జనం మెచ్చిన రాజు – Part 45
మహారాజు ఆజ్ఞ అనేసరికి మేము కిందకు చేరుకునేసరికి మగాళ్లందరూ చేరుకున్నారు , అందులో ముప్పావు మంది వొళ్ళంతా కట్లతో కొంతమంది కర్రల సహాయంతో వచ్చారు . చూసి చలించిపోయాను , పెద్దయ్యలూ – అన్నలూ – తమ్ముళ్లూ …… మన్నించండి మన్నించండి తెలిసికూడా మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు , దయచేసి మీరు మీ మీ గృహాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోండి , మన రాజ్యంలోని వైద్యులే కాదు మన సామంతరాజ్యాలలోని వైద్యులందరినీ రప్పించి మీకు వైద్యం అందించేలా చేస్తాను . ప్రజలు : మహారాజుకు జై మహారాజుకు జై …….. , మేము బాగానే ఉన్నాము మహారాజా మా కోసం రాజ్యం కోసం ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించారట – మేము సంతోషంగా పాలుపంచుకుంటాము . చాలా సంతోషం ప్రజలారా …… , ఆ బృహత్ నిర్మాణం రోజులలో పూర్తయ్యేది కాదు మీరు కోలుకున్న తరువాత మీరు సహాయపడవచ్చు , ఈ పరిస్థితులలో కష్టపడితే ప్రాణాలకే అపాయం అంటూ గాయపడినవారందరికీ నచ్చచెప్పి వారి గృహాలకు పంపించాను , మిగిలిన కొద్దిమందితోనే పనులు మొదలుపెట్టాలని ఆజ్ఞవేశాను – బుజ్జాయిలూ …… ఏమంటారు ? . బుజ్జాయిలు : మహారాజుకు జై – మా నాన్నకు జై ……. మిగిలిన ప్రజలు కూడా నినాదాలు చేస్తున్నారు . మీ అభినందనాలన్నీ మీ బుజ్జి యువరాజు – బుజ్జి యువరాణీలకు చెందాలి అంటూ జరిగినది వివరించాను . యువరాజు – యువరాణీ , యువరాజు – యువరాణి అంటూ నినాదాలు చేస్తున్నారు . వాళ్ళతోపాటు నేనుకూడా నన్నుచూసి మహారాణీ – చెల్లి వాళ్ళు సంతోషంతో నినాదాలు చేసాము . బుజ్జాయిలు : నాన్నా నాన్నా …… ఆంటూ బుజ్జిబుజ్జిచేతులతో నానోటిని మూసేయ్యడానికి ప్రయత్నిస్తున్నారు . బుజ్జిబుజ్జిచేతులపై ముద్దులుపెట్టి , మహారాణీ గారూ – యువరాణీ …… మీరు అనుమతి ఇస్తే రాజ్య ఖజానాను వాడుకుంటాను . మాహారాణి – యువరాణి : మేము కోపంతో చూస్తున్నాము మీకు కనిపించడం లేదు అంతే …… , మూర్ఖపు రాజు వదిలివెళ్లిన ఖజానాతోపాటు కొండ గుహలలో ఇమిడిఉన్న వజ్ర మణులు మొత్తం మీఇష్టం . బుజ్జాయిలు నవ్వుకుంటున్నారు . ఇంతదానికి కోపం ఎందుకు మహారాణీ గారూ ……. , భటులారా విన్నారుకదా అనుక్షణం మీ గురించే ఆలోచించే మహారాణీ – రాణులు – యువరాణీ సమ్మతి లభించింది , మొత్తం తీసుకొచ్చి రాసులుగా పొయ్యండి , ఆనకట్ట నిర్మించడానికి ఏ ఏ ముడిసరుకులు కావాలో అవి ఏ ఏ రాజ్యాలలో లభిస్తాయో వారికే తెలుసు , తెప్పించెయ్యండి , మిగిలినవారు పనిముట్లతో ఆనకట్ట నిర్మించే ప్రాంతానికి బయలుదేరండి – ముడిసరుకులు వచ్చేలోపు ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేయాలి , బుజ్జాయిలూ …… మీరు సిద్ధమేకదా ? . బుజ్జాయిలు : ఎప్పుడో సిద్ధం …… , మా నాన్న ఎక్కడ ఉంటే మేమూ అక్కడే . నేనుకూడా మేముకూడా అంటూ మాహారాణి – చెల్లి – రాణులు ఆ వెనుకే చెలికత్తెలందరూ అన్నారు .
