శృంగార స్టోరీ 81
మొత్తం వందల ఎకరాలు కానీ వేలం మాత్రం లక్షా ఒక్కరూపాయి , లక్షా రెండు రూపాయలు ……….ఇలా తమాషా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . శృంగార స్టోరీ 80 ఒక్కసారిగా కోపం సర్రున నెత్తికి ప్రాకింది . చూద్దాము ఎంతవరకూ వెళుతుందోనని రెండు లక్షలా ఒక రూపాయి అని పడ్డాను . ఎవడ్రా వాడు ఒకేసారి లక్ష పాడింది అని వెనక్కు తిరిగి చూసి రేయ్ ఎవడ్రా నువ్వు పాడటానికి అని నామీదకు వచ్చాడు . నేను లేచి కొట్టేలోపు కృష్ణగాడు చెవి నుండి రక్తం కారేలా ఒక్క దెబ్బ బలంగా వేయడంతో అంతే కిందపడినవాడి నుండి ఉలుకూ లేదు పలుకూ లేదు . అధిచూసి మరొక ఇద్దరు రావడంతో లేచి ఇద్దరమూ ఒక్కొక్క దెబ్బ అంతే ……… వాళ్ళ పరిస్థితి కూడా అంతే , పెద్దయ్య పెదాలపై చిరునవ్వు , పూజారి గారు అయితే ఏకంగా చప్పట్లు , విజిల్ వేశారు . పూజారి గారు మీలో ఈ యాంగిల్ కూడా ఉందా ఎంజాయ్ అని ఉత్సాహపరిచాము . ఈసారి ఏకంగా నలుగురు వస్తుంటే , రేయ్ మీలా ………….. రేయ్ మామా please రా , నీకెందుకు శ్రమ తమరు మా ఊరంతటికీ బుజ్జిదేవుడు హాయిగా అలకూర్చోండి మేంఉన్నాము కదా అని నవ్వి , రేయ్ మీలా మేము మామూలు ఫుడ్ తిన్నవాళ్ళం కాదు , తొమ్మిదేళ్లు జైల్ ఫుడ్ తిన్నవాళ్ళము . ఊరందరూ ఎంత బాధపడుతున్నారో తెలిసే ఇక్కడ కాలిపోయి ఉన్నాము . ఎవడు అడుగువేస్తాడో వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే అని చూపించడంతో , తమ్ముడూ అంటూ లేచివచ్చి కండలను వొత్తి దైర్యంగా వెనుక నిలబడ్డారు . ఆఫీసర్స్ వేలం మొదలెడతారా ………. మీకు కూడా ఏమైనా కోటింగ్ కావాలా అని కృష్ణగాడు చెప్పాడు . ఏంటి ఈ దౌర్జన్యం అని మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశారు . చుట్టూ కొలతలు తీసుకుంటున్న వాళ్ళు , అప్పటివరకూ ఎక్కడో కారులో రెస్ట్ తీసుకుంటున్న MP వచ్చాడు . ఎవడ్రా ……… నువ్వు మధ్యలో వచ్చి extraa లు చూస్తున్నావు అని కృష్ణగాడిని అడిగాడు . మహేష్ పేరు గుర్తుందా అని ప్రక్కకు తప్పుకున్నాడు . ఆ పిల్లలా మీరు 14 సంవత్సరాలు కదా అప్పుడే ఎలా వచ్చారు . నీ దౌర్జన్యాన్ని ఆపడానికి ఆ అమ్మవారు సరైన సమయానికి మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చారు . మీరన్నది నలుగురు మావాళ్లను చూసావా ఎంతమందిమి ఉన్నామో , అన్నయ్య గట్టిగా నవ్వి , ఏయ్ మాజీ MP ………… తొమ్మిదేళ్ల కింద నా తమ్ముళ్ల కోసం వచ్చిన ఒకటి , రెండు ఊళ్ల జనాలను చూసికూడా ఇలా మాట్లాడుతున్నావా ……….., ఒకే ఒక్క కాల్ చేశానంటే మీ ఒక్క పార్ట్ కూడా ఈ పొలాల నుండి బయటకు వెల్లదు . చెయ్యమంటారా …………అని మొబైల్ తియ్యగానే , వాడి వొళ్ళంతా చెమటలు పట్టేసాయి . అన్నయ్యా ………. నువ్వు సూపర్ అంటూ కృష్ణగాడు కౌగిలించుకున్నాడు . చూడు మాజీ MP వేలం నిర్వహిస్తావా ……… మాకు ok ఏ గొడవలూ లేకుండా మేము పాల్గొంటాము .
లేదు మాకు గొడవలు కావాలంటే చెప్పి క్షణాల్లో ఊరి జనాన్ని పిలిచేస్తాను నువ్వో మేమో బస్తీమే సవాలు అని కృష్ణగాడు ఉత్సాహంతో తొడలు కొట్టాడు . భయపడిపోయి వేలం మొదలెట్టండి అని అధికారులకు సైగ చేసాడు . సర్ ………… రేయ్ ఊరి జనంతో ఒక్కరూపాయి లేదు , వీళ్ళిద్దరూ ఇప్పుడే జైల్ నుండి వచ్చారు . 10 లక్షలు దాటిందంటే వాళ్లే భయపడి వెళ్ళిపోతారు అని ప్రక్కవాడికి చెప్పడంతో , సూపర్ సర్ మీరు అని సంతోషంతో yes అవును వేల మొదలెట్టండి అనిచెప్పారు . సరే సర్ అని మహేష్ గారి పాట 2 లక్షలా ఒక్క రూపాయి …….. 10 లక్షలు ఒక్క రూపాయి అని ఒకేసారి పెంచేశాడు MP ………… నేను పాడబోతుంటే , కృష్ణగాడు బుంగమూతిపెట్టుకోవడం చూసి లవ్ యు లవ్ యు రా …………అని బుగ్గపై ముద్దుపెట్టి సరే నువ్వే పాడు అనిచెప్పాను . లవ్ యు రా మామా ……….. నువ్వు జస్ట్ వేళ్ళతో చూపించు అంతే అని ఉత్సాహంతో నా వేళ్ళ వైపే చూస్తుంటే , నవ్వుకుని ఒక వేలిని చూపించాను . లక్షా …….కాదా , వేలా……. కాదా , వందలా ……కాదా , ok ok ఒక్క రూపాయి ……. కృష్ణ : 10 లక్షలా ఒక్క రూపాయి . ఎంపీ : 20 లక్షలు ………. కృష్ణ : ఒకే వేలిని చూసి 20 లక్షలా ఒక్క రూపాయి అని ఉత్సాహంతో చెప్పాడు . ఎంపీ : 30 లక్షలు ……… కృష్ణ : ఒకే వేలేగా చూడాల్సిన పనిలేదు , 30 లక్షలా ఒక్క రూపాయి . ఎంపీ: 40 లక్షలు …….. కృష్ణ : 40 లక్షలా ఒక్కరూపాయి ………. బాబు మహేష్ అంత డబ్బు , అవును మహేష్ అంత డబ్బు అని అంకుల్ కూడా అడిగి ఆశ్చర్యపోతున్నారు . పెద్దయ్యా , అంకుల్ ………. కూల్ అని అన్నయ్య ద్వారా వాటర్ తెప్పించి వాళ్లకు అందించాను . ఎంపీ: ఆశ్చర్యపోయి ఇదే లాస్ట్ రా ……….. 50 లక్షలు అని మెల్లగా పాడాడు . ఏంటన్నా మీరు భయపడుతున్నారా ………. లేదురా మనం వాళ్లకు ఇచ్చిందే 50 లక్షలలోపు వడ్డీ , చక్రవడ్డీ వేసి కొండంత చేసాము. నెక్స్ట్ 60 అన్నామంటే ఆ డబ్బుతో అసలు తీర్చేసి వడ్డీ తరువాత నెమ్మదిగా ఇస్తామని కోర్ట్ లో కేస్ వేశారంటే , మన మోసం బయటకువచ్చి ఇక నేను జీవితంలో ఎలక్షన్ లో పోటీ చేయలేను . కృష్ణ : ఏంటి ఎంపీ నెమ్మదిగా పాడావు ………, రేయ్ మామా ఒక్కరూపాయే కదా 50 లక్షలా ఒక్కరూపాయి అని పొలాలు మొత్తం వినిపించేలా అరిచాడు . ఎంపీ మౌనంగా అయిపోవడంతో అధికారులు మూడు సార్లు పాట పాడి పొలాలు మొత్తం 50 లక్షలా ఒక్కరూపాయికి మహేష్ పరం అయ్యాయి అని గట్టిగా బెల్ కొట్టారు . ఫైల్ తెచ్చి నాకు అందించారు . రేయ్ మామా చెల్లికి ఇచ్చి సరిచూడమని చెప్పు అన్నాను . వాడు పరుగునవెళ్లి చెల్లికి అందించి వచ్చాడు . రేయ్ కట్టరా ……….. 50 లక్షలా ఒక్కరూపాయి కట్టరా ………, సాయంత్రం లోపు కట్టకపోతే వేలం పాట క్యాన్సిల్ అయ్యి పొలాలన్నీ ఫ్రీగా మాకే చెందుతాయి అని సవాల్ విసిరారు . రేయ్ మామా ………. మన ముగ్గురితో కలిపి ఉన్నది 20 లక్షల లోపే ఇప్పుడేలారా అని కంగారుపడుతున్నాడు . వాడితోపాటు పెద్దయ్య , అంకుల్ , అన్నయ్యలు కూడా ………….
