All content free · updated every 5 minutes

మధనుడి శృంగార ప్రయాణం 53 భాగము

Story Telugu 4 pages 4 years ago

మధనుడి శృంగార ప్రయాణం 53 భాగము
నేను హఠాత్తుగా వాడి పైకి ఉరికేసరికి,కాస్తా కంగారు పడి రెప్పపాటులో తేరుకొని వెనుతిరిగి మళ్లీ సివంగి పైకి వాడి ఖడ్గాన్ని విసిరాడు.. అది గమనించిన నేను క్షణ కాలంలో సివంగి ని కిందకి తోసేసి ఈసారి ముఖాముఖీ గా తలపడ్డాను వాడి పైకి ఖడ్గాన్ని దూసి.. ఆ గుర్రం పైన నా దెబ్బకి తప్పించుకొని,సరాసరి గాల్లో కి ఎగిరి నా పైన పడ్డాడు వాడు… వాడు బలంగా పడేసరికి దూరంగా పడిపోయాను..నాలో ఆవేశం అధికమై మళ్లీ వాడి పైకి ఉరికాను.. నేను వాడిని చేరుకునే లోపే వాడి వెనకాల నుండి సివంగి ని బలంగా ఒక్క తన్ను తన్నాడు,దెబ్బకి సివంగి అల్లంత దూరంలో పడిపోయింది వాడి బలమైన దెబ్బకి స్పృహ కోల్పోయి… అది చూసిన నేను బెబ్బులిలా గర్జించి గాల్లోనే ఎగిరి వాడిని బలంగా ఒక్క తన్ను తన్నాను.. వాడికి ఆవేశం ఎక్కువై తేరుకొని నా పైకి దుంకి నాతో మల్ల యుద్దానికి దిగాడు… అసలే సివంగి కి దెబ్బ తగిలింది అన్న కోపంలో ఉన్న నేను,ఉరుము లా ఉరిమి వాడి రెండు చేతులు పట్టేసి దొక్కలో ఒక్క తన్ను తన్నాను.. దెబ్బకి వాడికి నొప్పి ఏంటో తెలిసింది …అదే కోపంలో ఇంకోసారి తన్నగా కాస్తా వంగిపోయాడు వాడి బలాన్ని కోల్పోయి.. ఆలస్యం చేయకుండా నా చేతులతో వాడి మెడ ని పట్టేసి గట్టిగా తిప్పేసా వాడి మెడపంపులు విరిగిపోయేలా.. బాధతో విలవిలలాడిపోయాడు…ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న ఖడ్గాన్ని తీసుకొని వాడి తల ని వేరు చేసా . . అప్పటికి రాజన్న అందరినీ మట్టుబెట్టాడు..నేను చేసిన పనికి నాకు కళ్ళతోనే ధన్యవాదాలు తెలిపి సివంగి ని ఎత్తుకొని వాళ్ళ గూడెం వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు.. అంతా టెన్షన్ గా ఉంది సివంగి కి ఏమయిందో అని.. కాసేపటికి ఆ వైద్యుడు,ఇబ్బంది ఏమీ లేదు అంతా సవ్యంగా ఉంది ,మెలకువ లోకి వచ్చింది రాజన్నా వెళ్లి చూడండి అని చెప్పేసరికి లోపలికి వెళ్ళాము.. నన్ను చూసిన సివంగి ఆనందంతో,మహారాజా మీకేమీ కాలేదు చాలా సంతోషం అంది. వెంటనే రాజన్న, మహారాజు ని ఎదిరించే మగాడు లేడు సివంగి,అయినా అప్రమత్తంగా ఉండేది మరిచావా??మహారాజు లేకుంటే నీ పని అయిపోయేది ,వాటంగా వాడిని మట్టుబెట్టాడు.. ధన్యవాదాలు మహారాజా అంటూ దండం పెట్టింది సివంగి. చాల్లే సివంగి ఈ మాత్రానికేనా,నన్ను కంటి రెప్పలా కాపాడి పూజ కి వెళ్లేలా చేసావు అని అనేసరికి మాకు ఒక పెద్ద శబ్దం వినిపించింది.. ఏంటా శబ్దం రాజన్నా?? మీ పూజ కి ముహూర్తం మొదలయ్యింది మహారాజా..మనము వేగిరపడాలి.. సివంగి ఉత్సాహంగా లేచి,పదండి మహారాజా అంటూ నన్ను వాళ్ళ నివాసానికి తీసుకెళ్లి నాకు మంగళ స్నానం చేయించి సిద్ధం చేసింది.. ఈసారి రాజన్న వీరతిలకం దిద్ది నన్ను ప్రయాణాన్ని కొనసాగించమని చెప్పాడు..

