షాలిని – Part 4
యజమాని: మా రిసార్ట్ ని వివేక్ అనే పేరుతొ ఒకతను బుక్ చేసాడు…వాళ్ళందరూ ఫ్రైడే రోజు రాత్రి ఇక్కడకి చేరుకున్నారు.. డిన్నర్ ముగించి వాళ్లంతా ఏవో గేమ్స్ ఆదుకుంటామని మా బంక్యూట్ హాల్ తీసుకుని అక్కడ గాథేర్ అయ్యారు… నైట్ రెండు గంటల సమయంలో మా బాయ్ వాళ్లకి డ్రింక్స్ సప్లై చేసినట్టు చెప్పాడు..తెల్లారేసరికి మాకు ఎవరు కనపడలేదు.. రిపోర్టర్: మీరు వెంటనే పోలీసులకి ఎందుకు చెప్పలేదు యజమాని: మేము వాళ్ళు బిల్ ఎగొట్టి పారిపోయారు అనుకున్నాం..కానీ మా వాళ్ళు, వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ చేశామని చెప్పారు… నేను కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి విషయం చెప్పను.. కాల్ తీసుకున్నాయని ఆ అక్కడే ఎక్కడో తాగి దొర్లుతూ ఉంటారు వెతుక్కో అని పెట్టేసాడు.. చేసేది లేక ఉరుకున్నాం.. వాళ్ళు శుక్రవారం వచ్చారు..ఇవ్వాళా గురువారం….వారమైంది..ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో.. వాట్ మనం కిడ్నాప్ అయ్యి వారం అయ్యిందా ? మనం వారం నుంచి ఇలానే పడున్నామా ? తిండి తిప్పలు లేకుండా వారం పాటు ఎలా ఉన్నాం ? ఉన్న యాభై మందిని వెంటాడుతున్న ప్రశ్నలు ఇవి.. ఇప్పుడు ఏమి చెయ్యాలి…బయట పడే దారేది.. ఫోన్స్ లేవు…కమ్యూనికేషన్ లేదు..ఎవరు చేశారో తెలీదు…ఎందుకు చేశారో తెలీదు.. ఏంటి పరిస్థితి ..ఎన్నాళ్లిలా… టీవీ లో లైవ్ అప్డేట్లు ఇస్తున్నారు..కానీ విషయం ఏమి తెలీదు.. రిపోర్టర్: కిడ్నాప్ అయినా వాళ్ళ ఆచూకీ కానీ…కిడ్నాప్ చేసిన వాళ్ళ డిమాండ్స్ కానీ ఏమి తెలియరాలేదు.. ఏమి తెలియక పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు..చూస్తుంటే ఉండండి బొక్కలో టీవీ.. గది లో అంటా నిశ్శబ్దం…భయంకర నిశ్శబ్దం.. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ స్పీకర్ లో వినబడింది ఒక గొంతు….హలో బాయ్స్ అండ్ గర్ల్స్…ఎలా ఉన్నారు.. మీరంతా ఎదో ఫకింగ్ ఫెస్ట్ ఎంజాయ్ చేద్దామని వస్తే..ఏంటి ఇలా జరిగింది అనుకుంటున్నారా ? హ్హాహ్హా అంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది.. అంటే మీ ఫెస్ట్ నేను ప్లాన్ చేసింది కాదు… (హమ్మయ్య నేను బతికాను అనుకున్నాడు వివేక్) మీ ఫెస్ట్ ప్లాన్ నాకు తెలిసి….నేను నా స్వార్ధం కోసం మిమ్మల్ని కిడ్నాప్ చేసాను.. షాలిని: ఎవరు మీరు ఎం కావాలి.. సో మీ మైండ్ లో రకరకాల డౌట్స్ ఉండచ్చు…నేను కొన్ని క్లియర్ చేస్తాను.. షాలిని ఎదో అడగబోతే…రోహిత్ ఆపి: మన వాయిస్ వినపడదు ఆగు అన్నాడు..ఎందుకంటే అది జస్ట్ స్పీకర్..మైక్ లేదు.. ఓకే అంది షాలిని.. వాయిస్: ఎస్ మిమ్మల్ని కిడ్నాప్ చేసి వారం అయ్యింది..మీ డ్రింక్స్ లో మందు కలిపి మిమ్మల్ని కిడ్నాప్ చేసాం.. వారం నుంచి అలా ఎలా పడున్నారు అంటే అదే మందు మహత్యం..ఒక ఫ్రెండ్స్ ఎంజాయ్ యువర్ స్టే విత్ మీ… నేను మిమ్మల్ని మళ్ళి కలుస్తాను..
