ప్రియ Part 11
గాల్లోకి ఎగిరి గుడికి వెళ్లాను కానీ ఎవ్వరు కనిపించలేదు, మహర్షి ధ్యానం చేసుకునే చోట కూడా ఆయన కనిపించలేదు నాకేం చెయ్యాలో తోచలేదు. గాల్లోకి చూసాను మహర్షి గాల్లో పైకి నడుస్తుండడం చూసి ఎగిరి ఆయనకి ఎదురుగా నిలుచున్నాను. రుద్ర : మహర్షి ఏంటిది.. నాకు అవసరమైనప్పుడు నన్ను వదిలి వెళ్లిపోతున్నారు. మహర్షి : నీకింకా అర్ధం కాలేదా రుద్రా ఆ దేవుళ్ళు ఆడే నాటకం ఇది. ఇక ఇక్కడ నేను ఉండలేను.. నేను చెయ్యవలసిన సహాయం నీకు నీ శక్తులను గుర్తు చెయ్యడం.. చేసాను, ఇక వెళ్తున్నాను. రుద్ర : ఆగండి నాకు కొన్ని సమాధానాలు కావాలి. మహర్షి : కంధర గురించేగా.. రుద్ర : అవును.. మహర్షి : నీవు దేవుడుగా ఉన్నప్పుడు.. నువ్వు మనసారా ప్రేమించిన అమాయక సుందరాంగియే ఈ కంధర.. నీ ప్రేయసి.. నీవు ఆఖరి సారి యుద్దానికి వెళ్లే ముందు తనని పెళ్లి చేసుకుంటానని ఇక యుద్దానికి పొనని ఇక తనని వీడనని.. జీవితాంతం తనతోనే గడుపుతానని ప్రమాణం చేసావు.. కానీ ఇప్పుడున్న నీ భార్య లిఖిత నిన్ను ఆ జన్మలో కోరుకోవడం.. నీకు అది తెలిసి లిఖితతో భీకరమైన యుద్ధం జరగడం.. అదీ కాకా నీకు శాపాలు ఉండటంతో నిన్ను భూమ్మీదకి విసిరారు. రుద్ర : కంధర నా ప్రేయసియే అయ్యుండొచ్చు కానీ.. మహర్షి : పూర్తిగా విను.. నీవు యుద్దానికి బైలుదేరె ముందు కందరతో రమించావు.. దాని వల్ల కంధర గర్భవతి అయ్యింది.. నీ గురించి విన్న తరువాత చాలా సంవత్సరాలు నీ కోసం ఎంతో వేదనతో ఆశతొ ఎదురు చూసింది.. తనకి ఇష్టం వచ్చినప్పుడు పిల్లలని ప్రసవించగల వరం ఉండటచే అప్పుడు ఆపుకుంది.. ఇన్ని సంవత్సరాలు నీ కోసం వేరే వ్యాపకం పెట్టుకోకుండా అనుక్షణం నిన్ను తలుచుకుంటూ చీకటిలో బతికింది. కానీ నాలుగు మాసాలా ముందు మీ నాన్న గారు కంధరతో నీ ఆగమనం గురించి వివరించగా.. నువ్వు వచ్చేలోగా నీకు మీ బిడ్డని చూపించాలని తనకి ఉన్న వరం ఉపయోగించి గర్భవతి అయ్యింది. కానీ ఎక్కడ నుండి ఊడి పడ్డాడో ఈ నారదుడు.. కంధరకి… నీవు నీ ఇరువురు భార్యలతో రమిస్తుండగా.. ఖందరికి చూపించి.. నీవు రాక్షసితో రమిస్తున్నావని.. నీ గుట్టు రట్టు చేసాడు.. దానితో ఏ రాక్షసి వల్ల నువ్వు తనకి దూరం అయ్యావో తనతోనే రమిస్తుండడం చూసి కంధరకి నీ మీద అసహ్యం వేసింది.. తన చేత్తో తనే తన గర్భాన్ని పగలకొట్టి చీల్చుకుని.. ఏడుస్తూ రక్తపు మడుగులతో తన అక్క అయిన రాక్షస కంధర ముందు కుప్ప కూలిపోయింది. దేవుళ్లంతా కలిసి తమ అక్కా చెల్లెళ్ళను వేరు చేశారని నమ్మే ఆ రాక్షస కంధర.. హృదయ వికారకంగా ఏడుస్తున్న చెల్లిని.. విచ్చిన్నమైన తన గర్భం నుండి కారే రక్తాన్ని చూసి జరిగినది తెలుసుకుంది.. తన చెల్లికి జరిగిన అన్యాయానికి తాను పగ తీర్చుకుంటానని మాటిచ్చింది.. ఇక తన చెల్లెలి సమ్మతితో.. దేవత అయిన కంధరను తనలో కలిపేసుకుని..