వెళ్తున్న నాకు,మహారాజా ఈ పూజ ఎలాంటి పరిస్థితుల్లో అయినా పూర్తి చేసుకు రండి అని చెప్పగా అలాగే రాజన్నా అని బయలుదేరాను.. కాసేపటి ప్రయాణం తర్వాత ఆ స్వస్తిక్ గుర్తు ద్వారం కనిపించేసరికి దాని తెరచి లోపలికి వెళ్ళాను.. లోపల వాతావరణం అంతా కోలాహలంగా ఉంది,ఆడ బ్రాహ్మణులు వేదోచ్చారణ చేస్తుండగా హోమం జరుగుతోంది.. అలా లోపలికి వెళ్లిన నాకు సువర్ణా వాళ్ళ అమ్మ సుస్వాగతం పలికింది చిరునవ్వు తో.. కుశల ప్రశ్నలు అయ్యాక,మధనా స్నానానికి సిద్ధం అవ్వాలి.మీరు సిద్ధమేనా?? సిద్ధం అండి.. అలాగే అని ఏర్పాట్లు కోసం తను లోపలికి వెళ్ళిపోయింది.. నా చూపులు మాత్రం సువర్ణా కోసం తెగ వెతుకుతున్నాయి.. ఈసారీ ఆమె వచ్చి,పద అని నన్ను కొలను లోకి తీసుకెళ్లింది.. నా చూపుల అంతరార్థం తెలుసుకున్న ఆమె,ఏమిటీ మధనుడి కి ఎవరినో చూడాలన్న ఆత్రం ఎక్కువ ఉన్నట్లుంది అంది. మీకు తెలియనిది కాదు గా అండి. తెలుసు మధనా, ముందు ముందు మీకే కనిపిస్తారు విచారం వలదు.. అలాగైతే సంతోషం.. స్నానం పూర్తి చేసి,ఆ వంశ దేవత దగ్గర రతి ని పూర్తి చేయించింది నాతో.. ఈసారి ఆ వంశ దేవత,స్పష్టంగా మనిషిలాగే నాతో మాట్లాడటం గమనించాను.. రతి అయ్యాక మళ్లీ స్నానం చేయించి,ఒక రెండు గంటల పూజ ని చేయించింది నాతో.. నాకు మాత్రం సువర్ణా ని,ఇంద్రాణీ ని చూడాలన్న ఆత్రం ఎక్కువై వేచి చూస్తున్నా.. ఆమె నా దగ్గరకు వచ్చి,మధనా ఇక అంతా సిద్ధం,ముందున్న కార్యాన్ని విజయవంతంగా ముగించండి..విధివిధానాలు అన్నీ మీకు తెలుసు. అలాగే అండి,ఒక సందేహం అన్నా.. సెలవివ్వండి మధనా.. ఆ మీ వంశ దేవత ఈసారి మాట్లాడటం ఆశ్చర్యం గా ఉంది అన్నా.. అదా మధనా,అందులో ఆశ్చర్యమేమీ లేదు,మీ అసమాన కృషికి మా వంశ దేవత కి తిరిగి ప్రాణం వస్తోంది.అది ఒక శుభ సూచకం మాకు.. అలాగైతే చాలా సంతోషం అండి.. మాకూ సంతోషమే మధనా,ఇక మీరు వెళ్లొచ్చు… వెళ్లే ముందు ఒక చిన్నమాట వినండి..ఎంతటి కష్టం వచ్చిననూ ఈ కార్యం ఆపడానికి వీలు లేదు..మీరు ఈ రాజప్రాసాదం లో ఏమి జరిగినా పట్టించుకోకుండా మీ పనిని ముగించండి తర్వాత అన్నీ సర్దుకుంటాయి అని చెప్పింది.. నాలో చిన్న అనుమానం మొదలైంది ఆమె మాటలకి.. అవునండి,ఇక మనకు ఎటువంటి సమస్యా లేదు గా..ఎందుకు మీరు అలా అంటున్నారు?? ఇవి అమావాస్య కి అనుకూలమైన రోజులు,అందులోనూ శత్రువులు కి బాగా కలిసొచ్చే రోజులు..అందుకే ఏ క్షణం లో అయినా మనకు శత్రువులు నుండి ప్రమాదం రావొచ్చు..మీరు మాత్రం పూజ ని పూర్తి చేస్తే అదే పెద్ద విజయం మాకు.. అలాగే అండి,ఒకవేళ శత్రువులు దాడి చేస్తే సువర్ణా, ఇంద్రాణీ ల పైనే చేస్తారు గా అన్నా. అవును నిస్సందేహంగా.. అలాంటప్పుడు నాతో పాటూ సువర్ణా ని కూడా నా గది లో ఉంచడం ఉత్తమం కదా అన్నా.. మంచి ఆలోచనే ,అలాగే చేయాలని ముందే అనుకున్నాను..అందుకే ఇంద్రాణీ తో పాటే తానూ ఉంది..