కూల్ రా మామా ……….. అంకుల్ లాయర్ కు కాల్ చెయ్యండి అని చెప్పాను . కాల్ చేసి నాకు అందించారు . అలా నడుచుకుంటూ వెళుతూ సర్ నేను మహేష్ మాట్లాడుతున్నాను . మహేష్ ………. చెప్పు , సర్ నాకు 18 ఏళ్ళు నిండి 4 నెలలు అయ్యింది . అమ్మ రాసిచ్చిన ఆస్తులు నేను అమ్ముకోవచ్చా ………. అని అడిగాను . అమ్ముకోవచ్చు మహేష్ ……… ఎవరికి అమ్ముతున్నావు మహేష్ , ఇంకా ఎవరికీ అమ్మలేదు కదా ……….. , ఒక NRI ……… ఫారిన్ లో బాగా సంపాదించి ప్రశాంతమైన పల్లెలో సెటిల్ అవ్వాలనుకున్నారు . రీసెంట్ గా మీ రెండు పల్లెల మధ్యలో కంపచెట్లతో నిండిపోయిన పాతిక ఎకరాలు కొన్నారు దానిని చదును చేసి పంటలు పండించాలని అనుకున్నారు , నీవల్లనే కదా సమృద్ధి అయిన నీరు పారుతోంది . వస్తూ వస్తూ మీ ఇంటిని చూసి ఫిదా అయిపోయారు . కోటి అయినా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు . థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ , అర గంటలో అమ్మవారి గుడి దగ్గరకు ఆయనను డబ్బుతో పాటు పిలుచుకునివస్తే 75 లక్షలకే ఇంటితోపాటు పొలాన్ని కూడా ఇచ్చేస్తాను సర్ అనిచెప్పగానే , మహేష్ 20 నిమిషాల్లో అక్కడ ఉంటాను అనిచెప్పారు . థాంక్యూ సర్ వేచి చూస్తుంటాను అని అందరమూ అమ్మవారి గుడిదగ్గరకు చేరుకుని , అమ్మా ………… తొమ్మిదేళ్ల తరువాత కోరిక కోరుతున్నాను , అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేలా చూడు తల్లీ ………. నా చుట్టూ అందరూ టెన్షన్ పడుతూనే ఉన్నారు. చెల్లి కారులోనుండి వచ్చి రే…….. కృష్ణా అప్పు తీసుకున్నది లక్ష అయితే నెలకు వడ్డీ ఎలాపడితే అలా 10 , 15 రూపాయలు వేసి అమాంతం పెద్ద అమౌంట్ అయ్యేలా చేసేసారు . కృష్ణ వాడు టెన్షన్ లో ఉన్నాడు . ఇప్పటికిప్పుడు 50 లక్షలు కావాలి . కృష్ణా ………… నాదగ్గర డబ్బు మరియు నగలూ ఉన్నాయికదా అని వెహికల్ వైపు పరిగెత్తి బ్యాగులోనుండి తీసి వెనుకకు తిరుగగానే , కళ్ళల్లో ఆనందబాస్పాలతో చెల్లీ ……… అని అమాంతం కౌగిలించుకుని , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , చెల్లీ ఎండ ఎక్కువగా ఉంది లోపల కూర్చోమని కూర్చోబెట్టాను . అన్నయ్యా ………. నగలు , డబ్బు …….. చెల్లీ హృదయాన్ని కదిలించావు . వద్దు చెల్లీ ……… డబ్బు వచ్చేస్తోంది . ప్రాణం పోయినా అమ్మ నగలను మన నుండి వేరుకానివ్వను లవ్ యు చెల్లీ ………, అని ఫైల్ అందుకొని చూసి , కోపంతో మొబైల్ తీసి నేరుగా జడ్జిగారికి కాల్ చేసి పరిస్థితి మొత్తం వివరించాను . మహేష్ థాంక్యూ sooooo మచ్ నాకు కాల్ చేసినందుకు ఇలాగైనా నీకు సహాయం చేసి నేను చేసిన తప్పుని సరిచేసుకుంటాను , ఏ ఊరు అన్నావు ……. ok నువ్వు నిశ్చింతగా ఉండు నేను చూసుకుంటాను అని కట్ చేశారు . లాయర్ గారు చెప్పినట్లుగానే అర గంటలోపు వచ్చి డబ్బు చూపించారు .
థాంక్యూ sooooo మచ్ సర్ ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి పెట్టేస్తాను అని పూర్తిచేసి , బిల్డింగ్ తోట ఇక మీకే సొంతం సర్ , అవసరానికి సహాయం చేసారు థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని చేతులు కలిపాను . పెద్దగా నోరుతెరిచి షాక్ లో ఉన్న కృష్ణ గాడికి , రేయ్ మామా అందులోనుండి 25 వేరుచేసి పెద్దయ్యకు ఇవ్వు , ఒక రూపాయి add చేసి అక్కడ ఇచ్చేసి పొలాల పత్రాలన్నీ తీసుకొచ్చేయ్ అనిచెప్పాను . మహేష్ మాకోసం ఇంటిని , పొలాన్ని అమ్మేశావా …………, మన బాగు కోసం పెద్దయ్యా ………., అక్కయ్య ఉన్నా ఇలానే చేసేవారు . బాబు నువ్వు నిజంగా మాకోసమే పుట్టిన , ఆ అమ్మవారే స్వయంగా పంపించిన దేవుడివి అని పూజారి గారు కన్నీళ్లను తుడుచుకున్నారు . కృష్ణగాడు , అన్నయ్య ……… డబ్బుతోపాటు వెళ్లి వచ్చి రేయ్ మామా వడ్డీ కూడా ఇస్తేనే పొలం మరియు ఇంటి పత్రాలు ఇస్తాడంట , రేయ్ మామా ……… వాడు డబ్బు తీసుకుని వెళ్లిపోతున్నాడురా ………. రేయ్ మామా మహా అయితే టౌన్ లోని వాడి ఇంటికి వెళతాడు . మ్యాటర్ చాలాదూరం వెళ్ళిపోయింది అని అంటుండగానే , వరుసగా govt వెహికల్స్ వచ్చి నిలబడ్డాయి . చాలా మంది ఆఫీసర్స్ , పోలీసులతోపాటువచ్చి మహేష్ ఎవరు ఇక్కడ అని అడిగారు . నేనే సర్ అని పోలీస్ కు బదులివ్వడంతో , మహేష్ అంటే చిన్నపిల్లాడా ……… జడ్జిగారు నీగురించి చాలా చెప్పారు అని ఒక ఆఫీసర్ చేతిని ముందుకు చాపారు . జడ్జిగారికి మాపై అంత అభినానం సర్ , మీరు ………. అంకుల్ చెవిదగ్గరకువచ్చి మన జిల్లా కలెక్టర్ మహేష్ అని గుసగుసలాడారు . క్షమించండి సర్ ……… అని రెండు చేతులతో నమస్కరించి , ఈరోజు ఉదయమే జైల్ నుండి ………… మహేష్ నాకు జడ్జిగారు మొత్తం చెప్పారు . ఇక్కడ సమస్య ఏంటి అని ఎండలోనే అడిగారు . సర్ ఎండ ఎక్కువ ఉంది అలా నీడలోకి వెళదాము అని చెట్టుని చూపించాను . థాంక్స్ మహేష్ ఇంప్రెస్సెడ్ అని నా భుజం చుట్టూ చేతినివేసి తీసుకెళ్లారు . పెద్దయ్యా , పూజారి గారు ……… అలా షాక్ లో ఉండిపోయారు . సర్ సమస్య ఏంటంటే అంటూ వడ్డీ గిరించి , పొలాలు , ఇంటి పాత్రల గురించి వివరించి ఫైల్ చూపించాను . What ……… ఇంత ఘోరమా ? , సర్ అంటూ పెద్ద పోలీస్ ను పిలిచి 15 నిమిషాల్లో వాడు పత్రాలతోపాటు ఇక్కడ ఉండాలి . సర్ వారు మాజీ ఎంపీ అని మరొక పోలీస్ చెప్పారు . ఇంత ఫ్రాడ్ చేస్తూ ఇంకా గౌరవం ఏంటి , రైతులను మోసం చేసినవాడికి గింజ కూడా దొరకదు 15 మినిట్స్ thats it అని ఆర్డర్ వేశారు . వెంటనే ఎంపీ కి కాల్ చేసి విషయం చెప్పి కలెక్టర్ గారి ఆర్డర్ 15 నిమిషాల్లో అన్నింటితోపాటు ఇక్కడ ఉండాలి లేకపోతే మేము రంగం లోకి దిగాల్సివస్తుంది అని వార్నింగ్ ఇచ్చారు . సర్ బంగారం లాంటి పంటలు పండే పంటలు సర్ , సంవత్సరానికి మూడు పంటలు అత్యధిక దిగుబడిని ఇస్తాయి . ఇప్పటివరకూ సేంద్రియ ఎరువుల తప్ప వేరేవి వాడనేలేదు .
