జనం మెచ్చిన రాజు – Part 48
ప్రభూ …… ఏర్పాట్లు సిద్ధం అంటూ సైన్యాధిపతి వచ్చాడు . మీ చెల్లెళ్లను ఇలానే పంపించేస్తారా ….. ? , ఎప్పుడు తిన్నారో ఏమిటో – సరైన వస్త్రాలలోకూడా లేరు అంటూ మహారాణీ గారు ముందుకువచ్చారు . అవును నిజమే , కుటుంబ సభ్యులు కంగారుపడుతుంటారేమోనని పంపించాలనుకున్నాను మన్నించండి మహారాణీ గారూ …… , ముందైతే ఒంటిపై దెబ్బలకు మందు రాయండి , చెల్లెళ్ళూ ….. మీరిక ఎవ్వరికీ భయపడనవసరం లేదు మహారాణీ గారి వెంట వెళ్ళండి , బుజ్జాయిలూ ….. మీ అక్కయ్యలను పిలుచుకుని వెళ్ళండి అంటూ ముద్దులుపెట్టి కిందకు దించాను . బుజ్జాయిలు : అక్కయ్యలూ రండి – చెలికత్తెలూ …… వైద్యులను పిలిపించండి – పళ్ళు తీసుకురండి . మహారాజు గారూ ….. బుజ్జితల్లి : అక్కయ్యా ….. మీకు మహారాజు కాదు అన్నయ్య . ఒక చెల్లి : అన్న ….. య్యా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది . చెల్లీ ….. దెబ్బలు నొప్పివేస్తున్నాయా ? . చెల్లి : అన్నయ్యా …… మా చెల్లి …… మరొక చెల్లి : ష్ ష్ ష్ ….. ఏమీలేదులే అన్నయ్యా అంటూ ఆ చెల్లిని ఆపి సైగలుచేసి బుజ్జాయిల వెనుకే తీసుకెళ్లబోతోంది . ఆ చెల్లి కన్నీళ్లను చూసి చలించిపోతున్నాను . నాకులానే అనిపించినట్లు చెల్లీ …. అంటూ గుండెలపైకి తీసుకున్నారు మహారాణీ గారు – చెల్లీ ….. ఏమిటి ? . మరొక చెల్లి : ఏమీలేదు ఏమీలేదు …… చెల్లి : అవును ఏమీలేదు మహారాణీ ….. , దెబ్బలు నొప్పిగా ఉన్నాయి . మహారాణి : ఈ కన్నీళ్లు – మీ అన్నయ్యవైపు చూసే చూపు ….. నొప్పివలన కాదని అర్థమైపోతోంది చెల్లీ ….. , మనం బాధపడితే మీ అన్నయ్య తట్టుకోలేడు ఇక చెల్లెళ్ళు కన్నీళ్లు చూస్తే తట్టుకోలేడు . చెల్లెమ్మ : అవును అన్నయ్య తట్టుకోలేడు . మహారాణి : చెప్పు చెల్లీ …… , ఈ కన్నీళ్లకు కారణం ఏమిటి ? , నీ కళ్ళల్లోనే కాదు మీలో చాలామంది కళ్ళల్లో బాధ కనిపిస్తోంది , ఈ అక్కయ్యతో చెప్పకూడదా …… చెల్లి : ఏమీలేదు ఏమీలేదు అంటూ కన్నీళ్లను తుడుచుకుంది కానీ బాధ ఆగడంలేదు . ఇంకొక చెల్లి : అక్కయ్యా …… తన చెల్లిని లాక్కెళ్లారు అని చెప్పడానికి ….. మా చెల్లిని , తన వదినను ఈమె అక్కయ్యను ……. కూడా తీసుకెళ్లారు అంటూ ఏడుస్తూ మహారాణిని హత్తుకుంది . ఎవరు చెల్లెళ్ళూ ఎక్కడికి తీసుకెళ్లారు అంటూ ఒకేసారి ఆడిగాము , ఈ విషయం ఈ అన్నయ్యకు చెప్పడానికి ఎందుకు సంశయం …… మరొక చెల్లి : వ్యభిచార రాజ్యానికి తీసుకెళ్లారు …… వ్యభిచార రాజ్యమా …… , మంత్రిగారూ ….. అదెక్కడో తెలుసుకోండి – సేనాపతీ …… ఆ రాజ్యానికి బయలుదేరాలి . చెల్లెళ్ళు : అన్నయ్యా అన్నయ్యా ….. అక్కడకు వెళ్ళకండి అంటూ అందరూ వచ్చి హత్తుకున్నారు , అక్కడ రాక్షసుల్లాంటి వాళ్ళు కాపలాగా ఉన్నారు , మమ్మల్ని అక్కడనుంచే తీసుకొచ్చారు , మావలన ఇంత మంచి మా అన్నయ్యకు ఏమీకాకూడదు .
