మా గాయత్రి అక్క – Part 4
అలిగిన వేళనే…. ” ఈ రోజు ప్రత్యేకంగా దేవుడిని ఏం కోరుకున్నావు?” గుడిలోంచి వచ్చాక, ఒకపక్కగా వున్న అరుగ మీద కర్చీఫ్ పరుచుకుని కుర్చుంటూ అన్నాడు సుబ్బారావు.దేదీప్య మనోహరంగా నవ్వింది! పాలరాతి శిల్పానికి ఆల్చిప్పలు అతికించినట్టున్న ఆమె విశాల నయనాలలోసుబ్బారావుపట్ల ఆరాధన! నిటారుగా వున్న నాసిక! ఎర్రగా నోరూరించే చెర్రీపళ్ళరంగును పులుముకున్న సన్నని పెదాలు,గుండ్రటి మెడ! కింద చూపుతిప్పుకోలేనట్లు చేసే ఎత్తయిన, గుండ్రటి అమృత భాండాలు! అది గుడి కావడంతో సుబ్బారావు చప్పున ఆమె పై నుంచి దృష్టి గాలిగోపురం మీదకుమళ్ళించి, “ఈ రోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇంతకీ దేవుడిని ఏంకోరిక కోరావో చెప్పనేలేదు” అన్నాడు. “కోరిక ఏమి కోరలేదు. అయితే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను” అంది। “దేనికి?” అనడిగాడు సుబ్బారావు . ” మిమ్మల్ని భర్తగా ప్రసాదించినందుకు!” “అవును ఈ ఏడాదిలో ఏనాడూ నా మనసు నొప్పించలేదు. నేను అడిగింది కాదనలేదు.నాకు ఏవిషయంలోనూ కోపం తెప్పించలేదు. నాకు ఇంట్లోనే కాదు, కాలేజీలో కూడా “కోపం ముక్కు” అనే నిక్ నేమ్ వుండేది! మా అమ్మ అంటూండేది….”ఆ సత్యభామనిమించి మొగుడిని సాధించుకుతింటావ్, నీ అలకలు తీర్చలేక అమాయకపు ప్రాణిసన్యాసం పుచ్చుకోవడం ఖాయం” అని. “మీరు ఏం మంత్రం వేశారో, నా కోపం అంతా ఏమై పోయిందో నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది” అని సుబ్బారావు బుగ్గమీద చిటికేస్తూ అంది దేదీప్య. ” నీకూ కోపం వస్తుందా? నమ్మలేకపోతున్నాను!” ఆమె చేతిని తన చెతుల్లోకి తీసుకున్నాడు సుబ్బారావు. ”నేను కూడా నమ్మలేనంత నన్ను మార్చి న ఈ మంచి మొగుడిని నాకు ఇచ్చినందుకు ఈ పెల్లిరోజున ఆ దేవుడికి థాంక్స్ చెప్పుకోవాలి కదా !” ”పద పద …సినిమాకి టైం అయింది !” కర్చీఫ్ దులుపుకుంటూ లేచాడు సుబ్బరావు. అప్పుడే స్నానం పూర్తిచేసి ,నీలం పువ్వులున్న నైట్ కాటన్ శారీ కట్టుకునిబెడ్ రూంలోకి వచ్చింది దేదీప్య ! రాత్రి పది దాటింది . ఏ కాలంలో అయినాపడుకోబోయే ముందు స్నానం చేయడం దేదిప్యకు అలవాటు . మంచం మీద ఆ వై పుకుపడుకుని ,టీవిలో ఏదో మ్యూజిక్ చానల్ చూస్తున్నాడు సుబ్బారావు. ఇన్స్ ఫెక్షన్ పని చూసుకుని ఖమ్మం నుంచి రెండు గంటల క్రితమే వచ్చాడుఅతను.” రేపు మన రెండో మ్యారేజ్ డే! నేను అక్కడ, నువ్వు ఇక్కడ ! ఎలాకుదురుతుంది అందుకే రెండు రోజులు రాత్రిళ్ళు కూడా వర్క్ చేశాను ” అన్నాడుడైనింగ్ టేబుల్ దగ్గిర. దేదీప్య ఏమీ మమాట్లాడలేదు. పెళ్ళయిన రెండు సంవత్సరాల్లో దేదీప్య ముభావంగా వుండటం ఇదే చూడటం- సుబ్బరావు కి ఆరాటంగా వుంది. ”నువ్వేదో దాస్తున్నావు!” ”అబ్బ ఏం లేదన్నాను కదా ,త్వరగా భోజనం చేసి వెళ్ళండి ” అరిసినట్లుగాఅంది దేదీప్య .