All content free · updated every 5 minutes

జనం మెచ్చిన రాజు – Part 34

Story Telugu 4 pages 2 years ago

జనం మెచ్చిన రాజు – Part 34
ఏంటీ …… ” రెండు రాజ్యాలను దాటుకుని వచ్చామా అంటూ మంజరి – రెండు రాజ్యాలను దాటుకుని వచ్చామా అని నేను ” ఇద్దరమూ ఒకేసారి అన్నాము . మంజరి : ఆ రాజ్యాలు ఎటువైపు అడవిరాజా …… , మేము వెంటనే అక్కడికి వెళ్ళాలి ఇటువైపా అటువైపా అంటూ ఆతృతతో అడిగింది , ఒక్కసారిగా ఆకాశంలో అంతెత్తుకు ఎగిరి చుట్టూ చూసినట్లు కిందకువచ్చి అటువైపు ప్రభూ ….. అడవిరాజా ….. నీ కుటుంబం దగ్గరికివెళ్లు , మిత్రమా అంటూ పైకెక్కాను . అంతలో ఇంతవరకూ మేము వెళుతున్న వైపు నుండి ” అన్నయ్యా – చెల్లీ , అన్నయ్యా – చెల్లీ ……. అమ్మా అమ్మా …… కాపాడండి కాపాడండి అంటూ బుజ్జాయిల కేకలు వినిపించాయి . రాను రాను కేకలు పెరుగుతూ రావడంతో మళ్లీ అటువైపుకే తిరిగి కేకలు వస్తున్నవైపు వేగంగా పోనిచ్చాను . ప్రభూ అంటూ మంజరి , మంజరితోపాటు నొప్పి ఇంకా ఉన్నట్లు వేగంగా కాకపోయినా మావైపుకు పరుగులుతీసాడు అడవిరాజు . ” అన్నయ్యా – చెల్లీ ” అంటూ బుజ్జాయిల హాహాకారాలు – ఏడుపులు మరింత పెరగడంతో …… చలించిపోయి మిత్రమా హో అంటూ మరింత వేగంగా పోనిచ్చాను . దూరాన సైనికుల వస్త్రలలో చేతులలో కత్తులు – ఈటెలతో …… అన్నయ్యా – చెల్లీ అంటూ ప్రాణభయంతో ఏడుస్తూ పరుగులుతీస్తున్న బుజ్జాయిలవైపుకు భీకరంగా వచ్చి , చిక్కినట్లు చుట్టుముట్టారు . అమ్మా అమ్మా ……. అన్నయ్యా – చెల్లీ అంటూ ఒకరినొకరు హత్తుకున్నారు , చెల్లీ అంటూ వెనకనుండి చేతితో పట్టుకుని మరొకచేతిలో చిన్న కత్తితో చుట్టూ రాక్షస నవ్వులు నవ్వుతున్న సైనికులవైపుకు తిరుగుతూ , నా చెల్లిని వదిలెయ్యండి లేకపోతే అంటూ ధైర్యంగా నిలబడ్డాడు . లేకపోతే ఏమిచేస్తావు అంటూ ముందుకువచ్చిన సైనికుడి చేతిని చిన్న కత్తితో గాయపరిచాడు . స్స్స్ ……. పిల్లలిద్దరినీ చంపేయ్యండి . యువరాజుగా ఆజ్ఞాపిస్తున్నాను పిల్లలను వదిలెయ్యండి అంటూ ఆయాసపడుతూ మరొకడు వచ్చాడు . గాయపడిన సైనికుడు : చంపేయ్యమని మీ నాన్నగారు ఆజ్ఞాపించారు – వారి ఆజ్ఞనే మేము పాటిస్తాము – పిల్లలని జాలి చూయించకుండా చంపేయ్యండి . పిల్లలవైపుకు ఇద్దరు కత్తులతో రావడం చూసి మిత్రమా అంటూ వాయువేగంతో వెళ్లి , మిత్రుడి మీద నుండే చుట్టుముట్టిన సైనికుల మీదుగా బుజ్జాయిల ముందుకు దూకి బుజ్జాయి చేతిని అందుకుని బుజ్జి కత్తితోనే ఇద్దరు సైనికులు చంపడానికి ఎత్తిన కత్తులను అడ్డుకుని వారిద్దరి బొటన వేళ్ళను నరికేసాను . హమ్మా హమ్మా …… అంటూ చిందిస్తున్న రక్తంతో వాళ్ళ కేకలు అడవి మొత్తం వినిపించాయి . బుజ్జాయి గాయపరిచిన సైనికుడు : ఎవర్రా నువ్వు , భటులారా ….. పిల్లలతోపాటు వీడిని కూడా చంపేయ్యండి .

