All content free · updated every 5 minutes

శృంగార స్టోరీ 259

Story Telugu 14 pages 3 years ago

శృంగార స్టోరీ 259
పెద్దయ్యా పెద్దయ్యా …… కళ్ళు మూసుకోకండి నన్ను చూడండి నన్ను చూడండి మీకేమీ కాదు మీకేమీ కాదు హాస్పిటల్ కు వెళుతున్నాము అంటూ బుగ్గలను స్పృశిస్తూ కళ్ళు మూతలుపడకుండా ప్రయత్నిస్తున్నాను . శృంగార స్టోరీ 258 పెద్దయ్య : తల్లి నా తల్లి తల్లి బాబూ …… నా తల్లి అంటూ కలవరిస్తున్నారు . ఏమిటో అర్థం కాక పెద్దయ్యా …… ఇలానే స్పృహలో ఉండండి అంటూ అరచేతిలో చేతినివేసి ధైర్యాన్ని ఇస్తున్నాను . చెప్పినట్లుగానే నిమిషానికొక కిలోమీటర్ దాటినట్లు 15 నిమిషాలలో హాస్పిటల్ చేరుకుని నేరుగా తీసుకెళ్లి బస్సుని అత్యవసర విభాగం దగ్గర ఆపాడు . ప్రయాణీకులు సహాయం చెయ్యడంతో జాగ్రత్తగా ఎత్తుకుని కిందకుదిగి స్ట్రెచర్ పై పడుకోబెట్టాము . హాస్పిటల్ స్టాఫ్ …… వేగంగా ICU కు తీసుకెళ్లారు . వెనుకే వెళ్ళాను – కొంతమంది తోడుగా వచ్చారు . కండక్టర్ వచ్చి నా బ్యాగు అందించి ప్రయాణీకులంతా వేచిచూస్తున్నారు వెళ్లక తప్పదు బాబూ , పెద్దాయనకు ఏమీకాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని వెళ్లారు – తోడుగా వచ్చిన ప్రయాణీకులు కూడా భుజం తట్టి వెళ్లిపోయారు . డాక్టర్ బయటకువచ్చి ఆక్సిడెంట్ అయ్యి చాలాసేపు అయ్యింది రక్తం చాలా పోయింది హాస్పిటల్లో *** గ్రూప్ బ్లడ్ ఒక్కటే ఉంది మరొక ప్యాకెట్ అయినా అవసరమౌతుంది లేకపోతే ప్రాణాలకే ప్రమాదం . డాక్టర్ గారూ ……. నాదీ అదే బ్లడ్ తీసుకోండి . డాక్టర్ : please come in అంటూ లోపలికి పిలుచుకునివెళ్లి ఖాళీగా ఉన్న బెడ్ చూయించి బ్లడ్ తీసుకున్నారు . ప్రక్కనే తల్లీ తల్లీ …… అంటూ కలవరిస్తున్న పెద్దాయనకు ఒకవైపు బ్లడ్ ఎక్కిస్తూనే తగిలిన గాయాలను శుభ్రం చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు . ” ( వీడెవడండీ బాబూ ……. ప్రతీ స్టోరీలో లీటర్ల లీటర్ల బ్లడ్ ఇచ్చేస్తున్నాడు అని కోప్పడకండి – మనం బ్లడ్ ఇవ్వడం వలన ఒక ప్రాణం నిలబడుతుంది . ఇలా ప్రతీసారీ గుర్తుచేయ్యడం వలన xossipy ఫ్రెండ్స్ రక్తదానం చేస్తారని చిరు ఆశ – నేను ఇప్పటికే రెండుసార్లు ఇచ్చాను , వాళ్ళు థాంక్స్ చెప్పిన క్షణం కలిగిన ఫీలింగ్ అలాంటిది మరి , లవ్ యు గయ్స్ …….. మీ మహేష్ ) ” . బ్లడ్ ఇచ్చి బయటకువచ్చి కూర్చున్నాను . గంట తరువాత డాక్టర్ బయటకువచ్చి సరైన సమయానికి తీసుకొచ్చారు – సరైన సమయానికి బ్లడ్ ఇచ్చి ఒక ప్రాణం కాపాడావు – కాసేపట్లో స్పృహలోకి వస్తారు వెళ్లి చూడవచ్చు . థాంక్ గాడ్ ……. థాంక్యూ డాక్టర్ ……. డాక్టర్ : ఇంతకీ నీకు ……. పెద్దాయనకు ఏమౌతారు . నో డాక్టర్ …… బస్సులో వెళుతుంటే అంటూ జరిగింది వివరించాను . డాక్టర్ : గుడ్ అంటూ చేతులు కలిపారు . ఎవరోకూడా తెలియని పెద్దాయన ప్రాణాలు కాపాడావు . ఆ క్షణం కలిగిన ఫీలింగ్ ……., డాక్టర్ గారూ ……. పెద్దాయన దగ్గర మొబైల్ ఏమైనా …….. డాక్టర్ : నర్స్ …… చూసుకోండి , sorry రౌండ్స్ కు వెళ్ళాలి .

నో నో నో , మీరు sorry చెప్పడం ఏమిటి …… క్యారి ఆన్ డాక్టర్ ……. పెదాలపై చిరునవ్వులతో వెళ్లారు డాక్టర్ గారు . నర్స్ వచ్చి విషయం తెలుసుకుని , నో సర్ …… వారి దగ్గర ఎటువంటి మొబైల్ లేదు . అవునా …… , బహుశా అక్కడే పొదల్లో పడిపోయి ఉంటుంది – ఇప్పుడెలా …….. నర్స్ : సర్ …… లోపల తల్లీ తల్లీ …… అంటూ కలవరిస్తూనే ఉన్నారు అని పిలుచుకునివెళ్లారు . తలకు – చేతులకు – కాళ్లకు ……. కట్లు కట్టి ఉండటం చూసి చాలా దెబ్బలు తగిలాయని బాధవేసింది . ప్రక్కనే వెళ్లి నిలబడ్డాను . సగం కళ్ళతోనే నన్ను గుర్తుపట్టి బాబూ …… అంటూ కన్నీళ్ళతో చేతిని అందుకోబోయారు . పెద్దయ్యా పెద్దయ్యా …….. కదలకండి అంటూ చేతిని అందుకుని అరచేతిలో చేతినివేసి బెడ్ పై ఉంచాను . పెద్దయ్య : నా ప్రాణాలు కాపాడావు , నీ రుణం ……. పెద్దయ్యా ……. కాసేపు మాట్లాడకుండా రెస్ట్ తీసుకోండి అని కన్నీళ్లను తుడిచాను . పెద్దయ్యా …… మీవాళ్ళు ఎక్కడ ఉంటారు . పెద్దయ్య : మొబైల్ మొబైల్ ……. అంటూ తలెత్తి స్స్స్ స్స్స్ ……. కదలకండి పెద్దయ్యా నొప్పివేస్తుంది . చూసాము మీ మొబైల్ లేదు ఆక్సిడెంట్ అయినప్పుడు అక్కడే పడిపోయిందేమో ……… పెద్దయ్య : నెంబర్ నెంబర్ ……. నా కొడుకుది ********** ఇదిచాలు పెద్దయ్యా ……. ఇక మీరు ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి అని కాల్ చేసాను . బ్రదర్ కంగారుపడకండి మీ నాన్నగారికి చిన్న ఆక్సిడెంట్ అయ్యింది – కంగారుపడకండి సరైన సమయానికి హాస్పిటల్ కు తీసుకెళ్లడం వలన సేఫ్ గా ఉన్నారు . ఏ హాస్పిటల్ ఏ హాస్పిటల్ సర్ ……. వైజాగ్ ******** హాస్పిటల్ – కంగారుపడకండి బ్రదర్ ……. సేఫ్ అని డాక్టర్స్ చెప్పారు . సర్ ……. వెంటనే వచ్చేస్తాను – అప్పటివరకూ నాన్నగారు జాగ్రత్త please please సర్ …….. ప్రక్కనే ఉన్నాను బ్రదర్ ……. థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ , ఇప్పుడే వచ్చేస్తాను . నర్స్ : సర్ …… బ్లడ్ ఇచ్చారుకదా నీరసంగా ఉంటుంది , మీరుకూడా కూర్చోండి అని బెడ్ ప్రక్కనే ఛైర్ వేసింది – ఆపిల్ కూడా ఇచ్చారు . థాంక్స్ చెప్పాను . అర గంటలో ఒక తమ్ముడు ICU లోపలికివచ్చి పెద్దయ్యను చూసి , నాన్నగారూ నాన్నగారూ అంటూ కన్నీళ్ళతో ప్రక్కన చేరారు . అప్పటికే పెద్దయ్య కొద్దికొద్దిగా మాట్లాడుతున్నారు . కృష్ణా …… నాకేమీ కాలేదు కంగారుపడకు – ఈ బాబు వల్లనే నేను ప్రాణాలతో ఉన్నాను . తమ్ముడు కన్నీళ్లను తుడుచుకుని థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ అంటూ రెండు చేతులతో నమస్కరించాడు . నాకు చేతనైనది చేసాను – అంతదానికి ……. పెద్దయ్య : దేవుడిలా వచ్చావు బాబూ ……. పెద్దయ్యా …… థాంక్స్ చెప్పారు కదా చాలు పెద్దయ్యా ……. , మీరు సేఫ్ గా ఉన్నారు అంతకంటే సంతోషం ఇంకేమి కావాలి . పెద్దయ్య : మంచి మనసు బాబూ నీది , కృష్ణా ……. అక్కయ్య ? . తమ్ముడు : నిన్న సంతకు వెళ్లిన పిన్నీ వాళ్ళతోపాటు ఆటోలో వచ్చారు నాన్నగారూ ……..

