ప్రేమ పక్షులు మొదటి భాగం
గిత్తంటే గిత్త కాదురా…. దీని తస్సాదియ్యా…. సై అంటే కై మనే పొగరుమోతు గిత్తరా…. తోలు కర్రతో దరువు వేస్తూ హుషారుగా పాడుతున్నాడు రమణయ్య. రెండెండ్ల బండి పంట కాల్వ గట్టు మీద హుషారుగా పోతోంది. పైరు గాలికి చెదురుతున్న ముంగురులను సవరించుకుంటూ బంది ముందు ఒలకబోస్తూ తట్ట చంకనెత్తుకొని నడిచిపోతోంది వజ్రాలు. మట్టి రోడ్ మీద హుషారు గా నడుస్తున్న ఎద్దులనీ, వజ్రాలు నడుం ఒంపుల్నీ చూస్తూ పాడేస్తున్నాడు ర మణయ్య. తను పలకరిస్తేగాని రమణయ్య పాట మానడని వజ్రాలుకు తెలుసు. నడకమాని బండికెదురుగా నిల్చుంది. అది చూసిన రమణయ్య ఎడ్ల పగ్గాలు లాగుతూ “ఎహెయ్ ఆగండవే ఎదురు పడుచు పిల్ల నిలంటే ఒళ్ళు తెలీకుండా పోతారే మిటి? ఆగండి అంటూ వజ్రాలుకు దగ్గరగా బండి ఆపు చేసాడు. “ఏం మావో నీ బండి మా జోరుగా ఉందే? అంది ఎగతాళి గా వజ్రాలు. ఆ మరి… నా గిత్తలంటే ఏమనుకున్నావ్? కాసేపు నీవు తప్పుకోకపోతే నీ మీద నుంచే వెళ్ళిపోతాయ్ అన్నాడు నవ్వుతూ. వజ్రాలు కళ్ళు టప టప లాడిస్తూ రమణయ్యని చూసింది. ఆ నన్ను దాటే సత్తా నీ ఎడ్లకెక్కడుంది మావా, నీకు మల్లేనే ఆటికీ రూపు డాబు ” అంది తోసి పారేసినట్లు. నువ్వు మా రూపుగా ఉన్నావులే గాని, వచ్చి బండెక్కు కలిసి పోదాం ” ఉహు, నేను రాను బాబు. నీవసలే కొత్త గిత్తలు. ఏ గతిలోనో పడేస్తే నా గతేం కాను?” ” మనిద్దరి సంబ ర పడుతున్నాది ‘ గతి ఒక్కటే గాని, ఎక్కెహె వజ్రాలు బండి వెనకాల కొచ్చింది. రమణయ్య చేతి వూతం గా బండి ఎక్కింది. తట్ట ఒక పక్కగా పెట్టి గడ్డిలో కూర్చుంది. తిరిగి ఎద్దులు నడక ప్రారంభించాయి. రమణయ్య, వజ్రాలు ఒకే గ్రామం లో వాళ్లు. ఇద్దరి యిళ్ళ మధ్య రెండిల్లడ్డు. చిన్నప్పటి నుంచీ ఒకరికొకరు బాగా తెలుసు. వయసు వచ్చే కొలదీ యవ్వన కోరికలు ఒకరి మీద ఒకరికి పోయేవి. ఇద్దరూ ఈడూ జోడూ అయిన వాళ్లు. అంత లావు సన్నం కాని శరీరం వజ్రాలుది. కష్టపడే కుటుంబ మయినా ఒక్కత్తే కూతురు కాబట్టి గారాబంగా పెంచారు. ఇంతో అంతో కాస్త వెనుక ఉన్న కుటుంబం వజ్రాలు ది. —- అంద మయిన ఆ కళ్లు, కోటేరు వంటి ఆ ముక్కు, గులాబీ చెక్కిళ్ళు అన్నిటికన్నా ముందుకు పొడుచుకు వచ్చే ఆ యవ్వన సంపద ఆ వూర్లో కుర్రకారుకు పరిచయమే. రమణయ్య తప్ప ఆ వూర్లో ఆమెతో సరసాలాడి పరాభవం తిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఆమె ఎదుట నోరు తెరవడానికి భయ పడతారంతా. బ్రా లేని రవిక ముడిలో ఇమడక, నడుస్తుంటే పోటీ పడి విలాసంగా కదులాడే ఆమె ఎత్తయిన స్థన ద్వయాలు రమణయ్యను గిలిగింతలు పెడుతున్నాయి. అలాగే మెలి తిరిగిన కండలు, విశాలమైన ఛాతీ, కళకళలాడే ఆ మొఖం చూడగానే వజ్రాలుకు ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. మనసు మనసుల్లోనే తప్ప మాటల్లోకి మారని వారిద్దరూ ప్రయాణం చేస్తున్నారు. మామిడి చెట్ల క్రిందుగా బండి హుషారుగా పోతోంది.