నా ప్రణయ ప్రయాణం – 16
మీరు నాకు అందిస్తున్న ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అందించిన ఉత్సహానికి నా ఊపు కలుపుతూ మరింతగా రెచ్చిపోతూ రాస్తున్నాను.. 16వ భాగంలోకి పరుగులు తీస్తున్నాను.. నా ప్రణయ ప్రయాణం – 15→ ఆరోజు నుంచి నాకూ సరోజకూ మూడు రాత్రులు జరిగిపోయాయి. సరోజ నాతో చనువుగా మువ్ అవ్వటం మా మాస్టారు గమనించారు. ‘‘ ఏంటి సంగతి.. మా చెల్లితో నువ్వు చాలా క్లోజ్ గా మువ్ అవుతున్నావ్ ’’ అని. ‘‘ అదేంలేదు. తనకి నేనంటే ఇష్టమట. నన్ను ప్రేమిస్తోంట. ప్రేమించమని వెంటపడుతోంది ’’ అన్నాను ఏమీ తెలియని అమాయకుడిలా.. ‘‘ అంతేనా..? నీకేంటి వికాస్.. నీకేం తక్కువ. బుద్ధిమంతుడివి. నా చెల్లి నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటుందికదా.. నా చెల్లి కూడా బాగనే వుంటుంది. చేసుకోవచ్చుగా..’’ అన్నాడు. ‘‘ అది కాదు. నేను మిమ్మల్ని అన్నయ్యా అని పిలుస్తున్నాను. తను నాకేమౌతుంది. ఆ విషయం నేను చెప్పినా తను వినటంలేదు. మీరే చెప్పండి.. నేను తనని ఎలా..? ’’ అన్నాను మరీ ఫీలవుతూ.. ‘‘ నిజమే నువ్వు చెప్పేది కూడా.. కానీ తను చాలా సెన్సిటివ్.. కాదంటే తను ఏమైనా చేసుకుంటుంది. ’’ అన్నాడు మాస్టారు. ‘‘ అలా అని పవిత్రమైన అన్నా-చెల్లెళ్ళ బంధాన్ని పెళ్ళితో ముడేయటం ఎంతవరకూ కరెక్ట్ అన్నయ్యా ’’ అన్నాను. ‘‘ చాలా చిక్కు వచ్చిపడిందే.. ఇప్పుడేం చెయ్యటం.’’ అంటూ మాస్టారు ఆలోచిస్తున్నాడు. ‘‘ అన్నయ్యా.. నాదో చిన్న సలహా.. మీరు ఊ అంటే నేను చెప్తాను. కానీ మీ సొంత విషయాల్లో తలదూరుస్తున్నాను అని మీరు అనుకోకూడదు.’’ అన్నాను. ‘‘ సరే.. చెప్పు.. సలహానేగా.. నచ్చితే చూద్దాం.. ’’ అన్నాడు మాస్టారు. ‘‘ నను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఎలాగూ దసరా సెలవలు వస్తున్నాయి. తనని మాచర్ల పంపండి. ఈలోగా తనకి మంచి సంబంధం చూసి వుంచండి. మాచర్లలో పెళ్ళి చూపులు ఏర్పాటు చెయ్యండి. సెలవలు అయిపోయేలోగా తనకి పెళ్ళి చేసెయ్యండి. ఒకసారి ఆడదానికి పెళ్ళయితే చచ్చినట్లు మొగుడితో కాపురం చెయ్యక తప్పదు. ఆలోచించండి ’’ అన్నాను.. ‘‘ నిజమే వికాస్.. నువ్వు చెప్పింది. కానీ ఒక్కసారి ఆలోచించు.. నువ్వే తన జీవితంలోకి ఎందుకు రాకూడదు. నన్ను నువ్వు అన్నయ్యా అని పిలవబట్టే కదా ఈ సమస్యంతా.. ఈరోజు నుంచి నన్ను బావా అని పిలువు.. సమస్య ఇక్కడే సాల్వ్ అవుతుంది. నా చెల్లెలు కోరుకున్న వాడు దొరికాడని సంతోషంగా కూడా వుంటుంది ’’ అన్నాడు మాస్టారు. ‘‘ అన్నయ్యని బావా అని పిలవాలంటే చాలా కష్టంగా వుంటుంది. మీరే ఆలోచించండి.. ఒక