All content free · updated every 5 minutes

వ్ – Part 2

Story Telugu 3 pages 2 years ago

వ్ – Part 2
రవితేజ ఆమెని చూసి నిశ్చేష్టుడయ్యాడు..ఆమె వేశ్య అన్న నిజాన్ని ఒక్క క్షణం జీర్ణించుకోలేకపోయాడు..అతనికి “ప్రార్ధన” నవల లో మాటలు గుర్తొచ్చాయ్… ఆ శరీరం విద్యుల్లత అ లలాటము అర్ధచంద్రము ఆ కపాలము దర్పణము ఆ జడ బృంగావళి కేశాలు చామరాలు కనుబొమ్మలు స్పర్శ చాపాలు నాసిక తిలప్రసూనము నేత్రము కందళీ కుట్మలము చూపు ఉత్పల పంక్తి దంతము ముత్యము పలుకు వేణు నాదము నఖములు కంద కళ్హికలై , స్థనములు చక్రవాకములై, నాభి ఆవర్తమై, వళ్హువ నిచ్చెనులై , పృష్టము కాంచన పట్టమై , నితంబము పులినమై ఊరువులు కదళీ కాండములై, హసము వెన్నెలై, పుష్పమై, ఫేనమై, కైవరమై ప్రభవించిన అప్సరస.. ఎవరు.. అన్న ఆమె మాటలకు తేరుకున్నాడు రవి .. సావిత్రి అంటే నువ్వేనా? అతని మాటల్లోని తెచ్చిపెట్టుకున్న పొగరు చూసి ముందు కోపం వచ్చినా అతని కళ్ళలోని అమాయకత్వం చూసి దాన్ని అణుచుకుని…సౌమ్యంగా అవును…ఏం కావాలి అంది… ఎలా అడగాలో అర్ధం కాలేదు..ఫ్రెండ్ దూరంగా చూసి ఆమె వేశ్య అని చెబితే నమ్మివచ్చాడు. అసలు వాడనుకుంది ఈమె కాకపోతే, ఇంకేమైనా ఉందా. అయినా వేశ్య అయితే మాత్రం నడి రోడ్డు మీద భేరసారాలడితే ఒప్పుకుంటుందా…మళ్ళీ తనలోనే తాను “అయినా వేశ్యలకి ఫీలింగ్స్ ఏంటి nonsense” అనుకున్నాడు.. హలో బాబు నేను వెళ్ళాలి త్వరగా చెప్పు… నీ రేటెంత? ఇంకా పూర్తిగా రాని అతని నూనుగు మీసాలు, అతనడిగిన ప్రశ్న రెండూ అతనికి ఇంతకు పూర్వం ఇందులో అనుభవం లేదని చెప్పకనే చెబుతున్నాయ్.. వెంటనే నవ్వింది సావిత్రి… నవ్వుతావేంటి…నేను సీరియస్ గా అడుగుతున్నాను..చెప్పు… సరే …నా రేటు ఒక రాత్రికి 5000…నేనెక్కడికీ రాను …జంగారెడ్డి గూడెం, సౌభాగ్య lodge కి వెళ్లి నా పేరు చెప్తే ఒక రూం ఇస్తారు. ఈవినింగ్ 7.30 కి వస్తాను..మార్నింగ్ 6 కి వెళ్ళిపోతాను. రూం, రాను పోను charges నీవే..రూం లో మందు తాగకూడదు, సిగరెట్ కాల్చకూడదు…అని చెప్పి వెళ్ళిపోయింది.. వింటూ నోరు వెళ్ళబెట్టాడు రవి..కాసేపు అక్కడే నిలబడి వెనక్కి నడుచుకుంటూ వెళిపోయాడు..ఈసారి నెమ్మదిగా… చాలా నెమ్మదిగా…మళ్లి లారీల రాకపోకలు పట్టించుకోకుండా….ఒక రాత్రికి అయిదు వేలా….ఎందుకో అసంకల్పితంగా జేబు తడుముకున్నాడు..వర్షానికి, ఉన్న ఒక్క పది రూపాయల నోటు తడిసిపోయింది.. రాత్రి సరిగా భోజనం చేయలేకపోయాడు రవి…మనసులో ఆమె రూపం అలాగే ముద్రించుకుపోయింది…రాత్రి 10 గంటలకి, ఈ పాటికి ఎవడు ఆ అందాన్ని అనుభవిస్తున్నాడో అనుకున్నాడు. ఎందుకో శ్రీశ్రీ మాటలు గుర్తొచ్చాయ్.. ” కడుపు దహించుకుపోయే పడుపుకత్తె రాక్షస రాతిలో అర్ధ నిమీలిత నేత్రాల బాధల పాటల పల్లవి” ప్రేమాభిషేకం గుర్తొచ్చింది.. నిన్నకు రేపుకు సంధిగ నిలిచిన సుందరీ పాదాభి వందనం పాదాభి వందనం.. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు..

