All content free · updated every 5 minutes

చెన్నై అమ్మాయితో vasu 1

Story Telugu 5 pages 2 years ago

చెన్నై అమ్మాయితో vasu 1
The Seduction Story. Chapter One – The Temptation. * యిది జరిగింది నేను చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే ట్రైన్ ప్రయాణంలో. హుషారైన ముగ్గురు కాలేజీ అమ్మాయిలూ, యిద్దరు అబ్బాయిలూ కలిశారు యెదురు బెర్తులో. చెన్నైలో మా స్నేహితుడితో ఓ మూడు రోజులు గడిపి తిరుగు ప్రయాణమయ్యాను. అప్పటికింకా నాకు పెళ్లవలేదు. హైదరాబాద్ లో ఉద్యోగం. చెన్నైలో వుండే నా మిత్రుడు నా కాలేజీనుంచి పరిచయం. 0545pm కి బయలుదేరే ట్రైన్ కి కొద్దిగా15min ముండే స్టేషన్ కు చేరుకున్నాను. నా మిత్రుడు కూడా వొచ్చాడు. నేను ట్రైన్ బోగీకి అతికించిన ప్రయాణికుల లిస్ట్ చూస్తున్నాను. యింతలో మావాడు నా పక్కన వొచ్చి నిలబడి, యేరా, మళ్ళీ మొదలెట్టావా అంటూ నవ్వాడు. నేను లిస్ట్ చూస్తూ, ఒరేయ్ నా క్యాబిన్ లో ముగ్గురు కాలేజీ వయసు అమ్మాయిలురా అని సంబరపడ్డాను. నీ మొహంలే, అయితే యేమిటీ, వాళ్లకు నీతో కెమిస్ట్రీ సెట్ అవ్వాలి కదా, అయినా తింగరి వేశాలెయ్యకుండా తిన్నగా తిని పడుకో అన్నాడు. నేను వాడికి వీడ్కోలు చెప్పి వెళ్లి విండోపక్క సీట్లో సెటిల్ అయ్యాను. కిటికీలు తెరిచే వున్నాయ్. ట్రైన్ కదలటానికి యింకా 5min వుందనగా అప్పుడే బిలబిలమంటూ ఓ ఐదుగురు లగేజీలతో దిగబడ్డారు. వొకటే యికయికలూ పకపకలూ. ఒకటే గోల. మొత్తం 6గురు. నాదొక బెర్తు, మిగతా వాళ్ళవి. నాది కుడిపక్కన లోవర్ బర్త్. విండో పక్కన కూచున్నాను. వీళ్ళ హడావిడి మాములుగా లేదు. 6pm కి కూత పెడుతూ బరువుగా కదిలింది ట్రైన్. బయటినుంచి చల్లటి గాలి మెల్లిగా లోపలికి వొస్తూ ముఖాన్ని కొస్తోంది. కాసేపటికి వీళ్ళు సర్డుకుని కూచున్నారు. కాస్తా హడావుడి తగ్గింది. యింకా చీకట్లు ముసురుకోలేదు. ఇద్దరబ్బాయిలు నావైపు, మిగతా ముగ్గురు అమ్మాయిలు యెదురు బెర్త్ లో కూర్చున్నారు. కాసేపటికి కాఫీ వాడొస్తే తీసుకుని సిప్ చేస్తూ అప్పుడు నింపాదిగా చూశాను వాళ్ళని. బెర్తు చివర అమ్మాయి, మెరూన్ చుడీదార్లో వుంది. పసుపురంగు చున్నీ. రెండో ఆమె లూజ్ పైజమాలో ఆకుపచ్చ కుర్తాలో వుంది. యిద్దరూ చాలా ఫెయిర్, కానీ features అంత attractive గా లేవు. షోరూంలో పాలరాతి బొమ్మల్లా వున్నారు. యింక మిగిలింది నాకు యెదురుగా. యీ బొమ్మ మాత్రం బావుంది. రంగు, లేత గోధుమరంగుకి కొద్దిగా యెక్కువే. Sharp nose. సన్నటి పెదాలు. గుండ్రటి కళ్ళు. చాలా ఫిట్ గా వుంది. పోనీటైల్ జుట్టు. జీన్స్ లో తొడలు మంచి బలిష్టంగా వున్నాయ్. మెడలో సన్నటి గొలుసు, చేతికి స్మార్ట్ వాచ్. లైట్ బ్లూ టీషర్ట్, స్కిన్ టైట్ strechable gray జీన్స్. తను పెద్ద వాగుడుపిట్టలా వుంది. అదేపనిగా చేతులూపుతూ గలగలా మాట్లాడుతూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ బిగ్గరగా నవ్వుతూ సందడి చేస్తోంది. ఆమె అలా పడిపడీ నవ్వినప్పుడు, ఆమె గుండ్రటి వక్షద్వయం భలే ఎగురుతోంది. నావేపు చూసినట్టు లేదు. అప్పుడే చీకట్లు ముసురుకున్నాయ్.