మీరు ఎన్ని రోజులు ఉండాలి…మీ తిండి పరిస్థితి ఏంటి అనేది నా డిమాండ్స్ కి మీ పోలీసులు మీ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది… ఓకే సి యు బాయ్….అంతే వాయిస్ ఆగిపోయింది… అందరి మొహాల్లో భయం…ఏమి జరుగుతుందా అని… టిక్ టిక్ టిక్ సమయం ఆరు గంటలు… కిడ్నాప్ అయ్యి వారం… విషయం తెలిసి ఆరు గంటలు…. వారం నుంచి తిండి లేకపోవటం తో అందరికి ఆకళ్ళు వేస్తున్నాయి… కనీసం ఎవరన్నా కనిపిస్తే ఏదన్నా అడగచ్చు… రూమ్ లో ఉన్నవాళ్లు తమకి తామే కనపడనంత చీకటి… టీవీ ఆన్ అయినప్పుడు మాత్రమే మనుషులు కనపడుతున్నారు.. వివేక్: ఎం చెయ్యాలి ఇప్పుడు..ఆకలి మొదలైందా ? ఆ అన్నారు అందరు… రోహిత్: సరే ఒక పని చెయ్యండి..అందరు లేచి గోడ కానీ తలుపు కానీ దొరికే వరకు వెతకండి.. గోడ దొరికితే తలుపు కోసం వెతకండి… తలుపు దొరికితే చెప్పండి…అందరం కలిసి తలుపు కొడదాం… ఎవరు తియ్యకపోతే అంది రేవతి… రోహిత్: నీ దగ్గర వేరే ఐడియా ఏదన్నా ఉందా ? రేవతి: ఉహు… రోహిత్: మరి చెప్పింది చెయ్యి…తలుపు విరిగే వరకు కొడదాం… విక్రమ్: ఎవరు హీరో లు అవ్వటానికి ప్రయత్నం చెయ్యవద్దు…ఏమి చేసిన అందరం కలిసే చేద్దాం.. సరే అన్నారు అందరు….. రేవతి: ఎందుకు ? విక్రమ్: నువ్వెళ్ళి ఏదన్న తలుపు ఒక్కదానివే తెరిచి చూడు తెలుస్తుంది ? రేవతి: ఏమవుతుంది… ఫాతిమా: చంపేస్తారే…మెంటల్…. రేవతి: సరే సరే…పదండి వెతుకుదాం… మెల్లగా అందరు లేచి ఏదన్నా గోడ తగులుతుందా అని చేతులు చాచి తచ్చాడుతున్నారు.. ఎంత సేపు తిరిగినా ఏమి కనపడట్లేదు.. రేయ్ ఏంట్రా ఎంత నడిచినా ఏమి తగలట్లేదు..ఇది అంత పెద్ద రూమా… విక్రమ్: అవును రా అసలు ఏమి కనపడట్లేదు… వినయ్: కనీసం పిల్లర్ లేకుండా ఇంత రూమ్ ఎలా కట్టారు.. షాలిని: నిజమే…అసలు ఏమి తగలట్లేదు..ఎంత పెద్దదైన రూమ్ గోడ అన్నా తగలాలి కదా… ఒక పది మంది చుట్టూతా వెతుకుతున్నారు…. మిగిలిన నలభై మంది కదలకుండా నిలబడి ఉన్నారు మధ్యలో… రోహిత్: బాస్ అందరు వెతుకుతున్నారా లేదా సైలెంట్ గా ఉన్నారా…ఇంత మంది వెతుకుతున్నా రూమ్ కి గోడ గాని తలుపు గాని తెలియలేదంటే ఏంటి ఈ విచిత్రం… వెతికి వెతికి విసుగొచ్చి…ఎక్కడి వాళ్ళు అక్కడ కూలబడ్డారు… వివేక్: రోహిత్ అని పిలిచాడు… రోహిత్: హా ఎవరది..నేను ఏటో ఒక మూల ఉన్నాను…విక్రమ్… విక్రమ్: నేనొక మూల..వినయ్… వినయ్: హే విక్రమ్ అరవకు నేను నీ పక్కనే ఉన్నాను..వివేక్… వివేక్: నేనోపక్క..షాలిని… షాలిని: హా…ఎక్కడున్నానో తెలీదు…మధు… మధు: ఆ ఇక్కడే ఉన్నా రేవతి: ఇక్కడంటే ఎక్కడున్నావ్ మధు… మధు: నీ బొందె నీ బొంద…కనపడి ఛస్తేనే గా ఎక్కడున్నానో చెప్పేది… ఏంటి ఎవరు మాట్లాడట్లేదు…ఓన్లీ మన మాటలే వినిపిస్తున్నాయి..అంది ఫాతిమా… వివేక్: అవును గురు..
