మేనేజింగ్ డైరెక్టర్
షాహీన్ మాడం చాలా స్ట్రిక్ట్. ఒక కంపెనీ కి MD తను. తన ముందు సినిమా యాక్టర్లు కూడా బలాదూర్ అంత అందంగా ఉంటుంది. సర్తాజ్ తో పెళ్ళి నిశ్చయమైంది. సర్తాజ్ కోరి ఇష్టపడిన అమ్మాయి షాహీన్. అలా అని తాను తక్కువేమీ కాదు అమెరికాలో MBA చేసింది. మొదటి చూపులోనే సర్తాజ్ ఇష్టపడి ఆ సంబంధం కోసం పట్టుబడ్డాడు. కలిగిన కుటుంబాలు కావడంతో వారి ప్రేమ పెళ్ళి కాస్తా పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయింది. నిఖా మాత్రం నామమాత్రంగా ఉండిపోయింది. మిగిలినవి కక్కుర్తి పడుతూనే ఉన్నారు అప్పుడప్పుడూ ఈ లోగా తన కంపెనీ చూసుకోమని తనని MD గా చేసేశాడు సర్తాజ్ తాను బెంగుళూరు బ్రాంచ్ చూసుకోవడానికి వెళ్తూ. ఎదో చెబుతారు చూడండి అయ్యవారు వచ్ఛే దాకా అమావాస్య ఆగడు కదా……..అంటూ అమావాస్యలు చాలానే వచ్చ్చాయి అయ్యవారికి తీరిక దొరకట్లేదన్నట్లు, పెళ్లి తప్ప చిలక్కొట్టుళ్లు అదే నండి లాగి కొట్టడం మాత్రం అయిపొయింది . సావిత్రికి ఎన్ని సార్లు చెప్పినా ఇంతే; టైం కి రాదు. దీనికి బాగా పొగరెక్కింది. ఈ సారి డబ్బులు కట్ చెయ్యాలి. ఆఫీస్ కి 9.30AM కల్లా వెళ్ళాలి. అనుకొంటూ విసుక్కొంది షాహీన్. పొద్దున్నే సర్తాజ్ తో మాట్లాడింది. రోజూ ఇదే వరస వస్తానంటాడు. నిఖా చేసుకుంటే అసలు తన మొహం చూస్తాడా?! అని అనుకొంటూండగా…. పనిమనిషి సావిత్రి వచ్చింది. “ఏం సావిత్రి ఏమయ్యింది. రోజూ 7 ఇంటికల్లా రమ్మని చెప్పానా లేదా?” అంటూ సావిత్రి మీద విరుచుకు పడింది. కానీ సావిత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గబాగబా అన్ని రూములు ఊడ్చేసి బాసన్లు తోమేసింది. ఈ లోపల షహీన్ స్నానానికి వెళ్ళింది. వస్తూ ఉంటె వెక్కి వెక్కి ఏడుస్తున్న సడి వినపడి అటు చూసింది. సావిత్రి ఏడుస్తోంది. ఒక్క సారి జాలి ముంచుకొచ్చింది షహీన్కి. షహీన్ సంగతంతా కనుక్కొంది. సావిత్రి: “అమ్మా, మీరు చాలా మంచి వాళ్ళమ్మా, మీరు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇప్పిస్తున్నారు. మీ ఆఫీస్ ఊడ్చే పని కూడా నాకే ఇప్పించారు. కానీ నా మొగుడు కిషన్ గాడు దొంగ యాదవ వాడు లారీ డ్యూటీ కి పోయినప్పుడు మంచిగానే ఉంటడు. డ్యూటీ దిగినంక రోజు తాగుతాడు నన్ను చితకబాదుతడు. ఆడు కొట్టిన దెబ్బలకి ఉదయం లేవలేకపోయిన …..రేపటి సంధి మంచిగొస్తా….ఈ రోజుకి నా తప్పు కాయండి మాడం” అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకొంది. షహీన్ సావిత్రి కేసి చూసింది. సావిత్రి వంటి పై టెట్లు తేలాయి. అవి చేతి వేళ్ళ గుర్తులు. కర్రతో కొట్టిన గుర్తులు., సావిత్రి రాత్రంతా ఏడుస్తూనే ఉందని అర్ధమయింది షాహీన్ కి కళ్ళు ఉబ్బి పోయి ఉన్నాయి. కాళ్ళ కిందా చారికలు కట్టేసిన కన్నీరు చూసి ద్రవించిపోయింది షాహీన్. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి మందులు ఇప్పించింది. సావిత్రికి కళ్ళలో నీళ్లు తిరిగాయి తనని అంత ఆధరంగా చూసినందుకు కాళ్ళ మీద పడిపోయింది.