( సంతకు వెళ్లిన పిన్ని వాళ్ళతోపాటు …… దేవత అయి ఉండరులే ) పెద్దయ్య : హమ్మయ్యా …… , కృష్ణా …… ఆక్సిడెంట్ విషయం తల్లికి చెప్పలేదు కదా …….. కృష్ణ : కంగారుపడతారని అక్కయ్యకు – అమ్మకు చెప్పలేదు నాన్నగారూ …… – బుజ్జితల్లికి తెలిస్తే ఏడ్చేస్తుంది . ( బుజ్జితల్లి ……. నా బుజ్జితల్లి అయి ఉండదులే ) పెద్దయ్య : అవునవును తాతయ్య అంటే ప్రాణం నా బుజ్జితల్లికి – నన్ను ఇలా చూస్తే ఏడ్చేస్తుంది . కానీ బుజ్జితల్లిని వెంటనే చూడాలనిపిస్తోంది కృష్ణా ……. ( ప్రయాణమంతా తాతయ్య తాతయ్య ….. అంటూ కలవరిస్తూనే ఉంది – నా బుజ్జితల్లినేనా …… ) కృష్ణ : నాన్నగారూ ……. ఒకరోజైనా రెస్ట్ తీసుకోవాలి . పెద్దయ్య : ఒకరోజంతానా …… ? , మన బుజ్జితల్లిని చూడకుండా ఉండటం నావల్లకాదు – కృష్ణా …… తనను తన బుజ్జినవ్వులను చూశానంటే వెంటనే కోలుకుంటాను . నిజమే పెద్దయ్యా …… ప్రాణమైనవాళ్ళతో ఉంటే హాస్పిటల్స్ – మందులు అవసరం లేదు కానీ ట్రీట్మెంట్ కోసం మీకిచ్చిన మత్తు ఇంజక్షన్ పవర్ తగ్గేవరకైనా ఇక్కడే ఉండాలి లేకపోతే కదులలేరు . పెద్దయ్య : నువ్వు చెబుతున్నావు కాబట్టి సరే బాబూ …….. హాస్పిటల్ స్టాఫ్ ఒకరు లోపలికివచ్చి ట్రీట్మెంట్ బిల్ సర్ అంటూ రిసిప్ట్ ఇచ్చి కౌంటర్ లో పే చెయ్యండి అనిచెప్పి వెళ్ళిపోయాడు . తమ్ముడు జేబులన్నీ వెతికి కంగారులో డబ్బు మరిచిపోయాను అంటూ మెడలో ఉన్న చైన్ తియ్యబోయాడు . తమ్ముడూ …… ఆగు నేను పే చేస్తాను . కృష్ణ : సర్ …… ఇప్పటికే మీరు …… పర్లేదు తమ్ముడూ , నువ్వు …… నాన్నగారి దగ్గర ఉండు పే చేసి వస్తాను కావాలంటే ఇంటికివెళ్లాక ఇవ్వు ( ఆ బుజ్జితల్లి …… నా బుజ్జితల్లి ఏమో చూడాలికదా – చూసి ఇప్పటికే గంట పైనే అయ్యింది , ఈ హృదయం ఎలా తట్టుకొంటోందో ఏమిటో ) అని లేచాను . పెద్దయ్య ….. చేతులకు కట్లు ఉన్నా దండం పెట్టడానికి ప్రయత్నించారు . పెద్దయ్యా ……. మీరు పెద్దవారు , మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ ఇలా చెయ్యకూడదు అని ఆపి వెళ్లి కౌంటర్ లో పే చేసివచ్చి ICU బయటే కూర్చున్నాను . 10 నిమిషాల తరువాత కృష్ణ బయటకువచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు సర్ అని ప్రక్కన కూర్చున్నాడు . సర్ ……. ఆక్సిడెంట్ ఎలా జరిగింది . జరిగింది వివరించాను . కృష్ణ : సర్ ……. మీరు నిజంగా దేవుడు – మీరు చూడకపోయుంటే మరింత ఆలస్యం అయ్యేది – నాన్నగారికి ఏమైనా జరిగిఉంటే అమ్మ – అక్కయ్య – బుజ్జితల్లి అంటూ కన్నీళ్లు కారుస్తున్నాడు . అంతా దైవేచ్చ కృష్ణా ……. , బాధపడకు త్వరలోనే కోలుకుంటారు అని ధైర్యం చెప్పాను . కృష్ణ మొబైల్ మ్రోగడంతో తీసి చూసి , సర్ …… అక్కయ్య చేస్తోంది ఖచ్చితంగా బుజ్జితల్లినే చేయించి ఉంటుంది తాతయ్యను అడుగుతుంది అని మరింత కంగారుపడిపోతున్నాడు . భుజంపై చేతినివేసి మాట్లాడమని ధైర్యం చెప్పాను . కృష్ణ : సరే సర్ అంటూ ఎత్తాడు .

