All content free · updated every 5 minutes

జనం మెచ్చిన రాజు – Part 50

Story Telugu 8 pages 2 years ago

జనం మెచ్చిన రాజు – Part 50
చెల్లెమ్మా సంతోషమేకదా ఇక వెళ్ళండి . చెల్లెమ్మ : పురోహితులారా ……. శాస్త్ర బద్దంగా అన్నీ కార్యక్రమాలూ జరగాలంటే పెళ్లికూతురుతోపాటు పెళ్ళికొడుకు కూడా ఉండాలా వద్దా …… పురోహితులు : తప్పకుండా ఉండాలి యువరాణీ ……. చెల్లెమ్మా …… నా హృదయ దేవకన్యతో ఎప్పుడో ఆ కార్యక్రమాలన్నీ పూర్తిచేసి వివాహం కూడా చేసుకున్నానని నీకు తెలుసుకదా …… , ఆ అందమైన సంతోషపు అనుభూతులను నా ప్రాణమున్నంతవరకూ మరిచిపోలేను . చెల్లెమ్మ : మాకు తెలియదా అన్నయ్యా అంటూ నా హృదయంపై ముద్దుపెట్టింది . మహారాణి బుగ్గపై ముద్దుపెట్టినట్లు బుగ్గపై స్పృశించుకుంది – ఆ ఆనందపు అందాలను మేము తిలకించలేదు కదన్నయ్యా …… మహారాణీ గారూ …… ముద్దుపెట్టింది నా ప్రాణం కంటే ఎక్కువైన నా దేవకన్యకు . బుజ్జాయిలు : మన దేవకన్య ….నాన్నగారూ ….. అంటూ నా హృదయంపై ముద్దులు కురిపిస్తుంటే మహారాణీగారు మెలికలు తిరిగిపోతున్నారు . అదిగో మళ్లీ ……. మహారాణి : రెండురోజుల్లో ఆస్థానం ఎలాగో నాదే కదా మహారాజా …… అది ఎప్పటికీ జరగదు మహారాణీ గారూ ……. మహారాణి : వర్షం పడితే సాధ్యమే ……. వర్షం పడాలని కోరుకోవాలా లేక పడకూడదని కోరుకోవాలా …… , ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకి పడేశావు అమ్మా …… , మీకు తెలుసుకదా ఈ హృదయంలో మీ బిడ్డకు మాత్రమే స్థానం అని …… మహారాణీ : నాకుకూడా అమ్మే ……. అయితే ఇక ఆ అమ్మపైనా భారం …… చెల్లెమ్మ : సరిగ్గా చెప్పారు అన్నయ్యా …… , భారమంతా మన దుర్గమ్మపై వేసి మాతోపాటు రండి అంటూ ఏకంగా లాక్కునివెళ్లారు . రాజభవనంలోని ఉద్యానవనం చూసి ఆశ్చర్యపోయాము , చెల్లెమ్మా ….. ఇందాకనే కదా పనులు మొదలుపెట్టినది ఇంతలోనే ఎలా సాధ్యం ఇంత అందంగా మార్చివేశారు . ఆహా ….. ఎంత అందంగా ఉందో అంటూ మహారాణీ – యువరాణి ఆనందాలకు అంతేలేకుండా పోయింది . చెల్లెమ్మ : రాజ్యప్రజలు బంధువుల్లా మారిపోతే ఇలానే ఉంటుంది అన్నయ్యా …… పురోహితుల నియమానుసారం ముత్తైదువులు ….. మహారాణీ – యువరాణీని తీసుకెళ్లి మంగళ స్నానాలతో పెళ్లి కార్యక్రమాలను మొదలుపెట్టారు , మరొకవైపు నన్ను – యువరాజును ముస్తాబు చేశారు . సాయంత్రానికల్లా యువరాజు రాజ్యం మరియు బంధువులంతా విచ్చేసారు . సాయంత్రానికి రాణులు ముగ్గురు నుండి బదులు వర్తమానాలు వచ్చేసాయి , అక్కయ్యా – చెల్లీ …… కొన్ని ముఖ్యమైన పరిస్థితుల వలన వెంటనే రాలేకపోతున్నాము వివాహం రోజు ఉదయానికల్లా వచ్చేస్తాము చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ మా ముందు చదివి వినిపించింది చెల్లెమ్మ ……. మహారాణీ బుజ్జాయిలు నిరాశచెందినా వస్తున్నారని సంతోషించారు . మరుసటిరోజు ఉదయానికల్లా రాజ్యంలోని ప్రతీ ఇల్లు పెళ్లి కళతో కళకళలాడసాగింది . ఇక రాజభవనం అయితే స్వర్గంలా మారిపోయింది – ఉద్యానవనం పందిరిలతో మహాద్భుతంగా మారిపోయింది .