లేదు లేదు లేదు మహారాణీగారూ – చెల్లీ – రాణులూ …… పైనుండి చూశారుకదా గుట్టలు – ముళ్ల కంపలు , మీ సున్నితమైన పాదాలు – చేతులు ……. వద్దు వద్దు వద్దు మీరు రాజమందిరాలలోనే ఉండండి . మాహారాణి : మహారాజు – బుజ్జాయిలు – రాజ్యప్రజలు కష్టపడుతుంటే మేము రాజమందిరాలలో విలాసంగా ఉండటం భావ్యమా చెప్పండి . అధికాదు మహారాణీ గారూ …… , కష్టంతో కూడుకున్నది . మాహారాణి : మా ప్రాణ ……. మాకిష్టమైన మహారాజుగారు కష్టపడుతుంటే మేము పైనుండి చూస్తూ ఉండలేము , మీరే కదా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు మళ్లీ ఇలా చేతులను కట్టిపడేస్తారా …… ? . యువరాణి : కట్టిపడేస్తారా అన్నయ్యా – భలేగా ఆడిగావు వదినమ్మా అంటూ మహారాణీ చేతిని చుట్టేసింది . చిరునవ్వే సమాధానం అయ్యింది . అక్కయ్యా …. ఒక్కమాటతో ఒప్పించేశారు , ఇన్నాళ్లూ …… రాజభవనాలలో బందీలుగా ఉన్నాము అంటూ కళ్ళల్లో చెమ్మలతో రాణులు ముగ్గురూ ప్రేమతో మహారాణిగారిని చుట్టేశారు . మాహారాణి : ఈ సంతోషాలన్నీ మన మహారాజుగారి వల్లనే చెల్లెళ్ళూ …… , రాణులకు స్వేచ్ఛను ప్రసాదించిన మహారాజు ఏ రాజ్యంలో ఉన్నారు చెప్పండి . రాణులు : మరి అంతటి గొప్ప వీరాధివీరులైన మంచి మనసున్న మహారాజుకు మీరేమీ కానుకలుగా ఇవ్వడంలేదు , మీకు ఇష్టంలేకపోతే చెప్పండి మేము సమర్పించుకుంటాము అంటూ ముసుగులలో నావైపుకు చూస్తున్నట్లు తిరిగారు . మాహారాణి : కలిసిన క్షణమే సర్వం సమర్పించుకోవడానికి సిద్ధం అయిపోయానుకదా చెల్లెళ్ళూ …… , మన మహారాజు గారు ఊ అనాలేకానీ …… ఊహూ ఊహూ ఊహూ …….. బుజ్జాయిలూ – మిత్రులు – అడవిరాజా పదండి అంటూ సింహద్వారం దగ్గర పనిముట్లతో వెళుతున్న కొద్దిపాటి ప్రజల వెనుకే బయలుదేరాను . మహారాణీ – చెల్లి – రాణులు …… నాతోపాటు కదిలేంతవరకూ మిత్రులు – అడవిరాజు కదలకపోవడంతో చిరుకోపాన్ని ప్రదర్శించడం చూసి అందరూ నవ్వుకున్నారు , చూసారా బుజ్జాయిలూ …… మనకంటే మహారాణీ గారు అంటేనే ఇష్టం . బుజ్జాయిలు : మీకు మేమున్నాం కదా నాన్నా నాన్నా …… ఉమ్మా ఉమ్మా అంటూ రాజ్య వీధుల ద్వారా కొండలవైపుకు పొలాలవైపుకు వెళ్లే దారికి చేరుకున్నాము , వస్తూ మధ్యతలో చెల్లీ ….. రాజభవనాలు విలాసవంతంగా ఉన్నాయి కానీ రాజ్య ప్రజల గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి – ఎక్కడచూసినా మురుగుతో అపరిశుభ్రంగా , పిల్లలకు సరైన వస్త్రాలుకూడా లేవు . యువరాణి : అన్నయ్యా …… ఇలా ప్రతీ విషయాన్నీ మహారాణిగారిని అంటే మా వదినమ్మను అడగకుండా నన్ను అడగడం ఏమీ బాగోలేదు అంటూ నవ్వుకుంటున్నారు , ఈసారికి మాత్రం నేను బదులిస్తాను , నా మూర్ఖపు తండ్రి వారి తండ్రులు తండ్రులు మరియు నిన్నటివరకూ మూర్ఖాతి మూర్ఖమైన రాజు అతడిని అన్నయ్య అని పిలవను ఎందుకంటే అన్నయ్య పిలుపుకు ప్రతిరూపం మా అన్నయ్య అంటూ మహారాణిగారి చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది .
సంతోషం చెల్లీ ……. యువరాణి : వారు ప్రజాలగురించి ఏమాత్రం పట్టించుకోకుండా శృంగార సుఖాలు – రాజ్య విస్తరణ – సంపద గురించే ఆలోచించేవారు అందుకే ప్రజల పరిస్థితి ఇలా మారిపోయింది . పూర్తిగా మార్చేద్దాము చెల్లీ ……. యువరాజు : అదిగో మళ్లీ నాకే చెబుతున్నారు , మహారాజుగా రాజ్య పద్ధతులు పాటించండి అంటూ నవ్వుకుంటున్నారు . చెల్లీ అంటూ పిలిచి , మహారాణీగారి పద్ధతి – చూపులు తేడాగా ఉంటున్నాయి చెల్లీ , మాట్లాడాలంటే భయమేస్తోంది అంటూ చెవిలో గుసగుసలాడాను . యువరాణి : అన్నయ్యా …… ఉండండి వదినమ్మకు చెబుతాను . చెల్లీ చెల్లీ వ …… ద్దు ….. , దారికి ఒకవైపున ఆసక్తికరంగా కనిపించడంతో బుజ్జాయిలతోపాటు వెళ్లి మోకాళ్లపై కూర్చుని చూస్తే అక్కడక్కడా విత్తన మొలకలు కనిపించాయి . సంతోషంతో బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి , చెల్లీ చెల్లీ …… అంటూ పిలిచాను . యువరాణి : పో అన్నయ్యా మళ్లీ ……. నవ్వుకుని మహారాణీ గారూ ……. కనురెప్పపాటులో నాప్రక్కన చేరి నవ్వుతున్నారు ముసుగులో …… యువరాణి : మా మంచి మహారాజు అన్నయ్య …… మహారాణీ గారూ – చెల్లీ …… చూడండి అంటూ విత్తనాన్ని జాగ్రత్తగా అందుకున్నాను . మాహారాణి : ప్రభూ ….. మొలకెత్తుతోంది . బహుశా పొలాలనుండి పంటలను గోదాములకు తీసుకెళుతూ బండ్ల నుండి రాలినప్పటి గింజలు రాత్రిపడిన చిన్న వర్షానికే మొలకెత్తాయి , చూస్తుంటే దారికి ఇరువైపులా దారిపొడుగునా మొలకెత్తాయి , రాజ్యం చుట్టూ ఉన్న దారులకు ఇరువైపులా దున్నితే కొద్దిరోజులకు రాజ్యంలోని పశువులకైనా ఆహారంగా ……. ముందుచూపు కలవారు – అందరికోసం ఆలోచిస్తారు , ఇందుకుకాదూ మిమ్మల్ని దేవుడు అన్నది అంటూ ఆనందిస్తున్నారు . నిజమైన దేవుళ్ళు మన బుజ్జాయిలు ……. , ఆనకట్ట ఆలోచన చిగురించకుండా ఉంటే మనం ఇక్కడిదాకా వచ్చి మొలకలను చూసి ఉండేవాళ్ళమే కాదు , మొలకెత్తిన గింజలు ఈ ఎండలో సాయంత్రానికి మరణించేవి అంటూ బుజ్జాయిలను ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెట్టాను . బుజ్జాయిలు : నాన్నా నాన్నా …. ఇలా ప్రతీసారీ మమ్మల్ని దేవుళ్లను చెయ్యడం ఏమీ బాగోలేదు . మహారాణీవాళ్ళతోపాటు నవ్వుకుని పైకిలేచాను , దూరంగా వెళుతున్న ప్రజలను