” మావయ్యా …… ” స్పీకర్ మూసి బుజ్జితల్లే సర్ …… , బుజ్జితల్లీ …… అమ్మకు ఇవ్వు – తాతయ్యనా …… తాతయ్య తాతయ్య ఇక్కడే నాదగ్గరే ఉన్నారు – మాట్లాడాలా …… ? అదీ అదీ పనిలో ఉన్నారు బుజ్జితల్లీ ……. అమ్మకు ఇవ్వు బంగారూ ……. , అక్కయ్యా …… మీరు టిఫిన్ తినండి ఆలస్యం అవుతుంది వచ్చేస్తాము కదా ……. , సరే సరే వీలైనంత తొందరగా వచ్చేస్తాము అని కట్ చేసి హమ్మయ్యా …… అనుకున్నాడు . మంచిపనిచేశావు కృష్ణా …… లేకపోతే పెద్దయ్యను చూసేంతవరకూ కంగారుపడతారు . కృష్ణ : అదే భయంగా ఉంది సర్ ……. అక్కయ్య – బుజ్జితల్లి – అమ్మ – ఊరి జనం …. చెప్పనేలేదు కదూ మా ఊరి పెద్ద మా నాన్నగారే సర్ , నాన్నగారి మాటంటే అందరికీ గౌరవం , సర్పంచి కూడా నాన్నగారు చెప్పినట్లే వింటారు . అందరి ఆశీస్సులు ఉండటం వల్లనే మీ నాన్నగారికి ఏమీకాలేదు . ఆయన ఇక్కడ హాస్పిటల్లో ఉండటం కంటే అంతమంది ఆత్మీయుల మధ్యనే త్వరగా కోలుకుంటారు . 10 గంటల సమయంలో నర్స్ బయటకువచ్చి సర్ …… మిమ్మల్ని పిలుస్తున్నారు . లోపలికివెళ్లాము . పెద్దయ్య : నాన్నా కృష్ణా ……. హాస్పిటల్ నాకు పడదని తెలుసుకదా , మత్తు మొత్తం పోయినట్లుంది – నన్ను తొందరగా నా బుజ్జితల్లి దగ్గరకు తీసుకెళ్లు చూడు చేతులు – కాళ్ళు కదిలిస్తున్నాను అని పిల్లాడిలా బ్రతిమాలుతున్నారు – లేవడానికి ప్రయత్నిస్తున్నారు . నాకు – కృష్ణకు మరియు నర్సుకు కూడా నవ్వు వచ్చేసింది . పెద్దయ్యా ……. ఒక్క నిమిషం ఆగండి డాక్టర్ ను పిలుచుకునివస్తాను , వారు పర్లేదు అంటే మరుక్షణమే తీసుకెళ్లిపోతాము ( బుజ్జితల్లి ఎవరో చూడకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళేది లేదు ) . నర్స్ : సర్ ….. ఆగండి నేను పిలుచుకునివస్తాను అని వెళ్ళి డాక్టర్ తోపాటు వచ్చారు . డాక్టర్ గారిని ఆడిగేలోపు …… , డాక్టర్ డాక్టర్ …… నేను బానే ఉన్నాను , నొప్పులేమీ లేవు – నన్ను ఇంటికి పంపించేయ్యండి ఇక్కడ భయం వేస్తోంది అంటూ అటూ ఇటూ కదులుతున్నారు పెద్దయ్య . కృష్ణ : నాన్నగారూ ……. సైలెంట్ గా ఉండండి , ఆ విషయం చెప్పాల్సినది డాక్టర్ గారు . డాక్టర్ గారూ …… డాక్టర్ : త్వరగానే కోలుకున్నారు పెద్దయ్యా …… . పొలం పనులు చేసినవాళ్ళు కదా చూస్తేనే తెలిసిపోతోంది – పేషెంట్ కు ఎక్కడ ఇష్టమో అక్కడికే తీసుకెళ్లండి . కృష్ణ : డాక్టర్ గారూ ……. డాక్టర్ : కంగారుపడాల్సిన అవసరమే లేదు , కావాల్సినది రెస్ట్ తీసుకోవడం అదేదో ఆయన ఇష్టప్రకారం ఇంటిలోనే తీసుకోవచ్చు , అలా అయితేనే ఆత్మీయుల మధ్యన మరింత త్వరగా కోలుకుంటారు – మందులు రాసిస్తాను , డ్రెస్సింగ్ కోసం రెండు రోజులకొకసారి పిలుచుకునివస్తే సరిపోతుంది – డిశ్చార్జ్ చేస్తున్నట్లు సంతకం చేశారు . కృష్ణ : థాంక్యూ డాక్టర్ గారూ …….. డాక్టర్ : థాంక్స్ మీ నాన్నగారిని సేవ్ చేసినవారికి చెప్పండి – ట్రీట్మెంట్ చేసినందుకు మేము ఫీజ్ తీసుకున్నాము కదా ……..

డాక్టర్ గారూ …… అవన్నీ అయిపోయాయి – ఇప్పుడు మళ్లీ మొదటికి వస్తారు కృష్ణా ……. స్టార్ట్ చెయ్యకు . కృష్ణ : అలాగే సర్ అంటూ పెదాలపై నవ్వుతూ …… , నాన్నగారూ …… సంతోషమే కదా , మీ ఇష్టప్రకారమే ఇంటికి వెళదాము – అంబులెన్స్ ను సెట్ చేస్తాను . పెద్దయ్య : అంబులెన్స్ లో వెళితే మీ అక్కయ్య – అమ్మ – మన బుజ్జితల్లి భయపడిపోతారు , బండి తెచ్చావుకదా వెనుక కూర్చుంటాను . భలేవారు పెద్దయ్యా ……. ఇంకేమైనా ఉందా , కృష్ణా …… మందుల రిసిప్ట్ ఇవ్వు , మందులు తీసుకుని క్యాబ్ తీసుకొస్తాను – అంతలోపు నాన్నగారిని వీల్ చైర్ లో బయటకు తీసుకురా …….. కృష్ణ : అలాగే సర్ అంటూ రిసిప్ట్ ఇచ్చాడు . హాస్పిటల్లోని మెడికల్ షాప్ లో మెడిసిన్ తీసుకుని , బయటకువెళ్లి క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాను . కృష్ణ : చూడండి సర్ …… వీల్ చైర్ వద్దు నడుస్తాను అన్నారు . బ్రతిమిలాడి వీల్ చైర్లో తీసుకురావాల్సి వచ్చింది . పెద్దయ్యా …… త్వరగా కోలుకోవాలంటే తప్పదు అని జాగ్రత్తగా వెహికల్లో కూర్చోబెట్టాను . పెద్దయ్య : అదికాదు బాబూ …… ఇంటిదగ్గర చాలా పనులున్నాయి . ఇంతకీ చెప్పనేలేదు కదూ మావాడి పెళ్లి , ఈపాటికి పెళ్ళికొడుకుని చేయాల్సింది ……. అందరూ కంగారుపడుతుంటారు . కృష్ణ : పర్లేదు నాన్నగారూ …… కావాలంటే పెళ్లిని పోస్ట్ ఫోన్ చేయిద్దాము – మీరు కోలుకోవడం ముఖ్యం – అమ్మ అక్కయ్య నుండి ఈపాటికి 100 పైనే కాల్స్ వచ్చాయి – వస్తున్నాము అని మెసేజ్ పెడుతున్నాను కానీ మాట్లాడే ధైర్యం లేదు . పెద్దయ్య : వద్దు వద్దు కృష్ణా …… , నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా , అయినా నాకేమైంది – కట్లు విప్పి పెళ్ళిపనులు చెయ్యడానికి రెడీగా ఉన్నాను – మనసులో ఏమీ పెట్టుకోకు , నిన్ను ఎంత ప్రేమించింది ఆ పిల్ల నా కోడలు , నా వలన పెళ్లి ఆపడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు , మన ఇంటికీ మంచిదికాదు – ఏదీ మొబైల్ ఇవ్వు అని కాల్ చేశారు , అయ్యో ……. వచ్చేస్తున్నాము తల్లీ …… మీరు మొదలుపెట్టండి 15 నిమిషాలలో అక్కడ ఉంటాము . కృష్ణా ……. ఏర్పాట్లన్నీ రెడీ పదా వెళదాము . ( బుజ్జితల్లి – పెళ్లి ……. యాహూ …… నా దేవత దగ్గరకే వెళుతున్నాము ) కృష్ణా …… బైక్ ఎక్కడ నేను ఫాలో అవుతాను . కృష్ణ : నో నో నో సర్ …… , బండి ఎక్కడికీ వెల్లదు మీరు కారులో కూర్చోండి అని ముగ్గురమూ బయలుదేరాము . పెద్దయ్యను ఏ మెయిన్ రోడ్డులోనైతే వైజాగ్ హాస్పిటల్ కు చేర్చానో అదే రోడ్డులో వెనక్కువచ్చి ఆక్సిడెంట్ అయిన ప్లేస్ కు 100 అడుగుల దూరంలో రైట్ సైడ్ మట్టి రోడ్డు ద్వారా లోపలికి పోనివ్వమని డ్రైవర్ కు చెప్పాడు కృష్ణ . కృష్ణా ……. అదిగో అక్కడే మీ నాన్నగారిని చూసాను – మొబైల్ అక్కడే పడి ఉంటుంది . కృష్ణ : డ్రైవర్ …… అక్కడికి పోనివ్వండి .