ఆమె మాటకి సంతోషం ఎక్కువై,ఇక సెలవివ్వండి అన్నా.. విజయోస్తు అని సాగనంపింది.. కాసేపటి నడక తర్వాత వాళ్ళున్న గది ని సమీపించాను.. నాలో గుండె దడ ఎక్కువ అవ్వసాగింది దగ్గరకు వెళ్ళేకొద్దీ.. ఎట్టకేలకు వాళ్ళున్న గది ని చేరుకున్నా.. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసేసరికి,ఆనందం అవధులు దాటింది నాకు. ఎదురుగా ఇద్దరు అతిలోక సుందరిలు, రాజసం ఉట్టిపడేలా కూర్చొని ఉన్నారు.. సువర్ణా కి ముసుగు లేదు,కానీ ఇంద్రాణీ మాత్రం ముసుగులో ఉంది ఆమె అందమైన చేతులని మోకాళ్ళ పైన వేసి కూర్చొని. . నన్ను చూసిన సువర్ణా కి సంతోషం అలివిగాకుండా అయిపోయింది,రెప్పపాటులో నన్ను సమీపించి నన్ను లత లాగా అల్లుకుపోయింది ఆనందాభాష్పాలని నిరంతరం గా విడుస్తూ.. ఆమె ప్రేమమయ కౌగిళ్ళలో సంతోషాన్ని పొందుతూ,ఆమె చెంపలని నా చేతుల్లో తీసుకొని నుదుట ముద్దు పెట్టి,ఎలా ఉన్నావు సువర్ణా అన్నా. తను ఆనందాభాష్పాలని మాత్రం కురిపిస్తూనే,చూసావుగా మధనా నా మోము ని,మరి మీరే చెప్పండి ఎలా ఉన్నానో అని కళ్ళెగరేసింది.. ఆమె ఆనంద,తమకపు చూపులలో ఉక్కిరిబిక్కిరి అయిన నేను తమకంగా ఆమె చెంపలని ముద్దాడి,మీ సంతోషమే నా బలం సువర్ణా అని అన్నా.. ఆమె నుండి మాటలే లేవు,తన ఆనందాన్ని తన కౌగిలి రూపంలో చూపిస్తూ నా మొహం అంతా ముద్దులతో ముంచెత్తింది.. సువర్ణా అభిమానం ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.. తమకంగా కౌగిళ్ళలో ఉన్న సువర్ణా ని అదిలిస్తూ,ఇదిగో ఇలాగే ఉన్నావంటే నీతో నే పూజ అన్నా నవ్వుతూ.. నా మాట కి తన బుగ్గల్లో నవ్వుల సౌరభం విరజిల్లింది, అలాగే అందంగా నవ్వుతూ నాతో పూజ కి ఏముంది మీకు అడ్డు,ముందు ఇంద్రాణీ కి జరగాలి పూజ అంది.. మ్మ్మ్ మీకు మాత్రం పూజ చేయనా సువర్ణా!ముందు అక్కడ తర్వాత ఇక్కడ అని తన బుగ్గ పైన వేలితో రాసి ఇంద్రాణీ వైపు నడిచాను. సువర్ణా కొంచెం సలహాలు చెప్పి నన్ను ఇంకాస్తా అదిలించింది తను లోపల గది కి వెళ్లిపోతూ.. తల వంచుకొని, మొహానికి ముసుగుతో అచ్చు శృంగార దేవతలా ఉంది.. నేను వెళ్లి పక్కన కూర్చునేసరికి యధావిధిగా మూడు ప్రశ్నలు అడిగింది.. అన్నింటికీ సమాధానం చెప్పిన తర్వాత, తన ముసుగు ని తీసేసింది… ఆమె మోము ని చూసిన నాకు ఏదో తెలియని ఆవాహన నన్ను చుట్టుకున్నట్లు అనిపించి ఆమె ని అలాగే చూస్తూ ఉండిపోయాను.. ఆమె మాత్రం నేను ఎవరో తెలియనట్లు అమాయకంగా చూస్తోంది నా వైపు,నిజమే తను అన్నీ మరిచిపోయింది.. ఎవరినైతే ప్రేమగా నాలో కలుపుకోవాలి అనుకున్నానో,ఆ అందమే నా ముందు ముగ్దమనోహర రూపంలో అమాయకంగా కనిపించేసరికి అంతులేని ఆనందం కమ్ముకుంది నాకు.. మా మధ్య నిశ్శబ్దం ని చీల్చుతూ, మీ పేరేంటి మధనా??(అందంగా తన పాల పెదాలు కదుపుతూ).. ఆమె మాటకి ఆశ్చర్యం కలిగినా,”సంజయ్” అని చెప్పి మీ పేరేంటి అన్నా.. “ఇంద్రాణీ”ఎంతో రాజసంగా..

