శృంగార స్టోరీ 261
ఉదయం గమనించలేదు కానీ రోడ్డుపై ముందుకు వెళుతున్నకొద్దీ రోడ్డు మరీ ఘోరంగా ఉంది అక్కడక్కడా వర్షపు నీళ్లుకూడా నిలబడ్డాయి . గుడిప్రక్కనే ఉన్న విశాలమైన govt గ్రౌండ్ కు చేరుకున్నాము . Wow ….. కృష్ణా ఎంతమందైనా ప్రశాంతంగా పెళ్లి చూసేంత విశాలంగా ఉంది . చుట్టూ చూస్తూ కాస్తదూరంలో వందలమంది కాలేజ్ పిల్లలు చెట్టుకింద కూర్చుని పాఠాలు వింటుండటం చూసాను – చెట్టునీడ కొద్దిమంది పిల్లలపై మాత్రమే పడింది , 40% పిల్లలు మిట్టమద్యాహ్నం ఎండలోనే కూర్చుని టీచర్ చెబుతున్న పాఠాలు వింటూ చెమటను తుడుచుకుంటున్నారు . కృష్ణా …… కాలేజ్ బిల్డింగ్ లేదా పిల్లలంతా బయట కూర్చున్నారు . అంతలో భయంకరమైన శబ్దం . కాలేజ్ పైకప్పు పడిపోయినట్లుంది అన్నయ్యా అంటూ కృష్ణ – ఫ్రెండ్స్ పరుగుపెట్టారు . బుజ్జితల్లిని జాగ్రత్తగా పట్టుకుని వెనుకే పరుగుతీసాను . చెట్టుకింద కూర్చున్న పిల్లలంతా భయంతో మావైపుకు పరుగులుతీశారు . చూస్తుండగానే మిగిలిన పైకప్పు కూడా కుప్పకూలిపోయింది . ఎంత ప్రమాదం తప్పింది ఇలా జరుగుతుందని ఉదయమే అనిపించడంతో పిల్లలందరినీ చెట్టుకిందకు చేర్చాము అని కాలేజ్ టీచర్ చెప్పడంతో అందరమూ ఊపిరిపీల్చుకున్నాము . అయినా సరే కృష్ణ …… ఆ టీచర్ ను పదే పదే అడిగాడు అందరూ ఇక్కడే ఉన్నారుకదా – ఎవ్వరూ లేరుకదా అని ……. టీచర్ : లేదు కృష్ణా …… , ఉదయం నుండీ పిల్లలనే కాదు ఎవ్వరినీ అటువైపు పంపలేదు . కృష్ణ : మంచిపనిచేశారు సర్ , మీవలన …… తలుచుకుంటేనే భయం వేస్తోంది . ఊరిజనమంతా అక్కడకుచేరి ఏడుస్తున్న వారివారిపిల్లలను అక్కున చేర్చుకుని దేవుడికి – టీచర్ కు థాంక్స్ చెప్పుకున్నారు . కృష్ణ : రొడ్డయినా 20 – 30 ఏళ్లది అన్నయ్యా …… , కాలేజ్ అయితే బ్రిటిష్ కాలం నాటిది . ఎంత కంప్లైంట్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు . కృష్ణా – హెడ్ మాస్టర్ గారూ ……. పిల్లలకు ఏమీకాలేదు కదా , ఓట్లకు మాత్రం వచ్చేస్తారు – మా కష్టాలు చెప్పుకోవడానికి వెళితే కనీసం కలవను కూడా కలవరు . పుట్టిన ఊరికి ఏమీచెయ్యడానికి వీలులేని ఈ సర్పంచ్ పదవి ఉంటే ఎంత లేకపోతే ఎంత వెంటనే వదిలేస్తాను . ఊరిజనం : సర్పంచ్ గారూ …… మీ గురించి మాకు తెలియదా ? , పెద్దయ్యతో కలిసి మీ మీ సొంత డబ్బుతో ఎన్ని మంచిపనులు చేశారు – పదవిలో ఉంటేనే పట్టించుకోవడం లేదు ఇక వదిలేస్తే …… అని బాధపడుతున్నారు . కృష్ణ : అన్నయ్యా …… మనూరి సర్పంచ్ – నాన్నగారి స్నేహితుడు . ఉన్నడబ్బంతా ఊరికోసమే ఖర్చు చేశారు – ఉంటున్న ఇల్లుని కూడా అమ్మేసి నష్టపోయిన రైతులను ఆదుకున్నారు – కోనేరులో స్నానం చేస్తారు గుడిలోనే పడుకుంటారు . అందుకే అందరికీ గౌరవం . కృష్ణా …… మరి మనం ఉంటోన్న ఇల్లు ? .