పెద్దయ్య : కృష్ణా …… నాకు మళ్లీ చూడాలని లేదు – నువ్వు వెళ్లు – బండిని కూడా అక్కడే వదిలేసెయ్యి – ఇక జీవితంలో ఆ బండిని చూడకూడదు . కృష్ణ : అలాగే నాన్నగారూ అంటూ కిందకుదిగాడు . వెనుకే వెళ్లి ఆ ప్రాంతమంతా వెతికినా – రింగ్ చేసినా ఉపయోగం లేకపోయింది . వదిలెయ్యండి సర్ వెళదాము , ఈ బుల్లెట్ బండి అంటే నాన్నగారికి చాలా ఇష్టం – ఎప్పుడూ ఇలా జరగలేదు అని బాధపడుతూ కారులోకి చేరాము . పెద్దయ్యా ……. బుల్లెట్ ను బాగా నడుపుతారని కృష్ణ చెప్పాడు , ఇంతకీ ఎలా జరిగింది . పెద్దయ్య : ఉదయం 5 గంటలకు నా బిడ్డ – మనవరాలు బెంగళూరు నుండి వస్తున్నారని తెలిసి తీసుకెళ్లడానికి సంతోషంగా బస్ స్టాండ్ కు బయలుదేరాను . మట్టి రోడ్డు నుండి ఇక్కడ టర్న్ అవ్వగానే రాంగ్ రూట్ లో వస్తున్న లారీని తప్పించబోయి చివరన ఢీకొట్టాను – ఎలా కిందపడ్డానో తెలియదు , దేవుడిలా వచ్చి పెద్దయ్యా పెద్దయ్యా అంటూ నన్ను పలకరించి కాపాడటమే గుర్తు అంటూ మళ్లీ దండం పెట్టారు . పెద్దయ్యా ……. కృష్ణ …… నువ్వుకూడానా ? , మొదలెట్టేశారా ….. ? అంటూ నవ్వుకున్నాము . పెద్దయ్యా – కృష్ణా ……. మిమ్మల్ని రక్షించిన బస్సులోనే మీ అమ్మాయి మహి – బుజ్జితల్లి కీర్తీ బెంగళూరు నుండి వచ్చారు . పెద్దయ్య : మహి – కీర్తీ ……. మీకెలా? , అంటే ట్రైన్ మిస్ అవ్వడంతో బెంగళూరు నుండి మా వాళ్ళను క్షేమంగా తీసుకొచ్చిన దేవుడు కూడా మీరేనా ? . షాక్ – మీకెలా తెలుసు పెద్దయ్యా ……. పెద్దయ్య : నా కూతురు కాల్ చేసిన ప్రతీసారీ చెప్పింది మీ గురించి , నాన్నగారూ ….. మీరేమీ కంగారుపడకండి దేవుడి లాంటి వ్యక్తి తోడుగా వస్తున్నారని . మరొక స్వీట్ షాక్ , పెద్దయ్యా ……. మహి గారు నిజంగానే దేవుడు అన్నారా …… ? లేక మీరు …….. కృష్ణ : నాతో కూడా చెప్పారు సర్ – దేవుడు అనలేదు కానీ ఇంచుమించు అదే అర్థం వచ్చేలా చెప్పారు . అప్పటికి కానీ మాకు కంగారు తగ్గలేదు – అంతదూరం నుండి ఒంటరిగా అంటే చాలా చాలా భయం వేసింది . అక్కయ్య – మా ప్రాణమైన బుజ్జితల్లిని క్షేమంగా తీసుకొచ్చినందుకు గానూ థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ ……. , సర్ …… ఇదే మా చిన్న ఊరు – ఊరు చిన్నదే అయినా ప్రేమ , ఆప్యాయతలలో చాలా చాలా పెద్దది . మేమిద్దరు దేవుడు అని దండాలు పెడితేనే ఇబ్బందిగా ఫీల్ అయ్యారు – నాన్నగారిని కాపాడారని తెలిస్తే ఊరంతా ……. చెప్పను మరొకనిమిషంలో మీరే చూస్తారుకదా అని పెద్దయ్యతోపాటు నవ్వుతున్నాడు . అంతలోనే క్యాబ్ పెళ్లి పందిరి – తోరణాలు – షామియానా మరియు చిరునవ్వులు చిందిస్తున్న జనాలు గల ఇంటి ముందు ఆగింది . పెద్దయ్య : కృష్ణా …… ఆక్సిడెంట్ అని చెప్పకు తట్టుకోలేరు , బుల్లెట్ నుండి కిందపడ్డాను అని చెప్పు – బాబూ …… నువ్వుకూడా …….

నిజం చెప్పి అంతమందిని బాధపెట్టడం నాకూ ఇష్టం లేదు పెద్దయ్యా – జరిగినదేదో జరిగిపోయింది , మంచి నిర్ణయం తీసుకున్నారు . నా గుండె వేగంగా కొట్టుకోవడంతో నా దేవత – బుజ్జి ఏంజెల్ కోసం కళ్ళు ఆతృతతో వెతకసాగాయి – అదిగో నా బుజ్జి ఏంజెల్ ……. బుజ్జి బుజ్జి పిల్లలతో చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిబుజ్జిపరుగుతో ఆడుకోవడం చూసి మనసు శాంతించింది . అంతలో వెనుక పెద్దయ్య ప్రక్కన కూర్చున్న కృష్ణ ….. క్యాబ్ దిగగానే నేనూ దిగాను పెద్దయ్యను పట్టుకోవడానికి ……. బయట బుజ్జిబుజ్జి పిల్లలతో ఆడుకుంటున్న బుజ్జి ఏంజెల్ చూసి మమ్మీ – అమ్మమ్మా ……. తాతయ్య వచ్చారు అంటూ సంతోషంతో పరుగునవస్తూ , తన తాతయ్య వొళ్ళంతా కట్లను చూసి మమ్మీ – అమ్మమ్మా …… అంటూ ఏడుస్తూ కేకలువేసింది . ఆ పాటికే పెళ్ళికొడుకు శాస్త్రం కోసం వచ్చిన ఊరిజనం చూసి కంగారుపడుతూ అయ్యా – పెద్దయ్యా – అన్నా ……. ఏమైంది అంటూ తలా ఒకచెయ్యివేసి లోపలికి నడిపించుకుపోతుంటే …….. పెద్దయ్య ఆపి నాకేమీ కాలేదులే ఇప్పటికే పెళ్లి పనులు ఆలస్యం అయ్యాయి బయటే కూర్చోబెట్టమన్నారు . నిమిషంలో చెక్క మంచం మెత్తగా రెడీ చేసి కూర్చోబెట్టి , ఏమైంది ఏమైంది చాలా దెబ్బలు తగిలాయి అంటూ బాధపడుతూ చుట్టూ చేరారు . బుజ్జితల్లీ బుజ్జితల్లీ …… ఏడుస్తున్న బుజ్జితల్లిని పిలిచి ఒడిలో కూర్చోబెట్టుకోబోతుంటే ……. బుజ్జితల్లి : వద్దు తాతయ్యా ……. మీకు నొప్పివేస్తుంది . పెద్దయ్య : నా బంగారం తాతయ్య అంటే ప్రాణం అంటూ ప్రక్కన కూర్చోబెట్టుకుని కన్నీళ్లు తుడిచారు . బుజ్జితల్లి : తాతయ్యా ……. ఏమైంది అంటూ బుజ్జి కన్నీళ్ళతో అడిగింది . అంతలో దేవత – దేవత అమ్మగారు వచ్చి చూసి కన్నీళ్ళతో ప్రక్కన చేరారు . పెద్దయ్య : బుజ్జితల్లీ – తల్లీ – శ్రీమతిగారూ ……. ఏమీకాదు చూడండి నవ్వుతున్నాను . దేవత : కన్నీళ్ళతో తమ్ముడూ ఏమైందిరా …… ? . జనాలు : కృష్ణా ఏమైంది ఏమైంది ……… కృష్ణ : తెల్లవారుఘామున బస్ స్టాండ్ కు వెళుతూ …… లారీ …… అందరూ : లారీనా ……. అంటూ మరింత కంగారుపడిపోతున్నారు . కృష్ణ : లేదు లేదు మన రోడ్ టర్నింగ్ లో లారీ లైట్స్ సడెన్ గా పడటంతో పట్టుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న గడ్డిలో పడ్డారు . పెద్దయ్య : అంతే అంతే పొదల్లోకి వెళ్లిపోవడం వలన చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే …….. కృష్ణ : నాన్నగారు స్పృహకోల్పోయి పడి ఉండటం , బస్సులో వెళుతున్న ఈ అన్నయ్య చూసి సమయానికి హాస్పిటల్ కు తీసుకెళ్లి బ్లడ్ ఇచ్చి కాపాడారు . బుజ్జితల్లి : అంకుల్ ……. అంటూ పరుగునవచ్చి హత్తుకుంది . కీర్తీ తల్లీ …… అంటూ ప్రాణంలా ఎత్తుకోగానే , థాంక్యూ థాంక్యూ అంకుల్ అంటూ ముద్దులుపెడుతూనే ఉంది . కృష్ణ చెప్పినట్లుగానే దేవత అమ్మగారు – చుట్టూ జనమంతా థాంక్యూ థాంక్యూ బాబూ – తమ్ముడూ ……. అంటూ దండాలు పెడుతున్నారు .