అలాంటి పంట పొలాలను బీడు భూములుగా చిత్రీకరించి ఫ్యాక్టరీ కోసం పర్మిషన్ తీసుకున్నారు . అదేకనుక జరిగితే ఈ ఊరు మాత్రమే కాదు సర్ చుట్టుప్రక్కల సేంద్రీయ భూములన్నీ రసాయనాలతో సేద్యానికి పనికిరాకుండా పోతాయి సర్ , ఇక తరువాత పరిస్థితులు అందరికీ తెలిసినవే …… కేవలం మాకోసం , మేము జైల్లో కష్టపడుతున్నామని మా ఊరి జనమంతా సంతోషమైన జీవితాన్ని వదిలి టౌన్ లో చిన్న చిన్న పనులతో కూలీలుగా బ్రతుకుతున్నారు సర్ , ఈ విషయం నాతో దాచారు లేకపోతే ఇలా జరగనిచ్చేవాన్ని కాదు సర్ అని ఉద్వేగానికి లోనయ్యి , ఈ అప్పుని కట్టడానికి వీళ్లకు సంవత్సరం సమయం చాలు సర్ ………కావాలంటే మూడు నెలల తరువాత వచ్చి చూడండి సర్ ఎంత పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటాయో ఈ పొలాలు అని ఎలా ఉండేవో వివరించాను . మహేష్ నేను కూడా ఒక రైతు కొడుకునే , వాళ్ళ కష్టాలు నాకు తెలుసు ఇన్స్పెక్టర్ ఇచ్చిన సమయం అయ్యిందా ………. సర్ two మినిట్స్ సర్ అనేంతలో ఒక వెహికల్ వచ్చి అందులోనుండి ఇద్దరు దిగి పత్రాలన్నింటినీ తీసుకొచ్చి ఇచ్చేసారు . ఎంపీ ఎక్కడయ్యా ………. అని అడిగారు పోలీస్ సర్ ……. సర్ ఏమో సర్ తెలియదు సర్ అని వణుకుతూ బదులిచ్చాడు . పిరికిపంద ఎక్కడికీ పోతాడు ఇన్స్పెక్టర్ వెళ్లి అరెస్ట్ చెయ్యండి , మరొకసారి ఈ ఊరివైపు చూస్తే ఏమిచెయ్యాలో మీకు తెలుసుకదా అని ఆర్డర్స్ జారీ చేశారు . Yes సర్ అంటూ ఉత్సాహంతో బదులిచ్చారు . మహేష్ ……… నేను చూసుకుంటాను , ఈ ఫ్యాక్టరీ క్యాన్సిల్ చేయిస్తాను మీరు దున్నడం స్టార్ట్ చేసేయ్యండి అనిచెప్పి వెళ్లిపోతోంతే , సర్ మాకోసం ఇంతదూరం వచ్చినందుకు థాంక్యూ sooooo మచ్ సర్ అని చేతులెత్తి నమస్కరించాము . మహేష్ నా డ్యూటీ చేసేలా చేసావు . నేనే నీకు థాంక్స్ చెప్పాలి అని వెళ్లిపోబోతుంటే , సర్ మరొక కోరిక , మీ చేతులతో మా గ్రామ దేవత గుడి తలుపులు తెరిస్తే మేమంతా చాలా సంతోషం అని గౌరవంగా పిలిచాము . అంతకన్నా అదృష్టమా ………., మహేష్ బయట ఉండే మనుషులు చెడ్డపేరు సంపాదించుకుంటున్నారు . నువ్వు జైల్లో ఉండి ఎంతోమంది పెద్దపెద్ద వాళ్ళ అభిమానం సంపాదించావు వెల్ డన్ అని భుజం చుట్టూ చేతులను వేసి గుడిదగ్గరకు నడిచాము . సర్ మా అందరి మంచి కోరే ఊరి పెద్దయ్య , అమ్మవారి గుడి పూజారి గారు , టౌన్ లో govt ఆఫీస్ లో జాబ్ చేస్తున్న అంకుల్ అని పరిచయం చేశాను . ముగ్గురి చేతులు కలపడంతో వారి ఆనందానికి అవధులు లేవు . గుడి తలుపుల దగ్గరికి చేరుకుని పూజారి గారు ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నట్లున్నారు ………….. కలెక్టర్ సర్ ……… మహేష్ ను మా ఊరంతా దేవుడు అంటారు . తన ద్వారానే తలుపులు తెరిపించాలనేదే ఊరందరి కోరిక అని నెమ్మదిగా చెప్పి , తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అని రెండు చేతులనూ జోడించారు .
పూజారి గారు ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు అందించే మద్యులు మీరు అని ఆపి మీ కోరిక ప్రకారమే కానిద్దాము మహేష్ కానివ్వు అని మనఃస్ఫూర్తిగా చెప్పారు . సర్ మీరుకూడా అంటూ ఇద్దరమూ తాళం తీసి తలుపులు తెరవగానే అప్పటివరకూ సెగలు కక్కుతున్న సూర్యుడు మబ్బుల్లో మాయమై చల్లటి గాలులతో వర్షం పడటంతో, కలెక్టర్ గారితోపాటు అందరూ మైమరిచిపోయారు . మహేష్ పూజారి గారి మాటలు ఇప్పుడు నమ్ముతున్నాను . సంవత్సరం నుండీ వర్షాలు పడక జిల్లా మొత్తం రైతులు పూజలు చేస్తున్నారు ………., ఎన్నో విజ్ఞప్తులు వస్తున్నాయి , చివరికి అమ్మవారి అనుగ్రహం వలన వర్షం పడింది అని క్లర్క్ గొడుగు తెచ్చి సర్ పైన ఉంచబోతే ఆపి మాతోపాటు ఉత్సాహంతో తడిచారు . మహేష్ ఈ ఆనంద సమయంలో ఒక సెల్ఫీ అని సర్ అడగడంతో , మాలో మరింత ఉత్సాహం వచ్చి పరుగునవెళ్లి వెహికల్లోని చెల్లిని , అమ్మావాళ్లను పిలుచుకొనివచ్చి సర్ my సిస్టర్ కృష్ణవేణి ఫ్యూచర్ డాక్టర్ , వాడు నా ప్రాణమైన ఫ్రెండ్ ఫ్యూచర్ IPS , మా అమ్మలు అని పరిచయం చేశాను . నమస్కరించి అందరమూ సర్ మొబైల్లో , మా మొబైల్లో గ్రూప్ సెల్ఫీ తీసుకున్నాము . మహేష్ నీ గోల్ ఏంటి అని అడిగారు . నా ప్రాణమైన వాళ్ళ కోరిక నేను గొప్ప ఆర్కిటెక్ట్ అవ్వడం సర్ ………. ఆ గోల్ సాధించి , ఈ ఊరికి నా సొంత ఊరికి వచ్చేసి చుట్టూ ప్రాణమైన వాళ్ళతో అని ఎదురుగా ఉన్నవాళ్లను చూపించి ( మా అమ్మా అక్కయ్యాలతో అని మనసులో ) వ్యవసాయం చేస్తూ ప్రశాంతమైన జీవితం గడిపేస్తాను సర్ అని బదులిచ్చాను . లవ్లీ లవ్లీ ……… మహేష్ all the best ముగ్గురికీ అని కౌగిలించుకుని వెళ్ళొస్తాను అనిచెప్పి వెళ్లిపోతూ , పెద్దయ్యా మరియు మీరు ఏ ఆఫీస్ లో పనిచేస్తారు అని అంకుల్ గురించి తెలుసుకుని మహేష్ కు ఏమి అవసరం వచ్చినా నాకు కాల్ చెయ్యండి అని చిరునవ్వులతో వెళ్లిపోయారు . రేయ్ మామా , అన్నయ్యా ……… అంటూ ఇద్దరూ నన్ను చెరొకవైపు హత్తుకొని వర్షంలో సంతోషంతో చిందులు వేస్తుంటే , పెద్దయ్య పూజారి గారు ఆనందబాస్పాలతో దండం పెట్టబోతే ఆపి , పెద్దయ్యా ……….. పత్రాలను ఊరంతటికీ పంచెయ్యండి . ఆ 25 లక్షలతో రేపే పొలం పనులు ప్రారంభించండి , త్వరలోనే అక్కయ్యతోపాటు ఊరిలో అడుగుపెడతాము అనిచెప్పాను . మహేష్ మనవాళ్ళు ………… తెలుసు పెద్దయ్యా …………, అక్కయ్య లేకుండా ……..అంటూ వర్షంలో కన్నీటిని కారుస్తూ కృష్ణగాడు , చెల్లెమ్మను కౌగిలించుకుని వెళ్ళొస్తాము పెద్దయ్యా ………, అంకుల్ , అమ్మా వెళదాము అని కృష్ణగాడి ఫ్యామిలీతోపాటు టౌన్ కు బయలుదేరాము . రేయ్ మామా ………. కనీసం ఒకసారి అక్కయ్య తిరిగిన ఇంటికి ………., వద్దురా ……… ఇంటిని చూశానంటే చాలా ఎమోషనల్ అయిపోయి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని వాడి భుజం పై వాలిపోయాను . అన్నయ్యా ………. అంటూ ఉద్వేగంతో చెల్లి నా గుండెలపై వాలిపోయింది .