మన పది మంది మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి… కనీసం కాస్తైనా వెలుగు ఉంటె ఎవరున్నారు ఎవరు లేరు…అని చూసుకోవచ్చు.. ఇంతలో breaking news….. అందరు పరుగు పరుగున టీవీ దగ్గరికి వచ్చారు.. వివేక్ చుట్టూ చూసాడు….పది మంది మాత్రమే కనపడ్డారు… షిట్ మిగిలిన వాళ్లు ఏరి… షాలిని: అవును మనకి ఏ గోడా తగల్లేదు..మరి టీవీ దేనికి హ్యాంగ్ అవుతోంది… రోహిత్: రైట్ షాలిని…కరెక్ట్ పాయింట్ పట్టుకున్నావ్ అంటూ టీవీ దగ్గరికి వచ్చి బాస్ ఎవరన్నా వచ్చి నన్ను ఎత్తుకోండి…ఒక్కసారి టీవీ ని రౌండ్ గా తిప్పితే అసలు ఈ రూమ్ పరిస్థితి ఏంటో తెలుస్తుందేమో….. విక్రమ్ వచ్చి రోహిత్ ని పైకి లేపాడు టీవీ వచ్చే వైపు…. రోహిత్ టీవీ ని అటు ఇటు తిప్పాడు… టీవీ వెలుగు లో….కంటి చూపు మేర ఏమి కనపడలేదు… వినయ్: రోహిత్ టీవీ దేనికి హ్యాంగ్ అవుతుందో చూడు… రోహిత్: కరెక్ట్ బ్రదర్…అంటూ చెయ్యి పైకి చాపి చూసాడు…ఏమి తగల్లేదు…అని కిందకి దిగాడు… రోహిత్: టీవీ ఏ గోడకి లేదు…పైనుంచి దేనితోనూ హ్యాంగ్ చెయ్యలేదు….మరి టీవీ ఎలా వస్తోంది సడన్ గా… సరే ముందు న్యూస్ వినండి అన్నాడు వివేక్… బ్రేకింగ్ న్యూస్- కిడ్నాప్ చేసిన యాభై మంది లో నలభై మందిని విడుదల చేసిన కిడ్నాపర్లు… మిగిలిన పది మందిని ఎందుకు దాచారో ఇంకా తెలియాల్సి ఉంది… అసలు ఎందుకు బంధించారు..ఎందుకు వదిలేశారు అనే అంశాల పై పోలీసులు కసరత్తు చేస్తున్నారు… విడుదల అయినా వారిని విచారిస్తున్నట్టు సమాచారం…కానీ వారి దగ్గర ఎటువంటి సమాచారం లేదు… తమని ఒక గది లో ఉంచారని… వారం అయ్యిందని చెప్పారని… పోలీసులు రియాక్ట్ అయిన దాన్ని బట్టి మాకు తినడానికి ఏదన్నా ఇస్తామని చెప్పారని తెలుస్తోంది…అంతకు మించి వారికేమి తెలియదని చెప్పినట్టు సమాచారం.. తదుపరి అపుడట్లు కోసం చూస్తూనే ఉండండి బొక్కలో టీవీ… టీవీ ఆఫ్ అయిపొయింది.. వినయ్: రోహిత్, ఇప్పుడు టీవీ పరిష్టితి ఏంటో చూడు ? రోహిత్: రైట్…విక్రమ్ ఎత్తుకు బ్రదర్.. చటుక్కున ఎత్తుకున్నాడు విక్రమ్… ఇందాక ఉన్న ప్లేస్ లో టీవీ లేదు… రోహిత్: భయ్యా టీవీ కనపడట్లేదు భయ్యా…. వాట్ అవాక్కయ్యారు అందరు… వినయ్: ఒక పని చేద్దాం…అందరం ఒకళ్ళని ఒకళ్ళు ఎత్తుకుందాం..ఎక్కడన్నా మిస్ అయ్యమేమో తెలుస్తుంది.. వివేక్: అసలు ఇక్కడ ఎంత మందిమి ఉన్నామో తెలీదు…పది మంది అన్నారు…ఎవరు ఆ పది మంది.. పేర్లు చెప్పండి వన్ బై వన్.. వివేక్ నేను విక్రమ్ మీ రోహిత్ నేను వినయ్ నేను రమణ వివేక్: రమణ నువ్వున్నావా ఇందాకటి నుంచి మాట్లాడవేం ? రమణ: లేదు గురు ఇక్కడే ఉన్నా .. సరే సరే ఇంకా ఎవరున్నారు.. హే షాలిని మధు రేవతి ఫాతిమా రోజీ…. అబ్బాయిలు అమ్మాయిలని ఎత్తుకున్నారు.. ఇందాక టీవీ కనిపించిన ప్రదేశం లో అంతా వెతికారు… ఎవరి చేతికి ఏమి తగల్లేదు… దింపేశారు..
