Joint firm 33
‘ఇది గో.. ఓ సారిలా రా..” ఆఫీసు నుంచి వచ్చి మొహం కడుక్కొడానికి నీళ్ళ గదికి వెడుతోన్న కోదండం వంటింటి వైపు చూసాడు. ‘నిన్నే లోపలికి రా..’ కత్తి పీట ముందు కూర్చుని ఉల్లి పాయలు కోస్తున్న మంగ యధాలాపం గా అంది. మెల్ల గా లోపలి కెళ్ళి ఏమిటన్నట్టు చూసాడు తను. ‘రెండు రోజులుండి వచ్చేస్తానని వెళ్ళిన వాడి వి రెండు వారాల తరువాత వచ్చావ్. వచ్చి కూడా నాలుగు రోజులు అయ్యింది. ఆ వచ్చిన రోజు నేను పలకరించి నప్పుడు సమాధానం చెప్పటమే గానీ మళ్ళీ పెదవి విప్పి మాట్లాడలేదు. ఆయన దగ్గర కూడా ఇది వరకటి లా కూర్చోడం లేదు. నీ పద్దతి చూస్తుంటే మొహం చాటేసుకుని మసలు తున్నట్టుంది. మునుపటి కంటె కలివిడి గా కూడా కనిపించడం లేదు నువ్వు. ఏమిటి విషయం? మా మీద ఏదైనా కోపం వచ్చిందా? ఇంత ముందులా మాట్లాడటం లేదని శీను కూడా అంటున్నాడు. అసలే మిటి సంగతి?’ అతని మొఖం లోకి చూస్తూ సూటిగా అడిగిందామె. తన తత్తర పాటును కప్పిపుచ్చు కోడానికి అదోలా నవ్వుతూ ‘అబ్బే.. ఏంలేదండీ’ అని నాని చేసాడు కోదండం. అయితే ఆమె అన్న దాంట్లో అతి శయోక్తి ఎమీ లేదు. స్వగ్రామం నుంచి వచ్చి నప్పటి నుంచి తను మొహం చాటే సుకుని తిరుగుతున్న విషయం నిజమే. దానికి కారణం ఆమె అనుకుంటున్నట్టు వాళ్ళ మీద కోపం వచ్చి మాత్రం కాదు. మంగ కీ తనకీ రంకు సాగుతున్నట్టు గా అమ్మలక్కలు గుసగుస లాడు కొంటున్నట్టు గా గాయత్రి చెప్పిన విషయం అతని మన సులో బాగా నాటుకు పోయింది. ఇంతకు ముందు రాధ కూడా ఇదే సందేహాన్ని వ్యక్తం చేసినట్టు పద్మ చెప్పింది. దీనిని బట్టి ఊరంతా తను మంగ కి తిరుగుతున్నట్టు అను కుంటున్నారన్నది నిర్వివాదాంశం. ‘ఈ అపవాదు తొలిగించు కోడాని కేం చెయ్యాలి?’ అన్నదే అతని ఆలోచన. అందుకే అక్కడ చాలా ముభావంగా మసలు తున్నాడు. మంగ సంగతి సరే సరి, శేషయ్య గారితో మాట్లాడటం తగ్గించాడు. శీను ని కూడా అంత గా చేర నీయడం లేదు దగ్గర కి. అదే మంగ కి బాధ కలిగించి ఉండొచ్చు . ‘ఏం లేదంటే నేను ఒప్పుకోను. నీ మనసులో ఎదో ఉంది చెప్పు. చెప్పక పోతే నా మీద ఒట్టే!’ అంది మంగ కత్తి పీట మడిచి పెట్టి లేచి నుంచుంటు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తోచక కొన్ని క్షణాలు పాటు ఈగ లా కొట్టు కున్నాడు తను. కానీ తన మన సులొ మాట చెప్పడానికి ఇదే మంచి అవకాశ మేమో అని పించడంతో ‘ మరేం లేదంది..! అని ప్రారంభించాడు. ‘ఇటీ వల .. అంటే.. నేను మా ఊర్నుంచి వస్తూండగా నాకొక విషయం తెలిసింది. కొంత మంది మన ఇద్దరికీ లేని పోని సంబంధం అంట గట్టి గుసగుస లాడు కొంటున్నారట. మీతో ఉన్న సంబంధం మూలాన శేషయ్య గారు హాస్పిటల్లో ఉండ గా సెలవు పెట్టుకుని దగ్గరున్నానని అనుకుంటున్నారు. అటు వంటి పరిస్తితిలో నేనిక్కడ ఉండటం బావుండదేమో అని పిస్తోంది. మీతో ఈ సంగతి చెప్పి వేరె ఎక్కడి కయినా మకాం మార్చేద్దాం అను కుంటున్నాను..’ న మ్రతతో నసిగాడు.