ఘడియలు గడుస్తున్నకొద్దీ నాలో కంగారు అంతకంతకూ పెరుగుతుంటే , బుజ్జాయిల సంతోషం – ఉత్సాహం …… అంతకంతకూ పెరుగుతూనే ఉంది , ప్రతీ కార్యక్రమానికి నాచేతులను పట్టుకుని లాక్కుని వెళ్లి మరీ జరిపించి మురిసిపోయారు ముద్దులుపెడుతూ ఈ అదృష్టం ఎవరికి లభిస్తుంది , ఆ ఆనందాలను పరుగునవెళ్లి మహారాణీ – యువరాణులతో పంచుకుంటున్నారు . వివాహం రోజు రానే వచ్చింది – దైవ ముహూర్తం దగ్గరపడటంతో ముందుగా పురోహితులు పెళ్ళికొడుకులను పిలవడంతో …… యువరాజు వెళ్లి సంతోషంగా కూర్చున్నాడు , నేను ఎంతకూ కదలకపోవడంతో బుజ్జాయిలు లాగుతున్నారు – వీలుకాక పిల్లలందరినీ కేకెయ్యడంతో ఉత్సాహంగా వచ్చి పెళ్లిపీటల మీదకు లాక్కునివెళ్లి కూర్చోబెట్టడం చూసి అక్కడున్న ప్రజలు మరియు లోపలనుండి మహారాణీ – యువరాణీ సంతోషంతో నవ్వుకున్నారు . మంత్రాలు పలుకుతూ పెళ్ళికూతుర్లను పిలవడంతో బుజ్జాయిలిద్దరూ వెళ్లి పిలుచుకునివచ్చి మాఇద్దరి ప్రక్కన కూర్చోబెట్టారు . ప్రాణమైన నాథుడిని మళ్లీ తనవాడిని చేసుకోబోతున్నానన్న ఆనందంలో బుజ్జాయిలిద్దరినీ మామధ్యన కూర్చోబెట్టి ముద్దుచేస్తోంది . ఆ దృశ్యాలు చూసి తరించినట్లు ప్రజలంతా మాపై పూలవర్షం కురిపించారు . ప్రజలారా …… ఇంకా తాళి కట్టనేలేదు కాస్త ఆగండి . ప్రజలు : నవ్వుకున్నారు , మా దేవుడు – దేవతల వివాహం అంటే ప్రతీదీ మాకు సంబరమే మహారాజా అంటూ మళ్లీ పూలవర్షం కురిపించారు . ప్రక్కన పీటలపై కూర్చున్న చెల్లెమ్మవైపుకు తిరిగి తప్పదా చెల్లెమ్మా అని అడిగాను . చెల్లెమ్మ : ప్రజలారా విన్నారా ….. ? . ప్రజలు : ఉపవాస దీక్షకు సిద్ధమే యువరాణీ …… అంటూ పైకిలేచారు . వద్దు వద్దు వద్దు …… , పురోహితులూ …… తెలుసుకదా సూర్యుడు చూడండి ఎలా భాగభగలాడిపోతున్నాడో తొలి ముడి వేసేసమయానికి మేఘావృతం కాకపోతే ….. మహారాణి : మీఇష్టప్రకారమే పెళ్లిని ఆపేయ్యొచ్చు మహారాజా ……. , మరి మేఘాలు కమ్ముకుంటే సంతోషంగా మూడు ముళ్ళూ వేస్తారా ? . వెక్కిళ్ళు వచ్చేసాయి , బుజ్జాయిలు అందించిన నీటిని త్రాగి అప్పుడు చూద్దాములే అన్నాను , ఎండ భయంకరంగా ఉండటం చూసి హమ్మయ్యా అనుకున్నాను , తప్పు తప్పు వర్షం పడాలి – రాజ్యం పులకించాలి . మహారాణి : తథాస్తు ……. పురోహితులు : ముహూర్త సమయం ముహూర్త సమయం అంటూ తాళి అందించారు . మహారాణి : పురోహితులారా …… కొద్దిసేపు ఆపగలరా , చెల్లెళ్ళు ఇంకా రాలేదు . చెల్లెమ్మ : అవునవును ……. బుజ్జాయిలు : నా – మహారాణి బుగ్గలపై ముద్దులుపెట్టి , ద్వారం దగ్గరికి పరుగులుతీశారు , సమయం గడుస్తున్నా రాకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు . పురోహితులు : మహారాణీ – యువరాణీ …… దైవ ముహూర్తం మళ్లీ ఇలాంటి ముహూర్తం పుష్కరానికి కూడా రాదు . పురోహితులూ ….. ముహూర్తం కాదు ముఖ్యం , రాణులు రావడం ముఖ్యం …… చెల్లెమ్మ : వదినా …..