ఈ అన్నయ్యకు ఏమైనా అవుతుందని తోబుట్టువుల విషయం చెప్పకుండా మీలో మీరే బాధపడుతున్నారు అది ఎంత నరకమే ప్రాణమైనవాళ్ళను దూరం చేసుకున్న నాకు తెలుసు అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను . అక్కయ్యా – వదినమ్మా అంటూ మహారాణీ గారిని ఓదారుస్తున్నారు రాణులు – చెల్లెమ్మ ……. , మంజరి ఎగురుకుంటూ వెళ్లి మహారాణీ గారి భుజంపైకి చేరింది . కలిసి కొద్దిసేపైనా ఈ అన్నయ్య గురించి ఆలోచిస్తున్న చెల్లెళ్ళ కన్నీళ్లను తుడవలేని అన్నయ్య ప్రాణం ఉంటే ఎంత లేకపోతే ఎంత , మాటిస్తున్నాను చెల్లెళ్ళూ ….. సూర్యుడు అస్తమించేలోపు నా ప్రాణాలు అర్పించి అయినా మీ తోబుట్టువులను మీచేంతకు చేరుస్తాను , వారినే కాదు అక్కడ బాధపడుతున్న ప్రతీ ఒక్కరికీ స్వేచ్ఛను పంచుతాను , స్వర్గం లాంటి రాజ్యాలు ఉండాలి కానీ వ్యభిచార రాజ్యం ఒకటి ఉండటం ఏమిటి – మంత్రిగారూ …… మంత్రి : అటువంటి రాజ్యానికి ప్రాణం పోసినదే మన పాత రాజు ప్రభూ …… , కొంతమంది మూర్ఖమైన రాజుల సహాయంతో వ్యభిచార రాజ్యాన్ని నిర్భయంగా నిర్వహిస్తూ వెళ్లారు . ఈరోజుతో భూస్థాపితం అయిపోవాలి అన్నీ ఏర్పాట్లూ చెయ్యండి . సేనాపతి : చిత్తం మహారాజా అంటూ వెళ్ళాడు . నాన్నా నాన్నా …… మేమూ వస్తాము అంటూ నా ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నట్లు ఉరకాలేస్తున్న సింహాలపైకి ఎక్కారు . నా బుజ్జాయిలు ధైర్యవంతులని నాకు తెలుసు కానీ భయపడుతున్న మీ అక్కయ్యలకు తోడుగా మరియు నేను లేని సమయంలో రాజ్యానికి రక్షణగా మీరుండాలికదా అంటూ ఎత్తుకునివెళ్లి మహారాణీ – చెల్లెమ్మకు అందించి ముద్దులుపెట్టాను . బుజ్జాయిలు : ఆ రాక్షసుల అంతుచూసి వెంటనే వచ్చేయ్యాలి . నా బుజ్జాయిలను చూడకుండా నేనూ ఉండలేను . రాణులు : మహారాణీ గారికి చెప్పరా మహారాజా …… మన్నించండి మహారాణీ గారూ …… , వెళతాను . మహారాణి : వెళ్ళొస్తానని చెప్పండి , విజయులై తిరిగిరండి . సంతోషం మహారాణీ గారూ …… , బుజ్జాయిలూ జాగ్రత్త . బుజ్జాయిలు : అలాగే నాన్నగారూ …… , మీ మహారాణీ గారిని జాగ్రత్తగా చూసుకుంటాములే వెళ్లి