అందరు మళ్ళి దిగాలుగా కూర్చున్నారు… రేవతి లేచి అటు ఇటు నడుస్తోంది.. మధు: ఏయ్ ఎవరది నా కాలు తొక్కింది అని అరిచింది.. రేవతి: నేనే నేనే…నాకు ఆకలేసి అటు ఇటు నడుస్తున్నా సారీ.. మధు: ఒసే మబ్బు దానా…అటు ఇటు తిరిగితే ఇంకా ఎక్కువ ఆకలి వేస్తుంది జాగ్రత్త.. వామ్మో అయితే నేను కూర్చుంటా అని నాలుగు అదులేసింది.. కాలికి ఎదో తగిలింది…ఒక ప్లేట్ ని తన్నిన శబ్దం రీసౌండ్ ఇచ్చింది… వామ్మో అని అరిచింది రేవతి.. ఫాతిమా: ఎం తన్నావే ? రేవతి: ఏమో ఎదో ప్లేట్ లా ఉంది… రమణ: ప్లేటా…రేవతి ఎక్కడున్నావో అక్కడే నిలబడు.. ఫ్రెండ్స్..రేవతి ఇప్పుడు క్లాప్స్ కొడుతోంది…అందరు ఆ సౌండ్ వైపు నడవండి.. ఎం జరుగుతుందో తెలియదు….మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చప్పట్లు వినపడ్డ వైపు నడుస్తున్నారు.. రమణ రేవతి దగ్గరకి వచ్చి భుజం మీద చెయ్యి వేసాడు… మెల్లగా అందరు ఒక చోటకి చేరారు…రమణ: రేవతి అందరం నీ దగ్గరికి వచ్చాం..ఇప్పుడు చెప్పు ప్లేట్ నీ కాలిటీ తగిలి ఎటు వెళ్ళింది.. రేవతి మాట్లాడట్లేదు.. రమణ చెప్పు రేవతి ఏమైంది మాట్లాడవేం ? రేవతి: ఇటు చూపిస్తున్నా రోజి: వివేక్, ఈ తింగరిడి ఎక్కడ దొరికింది నీకు… వివేక్: హహ ఎదో ఎర్రగా బుర్రగా ఉంది కదా అని సెలెక్ట్ చేశా.. రోజి: బుర్రగా ఉంది కానీ బుర్ర లేదు దీనికి రేవతి: ఏమైందే తిడుతున్నావ్ ? రోజి: చీకట్లో ఏమి కనిపిస్తుంది చెయ్యి చూపిస్తున్నావు ? అందరు నవ్వారు… రేవతి: కదా అనుకుని….నా ఎడం వైపు వెళ్ళింది..కానీ నేను రమణ ఆగమనేసరికి అటు ఇటు తిరిగేసా..ఇందాక నా ఎడం ఎక్కడుందో ఇప్పుడు చెప్పలేను.. హుమ్మ్ అని నిట్టూర్చారు తొమ్మిది మంది.. రమణ: సరే నో వర్రీస్…అందరు రేవతి చుట్టూరా నిలబడండి…చేతులు పట్టుకోండి.. నిలబడ్డారు..చేతులు పట్టుకున్నారు… ఇప్పుడు మీ వెనక్కి తిరగండి… రేవతి: నేను కూడానా? రమణ: అమ్మ తల్లి నువ్వక్కడే ఉండు..తిరిగారా ? ఆ అన్నారు ఎనిమిది మంది.. సరే ఇప్పుడు చేతులొదిలేసి మెల్లగా ముందుకి నడవండి.. ఇంకా బెటర్ ఆప్షన్ వీలయితే పాకండి..ప్లేట్ కానీ ప్లేట్ లో ఉన్న వస్తువులు కానీ చేతికి తగులుతాయి…మళ్ళి ఎవరూ కాలితో తన్నకుండా..