ఆలస్యం చెయ్యాలని చూస్తున్నారు అన్నయ్య , నాకు తెలిసి దారి తప్పిపోయి ఉంటారు వచ్చేస్తారులే …… మహారాణి : బుజ్జాయిలూ మీఇష్టం ఎలా అంటే అలా …… బుజ్జాయిలు : ఆలోచించి అత్తయ్య చెప్పినట్లే కానిద్దాము . బుజ్జాయిలూ ……. బుజ్జాయిలు : నాన్నగారూ …… మీరు తప్పించుకోలేరు , పూజారిగారూ కానివ్వండి . అయిపోయాను , హమ్మయ్యా బయట ఎండ ఉందిలే అంటూ నిర్భయంగా పురోహితుడి నుండి తాళి అందుకుని పైకిలేచి అందరివైపుకూ చూయించి మరొకసారి బయట ఎండను చూసి వెటకారమైన నవ్వుతో మహారాణీ మెడను చేరాను . ప్రజలందరూ మావైపు సంతోషంతో – ఎండవైపు కంగారుపడుతూ పదేపదే చూస్తూనే లేచినిలబడ్డారు . మహారాణీ …… ఎండను చూసారా అంటూ గర్వంగా తొలిముడి వెయ్యడానికి రెండువైపులా కలిపానో లేదో ఆశ్చర్యం ఒక్కసారిగా చీకటి కమ్ముకున్నట్లు మబ్బులు ……… దేవుడు – దేవత , దేవుడు – దేవత …… అంటూ సంతోషాలతో మాపై పూలవర్షం కురిపించారు , మహారాజుగారూ ….. తొలి ముడిని వేసినట్లే కదా ……. నోరెల్లబట్టి వేసినట్లే అన్నాను . నవ్వుకుని అందరూ ఒకటి ఒకటి అంటూ కేకలువేస్తున్నారు . బుజ్జాయిలు : భలేభలే అంటూ ముద్దులుపెట్టి చిందులువేస్తూ చప్పట్లుకొడుతున్నారు . చెల్లెమ్మ : అన్నయ్యా …… రెండవ ముడిని కూడా వెయ్యండి . అలాగే అంటూ నాకు తెలియకుండానే రెండవ ముడిని వేసాను – మహారాణీ అందమైన నవ్వులు నా హృదయాన్ని చేరుతున్నాయి . మరింత ఆశ్చర్యం …… పెద్దగా ఉరుములు మెరుపులు …… మామూలుగా అయితే బుజ్జాయిలు – చుట్టూ పిల్లలు …… ఆ శబ్దాలు భయపడేవారు కానీ సంతోషంతో చిందులువేస్తున్నారు . చుట్టూ ప్రజలు అమితమైన ఆనందాలతో రెండు రెండు అంటూ పూలవర్షం కురిపిస్తున్నారు . మహారాణి : మూడవ ముడి వెయ్యక తప్పదు మహారాజా …… వేస్తున్నాను అంటూ మూడుముళ్లు వెయ్యడం ఆలస్యం గ్రంథాలలో రాసినట్లుగానే లోకకల్యాణం అన్నట్లు దేవతలే స్వయంగా ఆశీర్వదిస్తున్నట్లు వర్షం ధారాళంగా కురవసాగింది . మూడుముళ్లు వేసిన సంగతే మరిచిపోయి బుజ్జాయిలను ఎత్తుకుని వర్షం కిందకుచేరి పూర్తిగా తడిచాము – ముద్దులలో మునిగిపోయాము . బుజ్జాయిలకు మాత్రమేనా ముద్దులు నాకులేవా మహారాజా ……. అంటూ మహారాణి వచ్చింది . తాళి కట్టడమే కాకుండా ముద్దులా అంటూ వర్షం ఆస్వాధిస్తున్న చెల్లెమ్మ చెంతకు చేరాను . మహారాణి నవ్వుతూనే వెనుకే వచ్చింది . చుట్టూ ప్రజలందరూ ఆనందబాస్పాలతో వర్షంలో తడుస్తున్నారు – నాచుట్టూ చేరి దండాలుపెడుతున్నారు . ప్రజలారా …… నావలన కాదు . ప్రజలు : అవును మీవలన కాదు , మీరు – మహారాణీ గారు ఏకం అవ్వడం వల్లనే , మహారాజు – మహారాణీ , మహారాజు – మహారాణీ …… అంటూ కేకలువేస్తూ మహారాణీ గారిని నాప్రక్కన చేర్చి వర్షంతోపాటు పూలవర్షం కురిపించి ఆనందిస్తున్నారు .