రండి అంటూ నవ్వుతున్నారు . చెల్లెళ్ళు : అన్నయ్యా అన్నయ్యా …… మహారాణి : మీ అన్నయ్య దేవుడని అన్నారుకదా దేవుడికి ఏమీకాదు ధైర్యంగా ఉండండి . మిత్రమా సింహం ఎక్కడికి , నేనూ – కృష్ణ పూర్తి చేసుకొస్తాములే ……. అడవిరాజు : ఊహూ నీవెంటే అన్నట్లు ముందు ముందుకు వెళ్లిపోతున్నాడు – జాగ్రత్త అంటూ ఆడ సింహం వైపు సైగచేశాడు . కింద సేనాపతితోపాటు వీరులైన కొద్దిమంది సైనికులు సిద్ధంగా ఉండటంతో ఆయుధం చేతబట్టి మిత్రుడిపైకెక్కి బుజ్జాయిలకు ముద్దులువదిలి దుష్ట శిక్షణకు బయలుదేరాను – మంజరి ఎగురుకుంటూ వచ్చి మిత్రుడిపై చేరింది . మంజరీ ఇప్పటికి గుర్తుకువచ్చానా …… మంజరి : మహారాణీ గారు ఆజ్ఞవేశారు వచ్చాను . అంటే …… మంజరి : అంతేమరి అంటూ చుట్టూ ఎగురుతోంది .
నీసంగతి నాదేవకన్యను చేరాక చెబుతాను అంటూ నవ్వుకున్నాను . రాజ్యం దాటగానే అరణ్యంలోని సింహాలు – పులులు – చిరుతపులులతోపాటు సాధు జంతువులుకూడా మావెనుకే వేగంగా రావడం చూసి అడవిరాజువైపు చూసాను . నాకేమీ తెలియదు అన్నట్లు పెద్దమొత్తంలో జంతువులను వెనకేసుకుని మాకంటే ముందుముందుకు వెళ్లిపోతున్నాయి . సేనాపతి మరొక మార్గంలోకి తిరుగడంతో మిత్రమా అటువైపు కాదు ఇటువైపు అంటూ కేకెయ్యడంతో బుద్ధిగా మాతోపాటు వేగంగా రాసాగాయి . దాదాపు నాలుగైదు ఘడియలు ప్రయాణం తరువాత అల్లంతదూరంలోనుండే మహిళల ఆర్తనాదాలు వినిపించసాగాయి . మంజరి : ప్రభూ …… హింసిస్తున్నట్లు ఉన్నారు అంటూ ఎగురుకుంటూ వెళ్లి కొద్దిసేపటి తరువాత బాధ – కన్నీళ్ళతో వచ్చింది , నోటివెంట మాట రావడంలేదు . మంజరీ ఏమైంది …… మంజరి : ప్ర …. ప్రభూ ….. చిన్న వయసు అమ్మాయిలను గోలుసులలో బంధించి ఇనుప చువ్వలలో ఉంచి కొరడాలతో హింసిస్తున్నారు ప్రభూ ….. , లోపల అయితే మీదపడి బట్టలు చింపి రాక్షసుల్లా …… చెప్పడానికి కూడా మాటలు రావడంలేదు ప్రభూ ……. , మన రాజ్యానికి తీసుకువచ్చినట్లుగా అన్ని రాజ్యాలకు తీసుకెళ్లడానికి కూడా రథాలు సిద్ధం చేశారు ప్రభూ …… వాళ్ళను ప్రాణాలతో వదలకూడదు – చిత్రహింసలు పెట్టి నరకాన్ని తెలియజెయ్యాలి . ఆపాటికే వ్యభిచార