వర్షం అంతకంతకూ పెరుగుతూనే ఉంది . టౌన్ లో ఎటుచూసినా పిల్లలు పెద్దలు చాన్నాళ్ల తరువాత బయటకు వచ్చి వర్షంలో ఎంజాయ్ చెయ్యడం గమనించాము . ఇంటికి చేరుకోగానే మహేష్ వెంటనే వంట చేసేస్తాము మీరు బట్టలు మార్చుకోండి అనిచెప్పి అమ్మలిద్దరూ వంట గదిలోకి వెళ్లారు . అంకుల్ నెక్స్ట్ బస్ ఎప్పుడు ఉంటే అప్పుడు హైద్రాబాద్ వెళ్లిపోతాము బుక్ చెయ్యండి అని చెల్లి కార్డ్ అందించబోతే , మహేష్ ………నేను చూసుకుంటాను అని కార్డ్ వెనక్కు ఇచ్చేసి ముందు మీరు లోపలికివెళ్లి బట్టలు మార్చుకోండి అనిచెప్పారు . కృష్ణగాడు అన్నయ్య లగేజీ మొత్తం ఇంటిలోపలికి తీసుకురావడంతో ఒకరి తరువాత ఒకరము ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని సోఫాలో కూర్చుని అక్కయ్య గురించే ఆలోచిస్తున్నాను . అన్నయ్యా ………… అక్కయ్యను తొందరలోనే చేరుకుంటాము అనిచెప్పి అమ్మావాళ్లకు హెల్ప్ చెయ్యడం కోసం వంట గదిలోకి వెళ్ళింది . మహేష్ లంచ్ చేసి బయలుదేరితే హైద్రాబాద్ అర్ధరాత్రికి చేరుకుంటారు . అక్కడ కష్టం అవుతుంది కాబట్టి నైట్ టికెట్స్ బుక్ చేస్తాను డిన్నర్ చేసి బయలుదేరితే ఉదయానికల్లా చేరిపోవచ్చు అని కన్విన్స్ చేశారు . అలాగే అంకుల్ అని బదులిచ్చి వంట పూర్తయ్యాక , వెహికల్ డ్రైవర్ ను భోజనానికి లోపలకు పిలిచాము . అమ్మలిద్దరూ చెల్లి ప్రేమతో తినిపించడంతో తింటుంటే , బాబు ………కాదు కాదు సర్ మీరేనా అక్కడ మొత్తం ధడదడలాడించి ఇక్కడ మాత్రం బుజ్జాయిలాగా తినిపిస్తున్నారు అని ఆశ్చర్యపోయాడు . అందరూ నవ్వుకుని , అవును బయట ఎలా ఉన్నా …….. మాకు మాత్రం మా బుజ్జి దేవుడు అని ప్రాణంలా తినిపించారు . చెల్లి సహాయం చెయ్యబోతున్నా తల్లీ మేంఉన్నాము కదా అని అమ్మలిద్దరూ చెల్లిని ప్రాణంలా చూలుకోవడం చూసి మురిసిపోతూ , కృష్ణగాడు సిగ్గుపడుతుండటం చూసి నవ్వుకుని అంకులిద్దరితో మాట్లాడుతోంటే , డ్రైవర్ గుమ్మం దగ్గరికి పరుగునవచ్చి మహేష్ …….. అంత వర్షంలోనూ ట్రాక్టర్లలో వందలమంది జనాలు వచ్చారు అనిచెప్పడంతో , పెద్దయ్యా ……….అని లేచి పరుగున బయటకువెళ్ళిచూస్తే ఊరిజనమంతా అమ్మావాళ్ళతో సహా ట్రాక్టర్లలో పూర్తిగా తడిచిపోయి ఇంకా దిగుతూనే ఉండటం చూసి , పెద్దయ్యా ……….. చెప్పాను కదా , వర్షం కూడా ఎలాపడుతోందో చూడండి అని చెప్పాను . నువ్వుచెప్పినట్లుగానే ఎవరి పత్రాలు వాళ్లకు ఇవ్వడానికి వెళ్ళాను . ఏమాత్రం ఆలోచించకుండా పెద్దయ్యా ……… మన మహేష్ వల్లనే కదా , మనకోసం మన బాధల్ని తీర్చడానికి వచ్చాడు కదూ , పెద్దయ్యా ………మీకు రెండుచేతులు జోడించి దండం పెడుతున్నాము ఇప్పుడే మా అందరినీ మహేష్ దగ్గరికి తీసుకెళ్లు అని బాధపడటంతో తప్పలేదు మహేష్ ……….. వాళ్ళ అభిమానానికి అందరికీ చేతులెత్తి నమస్కరించి , అమ్మా ……….
ఇంత వర్షంలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టాను అని పాదాలకు నమస్కరించాను . ఆనందబాస్పాలతో లేపి మా బిడ్డను , మా బుజ్జి దేవుణ్ణి ………. చూడటానికి ఎంత దూరమైనా , ఎంత కష్టంలోనైనా వస్తాము . అక్కా చెల్లీ ఇక మన మహేష్ బుజ్జిదేవుడు ఏమాత్రం కాదు చూడు ఎంత ఎత్తు ఎదిగాడు తలెత్తి చూడాల్సివస్తోంది అని సంతోషంతో నవ్వుకున్నారు . మహేష్ ………. మాకోసం , మేము డబ్బుకు ఆశపడటం వలన నీ ప్రాణానికి ప్రాణమైన ఇంటిని , పొలాన్ని వధులుకున్నావా అని బాధతో చెప్పారు . ఎవరికోసం అమ్మా ……….. నా మనుషుల కోసమే కదా , నాకు చాలా చాలా సంతోషన్గా ఉంది మీరు బాధపడకండి అమ్మవారు ఎలా ఆడిస్తే అలా ఆడే బొమ్మలం మనము అని వర్షంలో కారుస్తున్న కన్నీళ్లను తుడిచాను . మహేష్ మీ అమ్మలందరినీ వర్షంలోనే నిలబెట్టేస్తావా ……….. అక్కా చెల్లీ లోపలకు రండి అని అమ్మ అందరినీ లోపలికి పిలుచుకొనివెళ్లి తల తుడుచుకోవడానికి చెల్లి సహాయంతో ఏర్పాట్లుచేశారు . అక్కా , చెల్లీ ……… నీకొడుకు మహేష్ కు తోడుగా ఉన్నాడు చూడు ముందు నీకు చేతులెత్తి నమస్కరించాలి అని కృష్ణ అమ్మను హత్తుకొని ఆకాశానికి ఎత్తేశారు . ఏమండోయ్ శ్రీవారు అనిపిలిచి పాలు తీసుకురమ్మని చెప్పడంతో కారులో 10 నిమిషాలలో తీసుకురావడంతో అమ్మలిద్దరూ , చెల్లి టీ చేసి అందరికీ అందించారు . చెల్లిని అందరి అమ్మలకు నాకోడలు అదే అదే మన ఊరి కోడలు , ఈ 9 సంవత్సరాలు తన ప్రియుడికి , తన అన్నయ్యకు అనుక్షణం తోడుగా ఉంది బాధను దరిచేయనీకుండా ప్రాణంలా చూసుకుంది కృష్ణవేణి అని గర్వపడుతూ అమ్మ చెప్పడంతో , మన కృష్ణ చాలా చాలా అదృష్టవంతుడు కృష్ణ – కృష్ణవేణి ………, చల్లగా ఉండు తల్లీ అని మనసారా దీవించారు . నన్ను ఆశీర్వదించండి అమ్మా అని పాదాలకు నమస్కరించబోతే తల్లీ అని ప్రాణంలా కౌగిలించుకొన్నారు . బయట బాబు మహేష్ ……….. పెద్దయ్య అంతా చెప్పారు . మా దేవత వాసంతి అతి త్వరలోనే నిన్ను చేరుకుని అంతే త్వరలోనే మన ఊరికి రావాలని మనసారా మన అమ్మవారిని ప్రార్థిస్తూనే ఉంటాము . అక్కడ మా అవసరం అనిపిస్తే ఒక్క కాల్ చెయ్యి మహేష్ ఉదయానికల్లా నీముందు వాలిపోతాము జాగ్రత్త మహేష్ అని అందరూ నా భుజం పై చేతులువేశారు . మీ ప్రేమ ఉంటే చాలు అన్నయ్యా ………. ఏదైనా సాధిస్తాను అని అందరినీ ఒకేసారి కౌగిలించుకున్నాను . కృష్ణ ……….. రాప్పా అలా దూరం ఉండిపోయావు , మన మహేష్ కు తోడుగా ఉన్న నిన్ను ముందు అభినందించాలి అని పిలిచారు . పెద్దయ్యా …….. ఇంకా చూస్తారేంటి ఎత్తండి అని ఇద్దరమూ ఒకచెయ్యివేయ్యగానే అందరూ అంతులేని సంతోషంతో పైకెత్తి సంబరాలు చేసుకున్నాము . చెల్లితోపాటు అమ్మలంతా గుమ్మం దగ్గర నిలబడి ఒకరిపై మరొకరు చూస్తూ సంతోషించారు .
అర గంట అయినా అలాగే ఉండటంతో అమ్మలిద్దరూ వర్షం నిలిచాక వెలుదురంట అని ఎంత చెబుతున్నా వినకుండా బయటకువచ్చి , అక్కా చెల్లీ మహేష్ వాళ్ళు వెళ్లే సమయానికి మళ్లీ వచ్చేస్తాము కదా ……… , అందరికీ ఒక ముఖ్యమైన పని ఉంది ఖచ్చితంగా వెళ్ళాలి అనిచెప్పారు . నేను ఆపడానికి ప్రయత్నించబోతే నువ్వుండేదే మరికొన్ని గంటలే అయినా వెళుతున్నాము అంటే అర్థం చేసుకో మహేష్ ………. అని నేను మాట్లాడకుండా చేసేసి వెళ్ళాలి అని ఊరిజనమంతా వెళ్లిపోయారు . పెద్దయ్యా , అమ్మలూ ………. జాగ్రత్తగా వెళ్ళండి అని మనసులో అనుకున్నాను . మహేష్ ………. పూర్తి తడిచిపోయావు జలుబు చేస్తుంది లోపలికిరా అని అమ్మపిలిచింది . అమ్మా ……… అమ్మావాళ్ళు ఊరికి చేరుకోవడానికి 20 నిమిషాలు పడుతుంది . అంతవరకూ నేనుకూడా వర్షంలో తడుస్తానమ్మా ……… మీరు చెల్లిని తీసుకుని లోపలికివెళ్లండి అనిచెప్పాను . లవ్ యు రా మామా అని వాడు నా ప్రక్కనే వచ్చి నిలబడ్డాడు . లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ……….అంటూ చెల్లి మా మధ్యలోకి చేరి , నా ప్రాణమైన వాళ్ళతోనే నేనూ అని వాడిగుండెలపై వాలిపోయింది . ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమను చూసి పరవశించిపోతూ అలా 20 నిమిషాలూ చూస్తూ ఉండిపోయారు . అంకుల్ ……….. మినిట్ మినిట్ చూస్తూ మహేష్ చేరుకుని ఉంటారు అని కాల్ చేసి కనుక్కుని లోపలికి పిలుచుకొనివెళ్లారు . ముగ్గురమూ ఒకేసారి తుమ్మడంతో ఒకరినొకరు చూసి నవ్వుకున్నాము . అమ్మలిద్దరూ ……….. పరుగున కొత్త టవాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని సోఫాలో కూర్చోబెట్టి తల తుడిచి , వేడినీళ్లు పెడతాను అందులో నీలగిరి ఆకులు వేసి రగ్గు నిండుగా కప్పుకుంటే జలుబు తుర్రుమంటుంది శ్రీవారు అనగానే అంకుల్ బయట నీలగిరి చెట్టుదగ్గరికివెళ్లి ఆకులను పీక్కునివచ్చారు . అమ్మ సలసలా కాగిపోతున్న నీటిని పెద్ద పాత్రలో తీసుకొచ్చి ముగ్గురినీ కింద చుట్టూ కూర్చోబెట్టి దుప్పటి కప్పేసి నీటిలోకి ఆకులను మరియు కాస్త vicks వేసి , తల్లీ గట్టిగా పీల్చి వదలండి , మేము చెప్పేంతవరకూ దుప్పటి నుండి బయటకు రాకండి అని దుప్పటిని చేతులపై నెలకు గట్టిగా అధిమేసారు . అమ్మా ………. వొళ్ళంతా చెమటలు , కళ్ళు మంట ………. అయితే తీసేయ్యనా తల్లీ ……….. వద్దమ్మా ……….. శ్వాస బాగా ఆడుతోంది , ఇప్పుడిప్పుడే హాయిగా ఉంది అంటూ ముసిముసినవ్వులు నవ్వుతూ కృష్ణగాడి బుగ్గపై ప్చ్ ……… అంటూ ముద్దుపెట్టింది . ఆ సౌండ్ వినిపించి మన కృష్ణ నిజంగా అదృష్టవంతుడు అని అమ్మావాళ్ళు సంతోషించారు . కొన్ని నిమిషాల తరువాత దుప్పటి తియ్యగానే ఆవిరి గుప్పుమంటూ పైకివెళ్లిపోయింది . అమ్మా ……… సూపర్ జలుబు ఎగిరిపోయింది . లవ్ యు soooooo మచ్ అమ్మా , అత్తయ్యా ……… అని హత్తుకుంది . తల్లీ నీ జలుబు ఎగిరిపోయింది ఆవిరి వల్ల కాదు , నువ్వు పెట్టిన ముద్దు వేడివలన అని ముసిముసినవ్వులతో చెప్పారు .
అమ్మా ………అని సిగ్గుపడుతూ గుండెలపై తలదాచుకుంది చెల్లి . లోపలికివెళ్లి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకునిరండి అని మూడు రూంలలోకి పంపించారు . వెచ్చటి నీళ్లతో స్నానం చేసివచ్చి సోఫాలో కూర్చుని టీవీ ఎంజాయ్ చేసాము . సాయంత్రం 6 గంటలకు వర్షం తీవ్రత తగ్గడంతో ఏమండోయ్ శ్రీవారు తొందరగా వెళ్లి తీసుకురండి అనిచెప్పారు . ఇదిగో వెళుతున్నాను అని లేచి మహేష్ కొద్దిసేపట్లో వచ్చేస్తాము అని అన్నయ్యతోపాటు వెళ్లి చికెన్ , మటన్ , రొయ్యలు తీసుకొచ్చి అధిరిపోవాలి అని అమ్మకు అందించారు . చూస్తారు కదా అని బదులిచ్చారు . అమ్మా ………. నేను కూడా సహాయం చేస్తాను అని వెళ్తోంటే , తల్లీ …………, అధికాదమ్మా ……….. నేర్చుకుందామని , సంతోషంతో మాఇద్దరివైపు చూసి రా తల్లీ నీ ప్రియుడికి , ప్రాణమైన అన్నయ్యకు వండిపెట్టడానికే కదా అని పిలుచుకొనివెళ్లారు . కొద్దిసేపటికే ఘుమఘుమల వలన అందరమూ వంట గదివైపు చూసాము . అంకుల్ లొట్టలెయ్యడం చూసి నవ్వుకున్నాము . 8 కి వంట పూర్తవ్వడంతో డ్రైవర్ అన్నయ్యతోపాటు అందరమూ కలిసి కూర్చుని అమ్మా , చెల్లి చేతులతో తిని wow wow అంటూ పొగడ్తల వర్షం కురిపించాము . కాసేపు రెస్ట్ తీసుకుని ఉద్వేగాల మధ్యన అమ్మా , అంకుల్ వెళ్ళొస్తాము అనిచెప్పగానే , అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి . అమ్మా ……… అక్కయ్య కనిపించిన మరుక్షణమే మీముందు వాలిపోతాము అని చిరునవ్వు చిగురింపజేసి లగేజీ బయటకు తీసుకువస్తోంటే , ట్రాక్టర్లలో ఊరిజనమంతా అమ్మావాళ్ళతోపాటు చేతులలో ఒక్కొక్కరూ ఒక్కొక్కటి పట్టుకుని తీసుకొచ్చారు . అక్కయ్యా , చెల్లీ ఏమిటివి అని అడిగారు . ఒక ఇంటికి కావాల్సిన అన్నింటినీ గ్యాస్ , పాత్రలు , సరుకులు , వడియాలు , స్వీట్స్ , పచ్చళ్ళు …………ఇలా ఒక్కటీ వదలకుండా తీసుకొచ్చాము . మా బుజ్జి కాదు కాదు దేవుడు , కృష్ణ , మా ప్రియమైన బిడ్డ ఎటువంటి ఇబ్బందీ పడకూడదు . అమ్మా …….. లవ్ యు లవ్ యు sooooooo మచ్ , ఇవి ఉంటే మేము మీతోనే ఉన్నట్లు ప్రతిక్షణం గుర్తుకువచ్చి సంతోషంగా ఉండవచ్చు , కానీ ఎలా తీసుకువెళ్లడం అని బాధపడుతోంటే , మహేష్ కొద్దిగా సమయం ఇవ్వు అని అంకుల్ లగేజీ వెహికల్ తెప్పించారు . సర్……… అయితే బస్ టికెట్స్ క్యాన్సిల్ చేసేయ్యండి నేను హైద్రాబాద్ వరకూ తీసుకెళతాను అని డ్రైవర్ అన్న చెప్పారు . అన్నా ………… మహేష్ ఒక్కరి కోసం ఊరుఊరంతా రావడం ప్రాణంలా చూలుకోవడం నేను ఇప్పటివరకూ చూడలేదు . బ్రతికితే మీలా అందరినీ కలుపుకుంటూ బ్రతకాలి . కనీసం మీకు ఈ కాస్త సహాయం చేసి తృప్తి చెందనివ్వండి please please ……. అని కోరుకున్నాడు . థాంక్స్ అన్నయ్యా ……….. యాహూ ………..అని , మాచేతులలోని లగేజీని లగేజీ వెహికల్లోకి తీసుకెళ్లి ఉంచి అందరూ ఇటు ఇవ్వండి అని అడిగాడు . అన్నయ్య కూడా ఎక్కి అందరిచేతిలోనివి అందుకొని సర్దారు .