వినయ్: కరెక్ట్ రమణ…ఇదిగో నేను పాకుతున్న నేను కూడా అంటూ అందరు మోకాళ్ళ మీద ఒంగుని పాకుతున్నారు…రేవతి నిలబడ్డ ప్లేస్ కి అన్ని వైపులా.. కొంతసేపటికి ఫాతిమా వినయ్ వెళ్లిన ప్లేస్ లో ఎదో తగిలింది చేతికి ఫాతిమా కి. ఫాతిమా: ఇక్కడేదో ఉంది రౌండ్ గా…హే ఆపిల్ లాగా ఉంది.. వినయ్: అవును ఆపిల్..నాకు దొరికింది.. రోహిత్: సరే ముందు మీరు క్లాప్స్ కొట్టండి…అందరం అటు వైపు వచ్చి వెతుకుతాం.. అందరు అటు వైపు చేరారు… మెల్లగా చేతికి దొరికిన వాటిని అన్నింటిని గథెర్ చేశారు..
ఇంకొద్ది దూరం లో ప్లేట్ దొరికింది… అన్నింటిని ప్లేట్ లో సద్ది…పది మంది దగ్గరగా చేరి చేతులు పట్టుకుని రౌండ్ గా కూర్చుని ప్లేట్ ని మధ్యలో పెట్టుకున్నారు.. రోహిత్: ఫ్రెండ్స్…వీటిలో కూడా ఏదన్నా మత్తు మందు కలిపి ఉంటారా ? వినయ్: చెప్పలేం బాసు… షాలిని: ఒక ఐడియా…తలా ఒకటి తీసుకుని ఒక బైట్ తిందాం….తేడాగా ఏమి లేకపోతె కంటిన్యూ చేద్దాం.. ఫైన్ అని తలా ఒకటి తీసుకున్నారు.. ఇంతలో స్పీకర్: హహ గుడ్ యూ గైస్ అర్ షార్ప్ అండ్ స్మార్ట్…మొత్తానికి ఫుడ్ వెతుకున్నారు.. అందులో ఏమి లేవు ధైర్యం గా తినండి.. నేను మళ్ళి కలుస్తాను… రేవతి: నువ్వెవడ్రా బాబు బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ లాగా అనౌన్స్మెంట్ ఇస్తున్నావ్ స్పీకర్: హా హా హా హ హ రేవతి నైస్ జోక్… అందరు ఉలిక్కి పడ్డారు.. షాలిని: అంటే మన మాటలు వాళ్ళకి వినిపిస్తున్నాయి..కానీ రెస్పాండ్ అవ్వట్లేదు… యేః రైట్ అన్నాడు రోహిత్.. షాలిని: అయిన సరే…కొంచం జాగ్రత్త గా తినండి…ఓకే అన్నారు అందరు…మెల్లగా అందరు తినడం ముగించారు.. కరెక్ట్ గా లెక్కేసి పది అంటే పది ఇచ్చారు ఆపిల్స్…సద్దుకోక తప్పలేదు… వినయ్: ఒసేయ్ పిచ్చి రేవతి…ప్లేట్ లో నీళ్లు కూడా ఉన్నాయేమో అవి ఎటు తన్నేసావో ? రేవతి: ఏయ్.. షాలిని: షట్ అప్ గైస్…ఇక ఏమి చెయ్యాలో ఆలోచించండి…గుడ్ జాబ్ రమణ పోలీసోడి తమ్ముడు వినిపించుకున్నావ్… రమణ: థాంక్స్…ఇప్పుడేంటి.. వివేక్: అసలా టీవీ ఏమైంది… అందరు ఆలోచనలో పడ్డారు.. ఒక పావుగంటకి షాలిని: గైస్…వాడు టీవీ ని డ్రోన్ తో ఆపరేట్ చేస్తున్నాడు….