ఒకటే కలలు ఓ అందమైన పువ్వుని ఎవడో మూర్ఖుడు చేతితో నలిపేస్తున్నట్టు ఓ అందమైన రాగం తాగుబోతు నోట్లో నాశనమైపోతున్నట్టు ఓ గొప్ప చిత్రకారుడి చిత్రం జడివానలో తడిసిపోతున్నట్టు… ఒకటే పిచ్చి కలలు… ………………………………… నెల రోజుల తర్వాత విజయలక్ష్మి ఫోటో స్టూడియో…స్టూడియో ఓనర్ కుర్రాడే…పేరు వినోద్..రవికి మంచి ఫ్రెండ్…మధ్యాహ్నం కాలేజ్ లేకపోయినా, వెళ్ళాలనిపించకపోయినా ఆ స్టూడియో లో కూర్చోవడం రవికి అలవాటు..స్టూడియో అంతా ఒకే గది…దాన్ని curtain తో రెండు భాగాలు చేసాడు…ముందు counter, వెనక ఫొటోస్ తీయడానికి ప్లేస్…అక్కడే పక్కనే కూర్చోవడానికి రెండు కుర్చీలు, ఒక సోఫా ఉంటాయ్..|తెలుగుసెక్స్కథలు డాట్ కం ఉత్తమ కథలను చదవండి ! ఎప్పట్లాగే రవి సోఫా లో పడుకుని సితార చదువుకుంటున్నాడు. ఇంతలో వినోద్ ఎవరితోనో మాట్లాడడం వినిపించింది.అది ఎక్కడో విన్న గొంతు.. ” ఏంటండీ ఇన్ని రోజులు…. 5 డేస్ క్రితం ఇచ్చేస్తానన్నారు” అయిపోయాయ్ madam, ఒక్క అయిదు నిముషాలు కూర్చోండి ఇచ్చేస్తాను . ఆ గొంతు గుర్తు పట్టాడు రవి…వెంటనే వెళ్లి చూడాలనిపించింది..కానీ ఏదో వెనక్కి లాగింది..చూడాలన్న కోరిక ముందుకు నెడుతుంది.. ఇంతలో వినోద్, ” వెనక చైర్స్ ఉన్నాయ్ కూర్చోండి madam” అన్నాడు.. curtain పక్కకి జరిపి లోపలికొచ్చింది సావిత్రి…కొంచెం మసక చీకటిగా ఉంది..సోఫా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.. ఒక రెండు నిముషాల నిశ్శబ్దం తర్వాత గుర్తుపట్టారా నన్ను అన్నాడు రవి… ఆ…గుర్తున్నావ్….వర్షం…రోడ్డు మీద…మరిచిపోలేదు..ఇంతకీ నీ పేరేంటి ? రవి తేజ (పేరు విని ఒక్క క్షణం మౌనంగా ఉంది) ఏంటి మళ్లీ కనబడలేదు….డబ్బులు రెడీ చేసుకున్నావా? “లేదు” ఏ…వేస్ట్ అనిపించిందా? “ఎందుకు అలా అన్నారు?” తనకి అందని ఆడదాన్ని వేస్ట్ అనుకోవడం, ఆమె గురించి చీప్ గా మాట్లాడుకోవడం అలవాటే కదా. “అర్ధం కాలేదు” ఉ….నా రేటు అందుబాటులో ఉంటే ఏమంటారు..ఒక్క రాత్రి ఆమె అందాన్ని అనుభవించడానికి ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదంటారు…అదే అందుబాటులో లేకపోతే అంత స్పెషల్ ఏముంది దానిలో..అందరి లాంటి ఆడదే..అయిదు నిముషాల సుఖం కోసం దానికి అయిదు వేలు తగలెయ్యలా అంటారు. ..నవ్వాడు రవి..”నాకంత పెద్ద విషయాలు తెలీవు..మిమ్మల్ని కలవనంత వరకు కేవలం మిమ్మల్ని అనుభవిస్తే చాలనుకున్నాను..కానీ కలిసిన తర్వాత మీతో కుర్చుని మాట్లాడాలనిపించింది..” | రోజూ చదవడం ఇష్టం తెలుగుసెక్స్కథలు . డాట్ కం | సరే చెప్పు ఏం మాట్లాడాలనుకుంటున్నావ్? ” ఇలా కాదు ఏకాంతంగా, ప్రశాంతంగా ” ఆ అవకాశం నేను నీకెందుకు ఇస్తాననుకుంటున్నావ్? “ఇవ్వరని తెలుసు…అందుకే డబ్బు సంపాదించడానికి ఒక పార్ట్ టైం జాబు జాయిన్ అయ్యా…ఇంకో రెండు నెలల్లో నేను 6000 సంపాదించి మళ్లీ మీకు కనబడతాను.” ఇంకేం మాట్లాడలేదు సావిత్రి….

అతని మాటల్లో ఏదో ఒక మూల నిజాయితీ కనబడింది.. ఇంతలో వినోద్ పిలిచాడు…”.మేడం …మీ ఫొటోస్ రెడీ” లేచి వెళిపోతూ రవి చేతిని చేతిలోకి తెసుకుని ఫోన్ నెంబర్ రాసి సాయంత్రం ఫోన్ చెయ్ అని వెళిపోయింది… …………………………….. Like 224 Dislike 28 51681 10 11 cookie-check వ్ – Part 2 no

Categories Telugu
More stories See all