అంకుల్ డ్రైవర్ దగ్గరికివెళ్లి ఒక అడ్రస్ రాసి ఇచ్చి అక్కడికి తీసుకెళ్లు అంతా arrange చేసేసాను అనిచెప్పారు . బస్ కాదు కాబట్టి అందరితోపాటు సరదాగా మాట్లాడుతూ సమయం మరిచిపోయాము . 12 గంటలకు అందరికీ వెళ్ళొస్తామని ఉద్వేగంతో కన్నీళ్లను తుడుచుకుని చెప్పాను . చెల్లి …….. అమ్మల పాదాలను తాకి గుండెలపై వాలింది . మహేష్ , కృష్ణ ……… నా తల్లి , మా కోడలు జాగ్రత్త అని వెహికల్ వరకూ వచ్చి కూర్చోబెట్టారు . అంకుల్ , పెద్దయ్య , పూజారి గారిని , అన్నయ్యను హత్తుకొని వెనక్కు తిరగకుండా వెళ్లి వెహికల్లో ముందుకూర్చున్నాను . పెద్దయ్యా ……… మీరేమీ బాధపడకండి ప్రక్కనే ఉంటాను కదా , కాల్ చేస్తుంటాను అని వాడి పేరెంట్స్ ఆశీర్వాదం తీసుకుని వచ్చి చెల్లిప్రక్కనే కూర్చున్నాడు . వెహికల్ బయలుదేరడం , వెనుకే లగేజీ వెహికల్ ……… మా ముందు వెనుక రెండువైపులా ట్రాక్టర్లలో పెద్దయ్యా , ఊరి జనం ఊరు పొలిమేరల వరకూ వచ్చారు . ఆపి జాగ్రత్తగా వెల్లమనిచెప్పి మిర్రర్ లో చూస్తూ ప్రయాణించాము . అక్కయ్య ఊహాలతో 5 గంటల ప్రయాణం 5 నిమిషాల్లో హైద్రాబాద్ చేరుకున్నాము . అప్పుడప్పుడే తెల్లారుతోంటే పెద్ద పెద్ద అద్భుతమైన బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ చూసి నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అనుకున్నాను . వెనక్కు చూస్తే చెల్లీ , వాడు ఒకరిపై మరొకరు హాయిగా నిద్రపోతూఉండటం చూసి సంతోషించాను . మా వెహికల్ వెనుకే లగేజీ వెహికల్ వస్తోంది. అన్నా ………. ఏదైనా ఇల్లు రెంట్ ……….. మహేష్ ………. మీ అంకుల్ అన్ని ఏర్పాట్లు చేసేసారు , అప్పుడే మీకోసం ఇంటిని కూడా సెట్ చేసేసారు . అక్కడికే వెళుతున్నాము . మీ అంకుల్ ఫ్రెండ్ ఎదురుచూస్తుంటారని మొత్తం ఆయనే చూసుకుంటారని ఈ అడ్రస్ కు తీసుకెళ్లమని ఇచ్చారు అని చీటి చూపించి gps ట్రాక్ సెట్ చేసాడు . సిటీలో గంట గంటన్నర ప్రయాణం తరువాత స్ట్రీట్ లోకి పోనిచ్చాడు . అడ్రస్ ప్రకారం ఇదే ఇల్లు మహేష్ అని మూడంతస్తుల బిల్డింగ్ ముందు ఆపాడు . వాడు , చెల్లి మేల్కొన్నారు . కిందకు దిగగానే , అంకుల్ వయసున్న ఒకాయన మనుషులతోపాటు బయటకువచ్చి మహేష్ అని పలకరించి చేతులు కలిపి , మీ అంకుల్ క్లోజ్ ఫ్రెండ్ నేను నువ్వు కృష్ణలా కాకపోయినా మాంచి స్నేహితులం . సర్ ……… మాగురించి ……… అంతా తెలుసు సర్ కాదు అంకుల్ అని పిలవండి , సెకండ్ ఫ్లోర్ లో మీరు ఉండటానికి అన్నీ ఏర్పాట్లుచేసాను అని లగేజీ పైకి మార్చడానికి మనుషులను పంపారు . సర్………. అంకుల్ అడ్వాన్స్ , రెంట్ ……….. మహేష్ ప్రయాణం వలన అలసిపోయి ఉంటారు . పైకివెళ్లి ఇల్లుచూసి రెస్ట్ తీసుకోండి . అన్నీ మనం తీరికగా మాట్లాడుకుందాము అని నిమిషాల్లో లగేజీ షిఫ్ట్ చేయించారు . అంకుల్ ……….. వాళ్లకు డబ్బు ఎంత అని ……….. నేను ఇచ్చేసాను . ముందు మీరు రెస్ట్ తీసుకోండి .
తరువాత కావాలంటే ప్రతీ పైసా ఇచ్చేద్ధురంట అనిచెప్పారు . అన్నా …….. రెండు అని డ్రైవర్ ను పిలిచాను . మహేష్ ……….. మా ఆఫీస్ ఉంది అక్కడ రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం రాజమండ్రి వెళ్లిపోతాను అని బదులిచ్చారు . అన్నా ………. అమౌంట్ , మహేష్ ………. నేను మీ సర్ చూసుకుంటాము . అయినా నేను ఒక ఫ్రెండ్ గా మిమ్మల్ని తీసుకొచ్చాను , మళ్లీ ఎప్పుడో ఎక్కడో మీరు వచ్చిన పని అతి తొందరలో పూర్తవ్వాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కౌగిలించుకుని నెంబర్లు ఎక్స్చేంజి చేసుకుని విడిపోయాము . అంకుల్ కృష్ణగాడితో మాట్లాడుతోంటే , అంకుల్ ఇంత మహానగరంలో ఇల్లు వెతకడం ఎలా అని ఆలోచించాను . మీవలన అతి సులభంగా ……… థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అంకుల్ , మేము మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించము . మహేష్ మిమ్మల్ని పంపినది నా ఫ్రెండ్ మొత్తం మీదే అనుకోండి యూత్ ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చెయ్యండి అని పైకి పంపించారు . చూస్తే బయట ఖాళీ ప్లేస్ , లోపల ఒక బెడ్ రూమ్ , హాల్ , వంట గది …….. లవ్ యు అంకుల్ అని ముగ్గురమూ సంతోషించి ప్రయాణం మొత్తం డ్రైవర్ కళ్ళుమూతలుపడకుండా మాట్లాడుతూ కంపెనీ ఇచ్చినందువలన హాల్లో దుప్పట్లు పరుచుకుని వాలిపోయాను . నా ప్రక్కనే వాడుకూడా వాలి కృష్ణ అని పిలిచాడు . వాడిప్రక్కనే కూర్చుని ………. మీరిద్దరూ రెస్ట్ తీసుకోండి అని కృష్ణగాడి బుగ్గపై ముద్దుపెట్టి బెడ్రూం లోని బాత్రూం వైపు వెళ్ళింది. మెలకువ వచ్చి మాంచి నిద్ర అంటూ పెదాలపై చిరునవ్వుతో వొళ్ళువిరుస్తూ లేచికూర్చుని కళ్ళుతెరిచి చూస్తే షాక్ …………చుట్టూ చూసి , రేయ్ మామా రేయ్ మామా ……….. అని ఛాతీపై చేతినివేసి వేగంగా కదిపాను . ఏంట్రా మామా………. నీ చెల్లితో హాయిగా అలా అలా……….ఆకాశంలో తెలిపోతుంటే డిస్టర్బ్ చేసావు అంటూ నిరాశతో లేచికూర్చున్నాడు . చెల్లెమ్మను ప్రక్కనే పెట్టుకుని ఇంకా ఊహల్లోనే తెలుతున్నావు ఏంట్రా అని వీపుపై దెబ్బవేశాను . అమ్మా ………చచ్చానురోయి అంటూ కళ్ళుతెరిచి నాలాగే షాక్ లో ఆశ్చర్యపోయి చుట్టూ చూసి , రేయ్ మామా ……….లారీ సామానులు మొత్తం అందంగా సర్ధేశి ఉండటం , ఇల్లు మొత్తం శుభ్ర చేసి ఉండటం చూసి ఇద్దరమూ నిలబడ్డాము . ఇద్దరమూ ఒకేసారి కృష్ణ – చెల్లెమ్మ అనుకుని ఒకవైపు సంతోషం , మరొకవైపు చెల్లి మాత్రమే ఇంత కష్టపడి ఉండటం చూసి దున్నపోతుల్లా పడుకున్నాము రా అని ఒకరినొకరు తిట్టుకుని , చెల్లీ రేయ్ కృష్ణా , చెల్లీ కృష్ణా………. అని పిలుస్తూ వంట గదిలోకి వెళితే అక్కడకూడా గ్యాస్ స్టవ్ తోపాటు వంటపాత్రలన్నీ చక్కగా సర్ది ఉండటం చూసి , రేయ్ – రేయ్ ……….. దున్నపోతులమే రా కనీసం పాత్రల సౌండ్ కు కూడా మేల్కొలేకపోయాము అని ఒకరిపై మరొకరము తు తు …….అని ఉమ్మేసుకు నవ్వుకుని చెల్లెమ్మా , కృష్ణా ……… అని కేకవేశాము .
