Joint firm 34
నీ పని ఇలా ఉందని తను నన్ను పట్టించు కోవడం మానే సిందంటే ఈ గుసగుస లాడు కుంటున్న ఏ వెధవైనా వచ్చి నా సదు పాయం చూడ గలడంటారా? అందు చేత అనుకునే వాళ్ళు రక రకాలుగా అను కుంటారు. అవన్నీ పట్టించు కుంటే ఈ వెధవ ప్రపంచం లో బ్రతకలేం. అందు చేత నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి పోవాలన్న ఆలోచన వదిలేయ్. మరో సంగతి. ఎడ్చే వాళ్ళని ఇంకా ఏడిపిద్దాం . ఈ పూట నుంచి నువ్విక్కడే అన్నం తిను. మరింక వొటల్ వద్దు. ఈ మాట కాదంటే నా మీద నీకు అభి మానం లేనట్టే లెక్క!’ అన్నాడు శేషయ్య ఆవేసం గా. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది కోదండానికి. ఆయన కేం చేప్ప లేక మంగ వేపు తిరగ బోయాడు. తీరా చూస్తే అక్కడ లేదు. ఆమె వెళ్ళి పోవడం తను గమనించనే లేదు. ఏడున్నర కి ‘అన్నం వడ్డించాను. కాళ్ళు కడుక్కుని రా’ అని స్వయంగా వచ్చి కేకేసింది మంగ. ‘ఇది ఎందు కోచ్చిన శ్రీమండి. నేను ఇక్కడే ఉండి పోతాను. కానీ మరి రేపటి నుంచి ఈ ప్రయత్నం చేయకండీ అన్నాడు తను అన్నం దగ్గర కూర్చుంటూ. ‘ఈ మాట ఆయనతో చెప్పు. నాకేం తెలియదూ అందామె నవ్వుతూ. ఆ రాత్రి కోదండాని కి ఓ పట్టాన నిద్ర పట్ట లేదు. ఆ సాయంత్రం శేషయ్య అన్న మాటలే చెవుల్లో గింగురు మంటున్నాయి. ఎవరేమనుకుంటే అనుకోని, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు అని ఒక్క మాటలో తేల్చేసే దానికి ఆయన అన్ని సంగతులు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అంతు పట్ట లేదు తనకి. మంగ కి తనకి నిజంగా సంభంధం ఉన్నా తను పట్టించు కో నట్టు మాట్లాడాడు ఆయన. మరీ లోతుగా ఆలోచిస్తుంటే మంగ గొవింద రావ్ తో తిరగడం కూడా ఆయన కు చూచాయగా తెలుసునే మో అని పిస్తోంది. మధ్య తలుపు ‘టక్ టక్’ మని చిన్న చప్పుడు చేయటం విని ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు కోదండం. మరలా అదే చప్పుడు అవతల నుంచి ఎవరో తలుపు కోడుతున్నారు. అది మంగ అయ్యుండాలి , సందేహం లేదు! చిన్నగా లేచి వెళ్ళి గెడ తీసాడు. నవ్వుతూ లోపలి కోచ్చి తలుపు మళ్ళా దగ్గరకి జారే సిందామె. ‘నువ్వింకా నిద్ర పోవని నేను అను కుంటూనే ఉన్నాను.’ అతని కుడి చేతి వేళ్ళ మధ్య కాలుతున్న సిగరెట్ ను చూసి సన్నగా నవ్విందామె. అతను మాట్లాడలేదు. ఆ వేళ ప్పుడామె అంత రహస్యంగా ఎందుకు వచ్చినట్టు? అన్న ఆలోచనలో ఉండి పోయాడు. మంగ చొరవగా కుర్చీలో కూర్చుని ‘నువ్వూ కూర్చో’ అంది. కిక్కురు మన కుండా మంచం మీద కుర్చున్నాడు తను. ‘ మనిద్దరికీ సంభంధం ఉందని అందరూ అను కుంటున్నారని నీకెలా తెలిసింది?’ సూటి గా అడిగింది. ఆ విషయాన్ని తెలుసుకోడానికి వచ్చిందని తెలుసు కోవటం తో కాస్త రిలీఫ్ ఫీలయ్యాడు. ‘ఒక శ్రేయోభి లాషి చిన్నగా. వలన తెలిసింది.’ అన్నాడు ‘ఎవరా శ్రేయోభి లాషి?’ ‘ఎవరైతే ఏంలెండి.