వేళ పిలిచినా తనని నేను భార్యగా కాదు.. నా సొంత చెల్లెలుగా చూస్తున్నాను. ఈ విషయం నేను తనకి చెప్తే తన సున్నితమైన మనసు ఎక్కడ హర్ట్ అవుతుందో అర్థంకాక తనతో నేను క్లోజ్ గా మువ్ అవుతున్నాను. నేనే ఈ విషయం మీతో మాట్లాడాలనుకున్నాను. మీరే నాతో మాట్లాడారు. మీరే నా పరిస్థితిలో వుంటే చెల్లిని పెళ్ళిచేసుకునేవారా..? ’’ అన్నాను. దీంతో మా మాస్టారి బుర్ర గిర్రని తిరిగింది. వెంటనే ‘‘ సరే.. నువ్వు చెప్పిన సలహాని అమలు చేస్తాను. ’’ అంటూ అక్కడి నుండి కదలబోయాడు. ‘‘ అన్నయ్యా.. ఈ విషయం తను మాచర్ల వెళ్ళిందాకా చెప్పకండి. పెళ్ళిచూపులు లేకుండా డైరెక్టు నిశ్చయ తాంబూలాలు ఏర్పాటు చెయ్యండి. తను మీకు నామీద ప్రేమ వున్న సంగతి చెబుతుంది. మీకు నేను నచ్చలేదని.. నాకు రకరకాల అమ్మాయిలతో సంబంధాలున్నాయని.. అందుకే మీరు ఒప్పుకోవట్లేదని చెప్పండి. నేను ఎన్ని నిందలైనా మోయటానికి సిద్ధంగా వున్నాను.. కేవలం చెల్లెలు సరోజ సంతోషం కోసం.. ’’ అన్నాను. మా మాస్టారు నన్ను తన గుండెలకి హత్తుకొని.. నా భుజం తట్టాడు. నీలాంటి గొప్ప మనసున్న వ్యక్తి నాకు పరిచయం కలగటం నా అదృష్టం. నాకు పుడితే నీలాంటి వాడే కొడుకుగా పుట్టాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను. అన్నాడు. నేను ‘‘ దానిదేముంది అన్నయ్యా.. మీ కోరిక బలంగా వుండాలే కానీ నా పోలికలతోనే, పాపో, బాబో పుడతారు. ’’ అన్నాను నవ్వుతూ.. మాస్టారు కూడా నవ్వుతూ.. మరో ఏడు నెలల్లో అదే జరుగుతుంది. అన్నాడు సిగ్గుపడుతూ.. అవునా.. అన్నయ్యా.. అన్నయ్యా.. నువ్వు సూపర్. కుమ్మేశావు పో.. మా మాధవికి నీలాంటి మంచి బిడ్డే పుట్టాలి.. అంటూ కితకితలు పెట్టాను. మాస్టారు పకపకా నవ్వేస్తున్నాడు. ఇంతలో సరోజ వచ్చింది.. ఏంటి అంత ఆనందంగా వున్నారు. నాక్కూడా చెబితే నేనూ నవ్వుతానుగా అన్నది. తనకి చెప్పలేదా అన్నాను మాస్టారితో.. చెప్పలేదు.. నువ్వే చెప్పు.. అంటూ మాస్టారు అక్కడి నుండి మాకు ప్రైవసీ ఇస్తున్నట్లు వెళ్ళిపోతూ నాకు ఏవో సైగలు చేసుకుంటూ మెట్లు దిగాడు. ‘‘ ఏమంటున్నాడు మా అన్నయ్య ’’ అంది మాధవి.. ‘‘ నీకు మేనత్తగా ప్రమోషన్ ఇచ్చాడట.. ’’ అన్నాను. ‘‘ అవునా.. మాధవి నాకు చెప్పలేదే.. ’’ అన్నది. ‘‘ మాధవి నీతో అన్నీ చెప్పుకునేంత చనువు నువ్వు ఎప్పుడిచ్చావ్. ఆడపడచు అర్థమొగుడు అన్నట్లు నీ మాటలతో తనని గాయపరుస్తునే వున్నావ్.. ఇప్పటికైనా ప్రేమగా వుండు ’’ అన్నాను కొంచెం సెంటిమెంట్ ప్లే చేస్తూ.. ‘‘ నేను తనని అపార్థం చేసుకున్నాను వికాస్.. ఇక నుండి నేను తనతో మనసు విప్పి మాట్లాడతాను. ’’ అన్నది. ఉరుములు, మెరుపులు ఆకాశంలో వస్తున్నాయి.. చిరుఝల్లు మొదలైంది. కిందనుంచి మాస్టారు సరోజని పిలిచాడు. వీడొకడు.. వెధవ కరెక్ట్ టైంకి పిలుస్తున్నాడు.. వెలుతున్నాను.. అన్నది. సరోజ నీకో విషయం చెప్పాలి. నేను ఎన్.