రాజ్యపు ద్వారం దగ్గరకు చేరుకున్నాము , అనుకున్నది అయితే మాటలతో నచ్చజెప్పి అందరినీ ఇక్కడినుండి తీసుకెళ్లాలనుకున్నాను కానీ లోపలనుండి వస్తున్న అక్కాచెల్లెళ్ల ఆర్తనాధాలను విని – ద్వారం దగ్గరనే రాక్షసుల్లాంటి వారు మహిళలను హింసిస్తుండటం చూసి కోపం కట్టలు తెంచుకుంది , మిత్రమా అంటూ వెళ్లి ద్వారం బయట ఆడవారిని హింసిస్తున్న వారి చేతులు తెగ నరికాను . వాళ్ళ అరుపులు రాజ్యం మొత్తం వినిపించినట్లు కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం ……. ఆ మాటకోసమే ఎదురుచూస్తున్నట్లు RRR లో NTR ఉసిగొలిపినట్లు అడవి జంతువులన్నీ పంజాలు విసురుతూ దాడిచేసుకుంటూ పోతున్నాయి . అధిచూసి ప్రాణభయంతో పారిపోతున్నవారి మరొక అడుగు పడకుండా చేతులూ కాళ్ళూ నరుకుతున్నాము , గోలుసులలో – చేరసాలల్లో – పంజరాలల్లో ……. వొళ్ళంతా చిరిగిపోయిన వస్త్రాలు రక్తంతో విలపిస్తున్న మనకు జన్మనిచ్చే మహిళలు పిల్లలను చూసి హృదయం చలించిపోతోంది , సైనికులారా – మిత్రమా ఇటువంటి వారిని వదలనేకూడదు ఒక్కడూ తప్పించుకోకూడదు , కోన ఊపిరి మిగిలేలా జీవితాంతం జీవచ్చవాలుగా బ్రతికేలా కాళ్ళూ చేతులూ తెగనరకండి . ఒక్కొక్కడి ప్రాణభయపు ఆర్తనాధాలను – చిందుతున్న వారి రక్తాన్ని చూసి బందీలుగా ఉన్న మహిళలందరూ కన్నీళ్లను తుడుచుకుని కోపంతో చంపేయ్యండి చంపేయ్యండి అంటూ భద్రకాలుల్లా తమవైపుగా పరిగెడుతున్నవారిని పట్టుకుని గోలుసులతో మెడలను చుట్టేస్తున్నారు .
కొద్దిసేపటికే ఒక్కడుకూడా మిగలలేదు , రక్తంతో విలవిలలాడుతూ కేకలువేస్తున్నవారిని లాక్కునివెళ్లి బయటపడేశారు – మా వస్త్రాలన్నీ ఆ రాక్షసుల రక్తంతో తడిచిపోయింది . బంధింపబడిన వారందరినీ విడుదల చెయ్యగానే వారి వారి కుటుంబసభ్యులతో కలిసి మా అందరినీ దేవుళ్ళలా చూసి దండాలు పెడుతున్నారు . సేనాపతీ – సైనికులారా …… వీరందరినీ జాగ్రత్తగా వారి వారి రాజ్యాలకు – గృహాలకు చేర్చండి . సేనాపతి : ప్రభూ …… మన సైనికులు ఉన్నది కొద్దిమందే ….. అంతలో చెల్లెమ్మ ప్రియుడు తన సైన్యంతో వచ్చాడు – మహారాజా …… నా కాబోవు రాణి వర్తమానం