వాళ్ళేదో ఫాస్ట్ ఫుడ్ తెచ్చుకుని తినేసి Tin కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. మాటల్లో తెలిసింది, ఆమె పేరు శృతి. యింజనీరింగ్ ఫైనల్ ఇయర్, చెన్నయ్ లో. చుడీదార్ వేసుకున్న అమ్మాయ్ తమిళ్ యింగ్లీష్ మాట్లాడుతోంది. మిగతా వాళ్ళు యింగ్లీష్ లో మాత్రమే. మరి వీళ్లకు తెలుగు వచ్చో లేదో తెలీదు. కాసేపటికి అంతా సద్దుమణిగింది. ఇద్దరబ్బాయిలు మొబైల్ చూసుకుంటే, అటు పక్క యిద్దరు laptop లో యేవో చూస్తున్నారు. శృతి మాత్రం, శృతి మాత్రం, కిటికీకి వున్న బెంచీ తీసి flat గా పెట్టి దానిమీద tablet pc, కొన్ని బుక్స్ పెట్టి యేదో చదువుకుంటోంది. ఆమె నన్ను పట్టించుకున్నట్టు లేదు. సరేనని నేను మొబైల్ ఓపెన్ చేసే లోపే, నన్ను డ్రాప్ చేసిన మిత్రుడు ఫోన్ చేసాడు. బయలుదేరానని చెప్పాను. యెట్లా వుంది అడిగాడు. పూలమొక్కలతో Garden లా వుంది అంటూ యేదో అనుమానం వచ్చి శృతి వైపు చూశాను. బాప్ రే, పెద్ద కళ్లేసుకుని, నొసలు చిట్లేసి చూస్తోంది. పోనీలే, యెలాగూ తెలుగు రాదు కదా అని రెచ్చిపోయాను. మా వాడితో, లేదురా, అంతా చప్పగా వుంది, బోరింగ్ గా, అంటూ ఆమె వైపు చూశాను. తను యేదో నోట్స్ రాసుకుంటోంది. ఫోన్ పెట్టేసి కాసేపు కళ్ళు మూసుకున్నాను. అలసటకి, చల్లటి గాలికి కళ్ళు బరువెక్కాయ్. మూడురోజుల బడలిక యింకా తీరలేదు. యెందుకో విండో బెంచీకింద కాళ్లదగ్గిర యేదో తగిలినట్టు అనిపించి బెంచీ కింద చూశాను. ఒక్కసారి ఆశ్చర్యపోయాను. నా కాళ్ళ దగ్గిర శృతి పాదాలు తచ్చాడుతూ వున్నాయ్. తన కాళ్లు లయబద్దంగా ఆడుతూ నాకు తగిలినా తనకు యేమీ తెలీనట్టు పుస్తకంలో మునిగిపోయింది. అక్కడ చీకటిగా వుంటుంది కాబట్టి యెవరికీ తెలీదు. కాసేపు ఆడించి వెనక్కి తీసుకుంది. నాకు curiosity ఆగలేదు. మళ్ళీ అదే తంతు. కాళ్లు ఆడిస్తోంది, నాకు తగులుతున్నాయ్. యిక లాభం లేదని నా పాదాల వేళ్ళతో తన పాదాల వేళ్ళను నొక్కిపెట్టాను. తనలో యేమీ రియాక్షన్ లేదు. యిసారి పాదాల మీద మెల్లిగా పాముతూ వున్నాను. చాలా నున్నగా వున్నాయ్. నాలో మెల్లిగా వేడి పెరుగుతోంది. కానీ చప్పున వెనక్కి తీసుకుంది. యెందుకో అనుకున్నాను. కానీ guess చేసినట్టు తనే మళ్ళీ ముందు కాళ్ళు చాచింది. నేను మళ్ళీ ఆమె కాలి వేళ్ళను నా కాలివేళ్ళతో నొక్కి పెట్టాను. మెల్లిగా నొక్కాను. తను కాలి వేళ్ళు విడిపించుకోవాలని గింజుకుంటోంది. నేను యింకా గట్టిగా పట్టుకున్నాను. తను సడెన్ గా ముందుకి వొంగి, ప్లీజ్ వొదిలేయ్, బావోదు అంది. నేను అవాక్కయ్యాను. తనకు తెలుగు వచ్చు. నేను కాళ్ళు తీసేశాను. తను చదువులో పడిపోయింది. కాసేపటికి నా కాలిని యెవరో బలంగా తొక్కుతున్నట్టుంది, చూస్తే, ఆమె కాళ్ళే. కోపంగా మొత్తం నలిపేస్తోంది, నొప్పి పుట్టేటట్టు. అసలే గోళ్ళు పెద్దవి, గీరుకుంటున్నాయ్. నేను ముందుకు బెంచీ మీదకు వొంగాను. తనూ ముందుకు వొంగింది.

