Priyamaina Shatruvu
Story Nachina Aunty lu please contact me in [email protected] in Google chat. i like more aunties age between 30 to 55. నేత్ర………. ఒసేయ్ నేత్ర ఎక్కడ చచ్చావే .. వస్తున్నా అత్తయ్య… పరిగెత్తుకుంటూ గది నుండి బయటకు వచ్చింది ఒక ఇరవయ్యేళ్ల అమ్మాయి. ఏంటి అత్తయ్య… ఏంటి అంటావేంటి… ఈరోజు ఉద్యోగంలో చేరాలి . మొదటిరోజే ఆలస్యంగా వెళతావా … లేదు అత్తయ్య…. బయల్దేరుతున్నాను. చాల్లే…. మా ప్రాణాలు తీయడానికి మీ అమ్మ కని మా మీద పడేసి అది మాత్రం దాని సుఖం చూసుకుని పారిపోయింది . మళ్ళీ నేను సరిగ్గా చూసుకోవడంలేదని ఊరంతా చాటింపు వేస్తున్నావు. అత్తయ్య… ప్లీజ్…. నన్ను ఏమైనా అనండి. కానీ మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి. నన్ను వదిలి వెళ్ళిపోవడం తప్ప మా అమ్మ ఇక ఏ తప్పు చేయలేదు. ఆ విషయం మీక్కూడా తెలుసు .. అయినా ఎందుకు అలా మా అమ్మని ఆడిపోసుకుంటారు . మీకు నచ్చకపోతే చెప్పండి నేను ఇంటి నుండి వెళ్లిపోయి నా బ్రతుకు నేను బ్రతుకుతాను . అబ్బో…. ఇప్పుడు ఎన్నైనా చెబుతావు . మూడు పూటలా తిండిపెట్టి కష్టపడి చదివిస్తే ఇప్పుడు ఉద్యోగం రాగానే నీ దారి నువ్వు చూసుకుందాం అని చూస్తున్నావా… చాలాసేపటి నుంచి బయట జరుగుతున్న డిస్కషన్ వింటున్న అభి … గది నుండి బయటకు వచ్చాడు. అమ్మా…..ఎందుకు పొద్దున్నే దాని మూడ్ చెడగొడతావు . నిజం చెప్పాలంటే తన చదువుకీ మనం ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టలేదు. తను చదువుకుంటూనే ఏదో పని చేస్తూ ఆ డబ్బులతోనే స్టడీస్ కంప్లీట్ చేసింది. ఏదో నువ్వు కష్టపడి చదివించినట్టు ఫీల్ అవుతావేంటీ….. హుమ్… అనండి అందరూ నన్నే అనండి .. రేపు ఇది కూడా ఎవడితో అయినా పోతే అప్పుడు ఉన్న ఈ కాస్త పరువు గంగలో కలిసిపోతుంది . అమ్మా.. నోటికి ఎంతోస్తే అంత మాట్లాడమే.. ఎదుటివాళ్ళు భాదపడతారు అన్న ఆలోచన కూడా లేదు నీకు… నేత్ర… నీ ఆఫీస్ కి లేట్ అవుతుంది రా డ్రాప్ చేస్తాను . ఎక్కడికిరా వెళ్ళేది. నిన్ను దానితో తిరగొద్దని చెప్పానా… అమ్మా….. వద్దు బావ….. నేను బస్ లో వెళతాను . అదికాదు నేత్ర.. ప్లీజ్… నన్ను ఇబ్బంది పెట్టొద్దు . నేను బస్ లో వెళతాను అన్నాను కదా.. గదిలోకి వెళ్ళి బాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. అభి కోపంగా వాళ్ళ అమ్మ వైపు తిరిగాడు . ఎందుకమ్మా… నేత్రని ఏదో ఒకటి అనకపోతే నీ మనసు ప్రశాంతంగా ఉండదా.. అభి….. నీకు చాలా సార్లు చెప్పాను . దానికి దూరంగా ఉండమని.. నువ్వు దాని చుట్టూ తిరిగావో ఏ విషమో తాగి చస్తాను జాగ్రత్త… రా … టిఫిన్ చేద్దుగానీ… ఆవిడ కిచెన్ లోకి వెళ్ళిపోయింది. అభి నిరుత్సాహంగా చూస్తూ ఉండి పోయాడు. నేత్ర బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉంది. కాసేపటికి అభి బైక్ మీద వచ్చి తన ఎదురుగా ఆపాడు . బస్ రాలేదా నేత్ర … లేదు బావ… లేట్ అనుకుంటాను . సరే… నేను డ్రాప్ చేస్తాను . వద్దు బావ ….. అత్తయ్య చూసిందంటే గొడవ చేస్తుంది.