దేవత అయితే నావైపు ఆరాధనతో చూస్తున్నారు – కన్నీళ్ళతో రెండు చేతులు జోడించి నమస్కరించారు . పెద్దయ్య ……. దేవత నుదుటిపై ముద్దుపెట్టి , చూస్తున్నావుగా బాబూ …… మేము చెప్పినదే నిజమైంది కదూ అంటూ నవ్వుతూ చెప్పారు . వీరి ఆప్యాయతలలో మీ మంచితనం తెలుస్తోంది పెద్దయ్యా …… , వీరంతా మీ చుట్టూ ఉండగా మీకేమీ కాదు . సర్ సర్ …… క్యాబ్ ఫేర్ ఇస్తే వెళతాను అని డ్రైవర్ అడగలేక అడిగాడు . Sorry sorry బ్రదర్ …… అంటూ బుజ్జితల్లిని ఎత్తుకునే పర్సు తీసేంతలో – కృష్ణ లోపలికివెళ్లి డబ్బు తీసుకొచ్చేన్తలో ……. ఎంత బాబూ ఎంత అంటూ ఊరిజనం పోటీపడుతూ ఇచ్చి పంపించారు . బాబూ ……. ఎంతసేపని నిలబడతారు కూర్చో …… – మా పెద్దయ్యను కాపాడిన మీరు , మాకు దేవుడితో సమానం అంటూ కుర్చీలు వేశారు . పర్లేదు అండీ ఇక నేను వెళతాను అని దేవత రియాక్షన్ కోసం చూసాను . అంకుల్ అంటూ బుజ్జితల్లి బుజ్జిచేతులతో నా నోటిని మూసింది – దేవత కళ్ళల్లో రెండు భావాలు ( వెళ్లిపో – ఉండిపో ) – బాబూ …… పెళ్లి చూసుకుని వెళ్లు అని ఊరిజనం – అవును బాబూ ……. పెళ్లి చూసుకుని మా ఆతిథ్యం స్వీకరించి మీకిష్టమైనన్ని రోజులు ఉండండి , మిమ్మల్ని సేవించుకుని కాస్తయినా రుణం తీర్చుకునే అవకాశం కల్పించు బాబూ అంటూ పెద్దయ్య వారి శ్రీమతి కోరారు . కృష్ణ : నాన్నగారూ …… ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం ……. పెద్దయ్య : నాన్నా …… కృష్ణా ……. పెళ్లి అంటే మనవైపు నిర్ణయం మాత్రమే కాదు – ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురుచూస్తున్న ఆ అమ్మాయిని బాధపెట్టకూడదు . ఇప్పటికిప్పుడు లేచి పెళ్ళిపనులు చెయ్యడానికి నేను రెడీగా ఉన్నాను . కృష్ణా …… సహాయం చేయడానికి మేమూ ఉన్నాము కదా ……. పెద్దయ్య : ఇంకేమిటి కృష్ణా …….. , ఇంతమందికి ఆదర్శప్రాయమైన మనమే ఇలా చెయ్యకూడదు . కృష్ణ : అయితే మీ ఇష్టం నాన్నగారూ ……. పెద్దయ్య : శ్రీమతి గారూ – తల్లీ ……. పెళ్ళికొడుకుని చెయ్యడానికి అన్నీ సిద్ధమేకదా ……… దేవత కన్నీళ్లను తుడుచుకుని , రెడీ చేసాము నాన్నగారూ …….. పెద్దయ్య : ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకండి , గుడికి వెళ్లి పెళ్లి పందిరి కోసం ఉంచిన వాటికి పూజచేసి తీసుకొచ్చి నీ తమ్ముడిని పెళ్ళికొడుకుని చెయ్యి తల్లీ …… కృష్ణ : అన్నయ్యా ……. మీరెక్కడకూ వెళ్ళడానికి వీలులేదు , నాన్నగారు చెప్పినట్లు పెళ్లి – ఆతిథ్యం స్వీకరించాల్సిందే …….. బుజ్జితల్లీ …… వెళ్ళిపొమ్మన్నావు కదా ……. బుజ్జితల్లి : మళ్లీ నోటిని మూసేసి ప్రాణంలా ముద్దుపెట్టి sorry అంకుల్ అంటూ గట్టిగా హత్తుకుంది . దేవత ……. నాదగ్గరికివచ్చి , ఉండండి మహేష్ గారూ అనిచెప్పి లోపలికి వెళ్లిపోయారు . యాహూ ……. అంటూ లోలోపలే సంతోషంతో కేకలువేసి , బుజ్జితల్లిని ఎత్తుకుని పెద్దయ్య దగ్గరకువెళ్లి , పెద్దయ్యా …… కంఫర్ట్ గా ఉందా అని నొప్పిలేకుండా కూర్చునేలా చేసాను .