ఆమె పెదాలు తడిగా మెరుస్తున్నాయ్. నేను పెదాలవైపు చూస్తూ యెంటీ, ప్రతీకారమా, గోళ్ళు గుచ్చుకుంటున్నాయి అన్నాను చిన్నగా నవ్వుతూ. మీరు ముందు కళ్ళు పైకెత్తండి అంది. పైకెత్తి ఆమె కళ్ళలోకి చూశాను. Teasingగా వున్నాయ్. అవును, ప్రతీకారమే అంది నవ్వుతూ. సరే, ఫ్రెండ్స్, అంటూ చేయి చాచాను. తను కూడా చేయి చాచి ఒకే అని కాళ్ళు తీసేసింది. బాబోయ్, పెద్ద శివంగిలా వుంది కదా. గెలకటం కష్టమే. తను యింకాస్తా ముందుకి వొంగి, మీకివన్నీ మామూలేగా అంది చిన్నగా నవ్వుతూ. చేతుల్ని ముడుచుకుని. నేను నవ్వి అప్పుడప్పుడూ, అదీ మీలాంటివాళ్లు కలిసినప్పుడే అన్నాను, బెంచీ మీద పెట్టిన ఆమె చేతివేళ్ళ దగ్గిరకు నా వేళ్ళను పోనిస్తూ తాకాను అమ్మాయిల్ని యిలా flirt చెయ్యరు అంది. మరెలా అన్నాను. నువ్వు ఐశ్వర్యలా వున్నావు, నీ కళ్ళు గుండ్రంగా వున్నాయ్… యిలా. ఓహ్, అయితే అలా మీకిష్టమా నవ్వాను. నీ మొహం, యివన్నీ వినీవినీ బోర్ కొట్టింది. పోనీ కొత్తగా ట్రై చేద్దామా అన్నాను ఆమె చేతి వేళ్ళు పట్టుకుని. ఆమె లాగేసుకుని, వీళ్లకి భాష తెలీకపోవచ్చు, కానీ నీ వేషాలు అర్థం అవుతాయి అంటూ వెనక్కి జరిగింది. నేను నిట్టూర్చాను. *** మీరేం చదువుతున్నారు అడిగాను, Final Year లో వున్నాను, హైదరాబాద్ లో మా పేరెంట్స్. చదువు చెన్నైలో అని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. బెంచీపై ఒక పుస్తకాన్ని తీసుకుని తిరగేశాను. యేదో ప్రాజెక్టు వర్క్ సంబంధించి. యింక ఆ తరువాత చాలా విషయాలు మాట్లాడింది. తను యింత త్వరలో free అవుతుంది అనుకోలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ని వొదిలేసింది. వాళ్ళ గొడవలో వాళ్ళున్నారు. గాలికి ఆమె ముంగురులు ఎగురుతూ ముఖంపై పడుతున్నాయ్. టాబ్లెట్ pc లో ఏవేవో చూపిస్తోంది వాళ్ళ ప్రాజెక్టు గురించి. నేను మెకానికల్ ఇంజినీర్ అని తెలిసి యింకా వివరంగా చెబుతోంది. ఆమె పూర్తిగా సబ్జెక్టులో మునిగిపోతే యింక రొమాన్సు గురించి ఏం మాట్లాడతాం. ఉన్నట్టుంది సడెన్ గా అడిగాను. మీకు బాయ్ ఫ్రెండ్ వున్నాడా అని. తను చెప్పడం ఆపేసి, Come again అంది. అంటే, మీకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా. యెలా చెబుతారు మీరు. యెలా అంటే, మీరు అస్తమానం పుస్తకాల్లో మునిగిపోతే మిమ్మల్నెవడు చూస్తాడు లెండి. అని నిట్టూర్చాను. తను తిరస్కారంగా చూస్తూ ఓహ్, మీకు కావాలా ఆ ప్లేస్ అంది నవ్వుతూ. బెంచీమీద