ముగ్గురి జీవితాలు 4
రాణీ పెళ్ళికి ముహూర్తం పెట్టారు.ఇంకా 6 నెలలు సమయం ఉంది.నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఎలా ఉండాలే అని కిరణ్మయి బాధపడుతుంది.నువ్వు కూడా పెళ్ళి చేసుకోవె అని రాణి అన్నది. ఏమో నాకు సరిపోయే వాడు ఇంకా దొరకలేదే అంది కిరణ్మయి. ముగ్గురి జీవితాలు 3 రాణి, హరి ఇద్దరూ లేట్ నైట్ వరకూ రోజూ కాల్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.ఒకరోజు హరి అడిగాడు, రాణి పెళ్ళికి ముందు నీతో సెక్స్ చేయాలని ఉంది అని. హే వద్దు అన్నది రాణి.ప్లీజ్ అంటూ రోజూ బ్రతిమాలుతున్నాడు. అయినా ఒప్పుకోలేదు. ఒకరోజు కిరణ్మయి ఒక ఫోటో చూపించి ఎలా ఉన్నాడే అని అడిగింది.ఎవరే అన్నది రాణి. మా అమ్మ నాన్న సంబంధం చూసారు నాకు.పేరు భార్గవ్.నీకు తెలిసే ఉండొచ్చు. మీ మండలం లోనే MRO గా చేస్తున్నాడు అన్నది. అవునా కొత్తగా జాయిన్ అయ్యాడా అని ఫోటో అలాగే చూస్తూ ఉంది.ఏమోనే ఎప్పుడూ చూడలేదు.నాకు తెలిసి లేడీ ఉండేది. ఆ తర్వాత ఎవరు వచ్చారో తెలియదు.అన్నది రాణి.సరే ఒకసారి మీ ఊరు వెళ్దామా చూద్దామా అన్నది కిరణ్మయి.సరే ఈ వీకెండ్ వెళ్దాం అనుకున్నారు. శుక్రవారం సాయంత్రం బయలుదేరి రాణి వాళ్ళ ఊరు వెళ్ళారు.రాణి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టమైన వంట చేసి పెట్టింది.ఇద్దరూ డాబా మీద పడుకుని ముచ్చట్లు పెట్టుకుని పడుకున్నారు.ఉదయం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తుంది కిరణ్మయి.10 తర్వాత ఇద్దరూ MRO ఆఫీస్ కి వెళ్ళారు.నేను స్కార్ఫ్ లో ఉంటాను. నా ఫోటో చూసి ఉంటే గుర్తు పడతాడు అని ఫేస్ కవర్ చేసుకుంది.లోపల పనిలో ఉన్నాడు భార్గవ్.కొద్దిసేపు తర్వాత ఇద్దరూ లోపలికి వెళ్ళారు.ఇద్దరినీ చూసి చెప్పండి అన్నాడు. రాణి చెప్తుంది, సార్ మా ఊరులో వాటర్ ప్రాబ్లం ఉంది.ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు.అందుకే డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి చెప్పాలని వచ్చాము అన్నది. రాణి వైపు అలాగే చూస్తున్నాడు భార్గవ్. సార్ అలా చూస్తున్నారేంటి అని అడిగింది రాణి.మనం ఎప్పుడైనా కలిసామా అన్నాడు.లేదు సార్.నేను ఇదే మొదటి సారి చూడడం అన్నది రాణి.సరే మీ సమస్య ఏంటో త్వరగా పేపర్ పై రాసి మీ సంతకం చేసి,ఆధార్ నంబర్,ఫోన్ నంబర్ రాసి ఇవ్వండి.నేను సంతకం చేసి మీ సమస్య తీరిపోయేలా చూస్తాను అన్నాడు.సరే అని రాణి పేపర్ తీసుకుని రాసింది. నీ నంబర్ రాయనా అన్నది కిరణ్మయి తో.వద్దు నా నంబర్ తర్వాత తెలిసే ఛాన్స్ ఉంటుంది కదా. నీదే ఇవ్వు. అయినా మీ ఊరు సమస్య కదా తేడా రాకూడదు అన్నది.రాణి తన డిటైల్స్ రాసి ఇచ్చింది.సంతకం చేసి ఫోటో తీసుకున్నాడు.వేరే ఒకతనికి ఇచ్చి ఇది మెయిల్ చేయండి అని పంపించాడు.వాళ్ళతో వెళ్ళమన్నాడు.వెళ్తూ ఉంటే,రాణి గారు లంచ్ టైం లో ఒకసారి కలవండి.ఈరోజు కొంచెం ఫ్రీ ఉన్నాను.కుదిరితే మీ ఊరు వెళ్దాం అన్నాడు.ఏంటి సార్ నిజమా అన్నది రాణి. కానీ MRO గా కాదు.