థాంక్యూ అంకుల్ అంటూ బుజ్జితల్లి సంతోషంతో పదేపదే ముద్దులుపెడుతోంది – ప్రాణంలా హత్తుకుంటోంది . బుజ్జితల్లి అమ్మమ్మ గారు వచ్చి , బాబూ ….. రాత్రంతా ప్రయాణం – ఉదయం నుండీ హాస్పిటల్లోనే ఉన్నావట కదా లోపలికివచ్చి స్నానం చెయ్యి బాబూ ……. పెద్దమ్మా …… ఎవరు చెప్పారు ? . పెద్దమ్మ : నా కూతురు చెప్పింది బాబూ …… నా కూతురిని జాగ్రత్తగాతీసుకొచ్చావు – నా భర్తను కాపాడి పెళ్లి జరుగుతోంది అంటే నీవల్లనే – మా దేవుడితో సమానం , ముందు లోపలికి రా బాబూ నీ ఇల్లే అనుకో , పై గదికి వెళ్లు ఎవ్వరూ ఉండరు అంటూ బుజ్జితల్లిని అందుకోబోయారు . బుజ్జితల్లి : ఊహూ …… అంకుల్ తోనే ఉంటాను – పైకి నేను తీసుకెళతాను అని ముద్దుముద్దుగా ముద్దులుపెట్టి గట్టిగా హత్తుకుని చెప్పింది . అంకుల్ స్నానం చేసేవరకూ బెడ్ పైననే బుద్ధిగా కూర్చుంటాను . బుజ్జితల్లి నా బుజ్జితల్లి మాటలకు ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేను . పెద్దమ్మ : మా బుజ్జితల్లి ఒక్కసారి ఇష్టపడితే ఇంతే వదలనే వదలదు – బంగారుకొండ అని చేతితో ముద్దుపెట్టి సరే నువ్వే తీసుకెళ్లు మీ అంకుల్ ను – బాబూ …… ఏమనుకోకు కాస్త తొందరగా వస్తావు కదూ , ఎందుకంటే నువ్వు వస్తేనేకానీ పెళ్ళికొడుకు కదలడు – మా బుజ్జితల్లి అమ్మ గుడికి కదలడు – బుజ్జితల్లి తాతయ్య …… ఇక సరే సరి . పెద్దమ్మా …… నాకోసం ……. పెద్దమ్మ : ఆ దేవుడే వచ్చి చెప్పినా ఇప్పుడు విననే వినరు – నువ్వంటే అంత ఇష్టం అయిపోయావు – స్టార్ట్ చేస్తే నేనూ ఊరుకోను . పెద్దమ్మా ……. నా అదృష్టం , సరే వెంటనే వచ్చేస్తాను – బుజ్జితల్లీ ఎటువైపు అని అడిగి పైకివెళ్ళాను . కీర్తీ తల్లీ …… కింద ఉద్వేగ వాతావరణంలో నీ బుజ్జి బార్బీ డ్రెస్ సరిగ్గా చూడలేదు , sooooo క్యూట్ అంటూ బెడ్ పై కూర్చోబెట్టాను . చుట్టూ చూసి ఇల్లు కూడా బాగుంది – మినిట్స్ లో ఫ్రెష్ అయ్యివచ్చేస్తాను అంటూ హైఫై చూయించాను . బుజ్జితల్లి బుజ్జిచేతితో హైఫై కొట్టి అంతేనా అంకుల్ అని బుంగమూతితో అడిగింది . మా బుజ్జితల్లి బుంగమూటలో కూడా ముద్దొచ్చేస్తోంది . బుజ్జితల్లి : ఆ ఆ ముద్దులే అడుగుతున్నాను – ముద్దొస్తోంది అంటున్నారు కానీ వచ్చినప్పటి నుండీ ఎంతో ఆశతో చూస్తున్నాను ఒక్క ముద్దైనా పెట్టారా …… ? – మా మంచి అంకుల్ కు నేనెన్ని ముద్దులుపెట్టాను . ఓ ఓ …… ఆదా సంగతి , sorry sorry బుజ్జితల్లీ …… ఒక్క ముద్దుతో తనివితీరదు – తెల్లవారుఘామున 5 గంటలకు నా బుజ్జితల్లిని వదిలి వెళ్లిపోయానా 6 గంటలు 7 గంటలు 8 గంటలు 9 10 ….

11 గంటలు అంటే దాదాపు 6 గంటల తరువాత నా ప్రాణాన్ని చూశాక గానీ నా ప్రాణం నిలబడలేదు – నిన్ను చూశాకనే ఈ గుండె నార్మల్ గా కొట్టుకుంది – నీకు దూరంగా ఉన్న ఆ 6 గంటలు నేను నేనులా లేను – అంకుల్ అంటూ పరుగునవచ్చి హత్తుకోగానే ఆ 6 గంటల్లోని ప్రతీ నిమిషం కాదు కాదు ప్రతీ క్షణానికొక ముద్దుపెట్టాలని ఉన్నా ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా …….. ? , ఇప్పటికి కూడా ……. బుజ్జితల్లి : అంకుల్ అంటూ లేచి నామీదకు జంప్ చేసి బుగ్గలపై ముద్దుపెట్టి , అడ్డు ఎవరు అంకుల్ మీకు కానివ్వండి . నా బుజ్జితల్లీ ….. నా కీర్తీ తల్లీ …… నా బుజ్జి ఏంజెల్ …… నిన్ను మనసారా గుండెలపై హత్తుకున్నాకే నేను శ్వాసిస్తున్నానని తెలిసింది అంటూ నిమిషం పాటు ముద్దులవర్షం కురిపించి , రోజంతా ముద్దులుపెడుతూనే ఉండాలని ఉంది . బుజ్జితల్లి : నేను రెడీ అంకుల్ ……. కానీ మనం కిందకు వెలితేనే కానీ పెళ్ళిపనులు మొదలుపెట్టరట అంటూ ప్రాణం లా హత్తుకున్నాను . బుజ్జితల్లి : అంకుల్ ……. నిన్నటివరకూ మమ్మీ వస్తేనే కానీ అమ్మమ్మా – తాతయ్య వాళ్ళు పెళ్ళిపనులు మొదలెట్టము అన్నారు – ఇప్పుడు మీరు వెలితేనే ……. , అంటే మమ్మీ కంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం అందరికీ – మిమ్మల్ని దేవుడు అన్నారుకదా …… , ఇప్పుడు నేనూ చెబుతున్నాను మా అంకుల్ నిజంగా దేవుడే …….. లవ్ యు అంకుల్ ……. లవ్ యు అన్నావా బుజ్జితల్లీ నా బుజ్జితల్లీ ……. లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లీ అంటూ మళ్లీ ముద్దులు కురిపిస్తున్నాను . బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులు చిందిస్తూనే , అంకుల్ ……. కిందకు వెళ్లాలన్నారు అని గుర్తుచేసే నవ్వుతోంది . నా ముద్దుల కీర్తీ తల్లి మాయలో పడి మరిచేపోయాను అంటూ ముద్దులుపెడుతూనే వదల్లేక వదల్లేక బెడ్ పై కూర్చోబెట్టి , గేమ్ ఆడుతూ ఉండు ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని మొబైల్ ఇచ్చి , బ్యాగుతోపాటు బాత్రూమ్లోకి వెళ్ళాను . బ్యాగులోనుండి బ్రష్ పేస్ట్ తీసుకుని కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ గా తలంటు స్నానం చేసి బ్యాగులోని డ్రెస్ వేసుకుని బయటకువచ్చాను . బుజ్జితల్లి : నో నో నో అంకుల్ …… , మమ్మీ …… అమ్మమ్మ చేత మావయ్యకోసం కొన్న కొత్త డ్రెస్ మీకోసం పంపించారు . మావయ్య పెళ్ళికోసం కొన్న డ్రెస్ కదా ……. , ఇష్టంతో తీసుకుని ఉంటాడు కృష్ణ పర్లేదులే ……. బుజ్జితల్లి : ఈ కొత్త డ్రెస్ వేసుకోకపోతే మొదట మమ్మీ ఆ వెంటనే అమ్మమ్మ – మావయ్య చివరగా కాదు కాదు ముఖ్యంగా నేను ఏడుస్తాను . అమ్మో అమ్మో ……. న బుజ్జితల్లి కంట కన్నీళ్లు చూస్తే ఈ అంకుల్ తట్టుకోగలడా వెంటనే మార్చేసుకుంటాను . బుజ్జితల్లి : గుడ్ బాయ్ అంటూ అందించి అటువైపుకు తిరిగింది .