కృష్ణ ఫ్రెండ్స్ : సర్పంచ్ కంటే ముందే అమ్మేసి , ఆ డబ్బుతో చాలామందిని పైచదువులకోసం సిటీకి పంపించారు – ఉన్న ఇంట్లోనే బాడుగకు ఉంటున్నారు – ఆ డబ్బే ఇద్దరి దగ్గర ఉండి ఉంటే ఎప్పుడో కాలేజ్ కట్టించేసేవారు అని కృష్ణ భుజాలపై గర్వపడుతూ చేతులువేశారు . హెడ్ మాస్టర్ – సర్పంచ్ చుట్టూ పిల్లలుచేరి రేపటి నుండి ఎక్కడ చదువుకోవాలి అని ఏడుస్తూ అడుగుతున్నారు . ఆ దృశ్యాన్ని చూసి బుజ్జితల్లి కంటిలోనుండి బుజ్జి కన్నీళ్లు – అంకుల్ అంటూ నన్ను గట్టిగా హత్తుకుంది . బుజ్జితల్లి కన్నీళ్లను చూసి నా గుండె చలించిపోయింది . ఒకరేమో ……. ఉన్నదంతా తమకోసం కాకుండా పిల్లల చదువులకు ఖర్చుపెట్టారు – మరొకరేమో ……. రైతులకోసం సర్వస్వం దానం చేసి గుడిలో ఉంటున్నారు . ఇకపై కూడా సంతోషంగా సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు . మొబైల్ తీసి నా అకౌంట్ బ్యాలన్స్ చూసుకున్నాను కోట్లకు కోట్లు బ్యాంకులలో మూలుగుతోంది – నా డబ్బు బడాబడా వ్యాపారులకు ఉపయోగపడుతోంది , వాళ్లేమో ……. IP పెట్టి దర్జాగా విదేశాలకు పారిపోతున్నారు – నా డబ్బు వాళ్ళు ఎంజాయ్ చెయ్యడం ఏమిటి ? – నాకు ఊరికోసం సహాయం చేసి ఆనందిస్తున్న పెద్దయ్య – సర్పంచ్ ఆస్వాధిస్తున్న పొందుతున్న ఆనందం కావాలి – నా డబ్బు పేదవారికి , రైతులకు , కష్టాలలో ఉన్నవారికి ఉపయోగపడాలి . బుజ్జితల్లీ ……. రేపు ఈ సమయానికి ఈ కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలు నింపుతాను – నీ బుజ్జి కన్నీళ్ళతో నా కళ్ళు తెరిపించావు , సంపాదించడంలో కాదు అవసరమైనప్పుడు సరైన సమయంలో కష్టాలలో ఉన్నవారికి తోచినంత సహాయం చేసినవాడే మనిషి – శ్రీమంతుడు అని నుదుటిపై ముద్దుపెట్టాను . ఏడుస్తున్న కాలేజ్ పిల్లలకు ఏమిచెప్పాలో – ఎలా ఓదార్చాలో తెలియక బాధపడుతున్న సర్పంచ్ దగ్గరకువెళ్లి , సర్పంచ్ గారూ …… సమాధానం నాదగ్గర ఉంది నాతోపాటు వస్తారా ? . సర్పంచ్ : పిల్లలకోసం ఎక్కడికైనా వస్తాను పదండి . కృష్ణా ….. పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చి నాన్నగారి దగ్గరకువెల్లు – పెళ్లికి సంబంధించినది ఏది గుర్తొచ్చినా కాల్ చెయ్యి – పిల్లల గురించి ఏమీ టెన్షన్ తీసుకోకు , తమ్ముళ్లూ ……. రండి వెళదాము అని సర్పంచ్ గారితోపాటు షేరింగ్ ఆటోలో సిటీకి బయలుదేరాము . సర్పంచ్ గారూ …… మీకు తెలిసిన మంచి కాంట్రాక్టర్ ను వైజాగ్ HDFC మెయిన్ బ్రాంచ్ దగ్గరకు రమ్మని పిలవగలరా …….. ? . నా కళ్లల్లో – మాటల్లో ……. నమ్మకం చూసినట్లు ఎందుకు ? – ఏమిటీ ? అని అడగకుండా మొబైల్ తీసి కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు . బాబూ …… సిటీలోనే ఉన్నారట , కొద్దిసేపట్లో వస్తానని చెప్పారు . మంచిది సర్పంచ్ గారూ …… , నాపై నమ్మకం ఉంచినందుకు కూడా ……. , బుజ్జితల్లీ ……. ఏంటి ఏమీ మాట్లాడటం లేదు .