ఈ పేరు మాత్రం మరిచిపోలేదు ఈమె అనుకుంటూ మెల్లగా నా చేయిని ఆమె చెయ్యి పైన వేసాను మెల్లగా పాముతూ.. నా స్పర్శ కి పరవశించాను అని తెలియచేస్తూ,రంగు మారిన కళ్ళతో నా కళ్ళల్లోకి చూసింది.. ఆ క్షణం ఆమె మోము ని చూసిన నాకు మహదానందం కలిగింది..ఆ మోము ని చూస్తూ జీవితాంతం బ్రతికేయొచ్చు అనిపించింది ఆ క్షణం.. అలాగే మెల్లగా ఆమె చెయ్యి ని నిమురుతూ, ఇంకో చేత్తో ఆమె నుదుటి పైకి వచ్చిన వెంట్రుకలని సరి చేసాను.. నా స్పర్శ ఆమె నుదుటన పడేసరికి,ఆమె మొహంలో రంగులను ఇంకాస్తా మార్చింది.. అంత అందాల రాశి నా ముందున్నా,ఆమె ని ఎలా పొందాలి అన్న ఊహే రావడం లేదు.. ఇంకొక మెట్టు అధిగమించి ఆమె నుదుటన ఒక చిన్న ముద్దు ని పెట్టా.. అహ్హ్ అని చిన్నగా మూలుగుతూ కళ్ళు మూసింది తమకంగా.. ఆమె నుదుటన ముద్దు పెడుతూ,ఆమె మూసిన కను రెప్పల పైన ముద్దులు పెట్టాను.. ఆమె లో కామ తాలూకు భావనలు అధికం అవ్వసాగాయి. తన శ్వాస లో మార్పు,తన మొహం లో మార్పు,తన పట్టులో మార్పు వెరసి ఆమె నన్ను తమకంగా హత్తుకుంది మ్మ్మ్మ్ అని మూలుగుతూ. Like 224 Dislike 28 78395 38 1 cookie-check మధనుడి శృంగార ప్రయాణం 53 భాగము no

Categories Telugu
More stories See all