకున్నాయి. హాథీ వెంటనే హార్ధిక్ తో “సర్ ఏంటి ఇవన్నీ?” అన్నాడు. “వెపన్స్ హాథీ.. కనిపించట్లేదా?” “ఇవన్నీ ఎందుకు?” “ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. పనికొస్తాయని తెచ్చాను” “సర్ మన దగ్గర ఉన్న మందీ మార్బలం సరిపోదా?” “హాథీ.. యుద్ధం అనేది చదరంగం లాంటిది. మన దగ్గర అన్నీ ఉండాలి” “అయితే మాత్రం? ఇన్ని ఎందుకు సర్?” “చెప్పాను కదా చదరంగం అని. మంత్రి అన్నీ చేస్తాడు అనుకుంటే గుర్రం చేసే పని చెయ్యలేడు కదా? భటుడు కూడా అటువైపు వెళ్తే మనకి నచ్చిన పావులా మారతాడు. అందుకే ఏదీ వదులుకోకూడదు. అన్నిటినీ సమర్ధవంతంగా వాడుకుంటేనే విజయం సాధిస్తాం.” హాథీ మరింకేం మాట్లాడలేదు. వచ్చిన సిబ్బంది మొత్తానికి రూంలు ఏర్పాటు చేసి హార్ధిక్ గదిలోకి వచ్చాడు హాథీ. హార్ధిక్ అప్పుడే బీన్ బ్యాగ్ మీద పడుకుని రిలాక్స్ అవుతూ మందు కొడుతున్నాడు. మర్యాదగా డోర్ కొట్టాడు హాథీ. తాగుతున్న హార్ధిక్ డోర్ వంక చూస్తూ “హా హాథీ.. లోపలికి రా” అన్నాడు. హాథీ లోపలికి వచ్చాక “చెప్పు” అన్నాడు. “అదే సర్ ఆ కాల్ గర్ల్ ని మన వాళ్ళతో ఎందుకు కిడ్నాప్ చేయించారు?” “ఓహ్ అదా? ఇంతకీ ఆ విషయమే మర్చిపోయాను. వెళ్ళి మల్హోత్రాని, ఆ అమ్మాయిని తీసుకురా పో..