వున్న ఆమె చేతిని పట్టుకుని, వొద్దు, మిమ్మల్ని భరించలేను, రాక్షసివి కదా అన్నాను. ఆమె చేయి విడిపించుకుని నా చేతిని గిల్లింది. మీకెంతమంది అడిగింది. ప్రస్తుతానికి ఖాళీ. నేను ఖాళీగా లేను. సరే, wait చేస్తాను. అవసరం లేదు, పెళ్లి చేసుకోండి. పెళ్లికి దీనికి సంబంధం లేదు. మీకస్సలు Ethics లేవు. వెన్నెల వున్నాక యింక నీడలతో పనేంటి. మరి అమావాస్య రోజు ఏం చేస్తారు. కళ్ళు మూసుకుంటాను. నా చేతుల్ని పట్టుకున్నారు, విడుస్తారా.

ఆమె చేతివేళ్ళని మెల్లిగా విడిచాను. * వాళ్ళు డిన్నర్ ప్యాకెట్స్ ఓపెన్ చేసి తినే పన్లో పడ్డారు. వాళ్లలో చుడీదార్ లో వున్న అమ్మాయ్ నాకో పార్సెల్ యిచ్చింది. థాంక్స్ చెప్పాను. యిద్దరం బెంచీమీద తింటున్నాం. కాసేపటికి తను కళ్ళెత్తి, నన్ను చూడటం కాదు, ముందు తినండి, రాత్రంతా చూడొచ్చు అంటూ నవ్వింది. మీకెట్లా తెలుసు అన్నాను. తను నవ్వి వూరుకుంది. అందరూ తినేసి పక్కలు సర్దుకున్నారు. * నాది లోవర్ బెర్తు కుడివైపు. తనది మిడిల్ బెర్తు యెడమ వైపు. అప్పుడు రాత్రి 930pm అనుకుంటా. అందరూ మొబైల్ లో మునిగిపోయారు. లైట్లు తీసేసారు. ఫ్యాన్ గాలి చల్లగా తగులుతోంది. శృతి మెడ వరకూ బ్లాంకెట్ కప్పుకుని మొబైల్ చూస్తోంది. తనని నేను చూస్తున్నాను. మసక వెలుతురులో తన బుగ్గలు మెరుస్తున్నాయ్. సైడ్ బెర్తుల్లో కింద యెవరో పెద్దాయన, పైన పాప. నేను బ్లాంకెట్ ని గట్టిగా ముడుచుకున్నాను. కాసేపటికి తను ఫోన్ వెనుకవైపు పెట్టి నాకేసి తిరిగింది. చిన్నగా నవ్వి, ఏం, నిద్ర రావటం లేదా అడిగింది. లేదన్నాను. యే అంది. రేపు నువ్వు వెళ్లిపోతున్నావా అడిగాను. లేక, నీతో వుండిపొమ్మంటావా అంటూ ఫక్కున నవ్వింది. మళ్ళీ తనే, సరే, ఫాంటసీలు మానేసి, నీ గురించి చెప్పు. నా గురించి చెప్పటం మొదలుపెట్టాను. నా పేరు తిలక్. ఓహ్, లోకమాన్య తిలకా, లేక దేవరకొండ తిలకా అంది. వొట్టి తిలక్, సరేనా. ఎందుకంత ఉడుకు అని మళ్ళీ నవ్వింది. నీ పేరు శృతి కదా. కాదు. అది షార్ట్ కట్. అవునా, మరి అసలు పేరు. శృంగవరపు తిరుప్పాసుందరి అంది. నాకు సడెన్ గా నవ్వొచ్చింది. సరే, నీ గురించి చెప్పు అంది. యేముంది, హైదరాబాద్ లో ఉద్యోగం. పేరెంట్స్ అక్కడే. కొత్తగా ప్లాన్స్ యేమీ లేవు అన్నాను. ఆమె కళ్ళెగరేసి, అబ్బా, యేమీ లేవా ప్లాన్స్ అంది. నీ ప్లాన్స్ యేంటి అడిగాను. శృతి చేతులు విరుస్తూ బద్ధకంగా పెద్దగా ఆవులించింది. ఆమె ఆహార్యం, హావభావాలు