సి.సి. ట్రైనింగ్ కి వెల్తున్నాను. రేపు ఉదయం నువ్వు లేచే టైంకి నేనుండను. మొబైల్ సిగ్నల్స్ కూడా అక్కడ పనిచెయ్యవు అన్నాను. నీతో మాట్లాడకుండా నేనెలా వుంటాను అనుకున్నావ్ వికాస్ అంది. ఎంత 15రోజులేగా.. ఇట్టే అయిపోతాయి.. వచ్చాక ప్రతిరోజూ పండగే మనకి.. అని పైకి అని (నాకు) అని నేను మనసులో అనుకున్నాను. మరి 15రోజులకూ గుర్తుండి పోయేలా నాకేదైనా ఇస్తావా అన్నది. ఇవ్వాలనే వుంది.. కానీ ఇప్పుడు కాదు.. కిందనుంచి మీ అన్నయ్య పిలుస్తున్నాడు.. వెళ్ళు.. అన్నాను. తను వెళ్ళిపోయింది. మరుసటిరోజు ఉదయం తను నిద్రలేచేసరికి నేను మాస్టారికి చెప్పి 15రోజులు దూరంగా వెల్తున్నానని చెప్పి.. ఈలోగా పని పూర్తిచెయ్యమని గోవా ట్రిప్ కి వెళ్ళాను. మాస్టారు‘‘ నువ్వు చేస్తున్న సాయానికి చాలా థ్యాంక్స్..’’ అన్నాడు. మరుసటి రోజు సరోజ మాచర్ల వెళ్ళింది. తను వెళ్ళగానే తనకి నిశ్చయ తాంబూలాలు ఏర్పాటు చేశారు. తను నాకు ఫోన్ చేసింది. కానీ దాని కాల్ కలవలేదు. ఒకేరోజు దాదాపు 120 ఫోన్లు తన నుంచి. నేను రాత్రికి చూసుకుంటున్నాను.. గోవాలో పాపలతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. సరోజ మా మాస్టారితోనూ, వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనూ నా గురించి చెప్పింది. ఎవ్వరూ వినలేదు. మా మాస్టారైతే నేనిచ్చిన స్క్రిప్ట్ పక్కాగా అమలు చేస్తున్నాడు. తప్పని పరిస్థితుల్లో సరోజ తెచ్చిన వాడితో తాళి కట్టించుకుంది. ఇదంతా కేవలం వారం వ్యవధిలోనే అయిపోయింది. సరోజ నాకు కాల్స్ మీద కాల్స్ చేస్తోంది. నేను ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు అవన్నీ చూస్తున్నాను. పదో రోజు సరోజ తన భర్తతో యూ.ఎస్.వెళ్ళిపోయింది. నాకు సందీప ద్వారా ప్రతి విషయం తెలుస్తోంది. నేను మార్చిన నా మొబైల్ నెంబరు సందీపకి సీక్రెట్ గా ఇచ్చాను. సందీపకీ, మాధవికీ అది చేసిన అన్యాయానికి నేను దాని రూట్ లోనే వెళ్ళి తగిన రివేంజ్ తీర్చుకున్నాను అనుకున్నాను. మాధవి, సందీప ఇద్దరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పైకి మాత్రం వారిద్దరూ సరోజకి సింపతీ చూపించారు. సరోజ ఏడుస్తూ… ‘‘ నా జీవితం 15 రోజుల్లో ఇలా అయిపోతుందని అస్సలు ఊహించలేదబ్బా.. నేను మీకు చేసిన అన్యాయానికి ఆ దేవుడు నాకు సరైన శిక్షవేశాడు.