3 – 4 ఏళ్ల వయసున్న బుజ్జాయిలిద్దరినీ గుండెలపైకి ఎత్తుకుని ( వారిని స్పృశించగానే ఏదోతెలియని తియ్యదనం ), బుజ్జి కత్తితో చుట్టూ అందరినీ నిలువరిస్తూ ఒక్కొక్కడి వేళ్ళను నరికేస్తున్నాను . వీడు సామాన్యుడు కాదు చిన్న కత్తితోనే పాతికమందిని నిలువరిస్తున్నాడు పారిపోదాము రoడ్రోయ్ అంటూ పరుగులుతీసారు . అంతలో ఒక్కసారిగా నామీదుగా మరియు సైనికుల మీదుగా సింహం ఎగిరి వారివైపుకు తిరిగి అడవికి రాజుని నేను నన్ను తప్పించుకుని ఎలా వెళతారన్నట్లు ఒక్క గర్జన గర్జించింది . అంతే సింహం సింహం అంటూ వొళ్ళంతా చెమటలతో గజగజ వణికిపోతున్నారు . మరొక్క అడుగువేశారో సింహానికి ఆహారం అయిపోతారు మీఇష్టం – మోకాళ్లపైకి చేరి శరణు కోరండి . అంతే భయంతో వణుకుతూ మోకాళ్లపైకి చేరారు . అమ్మో సింహం …… అన్నయ్యా – చెల్లీ అంటూ నన్ను గట్టిగా హత్తుకున్నారు ( మళ్లీ అలాంటి మధురమైన అనుభూతి ) . నవ్వుకున్నాను , బుజ్జాయిలూ …… సింహం మనదే మనల్ని ఏమీ చెయ్యదు చూడండి చూడండి అంటూ ఎత్తుకెళ్ళి తాకించాను – మరింత గట్టిగా పట్టుకోవడంతో భయపడకండి వద్దులే వద్దులే ఇదిగో అందమైన మంజరి ఎంత ముద్దొస్తోందో కదా …… బుజ్జాయిలు : మంజరి అని ఎక్కడో విన్నాము కదా అన్నయ్యా – అవును చెల్లీ ……. , చాలా చాలా ముద్దుగా ఉంది చిలుక మంజరి మంజరి …… నేను – మంజరి – ఇదిగో కృష్ణ మరియు అడవికే రాజు అయిన సింహం మేమంతా మిత్రులం , ఇప్పుడు ముట్టుకోండి …… భయపడుతూనే ముట్టుకుని , అవును ఏమీ చెయ్యలేదు అంటూ బుజ్జిబుజ్జిగా ఆనందిస్తున్నారు . భయం పోయింది కదా అడవిరాజుపై కూర్చుంటారా …… ? . అంతే భయంతో నా వస్త్రం చిరిగిపోయేలా అల్లుకుపోయారు . సరే సరే వద్దులే అంటూ స్వచ్ఛమైన అనుభూతిని ఆస్వాదిస్తూ బుజ్జాయిల వీపులపై ఆప్యాయంగా స్పృశిస్తున్నాను – నాకుకూడా బుజ్జాయిలను అప్పుడే కిందకు దించాలని అనిపించడం లేదు – మరింత ప్రేమతో హత్తుకున్నాను . మంజరి అయితే నాకంటే ఎక్కువగా బుజ్జాయిలకు ప్రేమను పంచుతూ నవ్విస్తోంది నేను – మంజరి …… బుజ్జాయిల అందమైన మైకంలో ఉండగా , మరొకవైపు అడవిరాజు మాత్రం నేను నరికిన సైనికుల వేళ్ళను బఠాణీల్లా లాగించేస్తూ రక్తం రుచిమరిగినట్లు వెళ్లి సైనికుల చేతుల నుండి కారుతున్న రక్తాన్ని జుర్రేస్తోంది . వాళ్ళ భయం చూసి బుజ్జాయిలకు చూయించి ఆనందించాము . యువరాజా …… చూస్తుంటేనే తెలిసిపోతోంది మీరు మంచివారని మీరు మోకాళ్లపై కూర్చోవాల్సిన అవసరం లేదు మాదగ్గరకు రండి . బుజ్జాయిలు : అవును మంచివారు , అమ్మ పారిపొమ్మని చెబితే సహాయం చేసినది వారే ……. మిత్రుడి సంచీలో ఉన్న కాసిన్ని నీళ్లను బుజ్జాయిలకు తాగించి , బుజ్జాయిలూ ….. ( బుజ్జాయిలను బుజ్జాయిల కళ్ళల్లోకి అలా చూస్తుండిపోవాలనిపిస్తోంది ) .