పంపింది ఉన్నపాటుగా మీకు సహాయం చెయ్యడం కోసం నా సైన్యంతో వచ్చేసాను , చూస్తుంటే అంతా పూర్తి చేసేసినట్లున్నారు . అయిననూ సరైన సమయానికే వచ్చావు బావా ……. వీరందరినీ వారి వారి కుటుంబసభ్యుల చెంతకు జాగ్రత్తగా చేర్చే బాధ్యత నీదే …… యువరాజు : ఒక్కొక్క అమ్మాయి వెంట ఇద్దరిద్దరు సైనికులను పంపి మీరిచ్చిన బాధ్యతను పూర్తిచేస్తాను మహారాజా …… సంతోషం యువరాజా ……. , సైనికులారా …… ఇలాంటి వ్యభిచార రాజ్యం ఒకటుందన్న ఆనవాళ్లు కూడా ఉండకూడదు . సైనికులు : అలాగే మహారాజా అంటూ రాజ్యం మొత్తాన్నీ కాల్చి బూడిద చేసేసారు . రాజ్యంలోని చెల్లెళ్ళ పేర్లు చెప్పి వారి కుటుంబసభ్యులను మావెంట రాజ్యానికి తీసుకెళ్లాము . రాజ్య ప్రవేశం దగ్గరే నాకోసం ఎదురుచూస్తున్నట్లు నాన్నా నాన్నా అంటూ పరుగున వచ్చి విజయ స్వాగతం పలికారు . వెంటనే కిందకుదిగి ఎత్తుకోబోయి వొళ్ళంతా రక్తం అంటూ ఆగిపోయాను . బుజ్జాయిలు : ఆ రాక్షసుల రక్తమే కదా నాన్నగారూ అంటూ నా గుండెలపైకి చేరారు . అఅహ్హ్ …… ఇప్పటికి ప్రాణం తిరిగొచ్చినట్లుంది – మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయానంటే నమ్మండి అంటూ ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెడుతున్నాను . బుజ్జాయిలు : మేముకూడా నాన్నగారూ అంటూ ముద్దుల వర్షం కురిపిస్తున్నారు . చుట్టూ చూసి ఒంటరిగానా ……. ? . బుజ్జాయిలు : మా నాన్న రాజ్యంలో మాకు భయం ఏమిటి ? , మా బుజ్జి సింహాలు తోడుగా ఉన్నాయికదా అంటూ ముద్దులుపెట్టి కిందకుదిగి మిత్రుడు సింహం దగ్గరికివెళ్లి వదిలింది . మాలానే ప్రేమను పంచుకున్నాయి . మా బుజ్జాయిలు బంగారం అంటూ బుజ్జిచేతులను అందుకుని రాజ్యపు వీధుల వెంట నడిచాము . ప్రజలు …… తమ అమ్మాయిలను అక్కునచేర్చుకుని ఆనందబాస్పాలతో మహారాజా మహారాజా …… అంటూ విజయనినాధాలతో స్వాగతం పలికారు – కొంతమంది అయితే పాలాభిషేఖం చెయ్యడానికి పాలు తీసుకొచ్చారు . ప్రజలారా …… మీ అభిమానానికి సంతోషం ఈ పాలను వృధా చెయ్యకుండా పిల్లలకు అందించండి అంటూ వారించాను . అంతే దేవుడిలా దండాలు పెడుతున్నారు .