అన్నయ్యా అన్నయ్యా …… అంటూ చెల్లెమ్మతోపాటు మేము స్వచ్ఛను అందించిన చెల్లెళ్ళందరూ గుండెలపైకి చేరారు , ఈ కంగారులో వాళ్ళు వచ్చిన సంగతే తెలియదు . చెల్లెళ్ళూ …… మీరు ? . చెల్లెళ్ళు : మా అన్నయ్య వివాహం అంటే ఆషామాషీ కాదు , అన్నీ రాజ్యాలలో ఈ వీరుడి వివాహం గురించే మాట్లాడుకుంటున్నారు , అలా తెలియగానే నలువైపుల రాజ్యాలలో ఉన్న మీ చెల్లెళ్ళంతా విచ్చేసాము , మీరేలాగో పిలవలేదు . వివాహమే ……. చెల్లెళ్ళు : తెలుసు తెలుసు …… , అయినాసరే దేవతనే చేసుకున్నారు అంటూ ఆనందిస్తున్నారు వర్షంలో ……. వర్షం కోసం తప్పలేదు చెల్లెళ్ళూ – ప్రజలంతా ఒక్కటై నాకు ఇష్టం లేకపోయినా మూడు ముళ్ళు వేయించారు – మూడు ముళ్ళు వేసినంత మాత్రాన ఒక్కటైనట్లు కాదులే ……. అలా అన్నానో లేదో పెద్ద ఎత్తున పడుతున్న వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది . అందరిలో నిరాశ – బాధ ……. బుజ్జాయిలను ఎత్తుకుని రాజభవనం పైనున్న ఉద్యానవనం దగ్గరికి చేరుకుని చూస్తే కొండపైకూడా వర్షం ఆగిపోయింది , తల్లీ గంగమ్మా ఏమైంది అంటూ బాధపడుతూ కిందకుదిగి మిత్రుడిపై ఆనకట్ట దగ్గరకు చేరుకున్నాను – అప్పటివరకూ కురిసిన వర్షపు నీళ్లు ….. భూదేవి దాహం తీర్చడానికే సరిపోలేదు అన్నట్లు మొత్తం ఇంకిపోయాయి – మేఘాలవైపు ఆశగా చూస్తున్నకొద్దీ మేఘాలు పరుగులుతీస్తూ సూర్యుడికి దారిని ఇచ్చాయి . నావెనుకే వచ్చిన కొంతమంది ప్రజాలుకూడా ఏమిజరిగిందో – అపరాధం ఎక్కడ జరిగిందో తెలియక బాధపడుతున్నారు . సూర్యుడు అస్తమించి చీకటిపడి చంద్రుడి వెన్నెల ప్రకాశిస్తోంది కానీ మేఘావృతం మాత్రం జాడలేదు . ప్రజలారా ప్రజలారా …… వర్షం రాక మన దేవుడి వల్లనే – ఆగిపోవడం కూడా మన దేవుడి వల్లనే అంటూ పురోహితులు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు . నావల్లనా …… ? . పురోహితులు : అవును మీవల్లనే మహారాజా …… , వివాహానికి సంతోషంగా విచ్చేసిన వారిద్వారా మాకూ ఇప్పుడే తెలిసింది , ” మూడు ముళ్ళు వేసినంత మాత్రాన ఒక్కటైనట్లు కాదు ” గుర్తుకొచ్చాయా మహారాజా …… అదీ అదీ …….. పురోహితులు : మీరు అలా అన్నారో లేదో తుఫానులా మారాల్సిన పెద్ద వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది . అవి నా మమసులోని మాటలే ….. , పరిష్కార మార్గం సూచించండి పురోహితులూ ……… పురోహితులు : దేవుడు – దేవత ఒక్కటవ్వడమే ……. , వివాహం తరువాత జరగాల్సిన మూడు రాత్రుల కార్యం జరగాల్సిందే ……. బలవంతంగా మూడు ముళ్ళు వేయించారు కానీ మూడు రాత్రుల కార్యం జరిపించలేరు – ఇక్కడినుండి కదిలితేనే కదా ……. బుజ్జాయిలు : తప్పు నాన్నగారూ తప్పు , ఏ సమయంలో జరగాల్సినవి ఆ సమయంలో జరగాలి అంటూ కిందకుదిగి బుజ్జిసింహాలను ఎత్తుకుని సింహాలపైకి చేరారు , నాన్నగారూ ….. మేము వెళుతున్నాము మావెనుకే మీరు వస్తున్నారు .

