మంత్రాలు – చింతకాయలు
ఈ కథ కేవలం ఊహ జనితమైనది.ఇంతకు ముందు వాటిల్లా ఇతరుల అనుభవాలను కథగా వ్రాయట్లేదు.ఐతే ఇన్స్పిరేషను మాత్రం నేడు సొసైటీలో జరుగుతున్న మోసాలు,అలాగే రసిక ప్రియులకు వినోదం అందించడమే. గోపీనాథ్ పిచ్చిపట్టినట్లుగా ఊరంతా తెగి తిరిగి ఉన్న డబ్బంతా ఖాళీ చేసుకొని సాయంత్రానికి కాళ్ళీడ్చుకొంటూ ఇంటికొచ్చాడు.ఇంటికి వచ్చీ రాంగానే వాకిట్లోనే కాచుకు కూర్చొన్న వాళ్ళ నాన్న భీమసేన్ రావు ఒసేవ్ నీ సుపుత్రుడొచ్చాడు గాని స్నానానికి వేన్నీళ్ళు ఎట్టి వేడి వేడిగా అన్నం వడ్డించు తిని విశ్రాంతి తీసుకొంటాడు అన్నాడు వెటకారంగా లోపలనుండి వచ్చిన శారద వచ్చావా నాయనా ..ప్రొద్దుననగా కొట్టుకెళ్ళి సరుకులు పట్టుకొస్తానని డబ్బు తీసుకెళ్ళిన వాడివి ఇప్పుడా వచ్చేదీ ..ఇంతకూ సరుకులేవీ ? ఇంకా ఎక్కడి సరుకులే వెర్రి మొహమా ఊరంతా బలాదూర్ తిరగడానికి ఉన్న డబ్బంతా ఖర్చు చేసుంటాడు.. ఏరా అంది శారద కక్కలేక మింగాలేక మిడిగుడ్లేసుకొని చూస్తుండిపోయాడు గోపీనాథ్. ఛీ ఛీ వెధవ బ్రతుకు ఎందుకురా మమ్మల్ని ఇలా వేదించుకు తింటావు.ఏదైనా పని చేసుకొని నాలుగు రాళ్ళు సంపాదించడం మాని మా మీద పడి బ్రతకడానికి నీకు సిగ్గులేదూ వయసుకొచ్చావు ఒక్కగానొక్కకొడుకువి అని ముద్దు చేస్తే ఇలా ఇంటి దొంగగా తయారయ్యావు… అంటూ శారద తిట్టిపోస్తుంటే పట్టించుకోకుండా లోపలకెళ్ళబోయాడు. భీంసేన్ రావు ఆగ్రహం పట్టలేక లేచి గోపీని లాగి బయటే నిలబెట్టేసాడు. దరిద్రుడా ఇంట చెడబుట్టావు.ముగ్గురాడపిల్లల తరువాత పుట్టినోడివడివి మాకు ఆధారంగా ఉంటావనుకొంటే మమ్మల్ని దోచుకొని బ్రతుకు తున్నావు. కాస్తైనా భాద్యత లేదట్రా పశువా .ఉదయానే మీ అమ్మిచ్చిన డబ్బు తీసుకొని వస్తేనే నీకు ఈరోజు ఇంట్లోనికి రానిచ్చేది.ఫో వెధవా అంటూ తరిమాడు. ఇంటి లోపలనుండి ఈ గొడవంతా చూస్తున్న ఆఖరమ్మాయి ఖనిజ పరిగెత్తుకొచ్చి వెళ్ళిపోబోతున్న గోపీ ని ఆపి ఈసారికి వదిలేద్దురు నాన్నారూ వాడిని నేను మారుస్తా అంటూ అభ్యర్తించింది. ఒసేవ్ అడ్డగాడిదా…. వాడు చెడిపోవటానికి నీవుకూడా కారణమేనే అంటూ కయ్యిమన్నాడు భీంసేన్ అమ్మా నీవైనా చెప్పవే ….. ఇక ముందు ఇలా జరగకుండా నేను చూసుకొంటా అంటూ తమ్ముణ్ణి చేయిపట్టి వెనక్కి తీసుకొంది ఖనిజ ఖనిజకు తమ్ముడిపై ఉన్న ప్రేమాభిమానాలు తెలుసు .. అందుకే శారద దీనంగా భర్త వంక చూసింది. ఛీ … ఛీ వెదవ బ్రతుకు ఏమైనా చేసుకోండి ఇదే చివరి సారి ఇంకో సారి ఇలా జరిగిందో ఇంట్లో మీరుంటారు నేనుండను అంటూ ధుమధుమలాడుతూ లేచి లోపలకెళ్ళిపోయడు భీంసేన్ రావు. తేలుకుట్టిన దొంగలా తనవెనకున్న గోపీని లోపలకు తీసుకెళ్ళి తన గదిలో కూచొబెట్టి ఏరా తమ్ముడూ అమ్మా నాన్నలతో ఇలా ఎంతకాలమని తిట్లు తింటావు.