బుజ్జాయిలు : వీరాధివీరా …… ఏంటి అలా చూస్తున్నారు ? – ఏదో అడుగుతున్నట్లున్నారు ? అంటూ బుజ్జిబుజ్జినవ్వులతో ముద్దుముద్దుగా అడిగారు . మంజరి : వీరాధివీరుడని బుజ్జాయిలకు కూడా తెలిసిపోయిందన్నమాట . అదే అదే ఎవరుమీరు ? – అభం శుభం తెలియని మిమ్మల్ని ఈ సైనికులంతా చంపాలని ఎందుకు పరిగెత్తిస్తున్నారు ? – మిమ్మల్ని పారిపొమ్మని చెప్పిన మీ అమ్మగారు ఎక్కడ ? . బుజ్జాయిలు : అమ్మ అమ్మ …… అమ్మ అంటే గుర్తుకువచ్చింది , అమ్మ ఆపదలో ఉంది అంటూ ఏడుస్తున్నారు . బుజ్జాయిలూ బుజ్జాయిలూ …… ఏడవకండి , ఎక్కడ ఉన్నారు ? ఏమిటా ఆపద ? , యువరాజా …… యువరాజు : మహారాణి గారు మాత్రమే కాదు మా నాన్నగారి వలన రాజ్యం మొత్తం ఆపదలో ఉంది , తీరం వెంబడి ఉన్న రాజ్యాలలో మా రెండు రాజ్యాలే పెద్దవి కానీ ఈ పిల్లల రాజ్యానికి ఆనుకుని ఉన్న అదిగో ఎదురుగా కనిపిస్తున్న కొండలలో బంగారు – వజ్రపు నిధులు పుష్కలంగా ఉన్నాయి , వాటిని చేజిక్కించుకుంటే తరతరాలుపాటు సుసంపన్నంగా జీవించవచ్చు – చుట్టుప్రక్కల రాజ్యాలన్నింటినీ సామంత రాజ్యాలుగా కాళ్ళ కింద తొక్కేయ్యవచ్చు …….. యువరాజా …… అధికారం కోసం ప్రయత్నం అని తెలిసిపోతోంది – ముందైతే బుజ్జాయిల అమ్మగారి ఆపద గురించి చెప్పండి అంటూ బుజ్జాయిలకు తెలియకుండా ఇద్దరినీ సింహం పై కూర్చోబెట్టి సైనికులందరినీ యువరాజు సహాయంతో ఊడలతో చెట్లకు కట్టిపడేసాను – వెనక్కు తిరిగిచూస్తే బుజ్జాయిలిద్దరూ భయంతో చప్పుడు చెయ్యకుండా కదలకుండా కూర్చుని ఉండటం చూసి నవ్వుని ఆపుకుంటూ ఎత్తుకున్నాను . బుజ్జాయిలు : కొట్టబోయి గట్టిగా అల్లుకుపోయారు . కొట్టొచ్చు కదా ప్చ్ ప్చ్ …… , మా మిత్రుడు అంటే మీ మిత్రుడు కూడానూ బుజ్జాయిలూ , చూడండి మీవైపు ఎంత ఇష్టంతో చూస్తున్నాడో అడవిరాజు ఎందుకంటే అడవిరాజుకు కూడా మీలానే ఇద్దరు పిల్లలు – బుజ్జి సింహాలు అంటూ బుగ్గలపై ఆప్యాయంగా ముద్దులుపెట్టాను . బుజ్జాయిలు : నా బుగ్గలపై చెరొక ముద్దుపెట్టి మరింత గట్టిగా హత్తుకున్నారు – ఆహ్హ్ …… ఏమిటీ కొత్త అనుభూతి అంటూ పులకించిపోసాగాను , తేరుకుని యువరాజా …… వెళదాము పదండి . యువరాజు : ఎంతో కాలంగా వేచిచూస్తున్న మా నాన్నగారు ….. ఈ రాజ్యానికి మహారాజు ఆకస్మికంగా మరణించడం ఆ వెంటనే కరువు రాగానే సహాయం చెయ్యడం మానేసి చుట్టుప్రక్కల రాజ్యాలను కూడగట్టి మూడువైపుల నుండీ దాడిచేశారు , ఈ విషయం తెలుసుకున్న పిల్లల తండ్రి యువరాజు చేతనైనంత సంపద వందలమంది భద్రతా సిబ్బందితో రాజ్యాన్ని – పిల్లల అమ్మ రాణిని – పిల్లలను మీ చావు చావండి అని వదిలేసి పిరికివాడిలా వీలైనన్ని ఓడలలో పారిపోయాడు , మా తండ్రి ఊరికే వదలరు కదా వెనుకే అంతకు రెట్టింపు ఓడలను పంపించారు ఈపాటికి చంపేసే ఉంటారు . బుజ్జాయిలు వినకూడదని ప్రయత్నించాను .