హ హ హ …… ఉమ్మా ఉమ్మా …… అంటూ డ్రెస్ మార్చుకుని బుజ్జితల్లిని రెండుచేతులతో అమాంతం ఎత్తుకుని ముద్దుచేస్తూ కిందకువచ్చాను – దేవత కనిపించగానే ముద్దులు ఆపేసాను . బుజ్జితల్లి : మమ్మీ అంటే అంత భయమా అంకుల్ ……. చాలా అంటే చాలా అంటూ చిలిపినవ్వులతో తలదించుకుని బయటకు నడిచాను . బుజ్జితల్లి : వెనుకకు చూసి అంకుల్ …… మమ్మీ కూడా మీలానే నవ్వుతోంది – డ్రెస్ సూపర్ అంటున్నారు . వెంటనే వెనక్కు తిరిగిచూస్తే నవ్వడం ఆపేసి కోపంతో చూస్తున్నారు . ప్చ్ ……… కృష్ణ : అన్నయ్యా ……. సూపర్ గా ఉన్నారు , నాకంటే మీకే డ్రెస్ బాగుంది అని నా ప్రక్కన చేరారు . పెద్దయ్య : మా ఇంటి దేవుడు వచ్చాడు , పెళ్ళిపనులు మొదలెట్టండి – భాజా భజంత్రీలు మ్రోగించండి – తల్లీ మహీ శ్రీమతిగారూ …….. దేవత : రెడీ నాన్నగారూ అంటూ పూజాసామాగ్రితో బయటకువచ్చారు . లోపల చూడలేదు కానీ కొత్త పట్టుచీరలో ముత్తైదువుల మధ్యన అందమైన నవ్వులతో దివినుండి భువిపైకి దిగివచ్చిన దేవతలా ఉండటం కన్నార్పకుండా చూస్తున్నాను . బుజ్జితల్లి : ఏమిటి అంకుల్ చూస్తున్నారు ? , మమ్మీ …… బ్యూటిఫుల్ కదా …… కనురెప్ప కూడా వెయ్యడం లేదు . అవునవును ……. లేదు లేదు బుజ్జితల్లీ అలాంటిదేమీ లేదు . అంతలో నా ప్రక్కనుండి దేవత ముసిముసినవ్వులతో ముందుకువెళ్లారు . రోడ్డుపై ఆగి నావైపు చూస్తున్నట్లు చూస్తూ తమ్ముడూ రారా అని పిలిచి నవ్వుతూ వెళ్లారు . కృష్ణ : నాన్నగారూ జాగ్రత్త వెళ్ళొస్తాము అని పాదాలను స్పృశించి ఆశీర్వాదం తీసుకున్నాడు . కృష్ణా …… మాలో కొంతమంది ఇక్కడే ఉంటారులే , వాళ్ళు చూసుకుంటాము కదా పదా గుడికి వెళదాము . కృష్ణ : సరే , అన్నయ్యా …… రండి అని నా గుండెలపై ఉన్న బుజ్జితల్లి బుగ్గపై చేతితో ముద్దుపెట్టాడు . దేవత మరియు ఊరి ఆడాళ్లందరి వెనుక బుజ్జితల్లిని ముద్దుచేస్తూ దగ్గరలోని గుడికి వెళ్ళాము . గుడిలో దేవత చేతులమీదుగా పందిరి కొమ్మలకు పూజ జరిగింది . మేళ తాళాలతో పందిరి కొమ్మలను తీసుకుని ఇంటికి చేరుకున్నాము . శాస్త్రం ప్రకారం నిమిషాలలో పందిరి నిర్మించడంతో కృష్ణ పంచె కట్టుకునివచ్చి పందిరి కింద కూర్చున్నాడు . ఇక అక్కడున్న అందరి చూపూ బుజ్జితల్లిపైనే పడింది . పెద్దమ్మ వచ్చి బుజ్జితల్లీ ……. తోడు పెళ్లికూతురు తమరే మేడం , కొద్దిసేపు మీ అంకుల్ ను వదిలి మీ మావయ్య దగ్గరికి చేరాల్సిందే ……. బుజ్జితల్లీ ……. తోడు పెళ్లికూతురు ? ప్రాణంలా ముద్దుపెట్టబోయి దేవతను చూసి ఆగిపోయి పెద్దమ్మకు అందించాను . దేవత ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . బుజ్జితల్లి : చూసి నవ్వి , అంకుల్ ……. స్నానం పూర్తవగానే వచ్చేస్తాను అంతవరకూ మీరు ఇదిగో ఇక్కడే నా ఎదురుగానే ఉండాలి అని ముద్దుముద్దుమాటలతో ముద్దుపెట్టి అమ్మమ్మా …… అంటూ వెళ్ళింది .

పెద్దమ్మ : మా బుజ్జి బంగారానికిమా అందరికంటే అంకుల్ అంటేనే ఇష్టం అన్నమాట , మీ అంకుల్ ……. నిన్ను వదిలి ఎక్కడకూ వెళ్లకుండా మేము చూసుకుంటాములే అని ముద్దుచేస్తూ కృష్ణ ప్రక్కన కూర్చోబెట్టారు . చూడటానికి ముచ్చటెయ్యడంతో కెమెరామెన్ ఫోటోలు తీస్తున్నా , నా మొబైల్ తీసి ఫోటోలు తియ్యడం చూసి బుజ్జితల్లి ముద్దుముద్దుగా నవ్వుతోంది . పెళ్ళికొడుకు – తోడు పెళ్లికూతురికి పసుపు పూసే కార్యక్రమం దేవతతో మొదలయ్యింది . వారి తమ్ముడి ముఖం – చేతులు – ఛాతీ – పాదాలకు మొత్తం పసుపు పూసి , నావైపు చూసి చిరునవ్వులు చిందిస్తూ బుజ్జితల్లి ముఖానికి – మెడకు – బుజ్జి చేతులకు – బుజ్జిబుజ్జి పాదాలకు పూసి లవ్ యు రా అంటూ కురులపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . ఇద్దరికీ హారతి ఇచ్చి నుదుటిపై కుంకుమ పెట్టి ఇద్దరు వెనుక చేరి అమ్మా కానివ్వు అని పిలిచారు . బుజ్జితల్లి : అమ్మమ్మా …… ఆగు , మమ్మీ తరువాత ఫస్ట్ అంకుల్ ఆ తరువాత మీ ఇష్టం అలా అయితేనే మావయ్య ప్రక్కన కూర్చుంటాను . కృష్ణ : లవ్ యు బుజ్జితల్లీ …… , నా కోరికనే నువ్వు చెప్పావు అని బుజ్జిచేతిని అందుకుని ముద్దుపెట్టాడు . అందరూ సంతోషంతో నవ్వుతున్నారు . బుజ్జితల్లీ ……. ముందు పెద్దవారు అని బుజ్జితల్లి ప్రేమకు ప్రాణంలా చూస్తున్నాను . బుజ్జితల్లి : తాతయ్య – అమ్మమ్మ – మావయ్య – మమ్మీ ……. అందరూ చెప్పారుకదా మీరు దేవుడని కాబట్టి మీరు ఫస్ట్ , అలా అయితే లేకపోతే …….. అందరితోపాటు పెద్దయ్య కూడా సంతోషంతో నవ్వుతున్నారు బుజ్జితల్లి ముద్దుమాటలకు …….. పెద్దమ్మ : సరే బుజ్జి మేడం గారూ …… , తమరెలా చెబితే అలా …… , బుజ్జిదానివైనా సరిగ్గా చెప్పావులే …… ఉమ్మా ఉమ్మా …… బుజ్జితల్లి : ముద్దులుకూడా అంకుల్ తరువాతనే అంటూ బుజ్జిచేతితో ఆపడం చూసి సంతోషపు నవ్వులు విరిసాయి . పెద్దమ్మ తియ్యదనంతో బుంగమూతిపెట్టుకుని , బాబూ …… రండి అని పిలిచారు . పెద్దమ్మా ……. ఏదో చిన్నతనం పెద్దవారు ముందు . పెద్దమ్మ : నువ్వు కాకుండా మరొకరు దగ్గరకు వెళితే కొట్టేలా ఉంది బాబూ …… ( నవ్వులు ఆగడం లేదు ) , చిన్నదైనా సరిగ్గా చెప్పింది – ఇలా సంతోషాలు పరిమాలిస్తున్నాయి ఆటే కారణం నువ్వు – మొదట నువ్వు పసుపు రాయడమే కరెక్ట్ అంటూ చేతిని పట్టుకుని పందిరి కిందకు చేర్చి పసుపు అందించారు . Sorry మేడం అంటూ దేవతవైపు చూసాను . దేవత : తియ్యదనంతో నవ్వుతూ కానివ్వండి అంటూ అందమైన కళ్ళతో సైగచేశారు . బుజ్జితల్లీ …….. మీ మమ్మీ పర్మిషన్ ఇచ్చేసారు అంటూ సంతోషంతో దేవత చేసినట్లు ముందు కృష్ణ ముందుకువెళ్ళాను . బుజ్జితల్లి బుంగమూతిపెట్టుకోవడం చూసి , అన్నయ్యా …… మొదట బుజ్జితల్లికి పసుపు రాయండి లేకపోతే నన్ను కూడా కొట్టేలా ఉంది . అధికాదు బుజ్జితల్లీ ….. శాస్త్రం ప్రకారం , మమ్మీ కూడా మొదట ……..