పిలిచి విషయం చెప్పడంతో …… సంతోషించి జయజయనాదాలు చేసుకుంటూ వెళ్లి పొలం పనిముట్లు తీసుకొచ్చి రాజ్యం చుట్టూ ఉత్సాహంగా దున్నడం మొదలుపెట్టారు . బుజ్జాయిలూ – చెల్లీ …… ఇక మిగిలినది మనం మాత్రమే ఏమిచేద్దాము ? . బుజ్జాయిలు : మనమే వెళ్లి శుభ్రం చేద్దాము నాన్నా నాన్నా అంటూ కిందకుదిగి ఒకచేతిలో బుజ్జిసింహాన్ని మరొకచేతిలో ప్రజలు ప్రక్కన ఉంచిన బుజ్జి పనిముట్టుని అందుకున్నారు .
అవునవును అంటూ హుషారుగా వంత పాడారు మహారాణీ వాళ్ళు …… , మేమూ సిద్ధం అన్నట్లు సిద్ధం అయ్యారు మిత్రులు …… వద్దు అంటే నన్ను వదిలేసి వెళ్లేలా ఉన్నారు అంటూ ఒకచేతితో గొడ్డలిని మరొకచేతితో సుత్తిని అందుకున్నాను . మహారాణీ వాళ్ళు ముసిముసినవ్వులతో ఒక్కొక్కపనిముట్టును అందుకున్నారు . మిగతా పనిముట్లను తరువాత తీసుకెళదాము , బరువుగా ఉన్నాయా చెల్లీ …… యువరాణి : నన్ను మాత్రమే అయితే అడగకండి అన్నయ్యా …….. శాంతి శాంతి చెల్లీ …… , మహారాణీగారూ – రాణులూ – చెల్లీ …… బరువుగా ఉన్నాయా ? . ఊహూ ఊహూ …… నవ్వుకుంటూ మునుముందుకు వెళ్లిపోతున్నారు . జాగ్రత్త …… రాళ్లు – ముల్లులు ఉంటాయి అంటూ దారి చివరి వరకూ వెనుకే వెళ్లి , ముళ్లపొదలు అడ్డుగా ఉండటం వలన ఆగడంతో పరుగున ముందుకువెళ్లి గొడ్డలితో నరికి దారిని చేస్తూ చివరికి ఆనకట్ట నిర్మించే ప్రదేశానికి చేరుకున్నాము . పని మొదలుపెట్టే సమయానికి మెమొచ్చిన దారి గుండా వందల్లో స్త్రీలు – అమ్మాయిలు – పిల్లలు …… చేతులలో పనిముట్లతో మాముందుకు వచ్చి నిలబడ్డారు , మహారాజా – మహారాణీ …… మావంతు సహాయం చేయడానికి వచ్చాము . అమ్మలూ – చెల్లెళ్ళూ ……. చాలా కష్టం . ” మా వీధులద్వారా నడుస్తూ మీరు మాట్లాడిన మాటలను విన్నాము మహారాజా – మా గురించి ఆలోచిస్తున్న మా మహారాజుకు సహాయం చెయ్యాలని వచ్చాము – ఇంతవరకూ మాగురించే ఆలోచించే మహారాణీ గారే స్వయంగా కదలివచ్చారు – ఎంత కష్టమైనా సంతోషంగా చేస్తాము మహారాజా కాదనకండి – చెలికత్తెలు ద్వారా విన్న మరొక విషయం ఏమిటంటే స్త్రీలకు స్వేచ్ఛను ప్రసాధించడం చాలా చాలా సంతోషం మహారాజా ….. , మహారాజా మహారాజా …… అంటూ నినాదాలు చేస్తున్నారు ” . సంతోషం చాలా చాలా సంతోషం అమ్మలారా – చెల్లెల్లారా …… , కానీ మీ సంతోషాలకు కారణం ……. బుజ్జాయిలు : మహారాజే మహారాజే అంటూ బుజ్జిబుజ్జికోపాలతో చూస్తుండటం చూసి మహారాణీవాళ్ళ నవ్వులు ఆగడంలేదు . నాకూ నవ్వు వచ్చేసింది – పిల్లలూ …… పెద్ద పెద్ద పనిముట్లు పట్టుకున్నారే జాగ్రత్తగా పట్టుకోవాలి , ఇంకా అక్కడే ఆగిపోయారే రండి …….. పిల్లా పెద్దా …… సంతోషాలతో కేకలువేస్తూ మొత్తం ప్రదేశాన్ని శుభ్రం చెయ్యడం మొదలుపెట్టారు . ఆ వెనుకే నెమ్మదిగా బామ్మలు వచ్చారు . బామ్మలూ …… మీరుకూడానా , నేను ఒప్పుకోనే ఒప్పుకోను – మిమ్మల్ని నేనే స్వయంగా గృహాలలో వదిలిపెడతాను రండి . బామ్మలు : దేవుడిలాంటి మీరు – దేవతలాంటి మహారాణీగారు తినకుండా వచ్చి మాకోసం శ్రమిస్తున్నారు , మీకోసమని ముద్దలు తీసుకొచ్చాము , మా వంట మీరు తింటారో లేదో శుభ్రన్గా అయితే చేసాము మహారాజా ……. ప్రేమతో తీసుకొచ్చిన అమ్మ చేతివంటను ఎవరైనా కాదనగలరా ? – బుజ్జాయిలూ ……. బుజ్జాయిలు : ఇష్టమే నాన్నా నాన్నా …… మహారాణిగారు – చెల్లీ …… అనేంతలో నాముందుకువచ్చారు .
ఆశ్చర్యపోయాను . పోను పోను మీకే అర్థమౌతుందిలే అన్నయ్యా ……. పిల్లలూ – అమ్మలూ – చెల్లెళ్ళూ …… పనులు ఆపి రండి తిందాము . ” మేము తినే వచ్చాము మహారాజా ” . మిత్రులారా ……. బామ్మలు : మహారాజా …… అవి తినకుండా మీరు తినరని తెలిసే కూరగాయలు – మాంసం – గింజలు కూడా తీసుకొచ్చాము అంటూ మిత్రుల చెంతకే చేర్చారు . సంతోషం బామ్మలూ …… అంటూ అందుకుని బుజ్జాయిలకు తినిపించి తిన్నాను – మాహారాణి గారు …… మంజరికి గింజలను తినిపించి ముద్దను ఇష్టంగా తినడం చూసి మరింత ఆశ్చర్యపోయాను . బామ్మలూ …… తిన్నాముకదా ఇక వెళదాము . బామ్మలు : మరి మధ్యాహ్నం ఆకలి ఎవరు తీరుస్తారు మహారాజా …… , మా బిడ్డలు కోడళ్లు పిల్లలు …… ఆనకట్ట పూర్తయ్యేంతవరకూ మీతోపాటే ఉంటామని శపథం చేసి వచ్చారు అంటూ ఒక ప్రక్కన రాళ్లను కూర్చి కలపను తీసుకొచ్చారు – మంట వెలిగించి తమతోపాటు తీసుకొచ్చిన పెద్ద పెద్ద పాత్రలలో బియ్యం వేసి అక్కడే వంట ప్రారంభించారు . అందరికోసమైనా కాదనలేకపోయాను – బామ్మలూ మీకు వందనం అంటూ నమస్కరించి మరింత ఉత్సాహంగా పనులు మొదలుపెట్టాము . Like 224 Dislike 28 131632 18 0 cookie-check జనం మెచ్చిన రాజు – Part 45 no