బస్ లో అనుకోని అదృష్టం (Part 1)
సునీల్ పరిగెత్తుకుని ఆ బస్ ఎక్కక పోతే ఈ కధ ఉండేదే కాదు… లేట్ అయి పోయిన వెంటనే పరుగు పరుగున బస్ స్టాండ్ కి వచ్చి తన వూరు వెళ్ళే బస్ ని రన్నింగ్ లో కాచ్ చేసాడు సునీల్. అసలు అతనికి లేట్ అయ్యేది కాదు… అర్ధ రాత్రి పన్నెండు గంటలకి తన రూం నుండి బస్ స్టాండ్ కి వచ్చే బస్సు లు లేక తప్పని సరిగా పక్క రోజు పండగకి తన వూరు వెళ్ళాల్సిందే అని నడుచు కుంటూ వచ్చి లేట్ అయ్యింది. ఎలా అయితే ఏమి లేట్ గా అయినా తన ఊరి బస్ ఎక్కాడు. తీరా ఎక్కి చూసే సరికి బస్ లో అన్నీ సీట్లు ఫిల్ అయి పొయ్యాయి. ఒక్క సీట్ మాత్రం ఖాళీగా ఉంది. కాని ఆ సీట్ పక్క సీట్ లో ఆల్రెడీ ఒక అందమయిన అమ్మాయి కూచుని ఉంది. ఆమె అందం అంతా ఆమె కోల ముఖం లోనే ఉంది. అంత తెలుపు కాదు నలుపూ కాదు గాని కొట్టోచ్చి నట్టు కనిపించే ఆమె మీనాల కళ్ళు వాటి మధ్యలో కూసుగా పొడవుగా ఉన్న ముక్కు, దాని కింద జ్యూసీ పెదవులూ బూరేల్లగా ఉన్న నున్నని బుగ్గలూ ఆమెని చాలా అందం గా చేస్తున్నాయి. పింక్ కలర్ పవిటా పావడాలో పక్కా పల్లెటూరి అమ్మాయి లాగ ఉంది. బస్ లోకి ఎక్కి చుట్టూరా కలియ చూసి ఇప్పుడేమి చేసేదిరా భగవంతుడా అనుకుంటూ ఏదయితే అడయింది లెమ్మనుకుని నేరుగా వెళ్లి ఆమె పక్కన కూచున్నాడు సునీల్. అంతవరకూ అతన్నే గమనిస్తూ ఉన్న ఆమె అతను వచ్చి పక్కన కూచున్న వెంటనే కొంచెం ఇబ్బందిగా కదిలింది సీట్ లో. అతనికి దూరం గా జరిగి సీట్ కి అవతలి వయిపు జరిగి కూచునింది. ఆమె ఏమయినా అంటుందేమో అనుకుంటూ ఉన్న సునీల్ ఆమె ఏమీ అనక పొయ్యే సరికి ఊపిరి పీల్చుకుని తను కూడా ఆమెకి దూరం గా జరిగి అవతలి వయిపుకు సర్దుకుని కూచున్నాడు. అప్పటికే బస్ బయలు దేరి నగర వీధుల్లో పయనించ సాగింది. చల్లని గాలి శరీరానికి హాయిగా తగులుతుండడం తో మనసులో ఏ ఆలోచనా లేని సునీల్ తలని సీట్ కి ఆనించి అలా నిద్ర లోకి జారుకున్నాడు సునీల్. ఆమె ఏమనుకుందో గానీ కొంచెం సేపు మేలుకునే ఉండి తరువాత తనూ కళ్ళు మూసుకుని నిద్ర పోవడానికి ఉపక్రమించింది. బస్ కుదుపులకి ఆ బస్ లోని వారందరూ అలా నిద్రలోకి జారుకున్నారు అప్పటికే రాత్రి ఒంటి గంట కావస్తుండడంతో… అలా నిద్ర లోకి జారుకున్న సునీల్ కి ఒక గంట తరువాత ఎందుకో మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచేప్పటికి పక్కన కూచున్న అమ్మాయి తల తన భుజం మీద ఉండి. షాంపూ చేసుకుని ఉన్న ఆమె కురులు తన ముఖం మీద జీరాడుతూ ఏదో సువాసనని వెద జల్లుతున్నాయి. సునీల్ ఇరవయి రెండు సంవత్సరాల యువకుడు. అప్పుడే నవ యవ్వనం లోకి అడిగిడుతూ కోడె తాచు లాగ ఉన్న కుర్రోడు. అలాంటిది అంత చీకటి రాత్రి ఆ బస్ లో ఒక అందమయిన అమ్మాయి పక్కన కూచోవడమే గాక ఆమె తల తన భుజం మీద పడుతూ రెచ్చ కొడుతుంటే ఒక్క క్షణం వెర్రెత్తి పోయింది.