చెల్లెళ్ళ కుటుంబసభ్యులను రాజాప్రవేశద్వారం దగ్గర వదిలి మీవాళ్లదగ్గరికి వెళ్ళమని చెప్పి బుజ్జాయిలను ఎత్తుకుని మిత్రులు – వీరులైన సైనికులతోపాటు ఆనకట్ట దగ్గరకు చేరుకున్నాను . కొద్దిపాటి జలపాతపు నీటిలోనే శుభ్రం చేసుకుని అమ్మవారి సన్నిధికి చేరాము – అమ్మా …… మాకు తోడుగా ఉండి మీ బిడ్డలను రక్షించుకునేలా అనుగ్రహించినందుకు అంటూ మొక్కుకున్నాను . బుజ్జాయిలు కూడా మొక్కుకుని నాన్నగారూ వొంగండి అంటూ అమ్మవారి కుంకుమను ఉంచారు . నాదేవకన్య కూడా అచ్చు ఇలానే ఉంచేది మరి మీకు అంటూ అమ్మవారిని ప్రార్థించి కుంకుమ ఉంచి ఎత్తుకుని వెనక్కు తిరిగాను . అన్నయ్యా అన్నయ్యా ……. అంటూ నా గుండెలపైకి చేరారు చెల్లెళ్ళు , అన్నయ్యా అన్నయ్యా …… మీకేమీ కాలేదుకదా వొళ్ళంతా రక్తం అని చెల్లీ – అక్కయ్య చెప్పారు అంటూ నావొళ్ళంతా చూస్తున్నారు . నా చెల్లెళ్ళ ఇంత ప్రేమ రక్షణగా ఉండగా ఈ అన్నయ్యకు ఏమవుతుంది చెల్లెళ్ళూ …….. అవునవును ఈ వీరాధివీరుడిని ఎవ్వరూ ఏమీచెయ్యలేరు అంటూ నా బుగ్గపై చేతులతో ముద్దుపెట్టారు . వద్దు వద్దు అంటూ ముద్దులను దులిపేసుకోవడం చూసి మహారాణీ గారితోపాటు రాణులు – చెల్లెమ్మ నవ్వుకుంటున్నారు . బుజ్జాయిలు : భలే భలే అంటూ నవ్వుకుంటున్నారు . మహారాణీ గారు : వెళ్ళేటప్పుడు కూడా మీ బుజ్జాయిలకు మాత్రమే ముద్దులు వదిలారు గాలిలో ……. అంతే ఒక్కసారిగా బుజ్జాయిల కళ్ళు ఎరుపురంగులోకి మారిపోయాయి . బుజ్జాయిలను చూసి మహారాణీ వాళ్ళు మరింత గట్టిగా నవ్వుకుంటున్నారు . బుజ్జితల్లీ బుజ్జినాన్నా ఏమైంది ? ఎందుకీ కోపం ? . బుజ్జాయిలు : మీరు మాకోసం గాలిలో వదిలిన ముద్దులను అమ్మ పట్టేసుకుంది అంటూ ఈర్శ్యతో చూస్తున్నారు . మహారాణి : నా మహారాజు ….. మాకోసం వదిలిన ముద్దులేమో అనుకున్నాను అంటూ నవ్వులు ఆగడంలేదు . కాదు కాదు మహారాణీగారూ …… బుజ్జాయిలకోసం . మహారాణి : ఆవిషయం ఇప్పుడు చెబితే ఎలా మహారాజా …… , మీ ముద్దులు ఎప్పుడో నా మనసులోతుల్లోకి చేరిపోయాయి . బయటకు తీసేయ్యండి మహారాణీ గారూ ……. ఒక్కసారి మా ఆడవారి మనసుల్లోకి చేరాయంటే బయటకు తియ్యడం అసాధ్యం అన్నయ్యా అన్నయ్యా …… అంటూ చెల్లెళ్ళంతా నవ్వుకుంటున్నారు . మహారాణి : అదీ అలా తెలియజేయ్యండి మీ అన్నయ్యకు ……. చెల్లెళ్ళూ …… మీరుకూడా మహారాణీ వైపుకు చేరిపోయారా ? . చెల్లెళ్ళు : మా వదిన అంతులేని ప్రేమ తెలిసాక మేమేంటి ఎవ్వరైనా మా వదినకు మద్దతు ఇవ్వాల్సిందే అంటూ మహారాణీ చెంతకు చేరిపోయారు . వదిన ……. కొన్ని ఘడియలు ముందే కదా చెల్లెళ్ళూ అక్కయ్యా అని పిలిచారు . చెల్లెళ్ళు : అది మీపై ప్రేమ గురించి తెలియనప్పుడు అన్నయ్యా …… , మరీ ఇంత అమాయకులు అయితే ఎలా అన్నయ్యా అంటూ సంతోషంగా నవ్వుకుంటున్నారు – మా వదిన విశ్వమంత ప్రేమ మీకెప్పుడు తెలుస్తుంది .
