సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 20
దిగాలుగా ఇంటికి చేరింది సంజన… అంత తొందరగా తిరిగి వచ్చిన సంజనను చూసి ఆశ్చర్యపోయాడు వివేక్… “ఏమైంది సంజూ… ఆరోగ్యం బాలేదా….” అడిగాడు… “అలాంటిదేం లేదు వివేక్… కావాలనే వచ్చేశా…. కొన్ని విషయాల గురించి ఆలోచించ వలసిన అవసరం ఉంది….” సోఫాలో కూలబడుతూ అంది సంజన… ” ఓకే… అలిసిపోయినట్లనిపిస్తున్నావ్.. టీ ఏమైనా తాగుతావా….?” మొదటిసారి ఆల్కహాల్ తీసుకోవడం వల్లనో భరించలేని విషయాలు చర్చించినందువల్లనో గాని సంజన కి తలనొప్పిగా ఉంది… వివేక్ టీ ఇస్తా అనడంతో ఆమెకి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది… వెంటనే ఓకే చెప్పింది… కొన్ని క్షణాల్లోనే వివేక్ ఆమెకి టీ అందించాడు… ఆమె టీ తాగుతుంటే ముందర కూర్చొని “ఆఫీస్ లో ఏమైనా ప్రాబ్లెమ్ వచ్చిందా… ” అంటూ అడిగాడు.. వివేక్ తో మాట్లాడడానికి ఇదే సరైన సమయం అనుకుంది సంజన…. ” అవును వివేక్ ఒక సమస్య వచ్చింది…. దాని వల్ల నా ఉద్యోగమే పోవచ్చు” అంది.. ” వ్వాట్….” అరిచాడు వివేక్… ” ఏమైంది సంజూ… అంతా బాగానే ఉంది అన్నావ్ గా… ఇంతలో ఏం జరిగింది… నిన్ననే వెళ్లి బ్యాంక్ వాడితో పెండింగ్ లో ఉన్న బకాయిల గురించి మాట్లాడి వచ్చాను… పిల్లల ఫీజులు వాటికంటే ఎక్కువగా ఉంటున్నాయి… ఈ పరిస్థితుల్లో నువ్ ఈ మాట అంటావేంటి… నాకేం అర్థం కావట్లేదు.. అసలెందుకు… ఏం… ఎన్టీ… .” సనిగాడు వివేక్… “వివేక్… నువు గాభరా పడి నన్ను గాభరా పెట్టకు ప్లీస్…. నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు…” అంది సంజన… ” సంజూ… విషయం ఏదైనా నాతో చెప్పు… అన్నీ నీ మీదే వేసుకొని ఇబ్బంది పడవద్దు… ఇద్దరం కలిసి ఏదైనా పరిష్కారం ఆలోచిద్దాం…” అన్నాడు వివేక్… చెప్పడం మంచిదే అనిపించింది సంజన కు.. “వివేక్… టెన్షన్ పడకుండా నేను చెప్పేది సాంతం విను… ఈ రోజు నేను స్నేహని కలిశాను…. ఆనంద్ కి సెక్రెటరీగా నాకిస్తానన్న ప్రమోషన్ గురించి చర్చించాను… ” చెప్పడం మొదలుపెట్టింది సంజన… వివేక్ మౌనంగా వింటున్నట్టు తలూపాడు… “సెక్రెటరీ పోస్ట్ నాకు ఇవ్వడానికి అన్నీ ఓకే గానీ దానికోసం స్నేహ ఒక కండిషన్ చెప్పింది.. ” అంటూ ఆపింది సంజన… కండిషన్ ఏమై ఉంటుందో వివేక్ కి చూచాయగా తెలిసిపోతుంది… “మనం దేని గురించి అయితే భయపడుతున్నామో దాని గురించే చెప్పింది స్నేహ… ఆమె ఉద్దేశ్యం ఏంటంటే.. పోస్ట్ కోసం… నేను … నేను…. ఆనంద్ తో… ” పూర్తి చేయలేకపోయింది సంజన… తన భర్తతో ఆ విషయం మాట్లాడడం ఆమెకు చాలా బాధగానూ, ఇబ్బందిగానూ అనిపించింది… ” ఛీ ఛీ ఎంత నీచపు మనుషులు వీళ్ళు…. ఒక మనిషి కష్టాల్లో ఉంటే వాటిని ఇలా వాడుకోవాలని చూస్తున్నారు….అసలు మనుషులా.