ముత్తైదువులు : అక్కడ అన్నీ ఏర్పాట్లూ చేసేసాము మహారాజా …… , యువరాణీ కోసం రాజభవనంలో యువరాణీ మందిరాన్ని – ప్రకృతి ఒడిలో పెరిగిన మీకోసం రాజభవనపు కొండపైనున్న ఉద్యానవనంలోని పూరి గుడిసెను శ్రుంగార పూల గుడిసెగా అలంకరించాము , ఒక్కసారి వచ్చి చూశారంటే మీరే ఉత్సాహంగా లోపలికి చేరిపోతారు . లేదు లేదు లేదు నేను రానంటే రాను – బుజ్జాయిలూ నన్ను వదిలి వెళ్లిపోతున్నారా ? . బుజ్జాయిలు : లేదు నాన్నగారూ ….. మీరూ వెనుకే వచ్చేస్తారు మాకు తెలుసు , అన్నాచెల్లెళ్ళు ( మీరు , మీ చెల్లెమ్మ ) అలంకరించిన గధుల్లోకి వెలితే మళ్లీ మమ్మల్ని పట్టించుకుంటారో లేదో అందుకే ముందే వెళ్లి అత్తయ్య – అమ్మలకు ముద్దులు అందిస్తాము , రండి రండి …… ఊహూ రానంటే రాను అంటూ అమ్మవారి ముందు కూర్చున్నాను . పురోహితులు : ముహూర్త సమయం కావస్తోంది . ప్రజలు : మహారాజుగారు మొండిగా కూర్చున్నారు ఏమి చెయ్యడం …… పురోహితులు : గ్రంథాల ప్రకారం వర్షం కురవాలి అంటే దేవుడు – దేవత ఒక్కటవ్వాలి , మీఇష్టం ఏమిచేస్తారో ……. , ఈ ముహూర్తం దాటితే …… ప్రజలు : తెలుసు తెలుసు పుష్కరం వరకూ ఆగాలి , మన దేవుడిని ఎత్తుకుని వెళ్లిపోవడం ఒక్కటే మార్గం ……. వద్దు వద్దు అంటూ పరుగుతీసాను . అప్పటికే ప్రజలంతా చుట్టుముట్టడంతో తప్పించుకునే వీలులేక అమ్మవారి వృక్షాన్ని గట్టిగా చుట్టేసి పట్టుకున్నాను . ప్రజలంతా నవ్వుకున్నారు , మహారాజుగారూ ….. మీరు ఒక్కరు – మేము వందకుపైనే అంటూ ఒక్కటై కాస్త కష్టమైనా చెట్టు నుండి వేరుచేసి కళ్ళూ చేతులూ కత్తివేసి జై వీరాంజనేయ అంటూ ఎత్తుకున్నారు . అమ్మా దుర్గమ్మ తల్లీ ఇక మీరే రక్ష …… రాజ్య వీధులగుండా ఎత్తుకుని వెళుతుంటే అందరూ చూసి మంచిపని చేశారు అంటూ సంతోషంతో నవ్వుకుంటూ రాజ్య ద్వారం వరకూ వచ్చి లోపలికి పంపించారు . కింద ఉద్యానవనంలో ఉన్న చెల్లెళ్ళు – చెలికత్తెలు ….. ఇక మేము తీసుకెళతాము , ప్రజలు కిందకుదించి కట్లు విప్పారు , అన్నయ్యా అన్నయ్యా ….. తప్పించుకోవాలని ప్రయత్నించారో మీ చెల్లెళ్ళు ఒక్కొక్కరూ ఒక్కొక్క భద్రకాలీ అవతారం ఎత్తుతారు గుర్తుపెట్టుకోండి అంటూ నవ్వుకున్నారు , శోభనం నుండి పారిపోయే వీరాధివీరుడిని మిమ్మల్నే చూస్తున్నాము అంటూ రెండువైపులా చేతులను ఒడిసి పట్టుకుని పైకి తీసుకెళ్లారు . చివరి అంతస్తులోని యువరాణీ మందిరం దగ్గర నాకోసమే ఎదురుచూస్తున్న చెల్లెమ్మ ….. నాగుండెలపైకి చేరి ఈరోజుతో మీ విరహ వనవాసం పూర్తవ్వబోతోంది చాలా చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా , మీరు – వదిన ఇక జీవితాంతం సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని మాత్రం చెప్పగలను . చెల్లెమ్మా చెల్లెమ్మా ….. నా దేవకన్య గురించి నీకంటే ఎవరికి బాగా తెలుసు నువ్వే రక్షించాలి .

చెల్లెమ్మ : ప్రాణమైన చెల్లెమ్మగా చెయ్యాల్సినదే చేస్తున్నాను అన్నయ్యా – ఒక్కసారి మా వదిన సౌందర్యం చూశారంటే మేమెవ్వరం గుర్తుకురాము చివరికి బుజ్జాయిలుకూడా …… ఇక నన్ను రక్షించేది బుజ్జాయిలు మాత్రమే ……, బుజ్జితల్లీ బుజ్జినాన్నా ……. చెల్లెమ్మ : అవునవును వారే వారే , మీకోసం మా వదినతోపాటు మీ మిత్రులతోపాటు పైన వెయ్యికళ్ళతో వేచిచూస్తున్నారు , నావలన ఆ సంతోషం ఆలస్యం అవ్వడం ఇష్టంలేదు తీసుకెళ్లండి తీసుకెళ్లండి అంటూ వెళ్లి యువరాజు కౌగిలిలోకి చేరి ఆనందిస్తోంది . బుజ్జితల్లీ బుజ్జినాన్నా , బుజ్జితల్లీ బుజ్జినాన్నా …….. చెల్లెళ్ళు : వాళ్ళ దగ్గరకే తీసుకెళుతున్నాము అన్నయ్యా అంటూ చేతులతో కళ్ళుమూసి పైనున్న ఉద్యానవనం దగ్గరికి తీసుకెళ్లారు . ఒక్కసారిగా గుప్పుమన్న మల్లెపూల సువాసనకు వొళ్ళు జివ్వుమంది . చెల్లెళ్ళు : ఈమాత్రం దానికే ఇలా అయితే ఎలా అన్నయ్యా అంటూ కళ్లపై చేతులను తీసేసారు . రంగురంగుల పూలు – కొవ్వొత్తులతో అత్యంత సుందరంగా అలంకరించబడిన ఉద్యానవనాన్ని అలా చూస్తుండిపోయాను . చెల్లెళ్ళు : ఎలా ఉంది అన్నయ్యా …… చాలా అందంగా ఉంది . చెల్లెళ్ళు : మా అన్నయ్య – వదినల శోభనం కోసం మేమే స్వయంగా ఇలా సర్వాంగ సుందరంగా అలంకరించాము . శోభనమా …… , లేదు లేదు అలంకరణ ఏమీ బాగోలేదు అంటూ చేతులను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను . చెల్లెళ్ళు : మీ కళ్ళు ఆనందిస్తున్నాయే అంటూ పూలవర్షం కురిపిస్తూ పూలదారిలో నడిపించారు . నాన్నా నాన్నా …… అంటూ బుజ్జాయిలిద్దరూ పరుగునవచ్చి నామీదకు చేరారు . చెల్లెళ్ళు : నాచేతులను వదిలి తప్పించుకోకుండా చుట్టూ చేరి నడిపించారు . బుజ్జితల్లీ – బుజ్జినాన్నా …… మీ దేవకన్య అమ్మకు అన్యాయం చెయ్యడం తగునా మీరే చెప్పండి . బుజ్జాయిలు : అందుకే కదా నాన్నా ….. ఈ ఏర్పాట్లన్నీ , మీకు ఇప్పుడు అర్థం కాదు లోపలికి వెళ్ళాక తెలుస్తుంది . చెల్లెళ్ళు : అవును లోపలికి వెళ్ళాక తెలుస్తుంది . మిత్రులు నా మిత్రులు ఎక్కడ ? . బుజ్జాయిలు : మిమ్మల్ని దగ్గరుండి ప్రకృతి గదిలోకి పంపించడం కోసం అక్కడే వేచిచూస్తున్నారు నాన్నగారూ …… అవునన్నట్లు నృత్యం చేస్తున్నాయి . అందరూ ఒక్కటైపోయారన్నమాట ఇక మంజరినే రక్షించాలి , మంజరీ మంజరీ …….. ప్రభూ ప్రభూ …… ఏమిటి ఆలస్యం , శోభన ముహూర్తం దగ్గర పడుతుంటేనూ అంటూ ఏకంగా గుడిసెలోనుండి వచ్చి బుజ్జితల్లి భుజంపై వాలింది మంజరి . నువ్వు లోపలే ఉన్నావన్నమాట , ఆయనా నా తప్పు ….. నువ్వెప్పుడో మహారాణీ వశం అయిపోయావు అని గుర్తించలేకపోయాను , చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ …… దయచేసి దయచేసి నన్ను వదిలెయ్యండి వెళ్లిపోతాను . చెల్లెళ్ళు : మా జీవితాలను సంతోషయం చేసిన మా ప్రాణమైన అన్నయ్య రుణం తీర్చుకునే సమయం దక్కింది ఎలా వదులుకుంటాము , బుజ్జాయిలూ …..