బుజ్జితల్లి : అంకుల్ …… కాలేజ్లో ఆక్కయ్యలు – అన్నయ్యలు ఏడ్చారు కదా అని మళ్ళీ బుజ్జికన్నీళ్ళతో నా షర్ట్ ను గట్టిగా పట్టుకుంది . నా బుజ్జితల్లి కన్నీళ్లకు చలించిపోయాను కాబట్టే మీ ఆక్కయ్యలు – అన్నయ్యల కన్నీళ్లను తుడవడానికే వెళుతున్నాము . నా ముద్దుల బుజ్జితల్లి కన్నీళ్లను చూస్తే నేను తట్టుకోగలనా చెప్పు అని తుడిచి ప్రాణంలా హత్తుకున్నాను . డీజిల్ ఆటోలో నేరుగా FDFC మెయిన్ బ్రాంచ్ చేరుకున్నాము . సర్పంచ్ : బాబూ ……. కాంట్రాక్టర్ మనకంటే ముందే వచ్చేసారు వారే అంటూ వెళ్లి చేతులుకలిపారు . కాంట్రాక్టర్ : ఏంటి సర్పంచ్ గారూ ……. ఇంత అర్జెంట్ గా రమ్మని పిలిచారు ? ఏంటి విషయం ? . సర్పంచ్ : పిలవగానే వచ్చినందుకు థాంక్స్ కాంట్రాక్టర్ గారూ …… కాంట్రాక్టర్ : ఎంతమాట సర్పంచ్ గారూ …… మీపై – మీ స్నేహితుడు నాకు అపారమైన గౌరవం , మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తాను , చెప్పండి విషయం ఏమిటి ? . సర్పంచ్ గారు నావైపుకు తిరిగి , కాంట్రాక్టర్ గారూ …… కొద్దిసేపటి ముందు ఉన్నట్టుండి కాలేజ్ పైకప్పు కుప్పకూలిపోయింది – గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని బాధపడుతూ చెప్పారు . కాంట్రాక్టర్ : పిల్లలకు ఏమీజరగలేదు కదా …… సర్పంచ్ : మా అదృష్టం బాగుండి ఏమీ జరగలేదు . కాంట్రాక్టర్ : థాంక్ గాడ్ ……. , ఎన్నిసార్లు ఆ విషయమై అధికారులను కలిశారో నాకు తెలుసు , నన్ను ఇంత అర్జెంట్ గా పిలిపించారంటే కాలేజ్ బిల్డింగ్ కోసం అమౌంట్ ………. సర్పంచ్ : లేదు లేదు కాంట్రాక్టర్ గారూ …….. కాంట్రాక్టర్ : మరి నన్ను పిలిపించిన విషయం …….. కాంట్రాక్టర్ గారూ ……. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న గోడలను పూర్తిగా నేలమట్టం చేసి , అదే స్థలంలో కాలేజ్ పిల్లలకు ఇంటర్నేషనల్ కాలేజ్స్ స్థాయిలో కొత్త బిల్డింగ్స్ నిర్మించడానికి ఎంత అవుతుంది సర్ ? . కాంట్రాక్టర్ : ఇతను ……. ఎవరైతే ఏంటీలే , నువ్వు చెప్పినట్లుగా చేయాలంటే కోటిన్నర రెండు కోట్ల దాకా ……… కానీ అంత డబ్బు ఇక్కడనుండి అని అతను కూడా ఫీల్ అవుతున్నారు . Please నాతోపాటు లోపలికిరండి అని అందరినీ పిలుచుకువెళ్ళాను . అమౌంట్ డ్రా బ్రోచర్ అందుకుని బుజ్జితల్లిని టేబుల్ పై కూర్చిబెట్టి బుజ్జితల్లి బుజ్జిచేతులతో ” 100000000 ” …….. రాయించాను – ప్రతీ జీరోకు ఒక ముద్దుపెట్టాను. వినయ్ – గోవర్ధన్ : 1 2 3 …. 8 జీరోస్ ఎంతరా ఎంతరా ……. 10 కోట్లు ? అంటూ షాక్ లో ఉండిపోయారు . సర్పంచ్ గారు – కాంట్రాక్టర్ కూడా ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు . ఒక్కనిమిషం సర్పంచ్ గారూ అంటూ బ్రోచర్ ను కౌంటర్ లో ఉన్న క్లర్క్ కు ఇచ్చాను. క్లర్క్ కూడా 1 2 3 4 ……. 8 జీరోస్ ….. this much అంటూ నావైపు గుటకలు మింగుతూ చూసాడు . కామెడీ ఏమైనా చేస్తున్నాడేమో అనుకుని నా అకౌంట్ చెక్ చేసి sorry సర్ sorry సర్ అంటూ సడెన్ గా పైకిలేచి ఆఫీస్ రూమ్ కు రండి అని ఆహ్వానించాడు .