అందుకే టీవీ ఒక్కోసారి ఒక్కోచోట వేలుస్తోంది… రమణ: డ్రోన్ ఏంటి ? షాలిని: డ్రోన్ తెలీదా…ఇప్పుడంతా డ్రోన్ ట్రెండ్ నడుస్తోంది…ఫారిన్ లో డ్రోన్ తో హోమ్ డెలివరీ కూడా చేస్తున్నారు.. ఇప్పుడు అన్ని చోట్ల డ్రోన్ తో సెక్యూరిటీ కామెరాన్ ఆరెంజ్ చేస్తున్నారు…వాటిని రిమోట్ తో ఆపరేట్ చెయ్యచ్చు… మధు: నీకెలా తెలుసు షాలిని.. షాలిని: ఐ అం ఆ డ్రోన్ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్… రోహిత్: మరి మనకి పైన కూడా ఏమి తగల్లేదు కదా ? టీవీ పైన షాలిని: డ్రోన్ టీవీ వెనక ఫిక్స్ చేసి ఉండచ్చు…అందుకే పైనుంచి మన చేతికి ఏమి తగల్లేదు…. థాట్స్ టెక్నాలజీ …. వావ్…స్మార్ట్ గైస్…మై ఛాయస్ ఐస్ నాట్ రాంగ్ అని స్పీకర్…. అందరు సౌండ్ వస్తున్నా వైపు చూసారు …ఆశ్యర్యంగా.. తన్నేసిన ప్లేట్ ని ఐడెంటిఫై చేసిన రమణ తెలివి.. చీకట్లో ఏమి కనపడక పోయిన…టీవీ హంగింగ్ ని బట్టి డ్రోన్ అని కానీ పెట్టిన షాలిని ని… బిగ్ బాస్ అభినందిస్తున్నారు…అని క్లాప్స్ కొట్టి స్పీకర్ ఆగిపోయింది… మళ్ళి కాసేపటికి…మీ తెలివి కి బహుమతిగా..మీరు చీకటిలో కాకుండా వెలుగు లో ఉండే వీలు కల్పిస్తున్నారు బిగ్ బాస్ అని ఆగిపోయింది..
రోహిత్: థాంక్స్ రమణ అండ్ షాలిని…గుడ్ జాబ్ అందరు మెచ్చుకున్నారు… కాసేపటికి ఆ రూమ్ కి వెలుగు వచ్చింది….ఒక కాండిల్ రూపం లో… ఫాతిమా: ఈ కాండిల్ తో ఏమి సేస్తాం.. వినయ్: సరే ఒక ట్రై చేద్దాం అని కాండిల్ తీసుకుని గోడ కోసం వెతకటం మొదలెట్టాడు.. ఎంత దూరం నడిచినా ఏమి కనపడలేదు…తగల్లేదు…కాండిల్ అయిపోతుండటం తో మిగిలిన వాళ్ళ దగ్గరికి వచ్చాడు వినయ్.. వినయ్: ఏమి లేదు బాసు…ఒక్క గోడ కానీ పిల్లర్ కానీ లేదు..ఇది ఎలా సాధ్యం…ఏ రూఫ్ అయినా అలా ఎలా నిలబడుతుంది… ఉమ్మ్ అన్నారు అందరు.. వినయ్: ఏ గోడ కనపడలేదు కానీ అక్కడక్క ఏవో ఎర్ర గీతలు ఉన్నాయ్…ఆ గీతల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదో ట్యూనింగ్ ఫోర్క్ లా సౌండ్ వస్తోంది… విక్రమ్: వాట్…ఎక్కడ…పద పద..అంటూ లేచాడు..మిగిలిన చిన్న కాండిల్ తీసుకుని అటు వైపు తీసుకెళ్లాడు వినయ్.. కాసేపటికి ఇద్దరు తిరిగి వచ్చారు.. షాలిని: యు ఫౌండ్ ఎనీథింగ్ విక్రమ్ ? విక్రమ్: గైస్ మన ఇక్కడ నుంచి తప్పించుకోవడం అసాధ్యం… మధు: ఏమైంది విక్రమ్.. విక్రమ్: అక్కడంతా ఇన్ఫరా రెడ్ రేస్ ఉన్నాయి..