శ్రీమతి.. ఒక బహుమతి 1 వ భాగం
వెలుతురు కళ్లల్లో గుచ్చుకుంటుంటే ఇక తప్పదన్నట్టుగా కాసేపు అటూ ఇటూ దొర్లి, బద్దకంగా ఒళ్లు విరుచుకుంటూ, కప్పుకున్న దుప్పటిని ఒంటి మీద నుంచి తొలగిస్తూ లేచి కూర్చున్నాను. ఎదురుగా నేను, మా శ్రీ వారు ఉన్న ఫొటోలో.. తను నన్ను వెనకనుంచి పట్టుకుని ఉంటే మేమిద్దరం మా 64 (32+32) పళ్లన్నీ కనబడేట్టు ఇకిలిస్తున్న ఫోజులో ఉన్నాం. శ్రీవారికి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి.. శనివారం పొద్దున్న నా పక్కన (లో)లేని తనని ముద్దుగా విసుక్కుంటూ మంచమ్మీదనుంచి దిగి బాత్రూములోకి అడుగుపెట్టాను. ** నేను (అంటే శ్వేత), హబ్బీ సాగర్.. ఇద్దరం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లం. పెళ్లయి ఏడాదిన్నర అవుతోంది. సాగర్ తన ప్రాజెక్ట్ వర్క్ మీద US వెళ్లి సుమారు 3 నెలలు కావస్తోంది. తను తిరిగి రావడానికి ఎట్లాలేదన్నా ఇం కా 3 నెలలు పట్టొచ్చు. భార్యా భర్తలిద్దరూ work చేసే వాళ్లయితే ఇట్లాంటి ఇబ్బందులు తప్పవనుకుంటా!. లేక పోతే శుభ్రంగా నేను కూడా సాగర్ తో పాటు వెళ్లి ఉండేదాన్ని కదా!.. ** సన్నగా నిట్టూరుస్తూ బాత్రూములోంచి బయట కొచ్చి గడియారం వంక చూసాను పది దాటొస్తోంది. బయట కొచ్చి ఎదురు అపార్టుమెంట్లో పిన్నిగారు ఇవ్వాళ టిఫిను, భోజనం అన్నీ వాళ్లింట్లోనే అన్న విషయం గుర్తుకొచ్చి “♡..” అను కుంటూ టవల్ అందుకుని మళ్లీ బాత్రూములోకి దూరాను మా ఇద్దరి సేవింగ్సుతోపాటు, కొంత బాంకులో లోనుతో మేము ఈ అపార్టుమెంటు కొనుక్కుని గృహప్రవేశం అయ్యే నాటికే మా ఎదురు అపార్టుమెంట్లో పిన్నిగారు వాళ్లు ఉంటున్నారు. బాబాయిగారు బ్యాంకులో మానేజరు. ఇంకా 2,3 ఏళ్ల సర్వీసు ఉందన్నట్టు గుర్తు. వాళ్లకి ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరికి పెళ్లిళ్లు చేసేసి అత్తవారిళ్లకి పంపేసి, వీళ్లిద్దరూ మళ్లీ లైఫ్ ని.. కొత్తగా పెళ్లయిన వాళ్ల లా enjoy చేస్తున్నారు. నాకు అప్పుడప్పుడూ, మేము కూడా అలా ఉండట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది. వచ్చిన కొద్ది రోజులకే వాళ్లిద్దరూ మాకు బాగా సన్నిహితులయ్యారు. బాబాయి గారు, మా హోం లోన్ ని వాళ్ల బాంకులోకి తక్కువ వడ్డీకి మార్పించారు. మేమిద్దరం ఎప్పుడన్నా అలసిపోయి ఇంటికి చేరుకుని వండుకునే ఓపికలేని సమయాల్లో వాళ్లింటినుంచి మాకు కూరలో, టిఫినో, లేకపోతే వాళ్లింట్లోనే భోజనమో సిద్ధంగా ఉండేవి. సరే, విషయాని కొస్తే.. ఏమైనా సరే, వీకెండ్లో ఆఫీసు మొహం చూడకూడదని గట్టిగా నిర్ణయించుకున్న నేను రాత్రి ఆఫీసులో కాస్త లేటుగా ఉండి, బిజీ బిజీగా ఉన్న సమయంలో, పిన్నిగారు ఫోను చేసి రేపు బాబాయిగారి పుట్టిన రోజనీ, అందువల్ల ఇంట్లో వంటే మీ పెట్టుకోవద్దనీ, వాళ్లింట్లోనే భోజన మనీ చెప్పి ఫోన్ పెట్టేసారు. “హమ్మయ్య!. ఐతే రేపటికి పిన్నిగారింట్లో విస్తరాకులు ఇచ్చేసినట్టే!..” అను కుంటూ మళ్లీ పనిలో పడ్డాను.