సమయం ఆసన్నమయ్యింది చివరగా ఎన్ని ముద్దులిస్తారో ఇవ్వండి ఒక్కసారి లోపలికి వెళ్లారంటే ఎన్ని రాత్రుల తరువాత బయటకువస్తారో ……. బుజ్జాయిలు : నాన్నను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేము అలాంటిది రోజులు చూడలేము , అమ్మాన్నాన్నల కోసం కాబట్టి మిక్కిలి సంతోషమే అంటూ ముద్దులవర్షం కురిపించారు . బుజ్జాయిలు – మంజరి – మిత్రుల కళ్ళల్లో సంతోషం …… మనసుకు ఆహ్లాదాన్ని అయితే పంచుతోంది కానీ …… , వెంటనే తప్పించుకోవాలి …… చెల్లెళ్ళు : కుదరని పని అన్నయ్యా …… బుజ్జాయిలు : నవ్వుకున్నారు , అమ్మా అమ్మా ….. నాన్నగారు వస్తున్నారు అని కేకలువేసి ముద్దులుపెట్టి కిందకుదిగారు , నాన్నగారూ …… మాగురించి ఏమీ ఆలోచించకండి మంజరి – మిత్రులతో సంతోషంగా ఆడుకుంటాము అంటూ బుజ్జిసింహాలను ఎత్తుకుని సింహాలపైకి చేరారు . చెల్లెళ్ళు : లోపలికి వెళ్ళాక మీరుకూడా గుర్తుండరులే బుజ్జాయిలూ – ఎక్కడైనా వధువు పాలగ్లాసుతో శోభనం గదిలోకి వెళుతుంది మా అన్నయ్య మొండితనం వలన వరుడు పాలగ్లాసుతో వెళ్లాల్సి వస్తోంది , ఏదైనా అందమేలే అంటూ చేతిలో పాలగ్లాసు ఉంచి కష్టంగా బలవంతంగా లోపలికితోసి పూలతో అలంకరించిన ద్వారాన్ని మూసేసి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు , వదినమ్మా ….. మేము వెళుతున్నాము ఇక మీ ఇష్టం …….. పాలను రాతిపై ఉంచేసే చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ …… అంటూ తలుపును ఎంత తియ్యడానికి ప్రయత్నించినా వీలుపడలేదు . హ హ హ …… ఎంత ప్రయత్నించినా తలుపు తెరుచుకోదు మహారాజా కాదు కాదు నా ప్రియాతిప్రియమైన నాథా …… , సూర్యోదయం వరకూ తేరుచుకోనే తెరుచుకోదు . ఏమిటీ …… అంటూ పలుకులు వినిపించినవైపుకు తిరిగాను . ఎదురుగా శృంగారం ఉట్టిపడేలా పూలతో అలంకరించిన పూలపాన్పుపై సిగ్గుపడుతూ ముసుగులో కూర్చున్న మహారాణీని చూస్తుంటేనే పాదరసంలా కరిగిపోతున్నాను – నుదుటిపై చెమట బిందువులు కూడా …… , చుట్టూ పూలు – కొవ్వొత్తులతో శృంగారంగా అలంకరించిన శోభనపు గదిలో మనస్సు జివ్వుమనేలా నవ్వుతున్న మహారాణీ వయ్యారాన్ని చూస్తుంటేనే పెదాలు తడారిపోసాగాయి . మహారాణీ నవ్వులకు తేరుకుని పెదాలను తడుముకున్నాను . ఏమండీ అంటూ తియ్యని పిలుపు …… వద్దు వద్దు అలా పిలవద్దు , అలా పిలిచే అర్హత ఒక్కరికే సొంతం నా హృదయంలో నిండిపోయిన నా సౌందర్యారాశి దేవకన్యకే సొంతం ……. నా సౌందర్యం …… మీదేవకన్యకేమీ తీసిపోదులేండి అంటూ పాన్పు మీదనుండి కిందకుదిగి నిలబడింది . అక్కడే ఆగిపోండి మహారాణీ ….. , మన మధ్యన ఈమాత్రం దూరం ఉండాలి . దూరంగా ఉండటం కోసమా అమ్మవారి సమక్షంలో తాళికట్టి భార్యను చేసుకున్నది ……. అది బలవంతం చేసి …… మహారాణి : బలవంతం చేస్తే బయపడటానికి మీరేమైనా బుజ్జాయినా ? . అవును బుజ్జాయినే చేసి తాళికట్టించారు – ఇప్పుడుకూడా చేతులూ కాళ్ళూ కట్టేసి ఈ గదిలోకి తోసారు .