సర్పంచ్ గారూ – కాంట్రాక్టర్ గారూ – తమ్ముళ్లూ …… రండి అని బ్యాంక్ మేనేజర్ రూమ్ కు చేరుకున్నాము . క్లర్క్ : సర్స్ …… pleaae please కూర్చోండి కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను – మేనేజర్ గారూ అంటూ బ్రోచర్ అందించారు . మేనేజర్ : అకౌంట్ చెక్ చేశావా …… ? ఇంత అమౌంట్ ఉందా …… ? . క్లర్క్ : హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ సర్ ……. – బెంగళూరు బ్రాంచ్ . అంతే మేనేజర్ గారు క్లర్క్ కంటే వేగంగా లేచి welcome సర్ అంటూ చేతులుకలిపాడు – క్లర్క్ ……. వెంటనే ఆర్రేంజ్ చెయ్యండి . క్లర్క్ : వితిన్ మినిట్స్ సర్ అంటూ వెళ్ళిపోయి ముందు డ్రింక్స్ పంపించారు . అందుకుని తమ్ముళ్లకు ఇవ్వబోతే ఇద్దరూ …… హండ్రెడ్స్ హండ్రెడ్స్ క్రోర్స్ అంటూ పెదాలను కదిలిస్తూ ఎప్పుడో షాక్ లోకి వెళ్లిపోయినట్లు కదలడం లేదు – నవ్వుకుని తమ్ముళ్లూ …… అంటూ కదిల్చి అందరికీ ఇచ్చాను . మేనేజర్ : సర్ …… మీరు మా బ్రాంచ్ లో అడుగుపెట్టడం మా అదృష్టం – ఇకనుండీ నేరుగా నా రూమ్ కే వచ్చెయ్యండి . Sure మేనేజర్ గారూ …….. డ్రింక్స్ ఫినిష్ చేసేంతలో కోటికొక బ్యాగ్ చెప్పున 10 బ్యాగులను లోపలికి తీసుకొచ్చి ఓపెన్ చేశారు . తమ్ముళ్లు నోరుతెరిచి అలా చూస్తుండిపోయారు . నవ్వుకున్నాను . సర్పంచ్ – కాంట్రాక్టర్ గారికి ఏమిజరుగుతోందో అర్థం కావడం లేదు. అంకుల్ …… అంటూ అంతే షాక్ లో చూస్తున్న బుజ్జితల్లి బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందించాను – నువ్వు నీ బుజ్జిచేతితో రాసినదే కదా బుజ్జి ఏంజెల్ ఎందుకంత ఆశ్చర్యం . మేనేజర్ : సర్ ……. 5 కౌంటింగ్ మెషిన్స్ కౌంట్ చేసుకోండి . మేనేజర్ గారూ ……. అవసరం లేదు నమ్మకం ఉంది – మేనేజర్ గారూ …… కొద్దిసేపు మీ బ్యాంక్ ప్రైవేసి రూమ్ ……. మేనేజర్ : అయ్యో ఎంతమాట సర్ …… , నా రూమ్ నే use చేసుకోండి అని బయటకువెళ్లారు . థాంక్స్ మేనేజర్ గారూ …….. సర్పంచ్ గారూ …… ఈ డబ్బు మీకోసమే ఇక మీ ఆధీనంలోనే ఉంటుంది – ఇదేకాదు ఎంత అవసరమైతే అంత అలా చిటికె వెయ్యండి మీ ముందు ఉంటుంది . కాంట్రాక్టర్ గారూ ……. ఈ డబ్బుతో కాలేజ్ బిల్డింగ్ పనులు మొదలెట్టొచ్చు కదా ….. కాంట్రాక్టర్ : ఎంతమాట బాబూ …… సర్ సర్ , ఇంత అమౌంట్ అవసరం లేదు . కాంట్రాక్టర్ గారూ …….. ఉదయం నుండీ నా ప్రాణం కంటే ఎక్కువైన ఈ బుజ్జి ఏంజెల్ ను …… గుంతలుపడిన రోడ్డు మూడుసార్లు