బుజ్జాయిలు : ఆ రాజు గురించి మేము బాధపడము వీరాధివీరా – అతడు కూడా రాక్షసుడు – అందరినీ హింసించేవాడు . యువరాజు : కుటుంబాలు ఉన్న సైనికులు పోరాడి ఓడి శరణు కోరారు – వారిక జీవితాంతం కారాగారంలోనే ఉండిపోతారు – ఈపాటికి రాజభవనంలోని ద్వారాలన్నింటినీ బద్ధలుకొట్టి రాజ్యాన్ని ఆక్రమించేసుకుని ఉంటారు – నేను ఎంత వారించినా వినలేదు మా తండ్రి – మన్నించండి పిల్లలూ ……. బుజ్జాయిలు : అంటే అమ్మ – పిన్నమ్మలంతా …… యువరాజు తలదించుకున్నారు – పిల్లలు …… రహస్య ద్వారం ద్వారా బయటకు రావడం చూసి భటుల నుండి తప్పించాను , మా తండ్రి చంపేయ్యండి అంటూ ఆజ్ఞాపించడంతో కాపాడాలని వెనుకే వచ్చాను , ఇక జరిగినది మీకు తెలుసు . Like 224 Dislike 28 131386 17 0 cookie-check జనం మెచ్చిన రాజు – Part 34 no

Categories Telugu
More stories See all