మహారాణి : హ హ హ …… , ఏ గదిలోకి నాథుడా ….. ? . అదే అదే శోభనం గదిలోకి ……. మహారాణి : అఅహ్హ్ మీ మాటలకే వొళ్ళంతా పులకరించిపోతోంది ఇక మీ కౌగిలిలో అంటూ ముందుకువచ్చింది . వద్దు వద్దు అక్కడే ఆగిపోండి , అర్థం చేసుకోండి ఈ మనసును ఎప్పుడో నా దేవకన్యకు అప్పజెప్పి నా హృదయమంతా తనతో నింపుకున్నాను , వేరొకరికి స్థానం లేదు . మహారాణి : ఎక్కడ ఉందో ఏమి చేస్తోందో …… ఎక్కడ ఉన్నా ఆ దుర్గమ్మ తల్లి రక్షణలో నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది – ఎప్పటికైనా ఒక్కటవుతాము . మహారాణి : తనను చేరుకునేలోపు మీ జీవితం అయిపోతుందేమో ……. సంతోషంగా ప్రాణాన్ని వధులుతాను – ఈ ప్రాణం ….. నాదేవకన్యకోసం అంటూ హృదయంపై చేతినివేసుకుని అనుభూతి పొందుతున్నాను , మరొకరిని ఊహించుకోలేను వేచిచూస్తాను ప్రపంచం మొత్తం అన్వేషిస్తాను , అందులో ఆనందం ఉంది – చూడలేకపోతున్నానన్న అంతులేని బాధకూడా ఉంది అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను . అమ్మా దుర్గమ్మా …… ఇక నాదేవుడిని బాధపెట్టడం ఇష్టంలేదు అంటూ మహి లా మాట్లాడింది , దేవుడా …… నన్ను మన్నించండి . ఆ మాటలకే కన్నీళ్లు కాస్త ఆనందబాస్పాలుగా మారిపోయాయి , నా మహి స్వరం – నా ప్రియమైన ప్రాణమైన ప్రాణం కంటే ఎక్కువైన నా దేవకన్య స్వరం ……. దేవుడా అంటూ ముసుగులోనే పరుగునవచ్చి నా గుండెలపైకి చేరి చుట్టేసింది . అఅహ్హ్ ….. హ్హ్ …. హ్హ్హ్….. హృదయవేగం – శ్వాస ….. అమాంతం పెరిగిపోసాగింది , ఆ క్షణం కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నాను , వొళ్ళంతా తియ్యదనంతో వణికిపోతున్నాను . ఆ చిరు కౌగిలింతకే బయట ఉరుములు మెరుపులతో వర్షం మొదలైనట్లు తుంపర మమ్మల్ని తాకుతోంది . దేవుడా దేవుడా నా ప్రియమైన ప్రాణమైన ప్రాణం కంటే ఎక్కువైన దేవుడా …… ఈక్షణం కోసం మీ ప్రియమైన కౌగిలిలో చేరడం కోసం ఎన్ని రోజులు యుగాలుగా గడిపానో ……. , మీ ముద్దుకోసం …… మహీ – నా దేవకన్యా – అతిలోకసుందరీ …… అంటూ ముఖంపై ముసుగును తీసేసి అహ్హ్హ్ ….. హ్హ్ …. హ్హ్ …… హృదయంలోనుండి సంతోషం కళ్ళల్లోనుండి బాస్పాలుగా …… మహి : నాదేవుడి కన్నీళ్లు భూదేవిని స్పృశించినా ప్రళయమే , ఆ తల్లికూడా తట్టుకోలేదు అంటూ నా కన్నీటి బిందులను పెదాలతో అందుకుని పాదాలను పైకెత్తి కళ్లపై ముద్దులుపెట్టింది . మహీ అంటూ ప్రేమతో కౌగిలించుకుని బుగ్గలను సున్నితంగా అందుకుని కళ్ళల్లోకే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తూ నుదుటిపై పెదాలను తాకించాను . నాకౌగిలిలో జలదరించిపోతోంది – ఈ ముద్దుకోసమే జీవిస్తున్నట్లు స్పర్శ ద్వారానే తెలియజేస్తోంది . నుదుటిపై పెదాలను తాకించి ఎంతసేపు ఉండిపోయామో ఒకరికౌగిలిలో మరొకరం ప్రపంచాన్నే మరిచిపోయాము . బయట వర్షం అంతకంతకూ పెరుగుతూనే ఉంది . Like 224 Dislike 28 131919 26 0 cookie-check జనం మెచ్చిన రాజు – Part 50 no

Categories Telugu
More stories See all