అవి ఇప్పుడు చాలా చిన్న ఫ్రీక్వెన్సీ అండ్ రేడియేషన్ తో ఉన్నాయి… షాలిని: అయితే ఏంటి విక్రమ్: వాటిని మనం దాటగానే వాటి రేడియేషన్ పెంచేస్తారు…మనం అక్కడి కక్కడే చచ్చిపోతాం.. వినయ్: ఇప్పుడు నేను దాటి వెళ్ళాను గా నాకేం కాలేదు గా. విక్రమ్: నువ్వు దాట లేదు…అక్కడికి వెళ్ళగానే నీ చేతిలో కాండిల్ చిదయ్యిందని వెనక్కి వచ్చావ్ అవునా ? వినయ్: అవును.. విక్రమ్: నీ చేతిలో కాండిల్ చిన్న దవ్వలా…ఆ రేడియేషన్ కి కరిగి పోయింది…ఉన్నట్టుండి… నువ్వేమో కాండిల్ అయిపోయిందనుకున్నావ్. వినయ్: నీకెలా తెలుసు కాండిల్ కరిగిందని.. విక్రమ్: నువ్వాగిన చోట కింద వాక్స్ అంతా పది ఉంది.. వినయ్: ఓహ్… విక్రమ్: మన చుట్టూ కొంత దూరం లో బౌండరీ లాగా రేస్ పెట్టారు…మనం అవి దాటినా వెంటనే నెక్స్ట్ బౌండరీ లో వాటి ఫ్రీక్వెన్సీ అండ్ రేడియేషన్ పెరుగుతుంది…రెండో బౌండరీ దాటే లోపు మనం చచ్చిపోతాం.. సో మనం ఇక్కడనుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు..షిట్ ఇలా ఇరుక్కుపోయామేంటి అనుకున్నారు అందరు.. షాలిని: విక్రమ్ వాట్ డు యు డు ? విక్రమ్: ఐ అం సైంటిస్ట్…x రేస్…ఇన్ఫ్రా రెడ్ రేస్ మీద రీసెర్చ్ చేస్తుంటాను… షాలిని: నైస్…గుడ్ జాబ్…గాబిక్కిన ఎవరూ రిస్క్ తీసుకోకుండా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పావ్. విక్రమ్: థాంక్స్.. వివేక్: సో మనం ఇక్కడ నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు…మరి ఏంటి పరిస్థితి..వీడు వదిలేదాకా ఇలా ఉండాల్సిందేనా.. షాలిని: ఎస్… మనం ఇక్కడ నుంచి తప్పించుకోకూడదనే ఇన్ని ఏర్పాట్లు చేశారు..వీటికి చాలానే ఖర్చు అవుతుంది… సో మనల్ని వదలాలంటే కూడా చాలా డబ్బు ఎక్సపెక్ట్ చేస్తారు… వీళ్ళ దెమంద్స్ ఏమిటో …ఎప్పటికి తెలిసేనో..
వదిలేసిన వాళ్ళని ఎందుకు వదిలేశారు…మనల్ని మాత్రమే ఎందుకు ఉంచారు… వీళ్ళు మన నుంచి కూడా ఎమన్నా ఎక్సపెక్ట్ చేస్తున్నారా ? వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే ఇంకొంత సేపు ఓపిక పట్టాలేమో… మధు: ఎదో ఒకటి తొందరగా తేలితే బావుండు…తొందరగా ఇంటికి పోవచ్చు… ఇప్పటిదాకా ఇక్కడ ఉండాలో ఏమిటో… రేవతి: వీళ్ళు వదిలేదాకానా ? మరి నా ఆఫీస్…? మధు: వెళ్లవే వెళ్ళు ఆ రేస్ ఏవో అన్నాడు గా వాటిలో పడి పోతావ్..అప్పుడు వెళ్ళు ఆఫీస్ కి.. రేవతి మొహం మాడ్చుకుంది.. రేవతి: నేను అలిగాను…బుంగ మూతి పెట్టుకున్నాను..హు… తొమ్మిది మంది ఒకేసారి: ఓరి దీని ఏషాలో…..అనుకున్నారు… Like 224 Dislike 28 40983 4 2 cookie-check షాలిని – Part 4 no