కృష్ణా , అన్నయ్యా ………బాత్రూమ్లో ఉన్నాను అయిపోయింది వచ్చేస్తున్నాను అని 15 నిమిషాల తరువాత పట్టు లంగా ఓణీలో దేవకన్యలా అందమైన చిరునవ్వుతో బెడ్రూం నుండి బయటకువచ్చి గుడ్ మార్నింగ్ రా అని సిగ్గుతో , గుడ్ మార్నింగ్ అని ప్రేమతో విష్ చేస్తుంటే , వెంటనే కృష్ణగాడి వెనుక నిలబడ్డాను . నేను గెస్ చేసినది కరెక్టే వెనుకకు పడిపోబోతుంటే పైనే పట్టుకుని ఆపి వెళ్లి కౌగిలించుకోరా అని చెప్పాను . లవ్ యు రా మామా ……….. అని ముందుకువెలుతోంటే , చెల్లి వాడి కొగిలిలో వొదిగిపోవాలని బొటన వేలితో నేలపై రాస్తూ తియ్యని సిగ్గుపడుతోయి ఆశతో ఎదురుచూస్తుంటే , కృష్ణా ………. లవ్లీ గుడ్ మార్నింగ్ రా అని కౌగిలించుకోబోయి ఆగిపోయాడు . ఎంతసేపటికీ కౌగిలించుకోకపోవడంతో , తననే కన్నార్పకుండా చూస్తున్న వాడివైపు ప్రేమతో చూస్తూ సిగ్గుపడి , తనే వాడి గుండెలపై వాలిపోబోతుంటే ………. కృష్ణా ………. నువ్వు దేవతలా రెడీ అయ్యావు , నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు వద్దురా అనిచెప్పాడు . నా హీరో ఎలాఉన్నా నాకు ప్రాణం అంటూ అమాంతం గుండెలపై వాలిపోయి రెండుచేతులతో గట్టిగా చుట్టేసింది . లవ్ యు my ఏంజెల్ అంటూ ప్రాణంలా హత్తుకొని నుదుటిపై పెదాలను తాకించాడు. నేను సంతోషంతో చప్పట్లు కొట్టడంతో మురిసిపోయి , అన్నయ్యా – రేయ్ ……… తొలిరోజు కదా పాలు పొంగించాలి త్వరగా స్నానం చేసిరండి అనిచెప్పింది . రేయ్ మామా ………. నువ్వు ముందువెళ్లి స్నానం చెయ్యి , నేను బయటకువెళ్లి దగ్గరలోని షాప్ నుండి పాలు తీసుకొస్తాను అనిచెప్పాడు . రేయ్ అవసరం లేదు ఓనర్ అంటీ మనం వస్తామని తెలిసి ఈరోజు నుండి రోజూ పాలప్యాకేట్స్ వేసేలా నిన్ననే చెప్పిందట , ఈరోజు అంటీనే వచ్చి ఇచ్చారు . చాలామంచివారు ………. అప్పుడే ఇరుగుపొరుగువారిని కూడా పరిచయం చేసుకున్నారు మేడం గారు …….. అని కృష్ణగాడు చెల్లి బుగ్గపై ముద్దుపెట్టాడు . చెల్లీ ………… మమ్మల్ని కూడా లేపి ఉండొచ్చుకదా , ఒక్కదానివే ఎంత కష్టపడ్డావో ……….. అని ఇద్దరిదగ్గరకువెళ్లి చెల్లి కురులపై చేతితో స్పృశించాను . మీరు నాకు దేవుళ్ళతో సమానం , దేవుళ్లను ఎవరైనా కష్టపెడతారా ……….. లవ్ యు sooooo మచ్ ……… అని ఇద్దరినీ హత్తుకొని , ఈ దేవుళ్ళ దేవతవి నువ్వు చెల్లీ ……….. కాబట్టి మాతో పనిచేయించొచ్చు అనిచెప్పి ముగ్గురమూ సంతోషన్గా నవ్వుకుని , రేయ్ స్నానం చేయడానికి వెళుతున్నాను . చెల్లిని ప్రాణంలా చూసుకో ……….ఊహల్లో కాదు రియల్ గా అని మరొకదెబ్బ వేసి బెడ్రూం లోకివెలితే అక్కడ కూడా ముగ్గురి బట్టలను చక్కగా కప్ బోర్డ్ లలో సెట్ చేసింది . రేయ్ ఒక్కనిమిషం మళ్లీ వచ్చి ఇలాగే కౌగిలిలో వాలిపోతాను అని వాడి బుగ్గపై కొరికేసి , పరుగున బెడ్రూం లోకివచ్చి అన్నయ్యా ………. బ్యాగులో డబ్బు ఉంది అని కర్చీఫ్ తోపాటు అందించింది .
ఇద్దరూ ఒకేసారి విస్వ సర్ …………, అవునన్నయ్యా చాలా ఉంది . కట్ట లక్ష చెప్పున 5 లక్షల దాకా ఉంది అన్నయ్యా ………. నోరుతెరిచి ఆశ్చర్యపోయి వెంటనే మొబైల్ తీసి విశ్వ సర్ కు కాల్ చేసాను . సర్ అంత డబ్బు మేము తీసుకోలేము సర్ మన్నించండి . వెంటనే డ్రైవర్ నాన్నతో వెనక్కు పంపించేస్తాను అనిచెప్పాను . మహేష్ ……… ఏడబ్బు నేను ఉంచనేలేదే ………. సర్ ………… మహేష్ ……….. మీరు ఉన్నది హైద్రాబాద్ లో (డ్రైవర్ కాల్ చేసాడు) అవసరం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. అలా వచ్చినా నువ్వే ఇబ్బందిపడతావు కానీ నన్ను అడగవు అందుకే ముందే ఇచ్చేసాను . నామీద ఏమాత్రం గౌరవం ఉన్నా డబ్బు గురించి మరొక్కమాట మాట్లాడకు . ఇంకా కావాలంటే అడుగు అంతే ………. అలాగే మీరు జైల్లో సంపాదించిన డబ్బు నిన్న సాయంత్రమే మీ కొత్త అకౌంట్ లలోకి పడిపోయింది . పాస్ బుక్ , కార్డ్స్ కొరియర్ చేస్తాను అడ్రస్ చెప్పండి అని అడిగారు . థాంక్యూ soooo మచ్ సర్ అడ్రస్ మెసేజ్ చేస్తాను అని కట్ చేసాను . వెంటనే అంకుల్ కు కాల్ చేసి లవ్ యు అంకుల్ ………. ఇల్లు చాలా బాగుంది . అంకుల్ కూడా చాలా మంచివారు . వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఏమైనా restrictions పెడితే ఒక్క కాల్ చెయ్యి దుమ్ముదులిపేస్తాను ……… ఇదిగో మీ అమ్మ మాట్లాడుతుంది అని ఇచ్చారు . అమ్మతోమాట్లాడి , మొబైల్ మరియు డబ్బుని చెల్లికి అందించి బాత్రూమ్లోకి వెళ్ళాను. అమ్మా ………. నా స్నానం అయిపోయింది , మీ బుజ్జి పిల్లలు రెడీ అయితే అంటూ వాడిని హత్తుకొని నవ్వుతూ , మీరు చెప్పినట్లుగానే పాలుపొంగిస్తాను అని మాట్లాడుతోంది . బాత్రూమ్లో రెండు సబ్బులు ఒకటి ఇప్పుడే చెల్లి వాడినట్లు , మరొకటి ఫ్రెష్ , మరి కృష్ణగాడికి అని ఆలోచిస్తూనే తలపై ఒకదెబ్బవేసుకుని ఇద్దరూ ఒక్కటే కదా అని నవ్వుకుని స్నానం చేసి బయటకువస్తూ , రేయ్ అయిపోయింది అని కేకవేసి బయటకువచ్చాను . చెల్లీ భుజం చుట్టూ చేతినివేసి బేబీ బేబీ బేబీ……….అంటూ ప్రేమతో మాట్లాడుతూ , వెంటనే వచ్చేస్తాను , మీ అన్నయ్యకు బట్టలు అందివ్వు అని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టాడు . రేయ్ ఇది నా సబ్బు , ఇది చెల్లి ……….. ఇక పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను బాగా గుర్తుపెట్టుకో అని చిలిపినవ్వుతో బయటకువచ్చాను . ఉమ్మా ………లవ్ యు లవ్ యు soooooo మచ్ రా మామా ఉమ్మా……… అంటూ లోపల డాన్స్ మొదలెట్టాడు . చెల్లి సిగ్గుపడుతూ జాగ్రత్త పడిపోతావు అని నవ్వుకుని నాకు కొత్తబట్టలు అందించి , అన్నయ్యా ……….. పాలు పొంగించడానికి అంటీని కూడా పిలుస్తాను . డ్రెస్ వేసుకుని కిందకు రండి అంటీ గ్యాస్ సిలిండర్ ఇస్తాను అన్నారు అని చెప్పింది . Two మినిట్స్ చెల్లీ ……….. అని డ్రెస్ వేసుకుని కిందకు పరిగెత్తి గుమ్మం దగ్గర నిలబడ్డాను . కృష్ణవేణి ……… మహేషా లేక కృష్ణనా ……….అని అంటీ అడిగింది . మహేష్ ………నా ప్రాణం కంటే ఎక్కువైన అన్నయ్య అంటీ ………..