పడేసింది . ఎంత ధైర్యం ఆ రోడ్డుకు ……. అందుకే నా బుజ్జితల్లి రేపు ఉదయం రోడ్డుపై అడుగుపెట్టేలోపు ఫ్లాట్ రోడ్డుగా మారిపోవాలి . రాత్రికి రాత్రి హైవే నుండి ఊరి వరకూ ……. వేసేయ్యాలి . బుజ్జితల్లి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది . మరి నా బుజ్జితల్లినే పడేస్తుందా ఉదయానికల్లా …… మొత్తం మార్చేద్దాము బుజ్జితల్లీ …… అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . కాంట్రాక్టర్ : రాత్రికిరాత్రి ? . అవును కాంట్రాక్టర్ గారూ …….
మీరుమాత్రమే చేయగలరని సర్పంచ్ గారు నమ్మకంతో చెప్పారు . ఎంతమంది వర్కర్స్ నైనా పిలిపించండి సూర్యోదయం లోపు రోడ్డు ఫినిష్ అయిపోవాలి – ఈ డబ్బు సరిపోదంటే చెప్పండి డబల్ అమౌంట్ డ్రా చేద్దాము కానీ రాత్రికిరాత్రి please pleaae …….. కాంట్రాక్టర్ : షాక్ నుండి తేరుకుని అక్కడికక్కడే మొబైల్ తీసి రేయ్ వెంటనే అవును వెంటనే అర్జెంట్ గా వేలల్లో ఎంతమంది దొరికితే అంతమంది మేస్త్రీలు – కూలీలు కావాలి …… ఆ అవును గంటలోపే , వందల లారీల సిమెంట్ – వందల లారీల కంకర్ – వందల లారీల ఇసుకు – వందల్లో వాటర్ టాంక్స్ – కౌంట్ లెస్ స్టీల్ – రోలర్ మెషీన్స్ ఎన్ని ఉంటే అన్నీ వీలైతే మరికొన్ని ……. మొత్తం మొత్తం తీసుకుని గంటల్లో ****** విలేజ్ రోడ్డువెంబడి స్టాక్ చేసి వర్క్ స్టార్ట్ చేసేయ్యాలి – అవును నైట్ మొత్తం డబల్ కూలీ అనిచెప్పండి – బాబూ ……. on the way . థాంక్యూ sooooo మచ్ కాంట్రాక్టర్ గారూ ……. , అలాగే కాలేజ్ బిల్డింగ్స్ కూడా నెల – రెండు నెలల్లో పూర్తయిపోవాలి . కాంట్రాక్టర్ : నెలలోనా ……. ? . కోవిడ్ అని తెలియగానే 14 రోజులలో బిగ్గెస్ట్ హాస్పిటల్ నిర్మించారు ఆ చైనా నాకొడుకులు – వారికంటే మనం ఎందులో తక్కువ కాంట్రాక్టర్ గారూ …… – పాపం కాలేజ్ పిల్లలు ఎండలో కూర్చున్నారు సర్ – చూడగానే నా హృదయం …… కాదు కాదు నా బుజ్జి ఏంజెల్ బుజ్జి హృదయం చలించిపోయింది . వారికోసమైనా పూర్తిచేయ్యలేరా …….. కాంట్రాక్టర్ : తప్పకుండా తప్పకుండా బాబూ ……. , పిల్లల కోసం ఈ యజ్ఞాన్ని పూర్తిచేసేలా నావంతు కృషిచేస్తాను . కాంట్రాక్టర్ గారూ ……. మీ అడ్వాన్స్ గా ఒక బ్యాగు తీసుకోండి . కాంట్రాక్టర్ : నాకుకూడా నీపై నమ్మకం ఉంది బాబూ …… , ప్రస్తుతానికి కూలీలకోసం – కావాల్సినవాటికి మాత్రమే సర్పంచ్ గారి దగ్గరనుండి తీసుకుంటాను . నేను ఆ ఏర్పాట్లన్నీ చూసుకుని అటునుండి అటు వచ్చేస్తాను – బాబూ ……. ఎవరివో తెలియదు , ఎక్కడ నుండి వచ్చావో తెలియదు పిల్లలకోసం మీ చేస్తున్నారు చాలా చాలా సంతోషం నా మనసుపెట్టి పూర్తిచేయిస్తాను అని వెళ్లిపోయారు . సర్పంచ్ గారూ ……. కాలేజ్ – రోడ్డు మాత్రమే కాదు మీ ఊరికోసం మీరేమి చెయ్యాలనుకుంటున్నారో అన్నీ చేయించండి , ఎంత డబ్భైనా సరే – డబ్బుని తీసుకుని ఇంటికివెళ్లండి – పెళ్ళిపనులు పూర్తిచేయాలి కదా ఆర్రేంజ్ చేసి వస్తాము , వినయ్ ….. సర్పంచ్ గారితోపాటు వెళ్లు . సర్పంచ్ : బాబూ …… అంటూ చేతులు జోడించడమే కాకుండా పాదాలను కూడా స్పృశించబోయారు ……. సర్పంచ్ గారూ ……. ఇంకెప్పుడూ ఇలా చెయ్యకండి మీరు పెద్దవారు అని ఆపాను , మీరు – పెద్దయ్య చేసినదానితో పోలిస్తే నేనెంత ……. సర్పంచ్ : ఇప్పుడే వెళ్లి ఊరందరికీ ఈ విషయాన్ని చెబుతాను – ఒక మంచి మనిషి మన కష్టాలు తీర్చడానికి వచ్చారు అని చెబుతాను , బాబూ …… మీ పేరు ? . సర్పంచ్ గారూ …….
ఇదంతా మీరు – పెద్దయ్య చేసినట్లుగానే ఉండాలి , ఊరుకోసం సర్వస్వం త్యాగం చేశారు – ఏదో నాతో డబ్బు ఉందికాబట్టి చేసాను , మీరు లేకపోయినా చేస్తూనే ఉన్నారు , నా బుజ్జితల్లి పెదాలపై చిరునవ్వులు చూడటం కోసం చేస్తున్నాను అంతే , ఊరంతా మిమ్మల్ని – పెద్దయ్యనే దేవుళ్ళలా కొలవాలి ……… సర్పంచ్ : బాబూ ……. ఇది మహాపాపం . ప్రామిస్ చేస్తున్నారు అంతే ……… బుజ్జితల్లి : అంకుల్ ……. లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు …… soooooo మచ్ అంటూ ముద్దులవర్షం కురిపించి ప్రాణంలా హత్తుకుంది . బాబూ – అన్నయ్యా అన్నయ్యా …….. ఉదయం అన్నట్లుగా మీరు మా ఊరికోసం వచ్చిన దేవుడు అంటూ ఆనందబాస్పాలతో దండం పెట్టారు . బుజ్జితల్లీ ……. మళ్లీ మొదలెట్టేశారు అయ్యో …… వదిలిపెట్టరా ? . బుజ్జితల్లి ముద్దుముద్దుగా నవ్వుకుని , అవును మా అంకుల్ దేవుడు కాబట్టి ఆపనే ఆపరు అంటూ బుజ్జిచేతులతో దండం పెట్టింది. నవ్వుకుని , లవ్ యు లవ్ యు అంటూ కలిపిన చేతులపై ముద్దులవర్షం కురిపించాను . సర్పంచ్ గారూ ……. ఉదయం లోపు నా బుజ్జితల్లి అడుగు బయటపెట్టెలోపు రోడ్డు పూర్తవ్వాలి కమాన్ కమాన్ దండాలు పెట్టినంతవరకూ చాలు చాలు please please ……. ముగ్గురూ నవ్వుకున్నారు – కీర్తీ తల్లీ ……. నా ఆయుష్షు కూడా పోసుకుని సంతోషంగా ఉండాలి అని బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టారు . బ్యాంక్ స్టాఫ్ సహాయంతో బ్యాగులను బయటకు తీసుకువచ్చాము . మేనేజర్ : సర్ …… బ్యాంక్ సేఫ్టీ వెహికల్లో తీసుకుపోండి . డ్రైవర్ …… ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లు . థాంక్యూ మేనేజర్ గారూ ……. , ఇకనుండీ చెక్స్ వస్తూనే ఉంటాయి – ఎవ్వరు వచ్చినా …….. మేనేజర్ : క్షణాల్లో పంపిస్తాము సర్ ……. థాంక్యూ అంటూ చేతులు కలిపాను . సర్పంచ్ : బాబూ …… నీకోసం ఎదురుచూస్తూ ఉంటాము – ఇంతకూ పేరు ……. సర్పంచ్ గారూ ప్రామిస్ చేశారు గుర్తుపెట్టుకోండి …….. , నా పేరు …….. బుజ్జితల్లి : మహేష్ ……. అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది . లవ్ యు ……. మై లవ్లీ ఏంజెల్ ……. సర్పంచ్ : మహేష్ – ఇకనుండీ మీ పేరు మా ఊరి జనం గుండెల్లో ఉంటుంది బాబూ …….. అని నమస్కరించి బ్యాంకు వెహికల్లో వెళ్లారు . బ్యాంకు మేనేజర్ కు మళ్లీ కలుద్దాము అనిచెప్పి తమ్ముడు గోవర్ధన్ తోపాటు మెయిన్ గేట్ బయటకువచ్చాను . 4 గంటలు అవుతున్నా ఎండ ఎక్కువగానే ఉండటంతో బుజ్జితల్లి ఇబ్బందిపడుతోంది . బుజ్జితల్లీ …… ఐస్ క్రీమ్ ? . ఉమ్మా ……. ఎదురుగా ఉన్న షాప్ లో బుజ్జితల్లికి కోన్ ఐస్ క్రీమ్ కొనిచ్చి , చాక్లెట్ లు – కూల్ డ్రింక్ తీసుకున్నాను . వాకబుల్ డిస్టన్స్ లో కార్స్ షోరూం కనిపించడంతో నడుచుకుంటూ వెళ్ళాము . లోపలికివెళ్లి బుజ్జితల్లీ ……. నీకిష్టమైన కార్ సెలెక్ట్ చెయ్యి ఇక AC లో హాయిగా వెళదాము అని చుట్టూ ఒక రౌండ్ వేసాను . అంకుల్ అంటూ పెదాలపై చిరునవ్వులతో రెడ్ రేంజ్ రోవర్ చూయించింది .
నా బుజ్జితల్లికి రెడ్ అంటే ఇష్టమన్నమాట …… బుజ్జితల్లి : మమ్మీకి ఇష్టం అంకుల్ – మమ్మీకి ఏది ఇష్టమో నాకూ అదే ఇష్టం . లవ్లీ అంటూ పెదాలపై తియ్యదనంతో , ఇకపై నాకు కూడా …….. బుజ్జితల్లి : అంకుల్ ….. ? , విన్నట్లు చూస్తోంది . చిలిపిదనంతో నవ్వుకుని Wow wow సూపర్ కార్ బుజ్జితల్లీ …… , నాకు కూడా బాగా నచ్చింది ఇదే తీసుకుంటున్నాము అని ముద్దుపెట్టి సేల్స్ బాయ్ ను పిలిచాను . స్పాట్ లో మనీ ట్రాన్స్ఫర్ చేసి బుజ్జితల్లిని ఎత్తుకునే కూర్చుని స్టార్ట్ చేసి AC వేసాను . బుజ్జితల్లి : చల్లగా ఉంది అంకుల్ అంటూ చుట్టేసి ముద్దులుపెడుతోంది . హ్యాపీ బుజ్జితల్లీ ……. , తమ్ముడూ …… ఎక్కి కూర్చో అంటూ సైడ్ డోర్ అన్లాక్ చేసాను . కూర్చోగానే బయలుదేరాను . Like 224 Dislike 28 129718 11 0 cookie-check శృంగార స్టోరీ 261 no