బుజ్జితల్లి : మమ్మీకి …… నాకంటే వాళ్ళ తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టం . దేవత : అవును నిజమే నాకు నా తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టం అంటూ బుజ్జి బుగ్గను గిల్లేసారు . చుట్టూ సంతోషాల నవ్వులు చూసి పెద్దయ్య ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు . బుజ్జితల్లి : అంకుల్ …… మమ్మీలా మీకు కూడా మావయ్య అంటేనే ఇష్టం కదా అంటూ బుంగమూతి పెట్టుకుంది . లేదు లేదు లేదు మీ తాతయ్యకు – అమ్మమ్మకు – మమ్మీకు – మీ మావయ్యకు …… నాకు మా బుజ్జితల్లి అంటేనే ప్రాణం అంటూ సంతోషంతో మొదట బుజ్జితల్లికి సున్నితంగా పసుపు రాసి హ్యాపీనా అంటూ కృష్ణ ముందుకు వెళ్ళాను . లవ్ యు అంకుల్ అంటూ లేచి , కృష్ణకు పసుపు రాయడానికి వొంగిన నా బుగ్గపై తియ్యనైన ముద్దుపెట్టింది . దేవత : మొదట పసుపు రాసింది నేనుకదా బుజ్జితల్లీ ……. , నాకు పెట్టలేదే ముద్దు . బుజ్జితల్లి : నాకు మమ్మీకంటే అంకుల్ అంటేనే ఇష్టం కాబట్టి , ఆ మాత్రం తెలియదా మమ్మీ ……… దేవత ఈ ఈ …… అంటూ ఏడుపు నటించడం చూసి , సరే సరే ఏడవకు మమ్మీ … అంటూ దేవతకు ముద్దుపెట్టి కూర్చుంది . దేవత : ఇప్పుడు హ్యాపీ ……. , లవ్ యు బంగారూ …… అంటూ ముద్దుపెట్టబోతే …….. మమ్మీ స్టాప్ ……. అంకుల్ ఇంకా ముద్దుపెట్టలేదు అంటూ నోటికి అడ్డంగా బుజ్జిచేతిని అడ్డుపెట్టింది . మహీ మహీ ……. అవునుకదా , కాస్త కంట్రోల్ చేసుకో లేకపోతే కీర్తితో దెబ్బలు తింటావు అని చుట్టూ ఉన్న ఆడవాళ్ళంతా నవ్వుతున్నారు . దేవత ……నావైపు చిరుకోపంతో చూస్తున్నారు . Sorry sorry మేడం అంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తూ కృష్ణకు పసుపు పూసి బుజ్జితల్లి కురులపై ప్రాణమైన ముద్దుపెట్టి వెనక్కువచ్చాను . దేవత : ఆగండాగండి ఎంతైనా మా ఇంటి దేవుడు , హారతి కూడా ఇవ్వాలి . అవునవును బాబూ అంటూ పెద్దమ్మ …… నా చేతికి అందించడంతో హారతి తీసి ఇద్దరికీ బొట్టుపెట్టి చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జితల్లి కురులపై ముద్దుపెట్టి వెనక్కువచ్చాను . బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ …….. చుట్టూ ఆడవాళ్లు : ఇక నీ బుజ్జితల్లికి ముద్దుపెట్టుకో మహీ ……. అంటూ ఆటపట్టించి నవ్వుతున్నారు . దేవత : తియ్యనికోపంతో ……. ఇప్పుడైనా ముద్దుపెట్టొచ్చా బుజ్జిమేడం గారూ అని అడిగారు . బుజ్జితల్లి : లవ్ యు మమ్మీ అంటూ ముద్దుపెట్టింది . దేవత : హ హ హ లవ్ యు బంగారూ అంటూ కురులపై ముద్దుపెట్టి బుజ్జి బుగ్గను గిల్లేసారు . బుజ్జితల్లి : స్స్స్ ……. చూడండి తాతయ్యా – అంకుల్ అంటూ రుద్దుకోవటం చూసి చాలా చాలా ఆనందం వేసింది . పెద్దయ్య : నొప్పివేస్తోందా బుజ్జితల్లీ …… , స్నానం అయిన తరువాత ఇద్దరమూ కలిసి మీ మమ్మీ బుగ్గలను గిల్లేద్దాములే సరేనా ……. బుజ్జితల్లి : థాంక్యూ తాతయ్యా ……. దేవత ……. బుజ్జితల్లివైపు తియ్యనైన కోపంతో చూడటం చూసి నవ్వుకున్నారు .

నెక్స్ట్ పెద్దమ్మతో కంటిన్యూ అయిన కార్యక్రమం ముత్తైదువులందరూ పూయడంతో పూర్తయ్యింది . ఆ వెంటనే చిన్నా పెద్దా మొదలుకుని అందరూ తడి పసుపును చేతుల్లోకి తీసుకుని వారికిష్టమైన వారికి పరుగులుపెట్టించి మరీ పూసే కార్యక్రమం బహు ముచ్చటగా జరిగింది . పెద్దమ్మ …… పెద్దయ్యకు – ఆడవాళ్లు …… వారి వారి భర్తలకు ……. బుజ్జితల్లి ……. నాదగ్గరికి పరుగునవచ్చి రెండుచేతులూ చాపడంతో లవ్ యు లవ్ యు అంటూ ఎత్తుకోగానే , అంకుల్ …… అంటూ రెండుచేతులతో నా ముఖం మొత్తం పూసేసి నవ్వుతోంది . అమ్మ దొంగా …… ఉండు నీకూ పూస్తాను . బుజ్జితల్లి : నా వొళ్ళంతా పసుపే కదా అంకుల్ ఇంకెక్కడ పూస్తారు అంటూ కిందకుదిగి పరుగుతీసింది . బుజ్జితల్లీ బుజ్జితల్లీ అంటూ పసుపు అందుకుని వెనుకే పరుగుతీసాను . బుజ్జితల్లి వెళ్లి దేవత వెనుక దాక్కుంది – అంతే చేతులుకట్టుకుని కదలకుండా తలదించుకున్నాను . దేవత : నాకు పూయడానికే వచ్చారా ? . భయంతో నో నో నో అన్నట్లు తలఊపాను . దేవత రెండుచేతులతో నా బుగ్గలపై పూసి పరుగున వారి అమ్మ దగ్గరకు చేరారు . స్వీట్ షాక్ చెంది , దేవతకు పసుపు పూయాలన్న కోరికను కంట్రోల్ చేసుకుని , బుజ్జితల్లీ ……. దొరికావు అంటూ ప్రాణంలా హత్తుకున్నాను . దేవత …… ఆరాధనతో చూడటం గమనించలేకపోయాను . Like 224 Dislike 28 129305 15 0 cookie-check శృంగార స్టోరీ 259 no

Categories Telugu
More stories See all