యెలా వున్నా చాలా సెక్సీగా కనబడుతోంది. ప్రస్తుతానికి ఏం ప్లాన్స్ లేవు బాబూ అంది, నిద్ర పోవాలి, మళ్ళీ ఆవులిస్తూ. యింకా కొంతమంది మెలకువతోనే వున్నారు చేతిలో మొబైల్ తో. శృతి తిరిగి వెల్లకిలా పడుకుని బ్లాంకెట్ సర్దుకుంది. లోపల వాతావరణం చల్లగా వుంది. నేను కాసేపు కళ్ళు మూసుకున్నాను. యెందుకో కాసేపు తర్వాత మెలకువ వచ్చి తిరిగి చూస్తే, కొద్దిగా అవాక్కయ్యాను. శృతి నావైపే చూస్తోంది. శృతి, పడుకోలేదా అన్నాను. లేదు, నిద్ర రావటం లేదు. ఎందుకు, రేపు వెళ్లిపోతున్నందుకా అన్నాను. అంత లేదు అంటూ అటు తిరిగింది. నేను లేచాను. వెళ్లి తన బెర్తు దగ్గిర నుంచుని మోచేతులు తన భుజానికి దగ్గిరగా బెర్తు మీద పెట్టాను. శృతి, పిలిచాను. చప్పున తిరిగి ఆశ్చర్యంగా చూసింది. బాప్ రే, దగ్గిరనుంచి చూస్తే, యింత పెద్ద కళ్లు. తను ఏం మాట్లాడకుండా నా కళ్లలోకే చూస్తోంది.

బుగ్గలు చిరుచెమటతో తడిసి నిగారింపుతో వున్నాయి. శృతి, నిద్ర రావటం లేదు అన్నాను ముందుకు వొంగి. తను వెనక్కి జరగలేదు. యిద్దరి మధ్య ఒక ఐదంగుళాల దూరం మాత్రమే. తన శ్వాస స్పష్టంగా తెలుస్తోంది. ఆమె వొంట్లోనుంచి ఒక లాంటి మత్తైన వాసన. అయితే ఏం చేయమంటావు అంటూ చిన్నగా నవ్వింది. ఆమె సన్నని పలువరస తడిగా మెరిసింది. ఒక ముద్దు కావాలి అన్నాను. చిన్నగా నవ్వింది మళ్ళీ. ఏం మాట్లాడలేదు. ముందుకు వొంగాను. తన చూపుడువేలితో నా పెదాల మీద అడ్డుపెట్టింది. వేలిని ముద్దు పెట్టాను. తను వేలిని తీసేసి, అంది, చూసిన కొన్ని గంటల్లోనే ముద్దు వరకు వచ్చేస్తారా అని. నేను ముందుకు వొంగి తన నుదుటిమీద మృదువుగా ముద్దు పెట్టాను. వేడిగా వుంది ఆమె నుదురు. తను కళ్ళు మూసుకుంటూ భారంగా వూపిరి తీసుకుంది. కళ్ళు తెరిచి, వొద్దు తిలక్, యిది మనకు సెట్ కాదు. యెందుకు కాదు. యెందుకంటే నువ్వు మొగలిపువ్వు లాంటివాడివి, నీ ప్రపంచంలోకొస్తే నేను కొట్టుకుపోతాను, అంటూ నా చెంపల్ని పట్టుకుని దగ్గిరకి లాక్కుని పెదాలపై తన పెదాల్ని మెత్తగా అదిమిపెట్టింది. కొన్ని క్షణాలు నేను వూపిరి తీసుకోలేదు. తన ఎగ శ్వాసని వింటున్నాను. తను నన్ను వొదిలి వెళ్ళు, వెళ్లి పడుకో, యెమన్నా వుంటే ఉదయం మాట్లాడదాం అంది బ్లాంకెట్ సర్దుకుంటూ. నేను తిరిగొచ్చి పడుకున్నాను. యెప్పటికో నిద్ర పట్టేసింది. *** Like 224 Dislike 28 86510 44 15 cookie-check చెన్నై అమ్మాయితో vasu 1 no

Categories Telugu
More stories See all