మహేష్ ……… అక్కడే ఆగిపోయావే , లోపలికి రా బాబు ………. నమస్తే అంటీ …….. అని రెండుచేతులతో నమస్కరించి లోపలికివెళ్ళాను . అంటీ …….. అంకుల్ కనిపించడం లేదు అని అడిగాను . కొద్దిసేపటి ముందు మీకు కూడా టిఫిన్ చెయ్యమనిచెప్పి ఆఫీస్ కు వెళ్లిపోయారు . సమయం చూస్తే 10 గంటలు అవుతోంది . బాబు మహేష్ ………. extraa సిలిండర్ లోపల వంట గదిలో మూలన ఉంది . ఎటువైపు అంటీ …….. లోపలికివెల్లు మహేష్ , లోపల మా మూడో అమ్మాయి కార్తీక ఉంది చూపిస్తుంది అని పాలు ఎలా పొంగించాలో చెల్లికి వివరిస్తున్నారు . అలాగే అంటీ అని లోపలకు వెళ్ళాను . అంటీ కూతురు మా వయసే అనుకుంటాను డైనింగ్ టేబుల్ పై టిఫిన్ చేస్తూ నేను వెళ్ళగానే నోట్లో ముద్దతో కన్నార్పకుండా అలా చూస్తుండిపోయింది . Hi మేడం ……… మేము ఈరోజే మీ ఇంటిలో దిగాము . అంటీ సిలిండర్ తీసుకోమన్నారు అని చుట్టూ చూస్తున్నాను . మేడమా ………… నన్ను చూస్తే మేడం లా కనిపిస్తున్నానా ……… నా వయసు స్వీట్ sixteen తెలుసా ……… అని కాస్త కోపంతో లేచినిలబడి రెండు చేతులతో తన బాడీ చూపించి, i am కార్తీక ఇంటర్ సెకండ్ ఇయర్ అనిచెప్పింది . Sorry కార్తీక గారు ………. కార్తీక గారా ……….. ఇంత explain చేసినా మళ్లీ మొదటికే వచ్చావు . I am కార్తీక జస్ట్ కార్తీక అని చిరుకోపంతో చెప్పింది . అలాగే నండీ ………… Shit shit shit ………… ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావో , అయినా కూడా నచ్చేసావు అని నవ్వుతూ వచ్చి మెతుకుల చేతినే చాపి i am కార్తీక , నువ్వు ………. అని మెలికలు తిరిగిపోతోంటే ……….. తన వయసు ప్రభావమని , ఇక్కడితో కట్ చెయ్యాలని ……. నా పేరు మహేష్ నిన్న ఉదయమే సెంట్రల్ జైల్ నుండి రిలీజ్ అయ్యాను అనిచెప్పాను . సెంట్రల్ జైలా ………. అని నుదుటిపై చెమటతో వణుకుతోంటే , నవ్వుకుని మేడం కార్తీక మేడం సిలిండర్ ఎక్కడో చూపిస్తే ఇక మీకు కనిపించనే కనిపించను. అక్కడ అన్నట్లు నోటివెంట మాట రానట్లు వేలితో డైనింగ్ టేబుల్ వెనుక చూపించింది. మోస్ట్ వెల్కమ్ మేడం అంటూ అంత బరువుని ఓకేచేత్తో ఎత్తుకుని భుజం పై వేసుకోవడం చూసి నోరుతెరిచి ఆశ్చర్యపోతుంటే , జైల్ ఫుడ్ తిని 24 గంటలూ కష్టపడతాము కదా …….. ఈ మాత్రం బలం ఉంటుంది మేడం అని నవ్వుకుంటూ చెల్లిదగ్గరకు వచ్చాను . కృష్ణవేణి మరొక గంట వరకూ మంచి సమయం ఉంది పాలుపొంగించడానికి అని అంటీ చెప్పారు . అంటీ మీరుకూడా వస్తాను అన్నారుకదా రండి please అని చెల్లిపిలిచింది . సరే ……… కార్తీక నువ్వు వస్తావా తల్లీ ……… నో నో నో ……….. ఇక చచ్చినా పైకి వెళ్ళను . ఏమైంది అన్నయ్యా ………..అని కళ్ళతోనే అడిగింది చెల్లి . నిజం చెప్పాను చెల్లీ ……… చెల్లికి మొత్తం అర్థమై , లైవ్ యు అన్నయ్యా ……… మా అన్నయ్య హృదయంలో కేవలం మా అక్కయ్యకు మాత్రమే ……….. మా చెల్లి కూడా ……….. అంతే కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా గుండెలపై వాలిపోయే పైవరకూ వచ్చింది . బాబు మహేష్ ……….. బరువుగా లేదు కదూ ……….
మా అన్నయ్య కొండనైనా ఎత్తేస్తారు అంటీ అని లోపలికి వచ్చాము . Hi కృష్ణా ……… అని అంటీ పలకరించింది . వాడు ఆశ్చర్యపోతుంటే చెల్లి నవ్వుకుని అంటీని పరిచయం చేసింది . సిలిండర్ పై ఉన్న instructions ప్రకారం సిలిండర్ కనెక్షన్ ఇచ్చాను . చెల్లి పూజ గదిలో పూజ చేసి పాలను పాత్రలోవేసి అంటీ చెప్పినట్లు పొంగించి అంటీ తెచ్చిన కాఫీ పొడర్ కలిపి కాఫీ చేసి అందరికీ అందించి తానూ తాగింది . కృష్ణవేణి , కృష్ణ , మహేష్ ……….. వంట సరుకులు తెచ్చుకునేంతవరకూ మాఇంట్లోనే తినమని అంకుల్ చెప్పారు రండి అని వద్దన్నా పిలుచుకొనివెళ్లి , కార్తీక అని పిలిచారు. అమ్మా ……… కాలేజ్ టైం అయ్యింది బై అంటూ మమ్మల్ని చూసి భయంతో బయటకు తుర్రుమంది . చెల్లితోపాటు నవ్వుతోంటే కృష్ణగాడు ఏంటని సైగచేశాడు . చెల్లి వాడి చెవిలో గుసగుసలాడటంతో ముగ్గురమూ నవ్వుకున్నాము . మీరు ముగ్గురూ ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉంటారా …………, అంతే అక్కయ్య గుర్తుకువచ్చి సైలెంట్ అయిపోయాను . అన్నయ్యా ……… అంటూ చెల్లి ఎమోషనల్ అవ్వడం చూసి , చెల్లీ ……… లెట్స్ సెలబ్రేట్ our first డే అని నుదుటిపై ముద్దుపెట్టి నవ్వుతూ ఆకాలేస్తోంది చెల్లీ అనగానే , చెల్లి వడివడిగా అంటీకి హెల్ప్ చేసి , అంటీ ………. మీరు ఏమీ అనుకోకండి అని నాకు ప్రేమతో కలిపి తినిపించింది . Wow ………….. how స్వీట్ అని సంతోషించి , మహేష్ కృష్ణా ఎలా ఉందో చెప్పనేలేదు . Sooooo tasty అంటీ ……… అప్పుడప్పుడూ కూరలు అని ఆడిగాము . అంటీ మైనరిచిపోయు అప్పుడప్పుడూ ఏంటి రోజూ నేనే తీసుకొస్తాను అని బదులిచ్చారు . మేము తిన్న తరువాత , హాల్లోని సోఫాలో కూర్చోమనిచెప్పి చెల్లి అంటీ తిన్నారు . Like 224 Dislike 28 122060 20 0 cookie-check శృంగార స్టోరీ 81 no