ఆ సంగతి వదిలెయ్యండి కానీ అక్కడ మీ తల్లిదండ్రులు మీకోసం బాధపడుతుంటారు – మీ ప్రయాణానికి సన్నద్ధం చేయిస్తాను . చెల్లెళ్ళు : మా వదినలను వదిలి అప్పుడే వెళ్ళము పైగా చీకటిపడుతోంది . మరి ……. చెల్లెళ్ళు : మేము క్షేమమని మా వదిన ఎప్పుడో మా అమ్మానాన్నలకు పావురాల ద్వారా వర్తమనం చేరేలా చేశారు సమాధానాలు కూడా వచ్చేసాయి కూడా ……. అలా అయితే సంతోషం – మీ ఇష్టం వచ్చినాన్ని రోజులు ఉండవచ్చు . చెల్లెళ్ళు : మీ ఈ సంతోషం మా వదిన వల్లనే కాబట్టి కానుకలేమైనా ఇవ్వాలనుకుంటే వారికే ఇవ్వండి . చాలా సంతోషం మహారాణీ గారూ ……. అంతే అందరూ చప్పట్లు – కరతాళధ్వనులతో హోరెత్తించి ఆనందిస్తున్నారు . సేనాపతీ మంత్రిగారిని పిలిపించండి . మంత్రి : ఇక్కడే ఉన్నాను ప్రభూ …… , మీ విజయానికి అభినందనలు ……. విజయానందం అప్పుడే కాదు మంత్రిగారూ ……. , మన మహారాణీ గారు …… చెల్లెళ్ళ తల్లిదండ్రులకు వర్తమానం పంపినట్లుగానే మన సామ్రాజ్యంలోని పెద్ద చిన్న మరియు సామంత రాజ్యాలన్నింటికీ వెంటనే ఉన్నఫలంగా వర్తమానాలు పంపండి రేపు సూర్యోదయ సమయానికల్లా వాళ్ళ వాళ్ళ రాజ్యాలలో బలవంతంగా నిర్బంధించుకున్న ఆడవాళ్ళందరినీ క్షమించమని వేడుకుని తగిన బహుమతులతో వారి వారి కుటుంబాల చెంతకు చేర్చాలి లేకపోతే వారి రాజ్యానికి వ్యభిచార రాజ్యానికి పట్టిన గతే పడుతుందని నామాటగా హెచ్చరించండి – అందరూ స్వేచ్ఛను పొందారో లేదో మన గూఢచారుల ద్వారా మీరే స్వయంగా తెలుసుకుని నాకు తెలపండి – ఏ ఒక్కరూ కన్నీళ్లు కార్చకూడదు . మంత్రి : ఆజ్ఞ ప్రభూ ఇప్పుడే వర్తమానాలు పంపుతాను . దీనికైతే ఏకంగా రెండు ముద్దులు పెట్టాల్సిందే అంటూ రెండు బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు మహారాణీ గారు …….. చుట్టూ అందరి ఆనందాలకు అవధులు లేవు …… బుజ్జాయిలు : ఇవికూడా అమ్మ ముద్దులే అంటూ ముద్దుల వర్షమే కురుస్తోంది . చెల్లెళ్ళు సంతోషంతో కేకలువేసి చేతులు జోడించారు ఆనందబాస్పాలతో ……. ఇదిమాత్రం మీవల్లనే చెల్లెళ్ళూ ……. , మీరు ఇక్కడకు రాకపోయుంటే ఇదంతా జరిగేది కాదు , స్వేచ్ఛ పొందే ప్రతీ అమ్మాయి పెదాలపై చిరునవ్వులు మీవల్లనే ….. అన్నయ్యా అన్నయ్యా …… అంటూ గుండెలపైకి చేరారు . సంతోష వాతావరణం నెలకొంది . Like 224 Dislike 28 131915 17 0 cookie-check జనం మెచ్చిన రాజు – Part 48 no